విశ్వ నాద ”జాన్సన్ ”కు” బాస్వేల్” శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు -1
మహా మహోపాధ్యాయ శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు గొప్ప విద్వాద్ వరేన్యులు .వారు విశ్వనాధ సత్య నారాయణ గారికి అతి ముఖ్య మైన శిష్యులు .విశ్వ నాద కవితా హృదయం బాగా తెలిసిన వారు .విశ్వనాధ రామా యణ కల్ప వృక్షానికి అత్యద్భుత వ్యాఖ్యానం చెప్ప గల మహా విశ్లేషకులు .ఒక రకం గా విశ్వ నాద ను ఆవిష్కరించిన దేశికులు .నా దృష్టిలో విశ్వ నాద అనే” జాన్సన్ ”కు ”బాస్వేల్ ”వంటి వారు శ్రీ మల్లం పల్లి శరభేశ్వర శర్మ గారు .ఆయన తన జీవితం లోని కొన్ని,విశేషాలను ”సహ్రుదయాభి సరణం ”పేర పుస్తకం రాశారు దాన్ని ఆధారం గా నే ఈ వ్యాసం దాదాపు ఆయన భాష లోనే చెబుతున్నాను . ఆ మాటలు మంత్ర పూతం గా వుంటాయి .అందుకే ఆ మాటల్లోనే చెబితే మహత్తు వుంటుంది .
విశ్వ నాద అనే హిమాలయానికి శరభయ్య గారు శిష్యుడనే మహా మేరు పర్వతం .A great disciple of a great master.మహా గొప్ప పండితులు విద్వద్వంశం లో జన్మించారు .తండ్రి మల్లికార్జునా రాధ్యుల వారు .కవిత్వ ,పాండిత్యాలలో సాక్షాత్తు అపర మల్లికార్జున పండితా రాధ్యులే .కుమారుడు శరభయ్య గారికి 12 ఏళ్ళు నిండక ముందే ,కావ్య ,నాటకా లంకారాలలో ,సాహిత్య విద్య నేర్పారు . అప్పటికే శరభయ్య గారికి కవిత్వం కరతలా మలకం అయింది .శ్రీ చెళ్ళ పిళ్ళ వారికి ఏక లవ్య శిష్యులైనారు .హృదయం చెళ్ళ పిళ్ళ సూర్యునికి ”అభిసరణం ”అయింది .సంస్కృతాంధ్రాలలో కొన్ని వేల శ్లోకాలు ,పద్యాలు వారికి కాంతస్తాలు (kanthasthaalu ) .కనుక తాను కవి అవటం లో ఆశ్చర్యం లేదని అంటారాయన .అంటే సహజ కవి అన్న మాట .అప్పటికింకా శాస్త్ర పరిచయం యేర్పడ లేదు .
విశ్వ నాద సాహిత్య పరిచయం
ఒక సారి మల్లం పల్లి వారు కృష్ణా జిల్లా కైకలుర్ దగ్గర లో వున్న శోభ నాద్రి పురం వెళ్ళారు .అక్కడ వీరి మేనల్లుడు ,అతని బంధువు వుండే వారు .వారిద్దరూ అప్పటికే విశ్వ నాద సాహిత్యం చదివి ,వాటి విషయమై చర్చిన్చుకొంటు వుండే వారు .చెళ్ళ పిళ్ళ వారి పద్యాలను అలవోక గా చదువుతుండే వారు .విశ్వ నాద పద్యాలను మల్లం పల్లి వారికి చదివి విని పిస్తుండే వారు .అప్పటికి శర్మ గారికి విశ్వ నాద తో పరిచయం లేదు .అంటే ఆ సాహిత్యం తో కూడా పరిచయమే లేదు .విశ్వనాధ పేరు ప్రక్కనఏం .ఏ. .వుండటం తో వీరికి ,ఆయన విద్వత్తు పై గౌరవం కలగ లేదట .విశ్వ నాద కు సంస్కృతం అసలేమీ రాదు అను కొన్నారట .అప్పటికింకా మల్లం పల్లి వారి హృదయం అంతా కాళిదాస ,భవ భూతులే ఆక్ర మిన్చుకొన్నారు .నన్నయ ,తిక్కన ,శ్రీ నాధులు కొలువై వున్నారు .ఇంకెవరికీ చోటు లేదని పించింది .తన మేనల్లుడు పదే పదే విశ్వ నాద కవిత్వాన్ని విని పిస్తుంటే ,తన మేనల్లుడికి ఇంత గొప్ప గా నచ్చిన విశ్వనాధ కవితా ప్రతిభ తనకెందుకు తెలియలేదు అని కొంత మధన పడ్డారు .మేనల్లుడు దగ్గరున్న విశ్వనాధ పుస్తకాలను అడిగి తీసుకొని మెల్ల గా చదవటం ప్రారంభించారు .
