అధర్వ వేదం లో వ్రాత్య -2

    అధర్వ వేదం లో వ్రాత్య -2

ప్రత్యేకత ,గొప్పదనం వల్ల అధర్వ వేదం ప్రసిద్ధి చెందింది .వేద ప్రామాణ్యము ,పొందింది .దీని లోని నైతిక భావనలు ,సామాన్య మానవునికి ,కల్గించే ఆశ ,సహాయం వల్ల ,ప్రత్యేకతను పొందింది .ఒక ద్రుష్టి పార లౌకికమైనా ,వేరొక ద్రుష్టి భౌతికం మీద కూడా ఉంచింది .భుక్తికీ ,ముక్తికే ,సేతువు అయింది .ఆనందం ,ఐశ్వర్యం తో పాటు మోక్షానికి మార్గం సుగమం చేసింది .యోగానికి ,యోగికి గొప్ప స్థానం కల్పించింది .వైదిక కర్మలను ,హీనం  గాచూపిస్తూనే ,”రుద్రునికి” గొప్ప స్థానం కల్పించింది .
శైవ తంత్రం లో రుద్రునికివున్న   ప్రత్యేకతనే ,ఈ వేదమూ ,చూపించింది .ఒక రకం గా రుద్రుని పూజించే విధానమే ఇది .శాక్త తంత్రాలలో ,రుద్రుని గురువు గా భావించటం కన్పిస్తుంది .అధర్వ వేదం లో పూజ్యుడు రుద్రుడే .యోగి ని     భగవంతుని రూపం గా ,భావించటం కన్పిస్తుంది .తంత్ర మార్గం లో ,గురువుకే ఉన్నత స్థానం .ఇదే అధర్వ మార్గము ,”వ్రాత్య కాండ ”లో ,వ్రాత్యను ప్రస్తుతించే ,స్తోత్రాలు ఎక్కువ గా వున్నాయి .సాయనా చార్యుల వ్యాఖ్య ననుసరించి ,”వ్రాత్య అంటే ఉపనయం కాని బ్రాహ్మణ  బాలుడు” .అలాంటి వారిని సంఘం లో అగౌరవం గా చూసే వారు .దీనికి కారణం -అతనికి ,మత పరమైన ,ఏ విధులు నిర్వహించటానికి అర్హత లేక పోవటమే .ఉపనయనం అయిన వారికే ఆ అర్హత వస్తుందని అందరికి తెలిసిన విషయమే .ఆ వ్రాత్యుడే ,గొప్ప రుషీ ,ద్రష్ట అయితే ,అందరి పూజలు పొందు తాడు .దేవతలు కూడా అతన్నిఆరాధించే  యోగ్యత కల వాడు అవుతాడు .అతనే పరమాత్మ స్వరూపం .బ్రాహ్మణులు అతన్ని ద్వేషించినా ,వేద గౌరవాన్ని పొందాడువ్రాత్యుడు . ఈ కాండ అంతా వ్రాత్యను స్తుతించేదే .యోగ విధానం వల్ల ,పరమాత్మ అయిన వాడే ,వ్రాత్యుడని భావం .యోగి ని స్తుతించిన మంత్రాలన్నీ భగవత్పర మైనవే .సాయనాచార్యుని నిర్వచనం అందరు ఒప్పు కొన్నదే .అయితే, అంతకు మించి చాలా వుంది .ఆ నాటి వ్రాత్యులు వైదిక కర్మలు చేసే వారు కాదు .అసలు చేయ నక్కర్లేదు కూడా .ఆ యోగులు ,రుద్రుని భగ వంతుని గా భావించి పూజించే వారు .యజుర్వేదం లోని ”రుద్రాధ్యాయం ”లో వ్రాత్యను ”ఉశ్మిసి ”అన్నారు .అంటే తల పాగా వున్న వాడు అని అర్ధం . . ఇప్పుడు వ్రాత్య ఖండం లోని కొన్ని మంత్రాలు ,వాటి అర్ధాలను గురించి తెలుసు కుందాం .
