రంగు తిళ్లు

రంగు తిళ్లు

పూర్ణచంద్  ఆంద్ర భూమి లో రాసిన వ్యాసం

-డా. జి.వి. పూర్ణచందు సెల్: 9440172642

January 8th, 2012

 

ఆహారం ఏ రంగులో ఉంటే మంచిదని ఈ తరం ప్రజలు కోరుకొంటున్నారు…? ప్రకృతి ప్రసాదించిన రంగుల్ని కాదని అదనపు రంగులకు ఎందుకు ఆరాటపడుతున్నాం..? ఆహార పదార్థాలకు రంగులు చేరిస్తే మనసుకు ఇంపుగానీ, నోటికి రుచిగానీ ఉంటుందనే భ్రమలోకి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం…? ఆకుపచ్చ రంగు కలిపిన జున్నునో, నీలంరంగు కలిపిన పాయసాన్నో మనం తీసుకోగలమా…? పలు కాయగూరలూ, పళ్ళూ, పసుపు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ, కమ్మని రంగు, రుచితోపాటు చక్కని సువాసన ఆహార పదార్థాలకు, పానీయాలకు కలిగిస్తూ, మేలు చేసేవిగా ఉంటాయి. కంటికింపుగా ఉండాలని రంగులు కలిపి వంటకాలు తయారుచేస్తున్నామంటారు వ్యాపారులు.
అంతర్జాతీయంగా ఆహార నాణ్యత గురించి పరిశీలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పరచిన కోడెక్స్ సంస్థ ఆహార పదార్థాలలో కలిపే రంగులన్నీ ఇంచుమించుగా అపకారం చేసేవేనని తేల్చి చెప్పింది. చెర్రీలు, క్యాండీలు, కెచప్‌లు ఇవన్నీ ఎక్కువగా రంగు విషాలు కలిసినవే అయి ఉంటాయి. మనం కోరుకొంటున్నాం కాబట్టి ఇలా రంగులు కలుపుతున్నామని బుకాయిస్తుంటారు వ్యాపారులు. విషాలను కావాలని కలిపి, హానికరం కావని అబద్ధాలను లేబుళ్ళమీద రాసి బలవంతంగా మన చేత కొనిపిస్తున్నారు. ఆహార పదార్థాలు, పానీయాలు నిలవున్నపుడు రంగు తగ్గకుండా నిరపాయకరమైన స్థాయిలోనే ఫలానా రంగు కలిపామని కొన్ని కంపెనీలు రాస్తాయి. చాలా కంపెనీలు అదికూడా రాయవు.విటమిన్లూ, మినరల్సూ ఆవిరయిపోకుండా బాగా ముదురు రంగు కాపాడుతుందని మందుల తయారీ కంపెనీలు చెప్తాయి. టానిక్కులు, సిరప్పులూ, సరదాగా తాగే కూల్‌డ్రింకులూ, రస్నాలు, ఐస్‌క్రీములూ అన్నీ రంగులమయమే! ఆఖరికి అప్పడాలు, వడియాలూ రంగులు కలిపి అమ్ముతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నదా..? పాలక్ అనే వంటకంలో ఆకుపచ్చరంగు కలుపుతున్నారు, మనం పాలకూర తిందామనీ, అది చలవ చేస్తుందనీ ఎదురుచూస్తాం. కానీ అందులో కలిపిన ఆకుపచ్చ రంగు కాలేయాన్ని కాల్చేదిగా పరిణమిస్తోంది. బజార్లో అమ్మే కంపెనీ బ్రాండు ఎండు మిరపకారం వేసినపుడు పులుసుమీద గానీ, చారుమీద గానీ, ఎర్రని పదార్థం తెట్ట కడుతుంది గమనించారా…? కారంలో కలిపిన ఎర్ర రంగుకి సాక్ష్యం అది. మాంసాహారాల్లో ఈ రంగు విషాలు మరింత ఎక్కువగా కలుస్తున్నాయి. అనేక స్వీట్లలోకూడా ఏదోఒక రంగు కలిపి అమ్ముతున్నారు. పులిమీద పుట్రలాగా ఆ స్వీట్లను ఫాయిల్ పేపర్ అంటించి అమ్ముతున్నారు. పుట్టిన రోజు కేకుల మీద రంగులతోవేసే డిజైన్ల గురించి మనం పట్టించుకుంటున్నామా…? ఇటీవల నల్ల రంగు కేకులు, బిస్కట్లు ఎక్కువ ఫ్యాషనైపోయాయి. ముద్దుల పాపాయి పుట్టినరోజుకి ఇచ్చేది ఈ విషాలనా…?
