కాళి దాసు ప్రియంవద –2
బంభర విజ్రుం భణ
ఇంతలో తుమ్మెద మూగింది .అందులోను ,గండు తుమ్మెద .శకుంతలను అల్లరి పెట్టటం ప్రారంభించింది .”రక్షించండి ,రక్షించండి ‘అని ఆమె ఆర్తి తో ఎలుగెత్తి అరిచింది .అప్పుడు చెలికత్తె లిద్దరూ ,యెగతాళి పట్టించారు .”కే ఆవాం పరిత్రాయం దుష్యంత మాక్రందస్వ ,రాజం రక్షితవ్యాని తపోవనాని నామ ”అన్నారు .ఆమెకు భయం .వీరికి ఎగతాళి .మనసులో ఊహించుకొంటే ,ఆ ఘట్టం భలే మజా గా వుంటుంది .అక్కడ దుష్యంత మహా రాజుకు తననే స్మరిస్తున్నారనే ధీమా .దాని వల్ల లోలోపల ఆనందం .ఈ రెంటినీ మేళవించి కాళిదాసు తన ప్రజ్న ను చూపించాడు .ఇంతకీ చెలికత్తె లేమన్నారు ?”ఎవరు రక్షిస్తా రమ్మా !దుష్యంతుని పిలువు .తపోవనాన్ని రక్షించేది మహా రాజే కదా !”.సమయం చూసి దుష్యంతుడు బయట పడే మంచి సన్ని వేశం .కవి నేర్పు నిరుప మానం అని పిస్తుంది .గేలి చేస్తూ యెగతాళి గా అన్న మాటలు నిజమే అయాయి .ఈ చిన్న పాత్రల ద్వారా తాను సాధించి చూపించ వలసిన్దంతా అభి వ్యక్తీకరించాడు .హాశ్యం తోనే ,అంతులేని నాటక కళా మర్మాన్ని విశదీకరించిన మహా భావ కవి కాళిదాసు .
మహా రాజు పొద చాటు నుండి బయట పడ్డాడు .పౌరుష వచనాలు పల్కుతు ,తుమ్మేదను పార దోల్తాడు .ఎవరో రాజ పురుషుడు వచ్చాడని శకుంతలా ,సఖులు ఆయనకు స్వాగతం చెప్పారు .విషయాలన్నీ వివరం గా మాట్లాడు కోవ టానికి అనువైన స్థలం కావాలి కదా .ఇక్కడే మాట్లాడటం సందర్భోచితం కాదు .

సప్తపర్ణి ఛాయల్లో
ప్రియంవద ,తెలివిగా ,ఏడాకుల అరటి ”సప్తపర్ణి”చెట్టు కింద కూర్చొని ,మాట్లాడు కోవచ్చునని సూచించింది .బడలికా తీరుతుందీ ,నీడా వుంటుంది ,సవివరంగా సంభాషించుకోనూ వచ్చు .”తేనహి అస్సాం ప్రచ్చాయ శీతలాయాం ,-సప్తపర్ణ వేదికాయాం ఆర్య ఉపవిశ్య.-పరిశ్రమ వినోదం కరోతు ”అన్నది సాభిప్రాయం గా .అసలే వేసవి .రాజు ఎండకు బడలిక చెందాడు.కనుక దట్టమైన నీడ కావాలి .ఆ ప్రదేశమే సప్తపర్ణి చెట్టు కింద అరుగు .ఆ చెట్టు సౌరభం ,చల్లదనం ,మానసిక గ్లాని లను దూరం చేస్తాయి .ఆహ్లాదం కల్గుతుంది .వీటన్నిటినీ ద్రుష్టి లో వుంచుకొనే ప్రియంవద ఆ మాట అన్నది .ఆమె చాతుర్యానికి అబ్బుర పడుతాం . .కవి చాకచక్యానికి జోహార్ అంటాం .
ప్రియంవద చాలా లోకజ్ఞానం కలది .అనుమానం వచ్చి ,అనసూయను ప్రక్కకు పిలిచి ,వచ్చిన వాడు రాజ బంధువు గా కని పించటం లేదు సాక్షాత్తు దుష్యంత మహా రాజు గారే వచ్చారు అని తెలిపింది .త్వరగానే ,తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది .ఏదీ దాచుకొనే స్వభావం కాదామెది .వెంటనే అన్నది ”చతుర గంభీరాకృతి ర్మధురం -ప్రియ మాలపన్ప్రభురివ దృశ్యతే ”ఆకారం ,మాట ,రాజు అనే అనుమానాన్ని నిరూపిస్తున్నాయి .అనసూయ ఆయనతో తనను తాను పరిచయం చేసుకోమని ,ఆయన్ను కోరింది .మహా రాజు తాను మహా రాజు తరఫున ,ఆశ్రమ ధర్మ నిర్వహణ విషయమై ,పరిశీలనకు వచ్చిన వాడిని అని చెప్పు కొంటాడు .అప్పుడు అనసూయ అన్నది ”స నాదా ఇదానీం ధర్మ చారిణః ”అంటే -ధర్మ చారిణులకు తగిన సమయం లో సనాదుడ వైనావు .అంటే ఆపద లో వున్న అబలలకు సహాయం చేశావనీ ,నీకు కాబోయే సహ ధర్మ చారిణి లేవయ్యా నీవే నాదుడివి కూడా అని ద్వంద్వార్ధం గా చెప్పింది .కొంత వయసులో ప్రియంవద కంటే పెద్దది కనుక జాణ తనం చూపింది .ఆమె అన్న మాటలన్నీ సాభిప్రాయాలే .దుష్యంతుని కోరిక తీరు తుందని సూచ్యార్ధ సూచన . గంభీర మైన అర్ధాన్ని ,ఆ మాటల్లో జ్యోతకం చేయించాడు కవి .

