త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి 4–చివరి భాగం

               త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి 4–చివరి భాగం 

                                         సర్వ మత సమన్వయము 
        శ్రీ రామునితో త్యాగయ్య ”సంకీర్తనలతో కాలమ్ వెళ్ళ బుచ్చె బూటక జనం అనుకొంటున్నావా నన్ను ?ఇది మర్యాద కాదు .వాళ్లకు తాళ     జ్ఞానం ,భక్తీ ,రక్తి లేవు .ఉదాత్త గుణాలు లేవు .అను  రాగం లేదు .తినటం ,తూగటమే  వాళ్ళు చేసేది ..నా గుణాన్ని చూసి రక్షించు ”అని వేడు కొన్నాడు 
   ”మరియాద కాదురా !కరుణా కార ,వారిని ,వీరిని –సరి జేసి చూచు చుండేది ,
    రాగము ,తాళము ,రక్తి ,భక్తీ ,జ్ఞాన యోగము -మరి అణు రాగ యోగము లేని 
    భాగవతులు దర శయనులే గాని -త్యాగ రాజార్చిత తారక చరిత ”అని కుహనా వేష దారుల ను తీవ్రం గా ,విమర్శిస్తూ ,సద్గుణ ప్రధానుని గా ,తన్ను భావించ మని వేడు కొన్నాడు త్యాగయ్య.
    మత భేదాలు పాటించి ,కుతర్కం తోప్రజలను దారి మార్చే వారంటే ఆయనకు గిట్టదు .సర్వ మత సమన్వయ రూపమై ,సర్వ ప్రాణి హిత మైన ,సంగీతా సుధా లో ,వూరిన మనసు త్యాగ బ్రహ్మ ది .ఆయన లోక హితైషి .అందుకే అంటాడు –
  ”’మనుజుల ,నేచే ,జీవ మేలా ?మత భేద మనే శక ,నాస్తిక –సమ్మత వాక్కులు ,బలుకుట సుఖమా ?
    క్షితి లో ,సత్సంగతి ,సౌఖ్యము ”అని సత్సంగత్వం గొప్పది అని వివరించాడు .
  కవి బ్రహ్మ తిక్కన లాగ ,త్యాగ బ్రహ్మ ,హరి హరాత్మక రూపాన్ని ,మనసు లో భావించాడు .అందరి దేవుళ్ళను శ్రీ రాముని లో దర్శించిన పుణ్యాత్ముడు త్యాగయ్య .ఈ పూజా విధానం ఆనాడు దక్షిణ భారత దేశమంతా వుండేది .పశ్చిమ చాళుక్యుల రాజ దాని ”బాదామి ”లోను ,నెల్లూరు దగ్గర ”బిరవ కొన ”లోను ,కర్ణాటక లో ”హరి హర క్షేత్రం ”లోను ,తమిళ నాడు లో ”శంకర నారాయణ పట్టణం ”లో ,జావా,సుమత్రా  దేశా లలో ,హరి హర దేవాలయాలు వున్నట్లు చారిత్రిక సాక్ష్యాలున్నాయి .”నమశ్శివాయ”అనే పంచాక్షరి లో ,మా అనే ప్రాణ బీజం తీసేస్తే ,(న శివాయ -అంటే శివునికి కాదు ),నారాయణ మంత్రం లో రా అనే ప్రాణ బీజం తీసేస్తే (న -అయనాయ –పరబ్రహ్మ కోసం కాదు ),ఈ రెండు ప్రాణ బీజాలను కలిపితే ”రామ ”శబ్దం ఏర్పడు తుంది .అంటే ఇది హరి హరాత్మకమైన నామం.తరుణోపాయ మైన ,”సర్వ మత సమన్వయ జప మంత్రం ”ఏర్పడిందని అర్ధం చేసు కోవాలి .రామ శబ్దానికి అంతటి శక్తి వుందని భావం.అందుకనే అది మంత్రం అయింది .దీన్ని వివరించే కీర్తన –.