యూరోపియన్ యూనియన్‌లో ఆహార ద్రవ్యాల నియంత్రణ సంస్థ కొన్ని రంగులకు ‘ఇ-నెంబర్లు’ కేటాయించింది. పసుపులోంచి పచ్చని రంగునిచ్చే కణాలను వేరుచేసి కర్కుమిన్ అనే రంగు ద్రవ్యాన్ని తీశారు. దీనికి ళ100 అని పేరు పెట్టారు. పంచదారని నల్లగా మాడేలాగా వేయిస్తే ఒకవిధమైన గోధుమ రంగు వస్తుంది. దీన్ని కెరామెల్ రంగు అంటారు. అఖియోట్ గింజల్ని కలిపితే కాషాయం రంగు వస్తుంది. బీట్‌రూట్ దుంపనుంచి తేసే ముదురు కెంపురంగుని బిటానిన్ అంటారు. ఇలాంటివి సహజమైన వర్ణకాలు, వీటన్నింటికి నంబర్లు కేటాయించారు. నల్లగా బొగ్గుముక్కల్లాగా మాడ్చిన మొక్కజొన్న గింజలు, చింత పిక్కలు వీటిని వర్ణకాలుగా ఉపయోగపడతాయనితెచ్చి టీపొడిలోనూ, కాఫీపొడిలోనూ ముదురు రంగు అవసరమైన అన్నింటిలోనూ కలిపి, ఇవి సహజ రంగులేనని పేర్కొంటారు. ఏ ద్రవ్యాన్నయినా నల్లగా మాడేలాగా వేయించితే ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుడుతుంది. అది కేన్సర్‌కు కారణం అవుతుంది.
నిజానికి బ్రిలియంట్ బ్లూ, ఇండిగోటైన్, ఫాస్ట్ గ్రీన్ అల్లూరా రెడ్, ఎరిథ్రోజైన్, తారాజైన్, సనె్సట్ ఎల్లో.. ఇలా ఏడు కృత్రిమ రంగుల్ని ఆహార పదార్థాలలోనూ, పానీయాలలోనూ కలపటానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాథమిక రంగుల కలయిక వలన అనేక కొత్త రంగులు వస్తాయి. కూల్‌డ్రింకుకు తేనె రంగు రావాలంటే మిఠాయి రంగు నీలం రంగు, ఎరుపురంగు, ఆకుపచ్చ రంగు తగుపాళ్లలో కలపాలి. ఒక్కో రంగుకి ప్రభుత్వం వారు అనుమతించిన పరిమితి ఉంటుంది. ఇలా అనేక రంగుల్ని కలిపినపుడు ఈ పరిమితి దాటుతుంది. వెనె్నముక విరిగిన ఒక ఎలుకకి బ్రిలియంట్ బ్లూ అనే రంగుని ఇంజె ద్వారా ఇచ్చి చూస్తే వెనె్నముక చుట్టూ కణజాలాలు మరింత నశించిపోయి, మరమ్మతు చేయటానికి వీల్లేనట్టయ్యిందని కనుగొన్నారు. మనుషుల్లో కూడా ఇలా కణజాలాల నాశనం జరిగే అవకాశం ఉంది కదా..!
ఆరెంజ్ బి, అమరాంత్ అనే మిఠాయి రంగుల్ని అమెరికా ఏనాడో నిషేధించినా మన దేశంలో వాడుతూనే ఉన్నారు. కేన్సర్, దంత, లివర్ వ్యాధులకూ, ఎలెర్జీ రోగాలైన ఉబ్బసం, తుమ్ములూ, బొల్లి మొదలైన వ్యాధులకూ మనకు తెలియకుండానే ఈ రంగులు కారణవౌతున్నాయి. దేనిమీదా శ్రద్ధ లేకుండా జులాయిగా తిరగటాన్ని ఘఆఆళశఆజ్యశ జూళచిజషజఆ దకఔళ్ఘూషఆజ్పజఆక జూజఒ్యజూళూ అంటారు. రంగు పదార్థాలు ఎక్కువగా తింటే ఈ వ్యాధి పాలిట పడతారని శాస్త్రం చెప్తోంది. దీనికి పరిష్కారం ఏమిటంటే, ఇలాంటి విషాలను కొనకుండా ఉంటామని మనం ఒట్టుపెట్టుకోవాలి. వ్యాపారులు విషాలను అమ్ముతూనే ఉంటారు. వాటిని కొని అమాయకులు బలవుతూనే ఉంటారు. ప్రజలే చైతన్యవంతులై తమను తాము నియంత్రించుకోగలగాలి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

2 Responses to రంగు తిళ్లు

  1. bhaskar అంటున్నారు:

    దేనిమీదా శ్రద్ధ లేకుండా జులాయిగా తిరగటాన్ని ఘఆఆళశఆజ్యశ జూళచిజషజఆ దకఔళ్ఘూషఆజ్పజఆక జూజఒ్యజూళూ అంటారు

    ఏంటండీ ఈ వ్యాది పేరు..?

  2. aha అంటున్నారు:

    ఘఆఆళశఆజ్యశ జూళచిజషజఆ దకఔళ్ఘూషఆజ్పజఆక జూజఒ్యజూళూ what is this sir?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.