కాళిదాసు శకుంతల –4
మన్మధ విజ్రుం భణ
నాటకం తృతీయాంకం లో శకుంతల విరహ వేదనను కవి వర్ణిస్తాడు .అందులో ప్రియంవద చిత్త వ్రుత్తి ని వెల్లడి చేసే సందర్భాలు అనేకం సృష్టించాడు కాళిదాస మహా కవి . ఆమె శకుంతల హృదయాన్ని పసి కట్టే సింది . .వారిద్దరి చూపుల తూపుల లక్ష్యాలను ఎరిగి వుంది .అందుకే ,శకుంతల విరహం లో వుండగా ,అనసూయతో అన్నది ”రాజ ప్రధమ దర్శనం నుంచి ,మన చెలియ ఏమేమో అయి పోయింది .ఎందుకోసం ఇలా మనస్సుని కష్ట పెట్టు కొంటోంది ?”ఇక్కడ ప్రధమ దర్శనం అనే మాట వారి ఆంతర్యాన్ని మొదటి నుండీ తాను గమనించినట్లు స్పష్టం అవుతోంది .అప్పటి నుంచే ,వారిద్దరి ప్రవర్తన ను ,తాను నిశితం గా పరిశీలించినట్లు తెలుస్తుంది .
అనసూయ బోళా శాంకరి .సఖినే అడిగి తెలుసుకొందాం అంది .చేలువురిరువురిలో ప్రియంవద చిన్నదే అయినా చెలికి ఇష్టురాలు .ఈ మన్మధా వస్థ ల సంగతి ఆమె కు తెలుసు .ప్రబంధ పథనం వల్లో ,పెద్దల వినికిడి వల్లో ఆమెకు తెలిసి వుంటుంది .చెలి వద్ద ఆమెకు చనువు బాగా ఎక్కువే .అందుకనే అంటోంది ”రోజురోజుకీ నీ అవయవ సౌందర్యం తగ్గు తోంది .లావణ్యం మాత్రం ఛాయా లాగా విడవ కుండా వుంది ”.అంటే ఇంకా మనసు లోని మాటను దాచటం దేనికీ ?హృదయం విప్పి ,మా వల్ల లభించే సాయాన్ని పొందు అని అర్ధం .శకుంతల ”మీతో కాక ఇంకెవరికి చెప్పుకోను ”?అంది .అప్పుడు వారిద్దరూ ”స్నిగ్ధ సంవిభక్తుం ఖలు దుఖం -సహ్య వేదనం భవతి ”అని వూరడిస్తారు
మదన లేఖ
అప్పుడు శకుంతల ,తన మనోభావాన్ని ,ఆవిష్కరిస్తుంది .రాజైన దుష్యంతుని వనాగమనం ,తన మనసులో వలపుల తొలి చిగురు వేసిందని తెలిపింది .నర్మ గర్భ అయిన ప్రియంవద కు ఉపాయాలూ ,మార్గాలు తెలుసు .అందుకే అనసూయతో ”ఇక -మన్మదావస్థ ను తొలగించాల్సిన సమయం వచ్చింది .రాజు అనురూప గుణాల చేత ,అభిలషనీయుడు ”అంటుంది .దానికి సమాధానం గా అనసూయ ”సఖీ !నీ అనురాగం సార్ధకం .మహానది ,సముద్రాన్నే చేరుతుంది కదా !”ఇదంతా స్వభావ సిద్ధ మైన చర్య గా ఆమె భావించి అలా అన్నది .ఆమెకు అంతే తెలుసు .ప్రియంవద ఇలాటివి కాచి వడ పోసింది .ఆలన్కారికం గా ఆమెతో మహా కవి ఇలా అని పిస్తాడు ”కోవేదానీం సహకార మంతరే ణాతి ముక్త లతాం పల్లవితా మర్హతి ”అంటే సర్వాంగ సుందరం గా చిగిర్చి,పుష్పించ నున్న పుష్పలత కు ,సహకార వృక్షం కాక వేరొకటి సరి పోతుందా ?”
అని భావం .తీయ మామిడి లోని గొప్పతనం ,ముక్త లత లోని సౌందర్య విలసనం ఒక దానికొకటి ఎంత చక్క గా సరిపోయాయో ,అలాగే ప్రియమైన మాటలతో కాళిదాసు గారి ప్రియంవద సాహితీ పిపాసు లకు తృప్తిని కల్గించే మాటలు అని పించాడు .
ఇలాంటి సందర్భాలలో చేయాల్సిన కార్య క్రమాలన్నీ ,పూర్వానుభవం వున్న ఆరిందా లాగా ప్రియంవద సిద్ధం చేసింది .శకుంతల మనో గోప్యాన్ని ”మదన లేఖ ”లో వ్రాసి ,దేవతా ప్రసాదం గా దుష్యంతునికి అంద జేస్తే బాగుంటుంది అని చక్కని సలహా నిచ్చింది .ఇందులో ఆమె నేర్పరితనం మనకు తెలుస్తుంది .భగవత్ ప్రసాదం గా ఇస్తే ,రాజు దాన్ని తిరస్క రించడు కదా కార్య సాధనకు అనువైన పధకం అది .చెలి మనో వేదనను తొలగించే మార్గం ,ఆ వ్యధను తెలియ జేసేందుకు చక్కని అవకాశం కల్పించింది ప్రియంవద .”నీ సలహాను కాదన గలనా ?”అంది శకుంతల .అయితే లేఖ ,ఏ విధం గా ఉండాలో కూడా ప్రియంవదే చెప్పేసింది .”నీ వేదన ,అనురాగ తాపాలు ,చదవ గానే మనసుకు హత్తు కోనేట్లు ,లలిత పద బంధం తో లేఖను రాయి .”అని సూచించింది .అసలే సుకుమార మైన విషయం .అందుకే అత్యంతసుకుమార మైన పద బంధమే ఔచిత్యం .అయినా శకుంతల సందేహించింది .ప్రియుడు అవధీరణం చేస్తాడేమో నని భయ పడింది .
