నాకు గురువు ,మిత్రుడు ,మార్గ దర్శి మా ఉయ్యూరు వాస్తవ్యులు స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారు .ఆయన్ను మేమంతా ”దత్తు గారు ”అని అంటాం .వారికి వేదం నుంచి వేమన వరకు తెలీని విషయం లేదు .కమ్యునిస్ట్ భావాలకూ ఆకర్షితులై కొంత కాలమ్ వుండి తప్పు కొన్నారు ‘బయిటికి వస్తు ”నేను ఎందుకు కమ్యునిస్ట్ ను కాలేక పోయాను ”అనే పుస్తకం రాశారు .ఉయ్యూరు లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్.ఎస్.ఎస్ .కు చాలా కాలమ్ పోషకులు .ఎక్కడ సంఘ శాఖ జరిగినా కాఖి నిక్కర్ ,తెల్ల చొక్కా ,టోపీ పెట్టు కోని ,లాఠీ తో సహా హాజరయ్ వారు .ఉత్తర ప్రదేశ్ లోని సహజాన్ పూర్ యోగి శ్రీ రామ చంద్ర జీ తో సన్నిహిత సంబంధం వుండేది .అక్కడికి వెళ్లి నెలల తరబడి యోగా భ్యాసం చేసివస్తుండే వారు .ఆ విషయాలన్నీ మాకు తెలియ జేసే వారు .చిన్న వాళ్ళలో చిన్న వాడుగా ,పెద్ద వాళ్ల లో పెద్ద మనిషి గా వుండే వారు .వేదోపనిషత్ లన్నీ కరత లా మలకం .సైన్సు లో మంచి ప్రవేశం వుండేది .చాలా అడ్వాన్స్డ్ సైన్సు జర్నల్స్ తెప్పించి చది వే వారు .కోత కాలమ్ ఇంట్లో నే ఆర్ .ఎస్.ఎస్.శాఖను నది పారు .మంచి వితరణ శీలి .వ్యవసాయము చేయించే వారు .చెరుకు పండే బంగారు భూమి వుండేది .నౌకర్లు ,చాకర్లు వుండే వారు .తలంటి పోయటానికి రామ దాస్ అనే మంగలి ఆయన వుండే వాడు .కేరమ్స్ బాగా ఆడే వారు .చెస్ కూడా .రానిదంటు ఏమి లేదు .బాలభారతి ,నన్నయ్య కళా సమితి ఆయన నేతృత్వం లో మేము నిర్వహించాం .
దత్తు గారికి గొప్ప గ్రంధాలయం వుండేది .మేము వారింట్లో ఎన్నో పుస్తకాలు చదివాం .శ్రీ శ్రీ ,ఆరుద్ర ,ఆత్రేయ ,మొదలైన అభ్యుదయ రచయితల పుస్తకాలు అక్కడే మాకు పరిచయం .వేదాలు ,ఉపనిషత్తులు ,పురాణాలు ,భగవద్గీత ఒకటేమిటి ఆయన దగ్గర లేని పుస్తకం లేదంటే అతిశయోక్తి కాదు .అన్నీ కోని ఉంచే వారు .నా బోటి వారికి పుస్తకం ఇస్తే ఒక పుస్తకం లో నోట్ చేసు కోని ఇచ్చే వారు .ఒక వారం తరు వాత అడిగే వారు .కొంచెం వామ నావ తారం గా స్పోటకం మచ్చలతో వుండే వారు .మాట స్పష్టం గా వచ్చేది కాదు .వారింటి దగ్గర ,దీపావళి పండగ చేసే వాళ్ళం .నరకాసురున్ని గడ్డితో తయారు చేసి కాల్చే వాళ్ళం .సాహిత్య గోష్టి జరిపే వాళ్ళం .అలాంటి దత్తు గారు మరణించారు సుమారు పద్దెనిమిది ఏళ్ళ క్రితం .ఆయన్ను వాడు కొన్న వాళ్ళమే కాని ఆయనకు కనీసం ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు కూడా సంతాప సభ పెట్ట లేదు .దత్తు గారు తన చెల్లెలు ప్రయాగ కృష్ణ వేణి జ్ఞాప కార్ధం ఉయ్యూరు జిల్లా పరిషద్ హై స్కూల్ లో ఒక బ్లాక్ ను దాదాపు ముప్పహి ఏళ్ళ క్రితం 25 వేల రూపాయలతో నిర్మించిన దాత .కూచిపూడి భాగవతులకు ,వేద పండితులకు చేతికి ఎముక లేకుండా దానం చేసిన మహాను భావుడు .మంచి మనసున్న వాడు
