సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —13
”భక్తి లేని కవి జాల వారెన్యులు ,భావ మెరుగ లేరు ,కనుక భక్తి ,ముక్తి కల్గునని కీర్తనముల బోధించి తి ”అని చెప్పు కొన్నాడు త్యాగయ్య ”.మేను మోసం చేస్తుంది .హీన మైన ,మల మూత్ర రక్తముల కిరవు.మాయ మయం”కనుక నమ్మ వద్దు అంటాడు .సరసాంగి రాగం లో” అంగ భూత శరీరం పై మొహం వదులు కో” అని అంటే ,మోహన రాగం లో ”మోహము నీపై మొనసి యున్నది రా ”అని రాముని స్తుతిస్తాడు .సందర్భోచితం గా ఆ రాగాలను ఎన్ను కోని ,కృతులను చెప్పటం ఎంతో ఔచిత్యం ,ప్రత్యేకత ..
జయంతి శ్రీ రాగం లో ”మరు గేలరా ఓరాఘవా ”అని సంబోధిస్తూ —
”మరుగేల ,చరాచర రూప పరాత్పర ,సూర్య సుధాకర లోచన –అన్ని నీవనుచు ,అంత రంగమున
తిన్నగా వెదకి తెలిసి కొంటి నయ్య -నిన్నె గాని మదినేన్న జాల నొరుల -నన్ను బ్రోవు మయ్య ,త్యాగ రాజ నుత ”
అంతర్ముఖుడైన ఒక మహా భక్తుడు శోధించిన సత్యాన్ని ,ప్రకాశింప జేసే మహాద్భుత మైన సంఘటన .అండ మైన పదాల పొందు ,వీనులకు విందు .భాష ,దానికి తగ్గట్టు భావం సుందరాతి సుందరం గా జత కూడిన అపూర్వ రాగ భావ సమ్మీలనం .
జగన్మోహిని రాగం లో జగన్మొహనం గా సంగీత మహాత్మ్యాన్ని తెలు పుటూ ,భక్తి సంగీతందైవాంశం అని జ్ఞప్తికి తెస్తాడు .నాడో పాసనే తరించే మార్గమని సూచించిన ధన్య పురుషుడు త్యాగ రాజు .ఆ కీర్తనా వైభవం చూడండి –
”శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా –నాభి హృ త్కంత(kantha ) ,రసన ,నాసాదుల యందు
ధర ,రుక్సామాదులలో ,వర గాయత్రీ హృదయమున -సుర భూసురుల మానసమున,శుభ త్యాగ రాజా దులతో -శోభిల్లు”
గాయత్రి ఉపాసన రుక్ ఛందస్సు లలో ఒకటి అందుకే అదీ” త్రయి” లాగే అత్యంత పవిత్రమైనది అని చెప్పాడు .
”నీవె దైవ మని నమ్మి నాను దేవ ,-నీకు నాదు మేనమ్మినాను
మానము నీదే సుమ్ము ,అభిమానము నేలు కొమ్ము -చక్కని నీ రూపమును గని సోక్కితి ,నా హృదయమున ”
అని ,తన దేహం ,ఆ శ్రీ రాముని సొమ్మే అంటాడు .ఇదే ప్రతి పత్తి స్వరూపం అన్నారు పెద్దలు ,భక్తి విదులు .
రాదా దేవి ,ఎలా మధుర భక్తి తో ఆరాదిస్తుందో ,అలాగే తానూ రాముణ్ణి ,ఆరాధిస్తాడు .తన సేవాను భూతి ని చూపిస్తూ పులకలన్దిస్తాడు చూడండి ఆ భక్తి సామ్రాజ్య వైభోగం
”సత తంబు పదముల నర్పింతు ,-ఏకాంతమున నిన్నారాదింతు సీతా రామా !
తనివి దీర నిన్ను కౌగిలింతు ,దాహ మెల్ల దీర్చ సేవింతు
కనుల చల్ల గాను ,నిన్ను గందు ,-నాదు ,తనువు పులకరించ మెచ్చు కొందు
అడుగులకును మడుగు లం దిత్తు -నిన్నస రించి ,మెల్ల బల్క నిత్తు”
అని తనకు ,శ్రీ రాముడికి భేదం లేదని అంటున్నాడు .” నీవే నేనైన నీ వాడు గాక త్యాగ రాజు వేరా ”
అన గల సత్తా దమ్ము అద్వైతి కి మాత్రమే సాధ్యం .అలాటి వాడే త్యాగయ్య .తనలో పరమాత్మను ,పరబ్రహ్మం లో తనను చూసు కొన్న ,భక్తి వైరాగ్య ,సాధనా ,శరణాగతి ,ఆర్తి లను కల బోసు కోని పండిన త్యాగ జీవి .భగ వంతుని కి భక్త త్యాగ రాజు ”పరచిన red carpet welcome ”అన్నారు విద్వాద్వ రేన్యులు .”నీదు పలుకే పలుకురా ,నీదు కులుకే కులుకురా -నీదు తళుకే తళుకు రా ”అని మధుర ప్రేమ తో ఆరాట పడుతాడు
త్యాగయ్య .ఒక్క క్షణం కూడా ఆ రామున్ని విడిచి ఉండలేని పచ్చి భక్తి .
భక్తి తో త్యాగయ్య కు
”తలచి తే మేనెల్ల పులకరించేని రామ -కను గొన్న నందమై కన్నీరు నిన్దేడిని ఆలసించు వేళ జగ మంత తరుణ మయ్యేని -చరణ కౌగిలి వేళ చేలగమై మర చేని చెంత నుండ గ నాదు చింతలు తొల గేని -‘
‘అని అనటం లో త్యాగ్యా కున్న అత్యంత విశ్వాసం జ్యోతకం ఆవు తుంది .ఉన్మత్తు డై తేనే భక్తి కి పరా కాస్త .ఒక రామ కృష్ణ పరమ హంస లా ,స్సదా శివ బ్రహ్మేన్ద్రుని లా కని పిస్తాడు .పరమ హంసత్వం పూర్తి గా పొందిన దివ్య పురుషుడు గా త్యాగ్యా మనకు కన్పిస్తాడు .ఆ తనమయత్వం చైతన్య ప్రభువు ను జ్ఞాపకం చేస్తుంది .ఈ కృతి లో కవితా సౌభాగ్యం ,శోభ ,శ్రీ రామ రూప సౌందర్య చిద్విలాసం దర్శనమిస్తుంది .”ఇంద్రియాలకు ఆహ్లాదం ఇచ్చే రూపం -నెమ్మది లేని జనన మరణమ్ముల తొల గించే నట రాజ వినతుడిని దర్శించి మనకూ ,ఆ భాగ్యాన్ని కల్పించాడు త్యాగయ్య .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com