 మొదటి మంత్రం -”వ్రాత్య ఆశీదీయ మాన ఏవ స ప్రజా పతిం ,సమైరయత్ ”అని వ్రాత్య ఖండం లో ప్రధమ అను వాకం లోని మొదటి మంత్రం .వ్రాత్యకు ఉపనయనం లేదు కనుక ,అతడు అన్ని బంధనాలకు అతీతుడు .వ్రాత్య అంటే పరమాత్మయే.అతడే కాలా తీతాలకు అతీతు డైన దేవుడు .త్రిగుణా తీతుడు .ఆ గుణాలతో బంధింప బడే కర్మలకు అతీతుడు .”పిప్పల పాఠం ”లో వ్రాత్య అంటే మొదట ఇవన్నీ వున్న వాడు అని వుంది .అంటే కేవలం పరమాత్మయే కదా !వ్రాత్య అంటే రుద్ర నామాలలో ఒకటి .”నమో వ్రాత్యాయ ”అని రుద్రాధ్యాయం అంటోంది. రుద్రుడే పరమాత్మ .దీనికి సంబందంచి ,యజుర్వేదం లో 100 మంత్రాలు వున్నాయి .పైన చెప్పిన మంత్రానికి అర్ధం ఏమిటి అంటే –వ్రాత్యుడు ,కదలటానికి సిద్ధం గా వున్నాడు అంటే భగవంతుడు అనే భావనే ..తనను ,ప్రజాపతి గా భావించాడు అని .భగవంతుడు మార్పులేకుండా  వుండడు .చేతనా లేని వాడూ కాదు .పరబ్రహ్మ కే కదలిక లేదు .ఋగ్వేదం లోని ”నాస దీయ సూత్రం ”లో ”అతడు గాలి లేకుండానే శ్వాసిస్తాడు .”అని వుంది .ఈ సూక్తం లో శ్వాసించాడు అంటే చలనం ఉన్నట్లే కదా .అతడు ”మాయా శబలుడు ”పరబ్రహ్మ మాయలో ప్రతి బిమ్బిస్తాడు .కనుక ఈ చలనం ,బాహ్యానికి సంబంధించినది కాదు .ఆన్తరికం .అతడే జ్ఞాని .తెలియ వలసిన వాడు .తెలియ దగిన వాడూ అతనే .లయం లో వున్న జీవులన్నీ ,ఆయన్నే చేరు తాయి .ఆయన లోనే వుంటాయి .గాఢ నిద్ర లో వుంటాయి .పూర్వ జన్మ కర్మ లన్ని నిద్రాణం గానే వుంటాయి .మేలు కోవటం అనేది ,దీని తర్వాత జరిగే పని .పూర్వ కర్మ ఫలం అనుభవించాల్సిందే .తప్పించు కోవటం కుదరదు .భవిష్యత్ విశ్వం మాత్రు గర్భం లోమూర్తీభ విస్తుంది . ఆ స్థితి లో ”హిరణ్య గర్భుడు ”అనే తో పిలువ బడుతాడు .ఇంకో పేరు ”ప్రజా పతి ”.జీవ రాసులన్నిటికి తండ్రి అని అర్ధం .భర్త అనే అర్ధమూ వుంది .వ్రాత్య అనే దేవుడు ,ప్రజా పతిని కదిలించాడు .అంటే తన లోనే వున్న ప్రజా పతికి చలనం,ప్రేరణ కల్గించాడు . (motivated).”నాసదీయ సూక్తం ”లో ”ఆయన తపస్సు నుంచి ఒకడు జన్మించాడు ”అని వుంది .ఇంకో చోట ,శృతి ”అతని తపస్సేజ్ఞానం” అని అంది .