ఇదంతా ఎందుకు అంటే అలాంటి విద్యా ,బుద్ధి జీవి చని పోయిన తర్వాత ,ఆయన దగ్గరున్న విలు వైన పుస్తకాలు ఎమవు తాయో నని బాధ పడే వాణ్ని .వాళ్ల అబ్బాయి గోపాల్ కు ,ఆయన భార్య శ్యామల గారికి ఆ పుస్తకాల విలువ ఒకటి రెండు సార్లు తెలియ జేశాను .వాళ్ల కేమీ పట్ట లేదు .2000 వ సంవత్సరం లో తల్లికి కొడుకు కు పడక తల్లి రాజా గారి కోట లో ఒక పెంకు టింట్లో అద్దెకు వుండేది .ఇప్పుడున్న ఇల్లు కొడుకు స్వాధీనం చేసు కొన్నాడు .దత్తు గారి పుస్త కాలాన్నే కోటలోని పెంకు టింట్లో వున్నాయి .మళ్ళీ ఆవిడను పుస్తకాల గురించి అడిగి ,ఆవిడకు అక్కర లేని పుస్త కాలు నాకు ఇమ్మని కోరాను .సరే నన్నారు .మర్చి పోయాను .ఒక రోజూ అకస్మాతు గా మా ఇంటికి వచ్చి ”దుర్గా ప్రసాద్ గారు !మా వారి పుస్తకాలు వర్షాల వల్ల దెబ్బతిన్నాయి .కొన్ని చెదలు పట్టి పాడి పోయాయి .మీకు కావాల్సిన పుస్తకాలు యేరు కోని తీసుకొని వెళ్ళండి ”అని చెప్పారు దత్తు గారిభార్య శ్యామల గారు .
కోటలో వున్న వారింటికి వెళ్లి చూస్తే కళ్ళు తిరిగాయి జాలి వేసింది .చాలా పుస్తకాలు దెబ్బ తిన్నాయి .అందులో నాకు కావలసిన వన్నీ యేరు కోని ఇంటికి తీసుకు రావటానికి మూడు రోజులు పట్టింది .నాగర లిపి లో వున్న వేదాలు ,ఉపనిషత్తులు ,రామాయణం ,భారతం,తెలుగులో ఆంధ్రుల సాంఘిక చరిత్ర తిరుపతి కవుల పుస్తకాలు ,వీరేశ లింగం గారివి ,కొన్ని ఆంగ్ల పుస్తకాలు వివేక చూడామణి అష్టా వక్ర చరిత్ర మొదలైనవి సుమారు అరవై అరుదైన పుస్తకాలను నేను తెచ్చు కొన్నాను .మిగిలిన వాటిని ఆవిడ ఏం చేశారో తెలీదు .ఆ తర్వాత ఆవిడ ఆ ఇల్లు ఖాళీ చేసి బెజవాడ వెళ్లి పోయారు .నేను తెచ్చుకొన్న పుస్తకాల మీద లోపలి పేజీలో ”వంగల దత్తు గారి జ్ఞాపకం గా ”అని రాసుకోన్నాను
ఇంతకీ అసలు విషయం లోకి రానే లేదు .అలాంటి వాటిలో నాకు ఒక అరుదైన పుస్తకం దొరికింది .అదే ”vraatya khanda ”అనే సుమారు నూట యాభై పేజీల ఇంగ్లీష్ పుస్తకం .ఇది ”అధర్వ వేదం ”లో వున్న వ్రాత్య ఖండం .దీన్ని గురించి ఎవరికి పెద్ద గా తెలీదు .వ్రాత్య అనే పేరు ఎక్కడో అరుదు గ విన్పిస్తుంది వేదోపనిస్హాడ్ లలో దీన్ని ఉత్త్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,రాజస్తాన్ మాజీ గవర్నర్ ,మహా విద్వాంసుడు డాక్టర్ సంపూర్ణానంద్ ఆంగ్లం లో రాశారు .మూలం ఇస్తూ ఆంగ్లం లో చక్కిని అర్ధాన్ని ,తాత్పర్యాన్ని రాశారు ,నాకు బాగా నచ్చింది .వెంటనే దాన్ని నేను తెలుగు లోకి తర్జుమా చేశాను నా కోసం .వ్రాత్యను ఆంద్ర దేశం లో పరిచయం చేయాలని నా ఆలోచన .కాని ఏ పత్రికలు వేస్తాయో తెలీదు .అలాగే వుండి పోయింది సుమారు పదకొండేళ్ళు గా .ఆ తర్వాత ఆంద్ర జ్యోతి వాళ్ళు ప్రతి శుక్ర వారం ”నివేదన ”అని శీర్షిక తో ఆధ్యాత్మిక విషయాలు ప్రచురించే వారు .