సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —11
తాను నమ్మిన దైవాన్నో ,రాజునో ,ఇష్టమైన వాడినో ,తిడుతూ పొగడటటం ,పొగడుతూ తిట్టటం ,అధిక్షే పించటం ఒక రకమైన కవితా మర్యాద. చనువున్న కవి చేసే విచిత్ర ప్రక్రియ .భగ వంతుని లో ,ఆనందామృతం పంచుకొనే వారు చేసే రస రమ్య వినోదం .ఇందు లోను ,త్యాగయ్య ది పెద్ద పీటే .”నాకు ఇతర మతాలు తెలీవు .మది కరిగెట్లు భజన చేశాను .నేను భువిని మాని –నీవు కనికరం లేని హీనుడని పించుకోవటం మర్యాదా ?”అంటారు త్యాగ రాజ స్వామి రామ స్వామి తో .నింద మోపి ,భయ పెడ్తున్నాడు .
శ్రీ రాముడు చేసిన వింత పనులకు గుట్టు తెలిసి కోని ,మంచి ఉద్దేశ్యం తోనే కీర్తిని ఆపాదిస్తాడు .కొత్త పోకడ ,సోంపు తో వున ఈ కృతిని తిలకించండి .
”నిరు పేద భక్తుల ,కారి కోత బడ లేక గిరి పై ఎక్కావా ?రాలేరు అని శ్రీ రంగం లో దాగావా ?ఎప్పుడో వచ్చే ,జీర్ణ కుచేలుడి కోసం ,గోపీ వస్త్రాపహరణం చేశావా ?//అని ఎద్దేవా చేస్తాడు భక్త త్యాగయ్య.”నిన్ను ఆశ్రయిస్తే ,అన్నీ కష్టాలే .ఎవరేం బావుకొన్నారు ?”అని అధిక్షే పిస్తూ ప్రతి చోట ,ఒక కధకు ఊహ కల్పిస్తాడు .రసికత గల ఈ కృతి చూడండి –
ఆశ్రయించి ,వరమడిగిన ,సీత అడివికి బోనాయె –
ఆశ హరణా ,రక్కసి ఇష్ట మడగ ,అపుడే ముక్కు పోయేగా రామా
వాసిగా నారదముని ,వర మడుగ ,వనిత రూపు డాయే
ఆశించి దుర్వాసు డన్న మడుగ ,అపుడే మంద మాయే (కడుపు నిండి పోయింది )
సుతుని వేడుక జూడ దేవకి ,యడుగ ,యశోద సూడ నాయె
సతు లెల్ల ”రతి భిక్ష ”మడుగ ,వారి ,వారి పతుల వీడ నాయె ఓరామా
నీకే దయ బుట్టి ,బ్రోతువో ,బ్రోవవో నీ గుట్టు బయ లాయే
సాకేత ధామ ,శ్రీ త్యాగ రాజ నుత స్వామి -ఏటి ఈ మాయ ఓరామా ”
భక్తి పుట్టించిన అలౌకిక శక్తి తో త్యాగయ్య ”ఎన్నాల్లూరకే వుందువో చూతాము .ఎవరడిగే వారు లేరా శ్రీ రామా ?”అని వాడుక భాష లోనే బెదిరిస్తాడు .ఇలాంటి దాన్ని ”ఉపద్రవ భక్తి ”అన్నారు .అంతే కాదు ,”అన్నీ ,తానను మార్గమునను ,చనితే ,నన్ను వీడెను ?అంటావు ,భార మంటావు .”అని నిందిస్తాడు .”తన్ను బ్రోవరా సదా అంటె ,ద్వైతుడనేవు ?”అని దిగ్భ్రమ చెందు తాడు .”ఏ దారి సంచ రించ మంటావు ?నువ్వే చెప్పు ?”అని నిల దీస్తాడు .ఇందులో ఆత్మానందం ,తన్మ యత్వం ,ఆత్మ విశ్వాసం ,అకలంక భక్తి వినమ్ర, వినీత ప్రార్ధన కన్పిస్తాయి త్యాగయ్య లో .