మళ్ళీ ప్రియంవదే ”ఆత్మ గుణావ మానినీ !శరీరానికి చల్లదనం సౌఖ్యం చేకూర్చే శరజ్యోత్స్న ను చేలాన్చలం తో నివారించే వారుంటారా” ?అన్నది .సంబోధన లోనే శకుంతల గుణాదిక్యం ,దానిపై ఆమె కున నమ్మకం వ్యక్తమవుతుంది ”.దుష్యంతుడు తప్పక వలచి తీరతాడు .నీ గుణాదిక్యత కు ముగ్ధులు కాని వారెవ్వరు ?ఆభి జాత్యం గల, సుకు మారివి .నిన్ను తప్పక స్వీకరిస్తాడు .సందేహం వద్దు .”అని ఖచ్చితం గా చెప్పింది .ఇంత గాడ్హం గ మనసు లగ్నం అయినప్పుడే ,ఆమె హృదయ గత భావం కమ్మని గీతం గ వెలువడుతుంది అని ప్రియంవద యోచన .
మన్మధ లేఖ కు కావలసిన సామగ్రిని ప్రియంవదే సిద్ధం చేసింది .”సుకోదర సుకుమారమైన నళిన పత్రం పై నఖాలతో వర్ణాలు రాయి ‘అని హితవు పల్కింది .అందులో ప్రసాదాన్ని వుంచి ,పొట్లం లాగా మడిచి రాజుకు ఇవ్వ వచ్చు అని చెప్పింది .రాజు అక్కడికే వస్తాడు .ప్రియంవద నెమ్మది గా అంటుంది ”మీ ఇరువురి అన్యోన్య అను రాగం ప్రత్యక్షం అయాయి .అయినా మాచేలి యందలి ఆత్మీయత చేత నేను మళ్ళీ చెబుతున్నాను ”అని రాజ ధర్మాన్ని ,ఆయనకు గుర్తు చేసింది .ఆర్తి లో వున్న వారి ఆర్తి పోగొట్టటం రాజ ధర్మమే కదా అని భావం ”మా ప్రియ సఖి మన్మధ బారి పడింది .ఆమె ప్రాణం నిలప టానికి మీరే అర్హులు ”చాలా చిన్న చిన్న మాటలే .అందులో దుష్యంతుని పై శాకున్తలకున్న అవ్యాజ మైన ప్రేమను వ్యక్త పరుస్తూ మనమ్ధుని పీడా నుంచి ఆమెను కాపాడమనీ ,ఆమె చాలా కృశించి పోయి ఉందనీ ,ప్రాణాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ జ్ఞాపకం చేసిందన్న మాట .ఆమె ప్రాణం కాపాడటానికి అతడే సమర్ధుడు అని నిర్ద్వంద్వం గా చెప్పేసింది .ఇక్కడే ప్రియంవద నేర్పరి తనం మరో సారి కాళిదాసు మనకు వ్యక్తం చేశాడు .
ముందుగా శకుంతల కొంత తొందర పడ్డా ,తారు వాత సంయమనం చూపించింది .రాజుకు అనేక మంది భార్యలు ఉంటారనీ ,వినే వుంటుంది కనుక ,అంతఃపుర స్త్రీ లలో అంటే జనానా లో తన స్థానం ఏమిటో తెలుసు కోమని ప్రియంవద ను కోరింది .రాజు ,అవసరానికి తగిన వాగ్దానాలు చేశాడు .మిగిలిన కార్య క్రమం అంతా పూర్తి చేశారు చెలులు .ఇక అక్కడ తమ అవసరం లేదని గ్రహించారు .వారిద్దరినీ ఏకాంతం గా వుంచటం భావ్యం అని ప్రియంవద భావించింది ..అందుకే అటూ,ఇటూ ద్రుష్టి సారించి ”పర్యుత్సుకో మృగ పాతకో మాతర మన్వేషతే ”అని అంటూ ,అక్కడినుంచీ జారుకున్నారు .ఇందులో భావం -తల్లి కోసం మగ లేడి పిల్ల బెంగ పెట్టు కొంది అని అర్ధం .భవిష్యత్తు లో భరతుడి జననాన్ని ,సూచించాడు .ఆతని కోసం వెదికే పరిస్థితి తెలిపాడు .గాంధర్వ వివాహం ఫలితం గా భరత వంశ శ్రేష్టుడు ఉద్భావిస్తాడని సూచ్యార్ధ సూచన చేశాడు కాళి దాసు .శకుంతలా దుష్యంతుల కోర్కె లీడేరి పుత్రోదయం జరుగు తుందని కవి కుల గురువు కాళిదాసు గారి కమ నీయ కవితా ప్రవచనం అది .ఆయన ప్రతిభ కు ప్రబల ఉదాహరణం గా ఈ వాక్యాన్ని విశ్లేషకులు ఉదహరిస్తారు .
సశేషం