దానికి నేను అను వాదం చేసిన దానిలో ముఖ్య మైన విషయాలను వ్యాసం గా రాసి ”వ్రాత్య ”అని పేరు పెట్టి పంపాను .పట్టించుకొన్న వాళ్ళు లేరు .ఈ మధ్యనే దాని ప్రతి ఒకటి నాకువెతుకు తుంటే కని పించింది .దాన్ని రెండు భాగాలు గా మీకు అంద జేస్తున్నాను .కనీసం కొందరైనా వ్రాత్యను గురించి తెలుసు కొంటారు అని ,ఆ శబ్దం మీద వున్న అపప్రధ ను తొలగించుకు కొంటారనీ నా ఆలోచన .త్వరలో ”వ్రాత్య”మీ ముందుంటుంది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -01 -12

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
మీదగ్గర ఉన్న పుస్తకాలని స్కాన్ చేయగలిగితే స్కాన్ చేసి online లో పెట్టండి. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వాటిని చదువుతారు. నాకు కూడా మా తాత గారి దగ్గర నుండి కొన్ని పాట పుస్తకాలూ దొరికితే స్కాన్ చేసి అట్టే పెట్టా. నేను చదవలేకపోయినా ఎవరయినా చదువుతారేమో భవిష్యత్తులో…
Chaduvuthunte badha kaligindi. Entha viluvainavo aa pusthakaalu. Konnaina dakkinchukune adrushtam meeku kaligindi. Ika meeru andajeyaboye Vratsya ku dhanyavaadaalu swwekarinchandi.
Dear Mastaru, Thanks. Around the period when I was in vuyyuru, RSS was mostly conducted by Durga rao. Gopalakrishna was also a member. Both of us were there primarily to play games whch were conducted in the front yard of the temple.What I did not know at that time was that Dutt was a book lover. A more interesting issue is, there are a lot of book lovers in west krishna. One of them is Chalasani Das who set upa library in the Indepence samara yodhula hall on the banks of Bandar canal near Rammonhar library.Das has many more volumes in his house in Patamat. I have myself more than 3000 volumes in my house. My intent is to transfer them to Manga devi’s institutions in Guntur where one of my former students has donated money for the construction of a building in memory of his wife. I do not know what will happen Whatever will be will be. Premchand
Yes, I do remember participating, along with Premchand garu, in the games conducted by Durga rao with kakhi outfit and a lathi in hand. If my memory serves me right, Durgarao’s father was in the police dept., constable or head constable. Subsequently, they started a branch in the grounds adjacent to Lingala zemindar building next to to CBM hospital. That land was later on purchased by Vookoti ( washerman) family.–Gopalakrishna