”దేహ బుధ్యాతు దాసోహం ,జీవి బుద్ధ్యా తు త్వదంశః -ఆత్మ బుద్ధ్యాత్వమే వాహం ”అన్న శంకరా ద్వైతాన్ని ,భక్తి పూర్వక నిర్వచనం ఇస్తాడు త్యాగ య్య భక్త శిఖామణి .
”నన్ను దగ్గరకు తీయ వద్దని ,నీ పరి వారం లో ఏవ రైనా అన్నారా నీతో ?లేక గరుత్మంతుడు ”సమ్మె చేశాడా “”/అని స్మిత పూర్వాభి లాషి (నవ్వి ,మాట్లాడే వాడు )మందస్మిత వదనారవిన్దుడు అయిన రామ ప్రభువును ,అవహేళన చేస్తాడు ,ఆర్తి గా .”నగు మోము గన లేని ,నా జాలి తెలిసి ,నను బ్రోవగ రాదా శ్రీ రఘు వర -నీ నగు మోము
ఖగ రాజు నీ యానతి విని వేగ చానా లేదో ?గగనానికి ఇలకు బహుదూరంబని నాడో ?
ఒక వేళ లంచాలేమైనా పని చేశాయా ?ఇకా ఎక్కువ ఎవరైనా ముట్ట జెప్పారా ?”అంటూ పాత కధలు మనోజ్ఞం గా జ్ఞాపకం చేశారు త్యాగయ్య .
”ఇభ రాజేంద్రుడు ఎక్కు వైన లంచమిచ్చినా డేమిరా ?-సభలో మానము బో సమయంబున సతి ఎమిచ్చేనురా ?
భాగవతాగ్రేసర ,రాసికావన ,జాగ రూకుండని పేరే ?–రాగ స్వర యుత ,ప్రేమ భక్త ,జన రక్షక ,త్యాగ రాజ పండిత ”
భక్తుడిని ,ఉపెక్షిస్తుంటే నిల దీసే భక్తి ,శక్తి ,యుక్తి ,అను రక్తి వున్న వాడు త్యాగయ్య .అందుకే అంత ఘాటు మాటల పోట్లు పొడిచాడు తన రామయ్యను .సంగీత భక్తుల యెడ ,శ్రీ రామునికి పక్ష పాఠం వుందని ,పాత భక్తి సంగీత సార్వ భౌముల కధలు ,గాధలు విన్న వాడు ,వారి వ్యధలన్నీ తెలిసిన వాడు అయిన త్యాగయ్య .
భక్తుడు దీనా వస్తా లో వుంటే దేవి తో సరస సల్లాపాలా ?అని ”కోలా హల ”రాగం లో కోలా హలం ,హల్చల్ సృష్టించాడు .లలిత నిందా స్తుతి తో ,తళుకు బెళుకు తో మనసును ఆకర్షిస్తాడు .అవతారాలు పది వున్నా ,అందులో ”రామా వతారమే ,రామ వేషమే మిన్న ”అని ఉబ్బి పోయే ఉబ్బు లింగం త్యాగ బ్రహ్మం .
ఇట్టి వేళ నీ కెట్లు తోచు నని ,-ఇల్లాలితో ముచ్చట లాడేదు ?
రట్టు నీ మనసు కెట్టు తోచెనో ,రక్షించుటకు ,శ్రీ త్యాగ రాజ నుత
మది లో యోచన పుట్ట లేదా ?మహా రాజ రాజేశ్వరా ?”
రావా నారి యని రాజిల్లు కీర్తియు ,కాన కేగి యాజ్న మీరక
మాయా కారమునిచే ,శిఖి చెంతనే యుండి -దానవుని వెంట చని అశోక తరు మూల నుండి
వాని మాటలకు కోపగించి ,-కంట ,వధి ఇమ్పక నే యుండి
శ్రీ నాయక ,యశము ,నీకే కలగా -జేయ లేదా ?త్యాగ రాజ నుత ”
” ప్రాప్తి గల్గు చోట ఫల మిచ్చు దైవంబు-ప్రాప్తి లేని చోట ఫలము లేదు
ప్రాప్తి లేక పసిడి ,పరమాత్ము డిచ్చునా ?”అన్నాడు ప్రజా కవి వేమన .అలాగే త్యాగయ్య కూడా
”రానిది రాదు ,సురాసురులకైనా ,-పోనిది పోదు భూసురలకైనా ”అంటూనే
దేవేంద్రునికి సుదేహము ,పూర్వ దేవుళ్ళకు అమృతం అభావం కాలేదా ?”అంటాడు .
