సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –10
పద చిత్రాలు –2
ఇంకొన్ని పద చిత్రాల సోంపు చూద్దాం .శ్రీ రామునికి ఇరు వైపులా సీతమ్మ ,లక్ష్మణుడు నిల బడి సేవ చేస్తున్న వైనాన్ని , ,ఖర హరుడైన శ్రీ రామునికి ”ఖర హర ప్రియ ”రాగం లో ,త్యాగయ్య ఔచితీ వంతం గా చేసిన రచన తిల కించండి . .
”ప్రక్కనా నిలబడి ,కొలిచే ముచ్చట బాగా తెలప రాదా –చుక్కల రాయని ,గేరు మోము గల ,
సుదతి సీతమ్మ ,సౌమిత్రియు ,ఇరు ప్రక్కలా నిలబడి —
తనువు చే వందన మొనరించు చున్న -రాచనవున,, రామ కీర్తన చేయు చున్న రా
మనసున దలచి ,మై మరచి వున్న ,-రా నేనరుంచి ,త్యాగ రాజుని తో హరి హరి ,మీ కిరు ప్రక్కలా ” ,
ఇదొక అలౌకిక చిత్రం .మాటల చిత్రం ,మనసు కు పట్టే చిత్రం .ఆ దృశ్యం ,మనో వీధి లో చూచి ,మై మరపించే పులకింపు .తానూ ,మైమరుపు తో సేవిస్తున్న భావన .విశ్వాస పూర్వక మైన ఆకాంక్ష.
త్యాగయ్య శ్రీ రాముడు కేళీ వినోదుడు .తెలుగు వారి ”ఓమన గుంటలు ”ఆడతాడు .విశ్వ రూపుని కేళీ విన్యాసం .ఆది దంపతుల మధుర ప్రణయ లీలను దివ్య చిత్రం గా మలుస్తాడు .పద బంధం తో ప్రేమ జ్యోత్న పరుస్తాడు .పోతన్న గారు ”అల వై కుమ్థ పురంబు లో ”,అన్న పద్యానికి అనుకరణ ,చాతుర్యం చూపిస్తాడు త్యాగయ్య .
”మధుర మైన పల్కులసీతా రమణి తో ,”ఓమన గుంట గెలుచుట ” ” ,
చేత ,నొకరి నొకరు చూచుచు ,సాకేతాధిప ,నిజ మగు ప్రేమతో ,
బల్కు కొన్న ముచ్చట ,వాతాత్మజ ,భరతులు విన్నతుల .త్యాగ రాజ సన్నుత
విన నాస గోన్నానురా ,విశ్వ రూపు డనే ,మనసార ,వీనుల విందుగా ”
లలిత లావణ్య మూర్తి శ్రీ రాముని ముద్దు లోలికే మోము ను భక్తి మీర త్యాగ రాజు వర్ణిస్తాడు .సౌందర్యో పాసన తో ఆ స్వామి తను వంతా ,సౌందర్య సుకు మారం గా ,కాంతి వంతంగా ,కన్పిస్తుంది మనో వీధిలో
”సొగసు చూడ తరమా ?నీ సొగసు చూడ తరమా ?
నిగ నిగ మనుచు ,కపోల యుగము చే మెరయు మోము –అమరార్చిత పదయుగామో ,
కమ నీయ ,తను ,నిందిత కామ ,కామ రిపు నుత ,నీ -సొగసు చూడ తరమా ?
వర బింబ సమాధరమో ,వకుళ సురంబుల యుగమో–కర ద్రుత శర కోదండ ,మరక తాంగ వర మైన
చిరు నవ్వు ,ముంగురు లతో ,మరి కన్ను ల తెటో -వర త్యాగ రాజార్చిత ,వంద నీయ -ఇటు వంటి -సొగసు చూడ తరమా”
పంచ నదీ తీరం లో త్యాగయ్య స్వయం గా ,జరి పించిన నిత్య భజనో త్సవంకన్నుల ముందు నిల బెట్టు తాడు .సుందర పద బంధాలు తాళ నృత్య గతులతో వెంట నర్తిస్తాయి .అదీ త్యాగయ్య కృతి వైభవం .
”హరి దాసులు వెడలె -ముచ్చట ఆనంద మాయే -దయాళో
హరి గోవింద ,నరహరి ,రామ కృష్ణ యని ,వరుసగ నామము కరుణ తో జేయుచు
సంగతి గాను ,,మృదంగ ఘోష ములచే ,పొంగుచు ,వీధుల కేగుచు ,మెరయుచు

చక్కని హరి చే జిక్కితి మని ,మది సొక్కుచు నామమే ,దిక్కని పొగడుచు –హరి గోవింద
దిట్ట ముగా నడు కట్టు తో నడుగులు ,బెట్టు చు ,తాళ ముల్ బట్టి,గల్ గల్లన
జ్ఞాన ముతో ,రామ ధ్యానముతో ,మంచి గానము తో ,’మేను దాన” మొస గుచు
రాజ ,రాజుని పై ,జాజులు ,చల్లుచు ,రాజిల్లుచు త్యాగ రాజు ని తో గూడి –హరి ,గోవింద” —
భక్తుల ఆనంద పార వశ్యం నృత్య గాన భంగి మలు ,మనో ఫలకం పై ,ముద్ర వేసి నట్లు గా పదాల పరుగు ,నాట్యం చేసి నట్లుండే నడక ,మనో హర పద బంధం .అర్ధ వంతం ,మధుర శబ్ద ప్రయోగం .వారందరికీ శ్రీ రామ నామమే దిక్కు .”మేను దానం ”అనటం లో శరణా గత తత్పరత కని పిస్తుంది . ఈ విధం గా తాను మనసు లో ఊహించుకొన ,తాను సమాధి స్తితి లో దర్శించిన ,శ్రీ రామ కుటుంబ సపరి వార చిత్రాలను చక్కని పద బంధాలతో మృదు మధుర పద సౌందర్యం తో వర్ణ చిత్రాలు గా వేసి ,చూసి తరించ మని తెలియ జేశాడు త్యాగ రాజ మహా పద చిత్ర కారుడు .
దీని తర్వాత ”కృతుల లో -వ్యాజ నిందా స్తుతి ,అధిక్షేపణ ”లను తారు వాతి భాగాలలో తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com