సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –14 (చివరిది )
భక్తి శరణా గతి ఆర్తి –౩
”మహిత రీతి నన్ను మన్నించిన ,నీడు మహిమ కేమి తక్కువ ?అని నిష్టురం వేస్తాడు రాముడి మీద .”సమయానికి తగు మాట లాడు తాడు రంగేశుడు ”అంటాడు త్యాగయ్య .అంటే పూల రంగడు అని ఎద్దేవా చేయటమే ”.సద్గంగా జనకుడు ,సంగీత సంప్ర దాయకుడు ,.గోపీ మనో రధ మొసగ లేకనే గేలి చేసే వాడు .వనితలను సదా సొక్కు చేస్తాడు మ్రొక్క జేస్తాడు.”అదీ ఆ దేవుడి సత్తా.యశోద తనయుడు అని ముద్దు పెట్టు కొంటె లీల గా నవ్వు తాడు .ఆయనే రామ ,కృష్ణ ,రంగానాదుల త్రి మూర్తి మత్వం .”హరే రామ చంద్ర ,రఘు కులేష ,మృదు భాష ,శేష శయన ,పర నారీ సోదరారాజ విరాజుడు ”
తాను భక్తుడు అన టానికి సాక్ష్యాన్ని తన ఇష్ట దైవం అయిన శ్రీ రాముడికి తెల్పుకొంటాడు .పూర్వపు వారంతా మహా భక్తు లానే నమ్మకం వుంది తన స్వామికి .తన దగ్గర కు వచ్చే సరికి చెలగాటం ,సాచి వెత ,తాత్సారం .అందుకే బాధ పడతాడు .
”కామించి ప్రేమ మీర ,కరముల నీడు ,పాద కమ లముల బట్టు కొను వాడు సాక్షి
రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి -మరీ –నారద ,శుక శౌనక ,పురందర ,నాగ జాధర ముఖ్యులు సాక్షి ”
అని ,ఇతిహాసాలఞానాన్ని తినీ ఒక చోటే చేర్చాడు రామ నామ రసికుడు త్యాగ రాజు .కవితా శిల్పం లో ”పైకి ”తీసుకొని వెళ్ళే నేర్పు త్యాగయ్యది .
అందరు భక్తి పారు లైతే ఇంక యమ ధర్మ రాజు కు పనేమీ వుంటుంది ?పెడ మార్గం పట్టి అయినా బక్తి తో ముక్తి పొందు తాము అంటే ”యముడికి ”వ్యాధే కదా .?మంచి కవితా రీతి తో సాగిన ఆ సంగీత దేశికుని భావనా బలానికి మరో ఉదాహరణ .”చిన్తిస్తున్నాడే యముడు ,సతతము సుజను లెల్ల సద్భజన చేయుట చూసి
శూల పాశ ధర భట జాలము జూచి -మరి మా ,కోలాహలములు డిగే ,కాల మాయెనే యమునికి
దారి తెలియ లేక ,తిరిగే వార లైన ,చాలు నంటే సారమని తాగ రాజు సంకీర్తనము పాడే రనుచు ”.
భక్తి విశ్వాసానికి ఇది పరా కాష్ట .”మద మ్మాత్సర్యమనే తెర దీస్తే ”అంతా ,జ్ఞాన ప్రకాశమే నంటాడు త్యాగయ్య .త్రిగునాత్మక మైన ఆత్మ ఆవరణ లను చేదించి చూస్తె ,నిర్మల మనసు నిలి పితే ,జ్ఞాన చక్షువు ను తెరిస్తే ,నిశ్చలానందమేకదా. అదే ఎవరు కోరుకొన్నా.
”భజన పరులకు ,దండ పాణి భయం లేదు ”అని అభయ మిస్తాడు ఈ ”వేదండ పాలు దాసుడు ”దండ పాణి ని ఎదిరించా టానికి ,కోదండ పాణి వున్నా డని భావం .ధర్మ సంస్థాపన కోసం ”సరస సామ దాన భేద దండ చతురుడు -సాటి దైవ మెవరే బ్రోవవే ”అని కీర్తిస్తాడు .”పరమ శామ్భావాగ్రేసరున్దనుచు ,పల్కు రావణుడు తెలియ లేక పోయే –
హితము మాట లెంతో ,బాగా బల్కితివి -సతతము గా అయోధ్య నిచ్చే నంటివి
నాథ సహోదరుని రాజు జేసి ,రాక హతము చేసితివి ”అని అన్న పై పగ వున్నా తమ్ముడికి రాజ్యం ఇచ్చాడు .అందుకే శ్రీ రాముని దయ కావాలి అంటాడు .అది లేకుంటే యేఎ పని జరుగదు .