”ఆ వన చర బాధలు ఆ మునులకే గానీ ,”అన్న మాట సర్వ జీవులకు ఆనవా యించే సూత్రమే .రాక్షసులను ” పూర్వ దేవుళ్ళు ”అనటం సరదా అయిన మాట .వాళ్ళూ ఒకప్పుడు దేవుళ్ళే నని గుర్తు చేయటమే .మునులకు అరణ్య వాసం పాపం వారి నుదిటి వ్రాత గా అభి వర్ణించటం తమాషా .దీన్ని ఎవరు తప్పించ లేరు అని ధ్వని .విధి బలీయం అనటాన్ని సమర్ధించటం ..
దొంగ దారు లు తొక్క కుండా ,మాట మీద నిల బడ మని ఘాటుగా నిందా స్తుతి చేస్తాడుతమాషాగా .”ఇల్లు బంగారం అయిందా ?”అనీ ,”రంగాడా విభీషణునికి ,పంగ నామ మిడిన రీతిని ”పూర్వ కధ గా అభి వర్ణిస్తాడు .విభీషణుని తో లంకకు వస్తానని ఎగ గొట్టిన రాముడి మాట ను ఇక్కడ గుర్తు చేశాడన్న మాట .
”వెన్న తా భుజించి ,గోప కన్య ముఖమున -తిన్న గా నలది నట్లు ;”అన్న కృతి లో ఆలా కృష్ణ లీలలు వర్ణిస్తూ చెప్పటం గొప్ప గా వుంది .ఇందు లో శ్లేష ను కూడా జోడించి చెప్పాడు .విభీష నుడి రాజ్యానికి పోవ టానికి ఇష్ట పడని రాముడు ”సహ్యజ ”తీరం లో కొల్లడం ,కావేరి నదులు గా చీలిన అంతర్వేది తోనే తృప్తి పడ్డా డని చమత్కారం .
”సారమౌ కవితల ,విని వెర్రి వాడు -సంతోష పడి ఏమి పడ కేమి ?
చేరెడేసి గుడ్డి కనులు బాగా ,తెరచి ఏమి తెరవ కున్న వేమి ?
ఎదను శ్రీ రామ భక్తియు లేని ,నర జన్మ -మెత్తి ఏమి ,మృగ మైతే నేమి ?
పదము ,త్యాగ రాజ నుతు ని పై ,గానిది -పాడితే ఏమి ?ఏడ్చి తే నేమి ”?
అని రసవత్తరం గా అధిక్షే పించే సత్తా త్యాగయ్య భక్తునిది .త్యాగ రాజ వినతుని ,కడిగి ఎందేయ గల సామర్ధ్యం చాతుర్యం ,చేవ ఆయనకే వుందని పిస్తాడు .ఎగ తాళి చేసినా ,సమయం తెలిసి పుణ్యాన్ని ,ఆర్జించాలని త్యాగయ్య హావం .సొంపైన నడ వాది ,మనసుకు పట్టే లోకోక్తులు ,లోక రీతి ,కాల గతి ,చూపిస్తాడు త్యాగయ్య .శ్రీ రామ భక్తి ఏ పరమ తారకం అనే పూర్తి విశ్వాసం తో వున్న భక్త శిరోమణి ,రామ పాద సేవా దురంధరుడు త్యాగ బ్రహ్మ .
వ్యాజ నిన్దాస్తుతులు ,అధిక్షేపణ లకు ఇంతటి తో స్వస్తి పలుకు దాం .
త్యాగ రాజ కృతుల్లో” భక్తి ,శరణా గతి ”గురించి తరువాత వివరంగా తెలుసు కొందాం
సశేషం
మీ –గబిత దుర్గా ప్రసాద్ –20 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్