ఊసుల్లో ఉయ్యూరు –14
వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –౧
ఉయ్యూరు గ్రామం లో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ ఏకాదశి వరకు పదిహేను రోజుల పాటు వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరుగు తాయి .ఈ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేది శుక్ర వారం నుండి పదిహేడవ తేది శుక్ర వారం వరకు ఈ సంబరాలు జరుగు తున్నాయి .అందుకని ,అందరికీ తల్లి అయిన వీరమ్మ పేరంటాలు తిరునాళ్ళు ,ఆ జేజితల్లి దివ్య చరిత్రను ఊస్సుల్లో ఉయ్యూరు లో ధారా వాహికం గా మీందరి కోసం అందిస్తున్న్నాను .అసలు గ్రామ దేవతల ప్రత్యేకత ను గురించి ముందు తెలుసు కోవాలి .
గ్రామ దేవతలు
స్త్రీలు ప్రకృతి స్వరూపాలు .ప్రకృతి అంటే ప్రకృష్టమైన దాన్ని సృష్టించటం -అంటే -ఏదైనా సృష్టి చేయటం లో ,పరమ ప్రవీణు రాలైన వారిని ప్రకృతి అంటారు .సత్వ గుణానికి ”ప్ర”అనీ ,రాజోగునాన్ని ”కృ”అనీ ,తమో గుణాన్ని ”తి”అనీ అంటారు .అంటే ,త్రిగుణాత్మకమై ,సర్వ శక్తి సంపన్నమై సృష్టి లోని అన్ని కార్యాలకు ప్రదాను రాలే ప్రకృతి .అందుకే ఆమెను ”ప్రధానం ‘లేక ప్రకృతి అంటారు .ఇంకో రకం గా ఆలోచిస్తే ”ప్ర”అంటే ప్రధమం .”కృ”అంటే సృష్టి .అంటే సమస్త మైన శక్తికీ ,మొదటి కారణ స్వరూపిణి అని అర్ధం .సృష్టి కోసం పరబ్రహ్మ తనతకు తానే రెండు రూపాలుగా ,విభాక్తుడైనాడు .ఆ స్వరూపాలే మనం చెప్పుకొనే ప్రకృతి ,పురుషుడు .శరీరం లోని కుడి భాగం పురుషుడు ,ఎడమ భాగం ప్రకృతి అంటే స్త్రీ .ఆ ప్రకృతి అంశ తో జగత్తు ను పాలించే సకల దేవతలూ ఎర్పడుతున్నారు .అలాంటి దేవతలలో ఉయ్యూరు వీరమ్మ తల్లి ,పెద్దింటి నాంచారమ్మ ,పెనుగంచిప్రోలు తిరుపతమ్మ,,అంకాలమ్మ,సమ్మక్క సారక్క మొదలైన దేవతలను గ్రామ దేవతలు అంటారు .ఈ దేవతల ప్రభావం జానపదుల మీదే కాక సామాన్య జను లందరి పైనా వుంది .వారు సర్వ జనుల మనోభీస్టాలను నెర వెరచే సర్వ సమర్ధులు గా ప్రసిద్ధి కెక్కారు .ఒక్కొక్క గ్రామ దేవతకు ఒక్కొక్క మహిమ వుంటుంది .వీరికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేక పోయినా ప్రత్యెక సందర్భాలలో సంబరాలు ,తిరునాళ్ళు జరుగు తాయి .ఆ రోజుల్లో పల్లెల్లో సందడే సందడి .సాధారణం గా మాఘ మాసం నుంచి వరుస గా ఈ దేవతలకు తిరునాళ్ళు జరుగుతూ వుంటాయి .
మాఘం లో వీరమ్మ తల్లి తిరునాళ్ళు అమోఘం
మాఘ శుద్ధ ఏకాదశి నుంచి ,పదిహేను రోజులు ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ఘనం గా ,అమోఘం గా జరుగు తాయి .తిరునాళ్ళు అంటే తిరు అంటే పవిత్రమైన నాడులు అంటే రోజులు .ఆ మాటే తిరునాళ్ళు గా మారింది .అంటే మంచి రోజులని మొత్తం మీద అర్ధం .కృష్ణా జిల్లా లోనే అత్యంత ప్రాముఖ్యం కలవి వీరమ్మ తిరునాళ్ళు .జిల్లా లోని అన్ని ప్రాంతాల నుంచే కాక ,రాష్ట్రం లో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి ,వీరమ్మ తల్లిని దర్శించు కోని ,మొక్కులు చెల్లించుకొని సేవిస్తారు .ఇక్కడ గొప్పతనం ఏమిటంటే హిందువులే కాదు ముస్లిములు ,క్రిస్తియన్లు అందరు భక్తీ తో అమ్మ వారిని కొలవటం .అందరు ”వీరమ్మ తల్లి ”అని నోరారా పిలుస్తుంటే ,ఒళ్ళు గగుర్పొడుస్తుంది .ఏ మతం వాడైనా ”వీరమ్మ ”అని ఏక వచనం తో పిలవనే పిలవరు .అందుకే వీరమ అందరికీ తల్లి అయింది .అందరి కోర్కెలను తీర్చే దేవతగా ప్రసిద్ధి కెక్కింది .మతసామ రాశ్యానికి వీరమ్మ తల్లి తిరునాళ్ళు గొప్ప ఉదాహరణ .లక్ష లాది భక్తులు అమ్మ వారిని దర్శించి ,పూజించి కానుకలు సమర్పించుకొంటారు .
ఆలయ ప్రవేశం

క్రింద ఇంకొన్ని ఉసులు
ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు
ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు
ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని
ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -01 -12 .