”నీ కటాక్షం చాలు ,దానం లంకను దయ చూసి నట్లు -దినము దురాశ దీరిన యట్లు
బ్రహ్మేంద్ర పట్టాను భవ మందిన యట్లు -నాలు గొక్క పది భువన మేలి నట్లు
కలుగు కులము లెల్ల కదా తేరి నట్లు -రాజీవ భవ నుత ,రమణీయ చరిత
రాజిల్లు త్యాగ రాజ వినుత ”అని పొంగి పోతాడు అల్ప సంతోషి త్యాగయ్య.రాముని దయతో సకల కోర్కెలు తీరు తాయి .ఇహ ,పర భాగ్య లక్ష్మి చే పట్టి నంతటి విశ్వాసం త్యాగయ్య గారికి .
భ్కక్తికి ,సేవకు ,శరనాగాతికి చివరి మెట్టు స్వామిలో లీనం ఆవ తామే .ఈ తపన అంతా దాని కోసమే .సాయుజ్యం కంటే వేరే కోరిక ఏ భక్తునికీ వుండదు .ఆ భక్తి తో తన ఆత్మకు ,విశ్వాత్మకు అభేదం .అదే అద్వైతం .ఆ దివ్య సన్ని దానాన్ని ,మనసు లో కల్పించు కోని ,స్వామి లో లీన మై పోతూ ,జీవన్ముక్తు డైన ,గాన బ్రహ్మ ,నాద బ్రహ్మ ,కవి బ్రహ్మ ,జ్ఞాన బ్రహ్మ ,బ్రహ్మొహం అంతు పాడిన చివరి కృతి ధనాసి రాగం లో ”శ్యామ సుంద రాంగ ”అనే కృతి .ఎదురు గా పర మాత్మ తో మాట్లాడుతూ తనువు చాలించిన ధన్యుడు .ఆ దివ్య పురుషుని దివ్యాను భూతిని పంచ కొందాం .ఇదే ఆయన చరమ గీతం .–swan song .తాను ధన్యుడు అయినందుకు సరైన ధన్యాసి రాగం లో కృతి ని చేయటం ఔచిత్యానికి పరా కాష్ట .
”హంస ఎలా ఆడుతూ ,పాడుతూ ,ప్రాణాలు విడుస్తుందో ,”త్యాగ రాజ హంస ‘కూడా ,పరమ హంస యై ,గాన జ్ఞానం తో పాంచ భౌతిక శరీరాన్ని వదిలి ,నిత్యా సత్య ,శాస్వతా నందాని పొందారు .అదొక అలౌకిక శోభాన్విత మైన వూహ .
”శ్యామ సుంద రాంగ ,సకల శక్తియును నీవెరా -తామస రహిత ,గుణ సాంద్ర ,
ధరను వెలయు శ్రీ రామ చంద్ర ,-దుష్ట దనుజ విహార -ఇష్త దైవమును నీవెరా -ఇలను త్యాగ రాజు వేరా ”
ఆధ్యాత్మిక జ్యోతి ,పరంజ్యోతి లో లీన మైంది .వాగ్గేయ కారునిగా ,నాద బ్రహ్మో పాసకుడు శ్రీ కాకర్ల త్యాగ బ్రహ్మ మనందరికీ నిత్య ప్రాతస్మర ణీయులు .
త్యాగ రాజ మంగళా ష్టకం — రచన —శ్రీ వాలాజ పేట వెంకట రమణ భాగ వతార్
01 -రామ బ్రహ్మ సుపుత్రాయ ,రామ నామ సుఖాత్మనే -రామ చంద్ర స్వరూపాయ త్యాగ రాజయ మంగళం
02 -శ్రీ కాకర్ల వంశాబ్ధి చంద్రాయామిత తేజసే –పూర్నాయ పుణ్య రూపాయ త్యాగ రాజయ మంగళం
03 -నారదా చార్య కరుణా పాత్రాయాద్భుట కీర్తయే -ధీరాయ నిర్వి కారాయ త్యాగ రాజయ మంగళం
04 -కావేరీ తీర వాసాయ కారున్యామృత ,వర్షినే -అవీసుర రాజాయ త్యాగ రాజాయ మంగళం
05 -శ్రీ కారుణ్య సముద్రాయ లోకానుగ్రహ కారిణే –సాకేతాదిప భక్తాయ ,త్యాగ రాజాయ మంగళం
06 -యోగి పుంగవ మిత్రాయ ,యోగానంద స్వరూపినే -రాగ లోభ విముక్తాయ త్యాగ రాజాయ మంగళం
07 -గాన శాస్త్ర ప్రవీనాయ ,కలి కల్మష నాశినే -శరణా గత పోషాయ త్యాగ రాజాయ మంగళం
08 -దీన మానవ పోషాయ ,దివ్య నామ సంబోదినే –జ్ఞాన భక్తి ప్రదానాయ త్యాగ రాజాయ మంగళం .
