ప్రియమైన మిత్రులకు,
నమస్కారం. నూతన సంవత్సర / సంక్రాంతి శుభాకాంక్షలు. ఈమధ్య, నేను ‘గీతా సారం’ పేరుగల గ్రంధాన్ని తెనాలి లో 18.12.2011 తేదిన ఆవిష్కరణ చేయటం జరిగినది. ఈ గ్రంధాన్ని భగవద్గీత నుండి 117 శ్లోకాలు, తాత్పర్యం , విశేషాలను ఎంచి, సేకరించి, సంకలనం చేయటం జరిగింది. ఈకాలంలో, చాలామంది సంపూర్ణ భగవద్గీతను చదవలేకపోతున్నారానీ, ఆసక్తి కల వారు కనీసం ”గీతా సారం’ (సంక్షిప్త భగవద్గీత) అయినా చదివి అర్ధం చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ఈ గ్రంధాన్ని సంకలనం చేసి ఉచితంగా అందజేయాలని నేను సంకల్పించినాను. ఈ క్రమంలో, మీకు కూడా ఈ గ్రంధాన్ని బుక్ పోస్ట్ ద్వారా పంపాలని తలచాను. అందుకోసం మీ పోస్టల్ చిరునామా నాకు, ఇ – మెయిల్ ద్వారా తెలియ చేస్తే, మీకు బుక్ పోస్ట్ లో పంపగలను. కాబట్టి, మీ జవాబు లో తెలుపండి.
కాంటాక్ట్ ఈమెయిలు : mvln1947@gmail.com
శెలవు.
భవదీయుడు,
|