విశ్వనాధ రచనా పరీమళ ఆఘ్రాణం
మొదట ”కిన్నర సాని ”చదివారు .కవిత్వం లోని మనోధర్మం సజాతీయం అని తెలిసింది .తెలుగు పాట లో ఎంత తీయదనం వుందో ,అనుభవం అయింది .తెలుగు నేల లోని నదులు ,కొండల అడవుల ,ముగ్ధ సౌందర్యం అర్ధ మైంది .రసాకృతి చెందిన ఆ వాగులో తాదాత్మ్యం చెంది నట్లని పించింది .తన వెనుకటి జన్మ కు ,ఆ నది పూర్వ జన్మ కు ఏదో సంబంధం వుందని పించింది .ఓమదుర కవితా ఝరిలో మునిగి తేలిన అనుభవం కలిగింది .
తర్వాత ”అనార్కలి ”నాటకం చది వారు .అందులోని పాటలు సెలయేటి సంగీతం అని పించింది .”మా స్వామి ”చదివారు .శ్రీ నాద కవి సార్వ భౌముడి తర్వాత ,అంత ఆహ్లాద మైన ,స్నిగ్ధ మైన ,గంభీర మైన ఆంద్ర శారద దర్శనం ,శబ్ద మాధుర్యం ,మళ్ళీ విశ్వ నాద లో కన్పించింది .”నర్తన శాల ”లో ప్రవేశించారు .భాసమహా కవి ,తెలుగు లో నాటకం రాసినట్లు అని పించింది .”ఆంద్ర ప్రశస్తి ”చదివారు .ఒక అతీంద్రియ శక్తి తనలో వికశించినట్లు అయింది .”ఎన్ని జన్మ లుగా -ఈ తనువునన్ బ్రవహించునో ఆంద్ర రక్తముల్ ”అన్న అనుభూతి కి లోనైనారు .
”వేన రాజు ”చదివారు .”శుక్ల పక్షం లో అష్టమి నాడు ,చంద్ర కాంతి నిండు నది లా ప్రవహిస్తున్నట్లు ,ఒక మహా వైణిక విద్వాంసుని ,నాద వాహిని లో చేతనా చేతనా మైన సృష్టి అంతా ,తడిసి ముద్ద అయి నట్లు అని పించింది .”ఏక వీర ”నవల చదివి తాదాత్మ్య స్తితిని పొందారు .సంస్కృత నాటక కర్తలు తీర్చి దిద్దిన నాయికలు , ,పరమ భావుకతా లక్ష ణాలు ,చారు దత్త కవి లోని జాతీ కుసుమ పరిమళం లాగా ,మనసంతా ఆవరించింది .చివరకు ”వేయి పడగలు ”చదివారు .తెలుగు దేశం ఆత్మ సాక్షాత్కరించింది .కొన్ని కొన్ని అధ్యాయాలన్నీ ,ఆనందపు కన్నీ టి లో పూర్తిగా తడిసి పోయినాయట .ఒక్క నెల రోజులు దాన్నే చదివి ,ఆసాంతం జీర్ణం చేసు కొన్నారట .తన మనో ధర్మమే పూర్తిగా మారి పోయినట్లని పించిందట .భూమి ,ఆకాశం ,గాలి కొత్త గా వున్నట్లు అని పించింది .ఏదో కొత్త జన్మ ఎత్తిన అనుభూతి కల్గింది .