త్యాగ రాజ ప్రశంశ — పద్య రచన — శతావధాని ఎస్.రాజన్న కవి
01 – ”అలకలు నుదిటి పై ,నలవోకగా తూగు -నొరపుల బాలు డొక్కొక సారి
కోదండ ,తనకార ఘూర్నితాంభో రాశి -హుమ్కార కాంతు(kanthu ) దొక్కొక్క సారి
జానకీ స్మిత మధు శ్యండి మాలా రోచి -రుత్సిక్త హృదయు డొక్కొక్క సారి
పావన నందన భక్తి బాష్ప దారాప్లవ -నోత్సుఖ చరణు డొక్కొక్క సారి
ఎన్ని రూపుల దర్శనం బిదేనో నీకు -రామ చంద్రుండు ముని జన ప్రణయ మూర్తి
లలిత వీణా కలస్వాన తులిత మొర్తి –త్యాగ రాజ గృహీత లీలావతార.
02 -”నాద సుధా రసంబే దళి తేంద్రనీలమ్ము ,పానమ్ము దేహమ్ము చేసి
సకల లోకా నంద సంధాయి దివ్య రాగంమునే ,చేతి చాపంము జేసి
వివిధ భావా వేష ,విజ్ఞాత్రు స్వర కన్య కాలనే చాపమ్ము ,గంటలుగ జేసి
చిర తపస్సంజాత శీతలా లాపనా ద్రవమునే వింటి శరమ్ము జేసి
ఎంత చక్కని రాముని సృష్టించు కొంటి -వయ్య ,జప యోగ కూలంకశా వ తార
గాన మందార ,స్వర కన్యకా విహార –తత్పదాదీన హృదయ -ఓ త్యాగ రాయ ”.
సర్వం సంపూర్ణం
”త్యాగ రాజు కృతులలో సామాజిక ఆకృతులు” అనేశీర్షిక తో రాసిన నాలుగు వ్యాసాలు ,’సంగీత సద్గ్రు శ్రీ త్యాగ రాజ స్వామి ”శీర్షిక తో రాసిన పద్నాలుగు వ్యాసాలు ,వెరసి 18 వ్యాసాల పరంపరను ”శ్రీ త్యాగ రాజ ఆత్మ విచారం ” అనే పుస్తకం రాసి , అందులో కొత్త కోణం లో త్యాగయ్యను ఆవిష్కరించిన” హాస్య బ్రహ్మ ” స్వర్గీయ భమిడి పాటికామేశ్వర రావు (భ’కా’రా’)మాస్టారు గారికి సవినయం గా ,సభక్తి కం గా అంకితమిస్తున్నాను .
ఈ వ్యాస పరంపర కు ముఖ్య ఆధారం శ్రీ మరుపూరి కోదండ రామి రెడ్డి గారి ”త్యాగ రాజు భక్తి సుదార్ణవం ”అనే ఉద్గ్రందం .దీనితో పాటు తిరుపతి దేవస్థానం ,తెలుగు అకాడెమి వారు త్యాగయ్య పై ప్రచురించిన చిరు పుస్తకాలు ,అనేక పత్రికలలో నేను చదివిన వ్యాసాలు ఆధారం .
ఈ వ్యాసాలను నేను 01 -05 -93 న మొదలు పెట్టి ,05 -05 -93 వరకు నాకోసం రాసుకొని పూర్తి చేశాను .అంటే దాదాపు 18 సంవత్సరాల క్రితం రాసినవి అన్న మాట . ఇప్పుడు మీ కోసం వెలుగు చూశాయి .ఇదంతా ఆ త్యాగ బ్రహ్మ అనుగ్రహమే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com