  ”ఎవరని నిర్ణయించిరిరా ,?నిన్నేట్లారాధించి రిరా –శివుడనో ,మాధవుడ నో ,,కమల భవు డనో ,పర బ్రహ్మ మనో 
   ?-ఎవరని —
   ”శివ మంత్రమునకు” మ” ‘జీవము ,-మాధవ మంత్రమునకు ”రా ”జీవము 
    ఈ వివరము తెలిసిన ఘనులకు ,మ్రొక్కెద –వితరణ గుణ ,త్యాగ రాజ వినుత”
 దక్షిణ భారత దేశం లో శివ ,కేశవులను ఇద్దరినీ సమానంగా ఆరాధించే సంప్రదాయం అనాది గా వున్నదెఅదె మల్లె గుర్తు చేశాడు .అదే త్యాగబ్రహ్మ లోని ”సామ రస్య సమన్వయ బుద్ధి ”ఆ వివ రాలు ఏమిటో నువ్వే చెప్పు అని గడుసుగా ఆ ,రామున్నే అడిగాడు జాణ త్యాగయ్య,
 అసలు నీ రూపం శక్తి రూపమా ,?పంచ భూఆత్మక మా ?త్రిమూర్త్యాత్మకమా ?అని అడుగుతూ అన్నీ నీవే ,అంతటా నువ్వే ,అని చెప్పటం త్యాగయ్య పధ్ధతి .అందుకే ”ప్రశ్నోత్తర మాల”గా దీన్ని కూర్చాడు .శ్రీ రామ చంద్రుని విశ్వ వ్యాపకత్వాన్ని ,మన దృష్టికి తెస్తున్నాడు .భిన్నత్వం లో ఏకత్వాన్ని సాధించిన ఘనుడు ”త్యాగ ధనుడు” .ఆ కృతి ఆకృతి పరికించండి మరి –
   ”యే తావునరా నిలకడ నీకు ?–ఎంచి చూడ నగ పడవు 
    సీతా ,గౌరి ,వాగీశ్వరి యును -స్త్రీ రూపము లందా ?
    గోవింద ,,,భూకమలార్కా నిల ,నభ మందా ?
,  శ్రీ కరుడగు త్యాగ రాజు కరార్చిత ,–శివ ,మాధవ ,బ్రహ్మము లందా ?”
అంతటి ఉత్కృష్ట అభేద భావన త్యాగయ్యది .
 ఏదో ఒక తీర్ధం లో స్నానం చేస్తే చాలు .దానితో తృప్తి చెందు .ఇతర నడులకోసం ఎగా బ్రకడ్డు .అన్నీ సముద్రాన్ని చేరేవే .అంతు అఖండ మైన జల రాసి యొక్క ,భౌగోళిక సత్యాన్ని తెలియ జేశాడు .దీనినే తెనాలి రామ లింగడు తన హాష్య ధోరణిలో ”గంగ కిద్దరి మేలు ,అద్దరి కీడు ”ఉంటాయా అని ప్రశ్నించాడు .
  ” కోటి నదులు ధనుష్కోటి లో నుండగా ఏటికి తిరి గేవే మనసా” ?అని ప్రశ్నించాడు త్యాగయ్య .ఇక్కడ ఒక చారిత్రిక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మనం .రావణ వధ చేసిన తరువాత శ్రీ రాముడు ,తన” విజయ ధనుస్సు” ను నెల కొల్పిన క్షేత్రమే ”ధనుష్కోటి .రామేశ్వరానికి నైరుతి దిశలో ఉండేదట .పెద్ద ఉప్పెన లో అది కొట్టుకు పోయింది .”ఏటికి ”అంటే నదికి ,అని ,ఎందుకు అని రెండర్దాలున్నట్లు ప్రయోగించాడు శబ్ద బ్రహ్మ త్యాగయ్య.అసలు ఇందులో డాగి వున్న రహశం తెలుసు కోవాలి .విల్లు లాగా ,వుండే కను బొమ్మ ల మధ్య స్థానమే .భ్రూమధ్యం అని పిలువ అదే ”ధనుష్కోటి ”.దేహం అంతా వుండే నాదులే ,నదీ స్వరూపాలు .భ్రూమధ్యమే” ధృవం ”.దీని మీద ద్రుష్టి లగ్నం చేసి ధ్యానిన్చాతమే ”యోగం ”.మహా భారతం శాంతి పర్వం  లో త్యాగయ్య భావనకు స్పష్టం గా  ఆధారం లభిస్తుంది .