 రెండవ మంత్రం –
”స ప్రజా పథిహ్ సువర్ణ మాత్చాన్న పశ్యత్ -తత్ ప్రాజనయత్” దీని వివరం తెలుసు కొందాం
ప్రజాపతి తనలో బంగారం చూశాడు .అంటే బంగారానికి జన్మ నిచ్చాడని  భావం .ఇక్కడ బంగారం అంటే జీవులు చేసిన మంచి ,చెడుల ఫలితాలుఅని అర్ధం .ఇవన్నీ గత జన్మ లోనివి .గత విశ్వం లోనివి.నగలన్నీ బంగారం తో చేయ బడి నట్లే ,గత జన్మ ల సంస్కారాలు అనే సువర్ణం తో ,మళ్ళీ జన్మలు చేయబడు తాయి అని గొప్ప అర్ధం ఇందులో దాగి వుంది .తమ కర్మల ఫలితాలకు తగి నట్లు ,అనేక రకాల సృష్టిని ,నిర్మించాలి కదా .అందుకే ప్రజా పతి ”హిరణ్య గర్భుడు ”అయి నాడు .అంటే తన గర్భం లో హిరణ్యాన్ని అంటే బంగారాన్ని దాచిన వాడు అని అర్ధం .ఏదైనా ఒక ఆకృతి రూపు దాల్చాలి అంటే ,మనసులోనే ఆ భావం పుడుతుంది .ఆ తర్వాతే ఆకారం ఏర్పడు తుంది .దానికి అతడే సాక్షి .అలాగే భవిష్యత్ విశ్వ రచనకు మనసు లోని ఊహయే కారణం .నిజం గానే దేవుడికి మెదడు (mind )లేదు .కాని హిరణ్య గర్భుడి గా ,ఆపను లన్నీ చేస్తాడు .ఆయన్ను చూశాడు అంటే అదే సాక్ష్యం .భవిష్యత్ లోక సృష్టికి బీజం మనసు లోనే పడింది అన్న మాట .
        మూడవ మంత్రం –
”తదేకమవభావత్ -తల్లలామమ భవత్ -తన మహ దభ వత్ -తజ్జేస్త మవ భవత్ -తద్బ్రహ్మా భవత్ –తత్తపో భవత్ -తత్ సత్యమావ భవత్ -తేన ప్రజాయత ”  ఈ మంత్రార్ధమేమిటో చూద్దాం
అది ఒకటి అయింది .అందం గా మారింది ,.గొప్పదైనది .అన్నిటి కంటే పెద్దది అయింది .అదే బ్రహ్మ మైంది .తపస్సు అయింది .సత్యమయింది .దీని వల్ల సృష్టి జరిగింది .ఇదే ప్రజా పతికి చేసిన స్తుతి .అతని చేష్టకు ప్రస్తుతి .విశ్వం అంతా ఆయన లోనుంచే వచ్చింది కనుక ,అనేకత్వం లో ఏకత్వం భాసించింది .శృతి కూడా ”గొప్ప వాని కంటే గొప్ప వాడు ”అన్నది .గొప్ప అంటే అనంతత్వం .దేశ కాలాతీతం .సుందరం అంటే ఇంతకు పూర్వం లేని అనేక విషయాలను కని పించేట్లు చేయటం .ఆయన ,విశ్వం యొక్క పుట్టుక కు ముందే వున్నాడు .అందుకే పెద్ద వాడు .వృద్ధుడు .బ్రహ్మ నే ప్రజాపతి అనటం మనకు తెలిసిందే .ప్రజాపతి లో దాగిన జీవుల సంస్కారాలు అన్నీ ,తపస్సు .దీని నుంచే సత్యం జనిస్తుంది .రుతం కూడా దీని లోనుంచి రావాల్సిందే .రెండూ విడదీయ లేని సంబంధం కలవి .రుతం స్వాభావిక ప్రకృతి .సత్యం నీతి సూత్రం .”ఆతని తపస్సు నుంచే రుతం ,సత్యం పుట్టాయి ”అంటుంది శృతి .కనుకనే రుతం ,సత్యం ల నుంచే విశ్వావిర్భావం జరిగింది .శూన్యం నుంచి ఏదీ సృస్స్తింప బడదు .జీవ సంస్కారాల వల్లే జన్మలు కలుగు తాయి .శృతి లో కూడా ”సంస్కారాల మొత్తం అయిన ”అపూర్వం ”నుంచే ఆయన సృష్టి చేశాడు ”అని వుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.