సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –12
కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –1
నవ విధ భక్తిని తన కవితా కృతుల్లో వికశింప జేశాడు త్యాగ రాజు .తన ఆరాధ్య మూర్తి రామ మూర్తి కి ఆర్తి గా విన్న విన్చుకొంటాడు .సర్వ సమర్పణ భావం తో శరణా గతు డౌతాడు .సామీప్య ,సాన్నిధ్యాలతో సాయుజ్యం పొందే మహోన్నత ఆత్మ పరతత్వ వేడి ఆయన .ఆలోకం లో ఆనంద సామ్రాజ్యం ఎలి ,మనల్ని కూడా ఆ విందు లో పాలు పంచు కోనేట్లు చేస్తాడు .ఆత్మ వేది త్యాగ బ్రహ్మ .
”యెంతని రాల్తు కన్నీరు ?జాలి ఎవరితో తెలిపితే తీరు ?అని ఆవేదన తెల్పి ,”పూలమ్మ బతికిన వారు రామా ,పుల్ల లమ్మ బిల్వ రాదు -ఆ చులకన నీకు కాదా ?అంటాడు ఆ రామున్నే .”భక్తి వేలుగుచే ,వెతలు తీరు ననే విశ్వాసం జ్ఞాన తేజం కలి గిస్తాడు .పరమ సుందరు డైన స్వామిని సేవించే వారి లక్షణాలేవో తాను సాధించి ,తెల్పే రచన చూద్దాం .
”అనృతంబాడాడు ,అల్పుల వేడడు ,సునృపుల గోలవడు ,సూర్యుని మరువడు -మాంసము ముట్టడు ,మధువును త్రాగడు ,పర హింస చేయడు ,ఎరుకను మరు వడు ”అని ,ఉత్తమ భక్తు దిన తన లక్షణాలను ఏకరువు పెడ తాడు .మూడు ఈషనాలను వాడనని ,వంచన చేయ నని ,బొంకనని ,చంచల చిత్తుడై ,సౌఖ్యాన్ని వదలనని వేడు కొంటాడు .అంటే భక్తికి శీలం ఎంత ముఖ్యమో అందరికి తెలియ జేస్తాడు .”ఎందెందు జూచిన అందందే కలదు హరి ”అని ప్రహ్లాదునితో పోతన్న గా ఋ చెప్పించి నట్లు త్యాగయ్య గారు ‘నీకే తెలియక పొతే నేనేమి సేయుదురా ?లోకాదారుదవై ,నాలోని ప్రజ్వ లించే జాలి నీ కే తెలియక పొతే ”–”ఎందెందు చూచినా ,బలికిన ,సేవించిన ,పూజించిన ,అందందు నీవు అని తోచే తందరు
,నీ పాడార విన్దమును ,ధ్యానించిన డిందు కానీ ?/అని ప్రశ్నిస్తాడు .జాలి తన లో ప్రజ్వ లిస్తోందని ,అనటం కొత్త ప్రయోగం .అది కాల్చి తపన చేస్తోందని భావన .
ఆహ్లాద కర మైన భావాలతో ,తనపై మోపిన నింద శ్రీ పతి పద చిన్తనమే నట .తమాషా అయిన నింద ఇది .
”వారిజ నాయన ,నీ వాడను నేను ,వారము నను బ్రోవు -స్వల్ప ఫలదు లగు వేల్పుల ఏచిన అల్పు దనుచు నన్నందరూ బల్కిన ”కాస్త మైనా ,ఇస్తా మైనా దుస్తు దాని దూరినా పాపులు నాపై మోపిన నేరము -శ్రీ పతీ నీ పద చిన్తనమే ”ఇతర దేవతలు క్షుద్ర ఫలితాల నిస్తారు సజ్జనుల బలం అలాంటిది .