   ”నగము లెల్ల పుణ్య నగములు –నదులెల్ల పుణ్య నదులు -వినుము 
    భూసురాగ్ర గణ్య ,యకలుషం  ,బకర్దమం ,మన జాలు –నాత్మ తీర్ధ మెరుగు నకలుషునకు ”
                నాదం పరబ్రహ్మ స్వరూపం .దానిని ఉపాసించి ,నారదాదులు తరించారు .ఆత్మానుభావమే మతం .అనుభవం లేని ,వెద ,శాస్త్ర పాండిత్యం మతం కాదు .నాదం అనేది యోగ పరి భాష లో ”అనా హతం ”అని పెద్దలు చెప్పారు(వెన్నెముక లోని ఆరు చక్రాలలో మూలాధారం నుంచి నాల్గవది ).ఇదే స్వాతే నక్షత్ర స్తానం .వాయు సంబంధం వునాది .సప్త స్వరాలు ఇక్కడే జన్మిస్తాయని విజ్ఞులు వివరించారు .తన మానసం ”నాద లోలం ”కావాలని త్యాగయ్య ”నాద బ్రహ్మోపాసన్ ”చేస్తున్నాడు .ఈ కీర్తన రుచి చూద్దాం —
   ”నాద లొలు డైన  ,బ్రహ్మానంద మందవే  మనసా !–స్వాదు  ఫల ప్రద ,సప్త స్వర ,రాగ నిచయ ,సహిత 
    హరిహరాత్మక ,భూ,సుర ,శర జన్మ ,గణేశాది–వర మౌనులు పాశించి రే ధర త్యాగ రాజు తెలియ ” 
,  ఈ విధం గా సర్వ వాడ ,సర్వ దర్శన ,సమన్వయము చేశాడు త్యాగ యోగి .ఇది ఆయన పొందిన ఆత్మానుభావమే .బ్రహ్మ వేత్త త్యాగ బ్రహ్మ .వ్యక్తా వ్యక్త జగత్తు లో వున్న భిన్నత్వానికి ఏకత్వం ఆరోపించాడు ,సాధించాడు .నిజం గా వేదాంతం అంటే ఆత్మ సంస్కారమే అంటారు వేదాంత దేశికులు .పాండిత్యం ,కవిత్వం సమ తూకం లో వున్న సమ దర్శనుడు త్యాగయ్య .సూక్ష్మం గా ,సూటి గా మనసు కు హత్తు కోనేట్లు చెప్పే నేర్పు ఆయనది .వాగాదీశ్వరి రాగం లో ఇలా ఆలా పిస్తున్నాడు వినండి —
 ”పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసు కోరే –హరియత ,హరుదట ,సురలాట ,నరులట 
  అఖిలాండ కోటుల ,అందరిలో –గగనానిల ,తేజో ,జల ,భూమయ మగు 
  మృగ ,ఖగ ,నగ ,తరు కోటుల లో –సగుణములలో ,విగుణము లలో 
  సతతము ,త్యాగ రాజార్చితు డిలలో,”
అని అరటి పండు ఒలచి చేతిలో పెట్టినంత స్పష్టం గా గహన మైన విషయాన్ని తేలిక గా అర్ధం అఎతట్లు అందించిన సుమనస్కుడు .
         కుమ్మరి పురుగు కు బురద  .అంటదు  జీవన్ముక్తులకు . మాత్రమే మోక్షం  లభిస్తుంది .ప్రాణం ,అగ్ని సంయోగం వల ప్రణవం అయిన ఓంకారం జనిస్తుంది .అదే సప్త స్వరాలుగా విభాగమై ,సమగ్ర సంగీతం అయిందని కదా శాస్త్రం .దీనినే త్యాగయ్య ”ప్రాణాల సంయోగం వల్ల ప్రణవ నాదము ,సప్త స్వరములై బరగ ,వీణా నాదన లోలుదౌ శివ మనో విత మేరుగారు త్యాగ రాజ నుత ”అన్నాడు .అంతేనా ”మోక్షము కలదా భువిలో ,జీవన్ముక్తులు కాని వారాలకు ?అని తానె సమాధానమూ ఇస్తాడు .అంటే కాదు ‘యాగ ,యోగ ,త్యాగ ,భోగ ,ఫలా మోసంగే -రాగ సుధారస పాణం చేసి ,చొక్కి ,రంజిల్లవే మనసా ”అని బోధిస్తాడు .”సదా శివ మగు నాడంకార ,స్వర విదులు ,జీవన్ముక్తులు ”అని స్పష్ట పరుస్తాడు .ప్రణవం అనేది సదా శివుని వ్యక్తమైన రూపం .అసలు ఓంకారం అంటేనే సర్వ శబ్ద సమ్మేళనం అని వేదోపనిషత్తులు ఘోషించాయి .