ఇంత అనుభూతినిచ్చిన కవి తన కాలమ్ లో ,ఈ భూమి మీద ,జీవించి ఈ గాలి పీలుస్తూ ,ఈ నీరు తాగుతూ ,తనతో పాటు జీవిస్తున్నాడు కదా అని పించింది .ప్రాణాదికు డైన కవిని చూచి తరించాలని పించింది .ఎవరి ప్రమేయం లేకుండానే ,విశ్వనాధ ను దర్శించాలని మనసు నిండా భావించారు ..ఆ మహా కవికి ,ఏ కోరికా లేకుండా ,రస ముగ్ధ మైన ,సహ్రుదయాభి శరణం అనిపించింది శరభేశ్వర శర్మ గారికి .కాళిదాసాది మహా కవులకు ,తన వలె ,ఏ అజ్ఞాత వ్యక్తీ అయినా ,ఇలా సహ్రుదయాభి శరణం చేశాడా అని పించింది .పురూరవునికై ,ఊర్వశి చేసిన దాని కన్న ,తన ఆకర్షణ ,దివ్యమూ , ,ఇహలోక సంబంధమూ అని పించింది .విశ్వ నాద దర్శనం తో శరభయ్య గారు ఎలా పునీతు లయారో తారు వాత తెలుసు కొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .

విశ్వ నాద అనే హిమాలయానికి శరభయ్య గారు శిష్యుడనే మహా మేరు పర్వతం .A great disciple of a great master.మహా గొప్ప పండితులు విద్వద్వంశం లో జన్మించారు .తండ్రి మల్లికార్జునా రాధ్యుల వారు .కవిత్వ ,పాండిత్యాలలో సాక్షాత్తు అపర మల్లికార్జున పండితా రాధ్యులే .కుమారుడు శరభయ్య గారికి 12 ఏళ్ళు నిండక ముందే ,కావ్య ,నాటకా లంకారాలలో ,సాహిత్య విద్య నేర్పారు . అప్పటికే శరభయ్య గారికి కవిత్వం కరతలా మలకం అయింది .శ్రీ చెళ్ళ పిళ్ళ వారికి ఏక లవ్య శిష్యులైనారు .హృదయం చెళ్ళ పిళ్ళ సూర్యునికి ”అభిసరణం ”అయింది .సంస్కృతాంధ్రాలలో కొన్ని వేల శ్లోకాలు ,పద్యాలు వారికి కాంతస్తాలు (kanthasthaalu ) .కనుక తాను కవి అవటం లో ఆశ్చర్యం లేదని అంటారాయన .అంటే సహజ కవి అన్న మాట .అప్పటికింకా శాస్త్ర పరిచయం యేర్పడ లేదు .
విశ్వ నాద సాహిత్య పరిచయం

విశ్వనాధ రచనా పరీమళ ఆఘ్రాణం
మొదట ”కిన్నర సాని ”చదివారు .కవిత్వం లోని మనోధర్మం సజాతీయం అని తెలిసింది .తెలుగు పాట లో ఎంత తీయదనం వుందో ,అనుభవం అయింది .తెలుగు నేల లోని నదులు ,కొండల అడవుల ,ముగ్ధ సౌందర్యం అర్ధ మైంది .రసాకృతి చెందిన ఆ వాగులో తాదాత్మ్యం చెంది నట్లని పించింది .తన వెనుకటి జన్మ కు ,ఆ నది పూర్వ జన్మ కు ఏదో సంబంధం వుందని పించింది .ఓమదుర కవితా ఝరిలో మునిగి తేలిన అనుభవం కలిగింది .
