జిందాబాద్ స.జ.స.–కవిత
కవి -ఏ.ఏం.ఏం.కుమార్
అతని పేరు సదానందం -అవుతూంటాడు సమశ్యలతో సతమతం
అతని భార్యకు బి.పీ.షుగర్,ఓబీసిటి –సీరియల్స్ చూస్తుండగానే సస్పెన్సులో ఆపేయటం
– పిండి రుబ్బటానికి గ్రైన్దర్, పొడులకు మిక్సీ –మాసిన బట్టలకు వాషింగ్ మషీన్
శారీరక శ్రమ లోపించటం -నిర్ధారించారు డాక్టర్లు సవా లక్ష టెస్టులు చేసి
ఇక ,పుత్రరత్నం స్కూల్ వదిలి ఇంటికి రాగానే -హోమ్వర్క్ ఎగ్గొట్టి కార్టూన్ నెట్ వర్క్
పుత్రికా మణి ,సౌందర్యాన్ని పెంపొందించే చానెళ్ళు -ఏం తింటున్నారో ,ఎంత తింటున్నారో తెలీకుండా
టి.వి.ముందు కూర్చొనే భోజన కార్యక్రమాలు -బద్ధ కానికి మరో పేరు ఆ భీమ ,భామలు
కొన్ని రోజులుగా సంతోషం గా చలాకీగా -సదానందం లో చెప్పలేని మార్పు
రెండు చార్జి లైట్లు కొన్నాడు -ఆయన భార్యకు బి.పీ.షుగర్ నార్మల్ కొచ్చింది
రుబ్బు రోలు రుబ్బటం తో ,బట్టలు స్వయం గా వుతుక్కోవటం తో
పని మనిషి చీకట్లో అంట్లు తోమనని భీష్మించింది
ఆమెకిప్పుడు శారీరక శ్రమానందం తెలిసింది
పిల్లలకు టి.వి.బంద్,–చార్జి లైట్ వేలుగులూనే
పాపం హోమ వర్క్ సాగిస్తున్నారు ఇంటికి రాంగానే
అందరు కలిసి కబుర్లాడుతూ డైనింగ్ టేబుల్
భోజనాలతో మితం గా హితం గ తింటున్నారు .
పెందరాలే నిద్రకుపక్రమిస్తున్నారు

మాయో ,మంత్రమో వేసినట్లు స్మార్ట్ గా తయారయారు
ఇంతకీ వీటన్నిటికీ కారణం కరెంటు కోత
జేబు చిల్లు పడ కుండా బిల్లు కూడా చిక్కి పోయింది
కోత ఇబ్బంది పెట్టినా ,అందరికీ లాభాలే చేకూరాయ్
ఇన్ని లాభాలుంటే ,నిరసన దేనికన్నాడు సదానందం
అందుకే కొత్త పల్లవి ఎత్తు కొన్నాడు జిందాబాద్ కరెంటు కొతా
జిందాబాద్ స.జ.స.-స.జ.స.,స.జ.స.అంటూ వీరంగం వేశాడు .
ఇంతకీ దీని భావమేమి తిరుమలేశా అంటే సకల జనుల సమ్మె
అని సన్నాయి నొక్కులు నొక్కాడు సదానందం,చిదానందం గా .