      భక్తీ ,సంగీతం ,త్యాగ రాజు కు రెండు ఊపిరి తిత్తులు .భగవద్గీత ,ఉపనిషత్తుల సార సంగీతమే సాధన .కనుక విద్య వాసనా బంధం అన్నారు వేదాంతులు .దీనినే త్యాగాత్మ యోగి అండం గా చెప్పాడు —
  ”సీతా వర ,సంగీతా జ్ఞానము ,దాత వ్రాయ వలె రా రామ –గీతాద్యఖిలోపనిషత్సార భూత జీవన్ముక్తు  డౌట కు    
   ఆకాశ శరీరము ,బ్రహ్మమనే ,ఆత్మా రామున  తా ,సరి జూచుచు  
    లోకాదులు ,చిన్మయమనే సుస్వర లోలుడౌ ,త్యాగ రాజ సన్నుత ”.
              తన పూర్వ జన్మ లో చేసిన తఫః ఫలాన్ని ఆయన గుర్తిస్తాడు . ”లౌకిక కళకు దైవత్వం ఆపాదించి ,స్వర్గ ద్వారాలను ,స్వర ద్వారాలతో కల్పించిన ధన్య మూర్తి త్యాగ రాజు ”అన్న విశ్లేషకుల మాట అక్షర సత్యం .భారత దేశం లో ఏ కళ అయినా .,భాగావరాధనకే మార్గం చూపిన విషయం అందరికి తెలిసిందే.
”సొగసు గా ,మృదంగ తాలముల ,జత గూర్చి ,సోకక జేయు ధీరుడు నేనే ”అని ధంకా బజాయించి చెప్పు కొన్నాడు త్యాగయ్య.అది ఆత్మ విశ్వాసమే కాని అహంకారం కాదు .
    ”నిగమ శిరోర్ధము గల్గిన ,నిజ వాక్కులతో ,స్వర శుద్ధము తో ,యతి ,విశ్రమ సద్భక్తి విరతి ,ద్రాక్షారస ,నవ రసయుత ,కృతి చే ,భజించే యుక్తి ” తనకే వుంది అని అత్యంత ఆత్మ విశ్వాసం తో అతి నిక్కచ్చిగా ,నిర్దుష్టం గా చెప్పాడు .ఇలా సమాజం లోని అందర్నీ,వారి స్వభావాలను కాచి వడపోసిన వాడు త్యాగయ్య .అందరు ఒక్కటే .అనే కలిస్తే ఒక్కటే .అందరి లో వున్నది ఒక్కటే .ఆ ఒక్కదాన్ని చేరే మార్గాలు భిన్న మైనాచేరే చోటు ఒక్కటే .ప్రపంచమంతా తనదే .విశ్వేశుడు సకల చరా చరం లోను వున్నాడు .లో ద్రుష్టి పెట్టి వెతుకు దర్శన మిస్తాడు .ఆచారాలు విభజనకు కాదు .కలిసి పోవటానికి .తామసం నశిస్తే హృదయ కమలం వికశిస్తుంది .రామ నామమే తారకం అని సామాజిక స్పృహను భక్తీ లోజోడించి , ,వేద ఉపనిషత్ ,పురాణ ,గీతా సారాన్ని మృదు మధుర ,లలిత స్వరాలతో ,రాగాలతో అలతి పదాలతో సుస్పష్టం గాచేప్పిన వాడు త్యాగ రాజ మహాకవి .దార్శనికుడు .సంగీత వెది .రాగ సుదారాసాన్ని తని వారా గ్రోలి ,మనకూందించిన పుణ్య మూర్తి .,
                ”  త్యాగ రాజా కృతులలో సామాజిక ఆకృతి ”అనే అంశం ఇంతటితో పూర్తి .
        మరో అంశం తో మళ్ళీ మీ ముందుకు వస్తాను 
               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -01 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి 4–చివరి భాగం

  1. Phaneendra says:

    భక్తి వినా సన్మార్గము గలదే…! త్యాగరాజ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యోస్మి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.