క్షమా భిక్ష వెడుతూ ,అనుతాపం గా గీతాన్ని పాడుతాడు .పశ్చాత్తాపం పొందిన అశ్రు జాల ముచేత హృదయాన్ని క్షాలనం చేసి హృదయం పవిత్రం ఆవు తుందని అంటాడు త్యాగయ్య .అందుకే తానా పూర్వ లోపాలన్నీ ,వరుసగా వివరిస్తాడు . ”సకల భూతము లందు నీవై యుండ గా ,మది లేక బోయినా -చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీన కుతర్కు డైన , -పర ధనము కొరకు ,నొరుల మది కరగబల్కి ,-కడుపు నింపి తిరిగి నత్తి ,దుడుకు గలా నన్నే దొర కొడుకు బ్రోచురా
అంటూ ,మానవతకు దుర్లభ మనుచు ,నెంచి ,పరమానందమొండ లేక ,-మద మత్సర,కామ లోభ ,మోహములకు ,దాసుడై మోస బోతిని ”అని పశ్చాత్తాప హృదయం తో ఆత్మ క్షాళన చేసు కొంటాడు .
‘సతులకు కొన్నాళ్ళు ,ఆస్తికి ,సుతులకై కొన్నాళ్ళు ,ధన తతు లకి తిరిగితి నయ్యా -”ఇదీ త్యాగ రాజు ఆత్మా విచారం .నిజాయితీ .”పాప గణ ములన్నియు ,పురుషుని రూప మై ,బాధించి నాయత .అంటే పురుషుడైన తన రూపం లో .అంటే ఇదంతా ,స్వయం క్రుతాప రాదం .చక్కని ప్రయోగం ”పురుషుని రూపం ”అనటం .
”ఎటుల బ్రోతువో తెలియ -ఏకాంత రామయ్య ”అని తన చరిత్ర అంతా కర్ణ కథోరం అని చెపు కొచ్చాడు
” వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి ,పుట్టు లోభుల నెల్ల పొట్ట కై పోగిడితి ,-దుస్టు లతో గూడి ,దుష్కృత్యములు సల్పి రట్టు జేసిన త్యాగ రాజు ని దయతో ‘అని సిగ్గు విడిచి చెప్పే స్తాడు .తన గుట్టు రట్టు చేసు కొన్నాడు .ఈ ఆర్తి ని ఏకాంత రాముడే తీర్చాలని విశ్వాసం .
”సిగ్గు మాలి ,నా వలె ధర నెవ్వరు ,తిరుగ జాలరయ్య ముగ్గురి లో మేలైన రామ –మా ముఖాబ్జ దిన రమణ రామా -”వ్యర్ధం గా ఒక్క అక్షరం కూడా ప్రయో గిన్చడు త్యాగయ్య .ఇక్కడ కూడా తన సిగ్గు మాలిన పను లన్నీ నిస్సిగ్గు గా బట్ట బయలు చేశాడు .
”ముందర దయతో బల్కిన దింక ముందు రాక పోయే -దద్ద నాలతో దినములు గడిపే దారి తెలిసి పోయే
అందరి చేతను న బ్రతుకు అపుడు నిందల కెడ మాయే–మందరధర ,నా జీవుడు జీవ మిందు సేయ నాయె అని దెలిసి ” ఈ కీర్తాన్ లో అన్న జపేశం పెట్టిన బాధలు ధ్వనిస్తాయి .ఆశ వుంది .జీవ ,పరమాత్మల ఇక్యతే సర్వ అనీన ప్రేమ .సర్వ యాతనలకు దివ్యౌషధం ,సద్ధర్మ పధం .”
”కన్నా తండ్రి త్యాగ రాజు నింక -కరుణ జూడ లేదు అని తెలిసి ”అందుకే మనశ్శాంతి అవసరం .అది ఇహ పర సాధనం కూడా .”సామ రాగం ”లో సామ వేద సారాన్ని ఈ కృతి లో అద్భుతం గా నిక్షిప్తం చేశాడు .ఆ రహశ్యం చూద్దాం .

”శాంతము లేక సౌఖ్యము లేదు -సారస దళ నయానా
దాన్తుని కైనా ,వేదాంతుని కైనా –దార సుతులు ధన ధాన్యము లుండిన
సారెకు ,జప తప సంపద కల్గిన – యాగాది కర్మము లన్నియు చేసిన
బాగుగా సకల హృద్భావము తెలిసిన -ఆగమ శాస్త్రము లన్నియు జదివిన
భాగ వతులనుచు ,బాగుగా పేరైన -శాంతము లేక సౌఖ్యము లేదు ”

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -01 -12 .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -01 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com