కాళిదాసు ప్రియంవద –3
బాకీనెపం
దేనికైనా తగిన సమాధానం చెప్పటానికి ప్రియంవదే ముందుంటుంది .నేర్పుగా ”ఆర్య ధర్మ చరోపి -పరవశం జనహ్గురొహ్ పునరేతస్యా అనురూప వర ప్రదానే సంకల్పః ”అన్నది .”మా చెలి అస్వతంత్ర -తండ్రి కాష్యపులు తగిన వరుని చూసి ,వివాహం చేయాలను కొంటున్నారు ”అని చెప్పింది .దుష్యంతుడికి కావలసిన సమాధానం లభించింది .అనురూప వరుడు తానే అనీ నిశ్చయం కల్గింది .ఆమెది క్షత్రియ జన్మే అని రూధి అయింది .కనుక ప్రయత్నం చేస్తే తప్పేముంది అను కొన్నాడు .అయితే శకుంతలకు మాత్రం ,తన వివాహ విషయ ప్రశంస చేయటం ,అందులో అపరిచితుడి తో చేయటం నచ్చ లేదు .రోషం కూడా వచ్చేసింది .”గౌతమి తో చెప్తాను ‘అంటూ ,వెళ్ళటానికి బయల్దేర బోయింది . అతిధులను వదిలి అలా వెళ్ళటం ఆశ్రమ వాసులకు ధర్మం కాదని ప్రియంవద వారించింది .వినకుండా మళ్ళీవెళ్ళ బోతే ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తూ వెళ్ళటానికి వీలు లేదని చెప్పింది .”ఎందుకు ?”అని ఆమె ప్రశ్నిస్తే ,”వృక్ష సేచనే ద్వేమే దారయాసి తస్మా దేహి –తావదాత్మానం మోచయిత్వా తతో గమిష్యతి ” –వనం లో చెట్లకు నీరు పోసే కార్యక్రమం లో ,ఎవరి వంతు వారు నీరు పోయాలి కాని శకుంతల రవిక సవరించేతప్పుడు ,వనజ్యోత్స్న ను పరవశం తో చూసే సందర్భం లో ,నీరు పోయటం లో వెనకబడింది ఆ సంగతి గ్రహించిన ప్రియంవద కు ఇప్పుడు గుర్తు చేసి ,”ఆ రెండు చెట్లకు నేను నీళ్ళు పోశాను నా బాకీ తీర్చి వెళ్ళు ”అన్నది .రాజు ఈ మాట విని కరిగి పోయాడు .లతా లాగా కోమలం గా వున్న శకుంతల కండి పోతుందని బాధ పడ్డాడు .”ఇప్పటికే ఆమె ఘతోదకం మోసి ,మోసి అలసి పోయింది ఇదిగో ఈ బహుమానాలన్నీ తీసుకొని ,ఆమెను పరిశ్రమ నుంచి విముక్తి కల్గించండి ”అంటూ ,ఆ తొందరలో ,తన వెలి ఉంగరాన్ని ఇవ్వ బోయాడు .అంతకు ముందే అతను తనను తాను పరిచయం చేసుకొన్నా విధానం మర్చిపోయాడు .పారవశ్యం లో పది పోయాడు .తన స్తితి ని మర్చి పోయాడు .ఘటికులైన చెలులు ఉంగరం పై వున్న దుష్యంతుని పేరు చూసే శారు ఈలోగానే .ఇద్దరు అసలు విషయం పసి గట్టె శారు .


”తేనహి నార్హత్యేతదంగులీయకం అంగుళీ వియోగ మార్యస్య –తవ వచనే నైవ -అనృనా నామైషా సఖీ సకున్తలే -మోచితాన్యను కంపి నార్యేన -అదివా మహా రాజెన గచ్చాదానీం ”సొగసు అంతా ఈ వాక్యం లోనే నిక్షిప్తమై వుంది .మహా రాజు గుట్టు రట్టయింది .బొంకేందుకు ఇంక అతనికి అవకాశం ,వ్యవధి ఇవ్వ కూడదని నిశ్చయించు కొంది .అయ్యా ”అంగుళీయకం తమ అంగుళి నుండి ,వియోగం చెంద వలసిన పని లేదు .తిరిగి స్వీకరించండి ‘అంటూ ,శకుంతలతో ”అనుకంప వల్ల విడిచి బెట్ట బద్దావ్.పోనీ మహారాజు దయ వల్లే ననుకో ”అంటుంది .”ఆర్యేన అని సంబోధించి ,”మహారాజేన ”అని అనటం తో రాజు బొంకి నట్లు ,తాను నిజాన్ని గ్రహించి నట్లు తెలుస్తుంది అందరికి .రాజు చేత విడువ బడ్డావు అనటం లో ,అంగుళీయక వియోగం అనటం లోను భావి కధా సూచన తెలియ జేసే చక్కని పదాలను ఎన్నిక చేసి వాడాడు కాళి దాస మహా కవి .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .
మాస్టారు! నమస్కారం.మంచి విషయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు. మరొక విషయం చెప్పక తప్పటం లేదు. తెనుగు భాష మీద కొద్ది పాటి శ్రద్ధ, రాసేటపుడు చూపమని మనవి. మాటలు, పంటికింద పలుగు రాళ్ళలా బాధ పెడుతున్నాయి.