సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –9
పరమ భక్తాగ్రేసరుడు త్యాగయ్య శ్రీ రాముని కొలువు సన్నిధానం గా చేసుకొని, చూసి ,పాడి ,తన్మయుడై ,ఒక దృశ్య చిత్రం లా మన ముందు వుంచుతాడు .,
”పాహి రామ యనుచు ,భజన సేయవే -మనసు రంజిల్ల బల్కె మదన జనకుడు
కలువల రేకుల ను గేరు కనుల జూచెను -భారతుడా వేళ కరిగి కరిగి నిలవగా
కరము బట్టి కౌగిలించే వరదు డప్పుడు -మనసు దెలిసి ,కలిసి హనుమంతు డుండగా
చనువు మాట లాడు ,చుండే సార్వ భౌముడు ”
ఊహలో అద్భుత పదచిత్రం గీశాడు .మనసుకు హత్తు కొనే హృద్య మైన రచన ఆ భావుక కవి కి వరం గా లభించింది .
అలాగే ”సౌరాష్ట్ర రాగం ”లో ”వినయము కౌశికు వెంట జను ,నంఘ్రులను ,చూచే దెన్నటికో ”అంటూరామ కధా విధానాన్ని రూపు కట్టిస్తాడు .చిత్ర కారుడిగా మన ముందు నిలుస్తాడు . ,
”ఘన మైన ,పుష్పక మున ,రాజిల్లిన సొగసును -చూచే దెన్నటికో
భరతుని గని చేయి బట్టు కోని ,వచ్చిన వేడుక ను చూచే దెన్నటికో
కనక సింహాసనమున ,నెల కొన్న ఠీవి ని ,చూచే దెన్నటికో ” అని శ్రీ రామ పట్టాభిషేక మహోత్స వాణ్ని ,కళ్ళ ముందు ప్రదర్శిస్తాడు .హృదయాలను ,ఆర్ద్రం గా మారుస్తాడు .ఇక్కడ త్యాగయ్య లోని భక్తుడు ,కవి ,చిత్రకారుడు ,కొత్త రీతుల్లో కని పిస్తారు .ఆలన్కారికం గా రచన అందం పొందింది .అవయవాలకు ,ఉదాత్త మహిమ కల్పిస్తాడు
”వెనుక ,రాతిని ,నాతి చేసిన చరణము చూసే దెన్నటికో
ఘనమైన శివుని చాపము ను ,ద్రుంచిన ,పాదమును చూచే దెన్నటికో
ఆగమ నుతుని ,ఆనంద కందుని ,బాగ చూచే దెన్నడో
పరమ భాగవత ప్రియుని ,నిర్వి కారు ,నిరాకారుని రాగ చూచే దెన్నడో ”ఈ కీర్తన లో ,బావం ,భాష ,కల కండ పలుకే .
పలుకు పలుకున తేనే అంటే ఇదే .ఒక్కొక్క సంఘటన ఒక ”రవి వర్మ చిత్రమే నని పిస్తుంది”అన్న విజ్ఞుల భావన నూటికి నూరు శాతం నిజం .
ఈ చిత్రాలు ,విచిత్రాలే కాదు ,కళా మర్మాలకు ఆల వాలు . త్యాగయ్య కీర్తనలు రస నిష్యంద నాలు .సౌందర్య స్ఫోరకాలు .గాన కవితా చాతుర్యాలు .
మారీచుని మదం అణచే వేళ ,శివుని ధనువు విరిచే వేళ ,శ్రీ రాముని ముంగురుల కదలిక ఆయనకు ,విశ్వా మిత్రునికి అద్భుత ఆనందాన్ని ,గగుర్పాటును కలుగ జేశా యట .ఆ శిరో సౌందర్యం ఏమిటో మనమూ దర్శిద్దాం .
”అలక లల్లలాడగ ,,గని ,ఆ రాణ్ముని ఎటు పొంగెనో ?
— చెలువు మారగను ,మారీచుని మద మణి చే వేళ
ముని సైగ దెలిసి ,శివ ధనువును విరిచే ,
సమయమున ,త్యాగ రాజ వినతుని ,మోమున రంజిల్ల –అలకలల్ల లాడ
త్యాగ రాజ సత్కవి కి అంతా సుందరం ,శివం .
శ్రీ రాముని కొలువు లో ,త్యాగయ్య ప్రతి క్షణం తన్మయ స్తితి లో ఉంటాడు .గోష్టి ,సంకీర్తన ,సేవింపు ,మేలు కొలుపు ,పవ ళింపు దిన చర్య .
”చనవున ,పన్నీట స్నానము గావించి ,-ఘను నికి ,దివ్య భోజనమును ,బెట్టి
కమ్మని విడే మొసగుచు ,మరవక సేవించే –భాగవతులు ,బాగుగా ,ఘన ,నయ రాగ ములచే ,దీపా రాదన మొన రించి
వేగమే ,శ్రీ హరి విరుల పై ,పవళించి ,జోకొట్టి ,-త్యాగ రాజు సుముఖుని లేపే -”
ఇది సంపూర్ణ పరిచర్య స్వరూపం .కళ్ళకు కట్టి నట్లు వ్యక్తీకరించటం త్యాగయ నేర్పు .
శ్రీ రాముని కొలువులో ,వార కాంత ల ,రమణీయ లాశ్య విన్యాసం చూసి పక్కనున్న త్యాగయ్య తో రామయ్య మెచ్చు కోలు మాటలు చెప్పి నట్లు భావిస్తాడు .ఆ దివ్య దృశ్యం మన కళ్ళ కు కట్టి నట్లు వర్ణిస్తాడు ,కాదు ,కాదు చిత్రిస్తాడు మహా భక్తాగ్ర గణ్యు డైన త్యాగరాజ కవి చిత్ర కారుడు .
”సుర కామినీ ,మణుల గాన -మాదరణ నాల కిన్చుచు
శృంగార ,రస యుక్త ,వారమ ణుల ల జూచి ,సరస త్యాగ రాజ వరుని తో బొగ డే
పలుకు కండ చక్కర ను గేరునే -పణ తు లార చూడరే ”పటిక బెల్లం పలుకు మెల్ల ,మెల్ల గా కరుగు తూ రుచి నిస్తుంది .అంటే ఆ వాక్యాల మాధుర్యం క్షణికం కాదు ,శాశ్వతం ,ఆత్మాను భవం ,దివ్యాను భవం కవిత్వానికే ప్రాణం .
ఇంకొన్ని పద చిత్రాలు మరో సారి చూద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com