తర్వాత ”అనార్కలి ”నాటకం చది వారు .అందులోని పాటలు సెలయేటి సంగీతం అని పించింది .”మా స్వామి ”చదివారు .శ్రీ నాద కవి సార్వ భౌముడి తర్వాత ,అంత ఆహ్లాద మైన ,స్నిగ్ధ మైన ,గంభీర మైన ఆంద్ర శారద దర్శనం ,శబ్ద మాధుర్యం ,మళ్ళీ విశ్వ నాద లో కన్పించింది .”నర్తన శాల ”లో ప్రవేశించారు .భాసమహా కవి ,తెలుగు లో నాటకం రాసినట్లు అని పించింది .”ఆంద్ర ప్రశస్తి ”చదివారు .ఒక అతీంద్రియ శక్తి తనలో వికశించినట్లు అయింది .”ఎన్ని జన్మ లుగా -ఈ తనువునన్ బ్రవహించునో ఆంద్ర రక్తముల్ ”అన్న అనుభూతి కి లోనైనారు .
”వేన రాజు ”చదివారు .”శుక్ల పక్షం లో అష్టమి నాడు ,చంద్ర కాంతి నిండు నది లా ప్రవహిస్తున్నట్లు ,ఒక మహా వైణిక విద్వాంసుని ,నాద వాహిని లో చేతనా చేతనా మైన సృష్టి అంతా ,తడిసి ముద్ద అయి నట్లు అని పించింది .”ఏక వీర ”నవల చదివి తాదాత్మ్య స్తితిని పొందారు .సంస్కృత నాటక కర్తలు తీర్చి దిద్దిన నాయికలు , ,పరమ భావుకతా లక్ష ణాలు ,చారు దత్త కవి లోని జాతీ కుసుమ పరిమళం లాగా ,మనసంతా ఆవరించింది .చివరకు ”వేయి పడగలు ”చదివారు .తెలుగు దేశం ఆత్మ సాక్షాత్కరించింది .కొన్ని కొన్ని అధ్యాయాలన్నీ ,ఆనందపు కన్నీ టి లో పూర్తిగా తడిసి పోయినాయట .ఒక్క నెల రోజులు దాన్నే చదివి ,ఆసాంతం జీర్ణం చేసు కొన్నారట .తన మనో ధర్మమే పూర్తిగా మారి పోయినట్లని పించిందట .భూమి ,ఆకాశం ,గాలి కొత్త గా వున్నట్లు అని పించింది .ఏదో కొత్త జన్మ ఎత్తిన అనుభూతి కల్గింది .
ఇంత అనుభూతినిచ్చిన కవి తన కాలమ్ లో ,ఈ భూమి మీద ,జీవించి ఈ గాలి పీలుస్తూ ,ఈ నీరు తాగుతూ ,తనతో పాటు జీవిస్తున్నాడు కదా అని పించింది .ప్రాణాదికు డైన కవిని చూచి తరించాలని పించింది .ఎవరి ప్రమేయం లేకుండానే ,విశ్వనాధ ను దర్శించాలని మనసు నిండా భావించారు ..ఆ మహా కవికి ,ఏ కోరికా లేకుండా ,రస ముగ్ధ మైన ,సహ్రుదయాభి శరణం అనిపించింది శరభేశ్వర శర్మ గారికి .కాళిదాసాది మహా కవులకు ,తన వలె ,ఏ అజ్ఞాత వ్యక్తీ అయినా ,ఇలా సహ్రుదయాభి శరణం చేశాడా అని పించింది .పురూరవునికై ,ఊర్వశి చేసిన దాని కన్న ,తన ఆకర్షణ ,దివ్యమూ , ,ఇహలోక సంబంధమూ అని పించింది .విశ్వ నాద దర్శనం తో శరభయ్య గారు ఎలా పునీతు లయారో తారు వాత తెలుసు కొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .
ఇంత అద్భుతమైన సాహితీ విశ్లేషణలలో అక్షరదోషాలు – ఒత్తులు పెట్టకపోవడం – చాలా బాధించింది. దయచేసి సరిచెయ్యండి.