వలపు తేట
అనసూయ ,ప్రియంవద లు ఒకరికి మించిన వారిన్కొకరు .శకుంతల లజ్జావనత మైంది .శకుంతలా దుష్యంతుల ఆకార వికారాలను త్రుటి లో గ్రహించారు వారిద్దరూ .వలపు ల జ్వాల రగుల్తోందని తెలుసు కొన్నారు .శకుంతల తో వారు ”సఖీ శకున్తలే !యద్యత్రా దయ తాతః సన్నిహితో భవేత్ ”అన్నారు .”నాన్న గారే వుంటే ఏం చేసే వారో ఇప్పుడు ”ఇది కదాగామనాన్ని వేగం చేసే మాట .అంటే తండ్రి గారు చేయాల్సిన పని నువ్వే చేయాలి అని చెప్పకుండా చెప్పటం .ఆమె లోపలి భావాన్ని వ్యక్తీకరించా టానికి తగిన మాట కూడా .ఇద్దరి హృదయ భావాలను వెలికి తీసి,వలపు ను నాటి ,ప్రోది చేసే మాట .శకుంతల కు చిరు కోపం వచ్చింది .”వుంటే ఏం చేసే వారు “?అంది బుంగ మూతి పెట్టి .సఖులు దేవాంతకులు కదా వెంటనే అందుకొన్నారు .’ఇదం జీవిత సర్వస్వేనా వ్యతి దారో క్రుతార్దీ కరిష్యతి ”అన్నారు .స్త్రీ సహజ మైన మాటలు ఇవి శకుంతలకు వచ్చిన కోపానికి ”మేమేం చేశామమ్మా అంత కోపం ”అన్నట్లు వుంది.ఇంతకీ వాళ్ళ మాటల్లోని అర్ధం తెలుసోవాలి .”నాన్న గారే వుంటే ,తమ జీవిత సర్వస్వాన్ని -అంటే శకుంతలను అతిధి కి సమర్పించి వుండే వారు ”అని భావం .ఆమెనే సమర్పించి వుండే వారు అని .లోని అర్ధం .ఈ మాట ఆమె మనసు లోని కోరిక తీరే మాట .ఆమె చెవులకు ఇంపైన మాట .కర్ణ రసాయనం ప్రేయసీ ప్రియుల మనో గతాలను అతి స్వల్ప కాలం లో అవగతం చేసుకొన్న ఇష్ట సఖియలు వారిద్దరూ .సార్ధక నామ దేయులైనారు .
శకుంతల మళ్ళీ కోపాన్ని అభినయిస్తూ ”మీ మనసు లో ఏదో భావం వుంచుకొని ,మాట్లాడు తారు ”అన్నది .రాజు మనోభావాన్ని ప్రియంవద తక్కున(THAKKUNA ) గ్రహించింది .శకుంతల ముఖ కవళికలను గ్రహించింది .వలపు చిగురు తొడిగిందని అర్ధమయింది .రాజుతో నర్మ గర్భం గా”మళ్ళీ ఏదో చెప్పు బోతున్నారు “‘అంది అర్దోక్తిగా అతన్ని బయట పడేసింది .శకుంతల కోపం తో అంగుళీయకం తో బెదిరిస్తోంది .ఇక చాలు కట్టి పెట్టండి అనే భావం తో .
శకుంతలా జన్మ వృత్తాంతాన్ని దుష్యంతుడు వీరి వల్ల విని ఆమె సచ్చరిత్ర ”పారాయణం ”లా వుంది అన్నాడు .ఆమెను గురించి ఇంకా ఏదైనా అడగ వచ్చా అని అంటూనే ”మీ చెలి మన్మధ వ్యాపారాన్ని విసర్జించే తపస్సు వివాహం వరకే చేస్తుందా ?లేక -ఆజన్మ బ్రహ్మ చారిణి లా వుంది ,లేడి పిల్లతో వన వాసం లోనే ఉంటుందా ?అన్నాడు .వారి వలపు ఎలా పండిందో తరు వాత తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .