విశ్వ నాద జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మలంపల్లి శరభయ్య గారు -3

విశ్వ నాద జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మలంపల్లి శరభయ్య గారు -3

                                         విశ్వ నాద విరాణ్  మూర్తిమత్వం
 విశ్వ నాద గారి కల్పవృక్షం పేరెట్టి తే చాలు శరభయ్య గారు పులకరించి పోతారు .ఆయన అంటారు ‘సీతా రాములకు అయోధ్య దగ్గర లో వున్న గంగా నది కంటే ,తెలుగు దేశం లోని గోదావరి నది ఆత్మీయం అని పిస్తుంది .సీతా రాముల ఏకాంత వాసానికీ ,వనవాస లీలా మాధుర్య విలాసానికి ,ప్రణయపు లోతులకు ,ఎడబాసి ఉండలేని ,ఆ దుఖానికి సాక్షి గోదా వరే .ఇవన్నీ గోదా వరికీ తెలిసినంత ఆత్మీయం గా ,గంగమ్మకు తెలియవు .అందుకే ,సంయోగ వియోగ మైన తమ ప్రణయ జీవిత రహశ్యానికి సఖిలా వున్న గోదావరి ని విడిచి ఉండ లేక ,ఆ నది ఒడ్డునే ,భద్ర గిరి మీద ,నెలకొని ,తెలుగు ప్రజల హృదయం లో ,సీతా రాములు శాశ్వతం గా నిలిచి పోయారు .అసలు ,వారు వనవాసం నుంచి ,అయోధ్యకు వెళ్ళ లేదేమో నని పిస్తుంది నాకు .వారిద్దరి కళ్యాణ ,పట్టాభి షెకాలు ఈ రాష్ట్రం లోనే ,వార్షికం గా ,భక్తీ శ్రద్ధ లతో జనం చేసి తరిస్తున్నారు .ఇలా యుగ యుగాలుగా ,తన ప్రేమ బలం చేత సీతారాముల్ని గోదావరీ మాత ,తెలుగు నేల మీద తన ఒడ్డునే ,నిలిపి వేసు కొంది ”అని భక్తీ ప్రపత్తు లతో అంజలి ఘటిస్తారు
శ్రీ విశ్వానాధ కల్ప వృక్షమూ ఇన్ని విధాలు గానే కన్పిస్తుందట శరభయ్య గారికి .వాల్మీకి చిత్రించిన భూదేవి వర్ణ చిత్రమే కల్ప వృక్షం లో దర్శన మిస్తుందట .అందులోని సుకుమార ,రస భావనలే ,తేనే తో కలిసిన కేసరాలు ,రేకులు -ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పువ్వు .ఒక్కొక్క ఖండం ఒక్కొక్క చెట్టు .ఒక్కొక్క కాండం ఒక్కొక్క కొండ .అలాంటి ప్రకృతి రామ నీయకత కల్ప వృక్షం లో వుంది .బ్రాహ్మీమయ మూర్తి అయిన విశ్వ నాద నిర్మించిన కల్ప వృక్షం , ,భావుక హృదయా రామం లో ,స్థిర ప్రస్టిత మైంది అంటారు ఆనంద బాష్పాలు రాలుస్తూ మహా మహోపాధ్యాయులు శరభయ్య గారు .కాళిదాస కావ్యాలకు మల్లి నాద సూరి గారి సంజీవనీ వ్యాఖ్య ఎలాంటిదో ,విశ్వ నాద రచనలకు శరభేశ్వర శర్మ గారి వ్యాఖ్యానం అలాంటిది .అంత నిర్దుష్ట మైనదీ ,సాధికార మైన్దీను .
”మనం అందరం వాడే శబ్దాన్నే ,మంత్రించి ,విశ్వ నాద ప్రయోగిస్తాడు .ఆ శబ్దం లోంచే రస జగత్తులు తొంగి చూస్తాయి .”అంటారు గురువు విశ్వ నాధను గురించి అంతే వాసి శరభయ్య గారు .నాలుకకు ఓషధీ రుచి తెలిస్తే ,మనసుకు వాక్కు లోని రసాలు తెలుస్తాయి దీనిపై గొప్ప వ్యాఖ్యానం చేశారు చూడండి .
”జ్ఞానేన్ద్రియమైన రసనకు ,కర్మేంద్రియ మైన వాక్కుకు ,జిహ్వాయే అధిష్టానం .నాలుక ఆరు రుచులను గ్రహిస్తుంది .అలాగే తొమ్మిది రసాలకు ఆలంబన మైనా వాక్కును సృష్టిస్తుంది .జ్ఞానేంద్రియ మైన నాలుకకు వరుణుడు ,కర్మేంద్రియ మైన వాక్కు కు అగ్ని అధిష్టాన దేవ తలు .మొదటిది ఆరు రుచులతో అనుభ వింప జేసేది .రెండోది ,తొమ్మిది రసాలతో ఎదుటి వారి చేత అనుభవింప జేసేది .తాత్కాలిక మైన ఇంద్రియ సుఖం రుచి .శాశ్వత మైన అనుభూతి రసం .అలాంటి రసానికి ,ఆశ్రయ మైన వాక్కు ,అగ్ని లో నుంచి పుడు తుంది .కనుక పరమ పవిత్రం .అందుకే అది ”వాగగ్ని ”అయింది” .ఇంత గొప్ప గా విశ్వక్ నాద కవితా విరాట్ రూపాన్ని ఆవిష్కరించిన వారు లేరు .
తపోలక్షనాలు కల విశ్వ నాద అగ్ని లోంచి పుట్టే వాక్కును తన దహరాకాశం లో సంధ్యా దేవత వలె ,ఆవిర్భావింప జేసుకొని ,శబ్ద బ్రహ్మాన్ని సాక్షాత్కరింప జేసుకొన్నారు .”అస్మదీయ కన్తమున యండాడు చుండే -నొక ఏదో గీతి -బయత్కుబికి రాదు -చొచ్చుకొని లోనికిం బోదు -వ్రచ్చి పోయే -నా హృదయ మీ మహా ప్రయత్నా ము నందు ”అంటారు విశ్వ నాద .అంటే కాదు
”ఆ మహా సంధ్య లో ,శారద మయూరి -రమ్య కింకిణి ,కిణి  ,కిణి  ,రభస ,పాద
మంజుల విలాస నృత్య సామ్రాజ్య లక్ష్మి -యగుచు కచ్చపీ మృదు గీతుల ననుసరించు ”
అలాంటి అంతర్మధనం నుంచే ,మాదుర్యామృతం జనిస్తుంది .మనసు ఆర్ద్ర మవుతుంది .ద్రవీభావించిన ఆత్మ ,లక్షణమే మాధుర్యం .సృష్టికీ ,కావ్య సృష్టికీ ,అదే మొదటి దశ ”ఇంతటి నిగూఢ బావాన్ని ఇంత రసరమ్యంగా చెప్ప గల నేర్పు మల్లం పల్లి వారిది .
”విశ్వ నాద శబ్దాన్ని యేరు కోడు .ఆయన సృష్టి లో ఔచిత్యం ,భాష ,ఆకృతి అన్నీ రస మిలితాలై ,తమంతట తామే ,యధోచితం గా సరి పోతాయి .ఆయన చైతన్యం చాలా వేగ వంట మైంది .దేనిలో సంకల్ప మాత్రం చేత ,ప్రతి శూక్ష్మంశము యధా తదం గా అమరి వుంటుందో ,అదే సృష్టి .కావ్య సృష్టి అయినా ,జగత్ సృష్టి అయినా .”ఇచ్చామాత్రం విభొహ్ సృస్త్”అన్నారు అందుకే ”అని రాసా వేశం తో విశ్వ నాద మహా వ్యక్తిత్వాన్ని ఆవిష్క రిస్తారు .  శరబయ్య గారి దృష్టిలో ”సర్వ కవితా విశ్వనాధుడు -విశ్వ నాద ”.
  విశ్వ నాద మహా ప్రస్తానం 
విశ్వ నాద సత్యనారాయణ గారు మరణిస్తే ,శిష్య గణం అంతా రోదించింది .అందరిదీ మూగ వేదనే .కాని శ్రీ తుమ్మ పూడి కోటేశ్వర రావు -విశ్వనాధ పై ,”చితా భస్మం ”అనే కావ్యాన్ని విశ్వనాధ మరణానంతరం  రచించారు .దీనిపై స్పందిస్తూ మల్లంపల్లి వారు ”మాలో పసివాడు కాబట్టి ,కోటేశ్వర రావు స్పందించాడు .ఎవరిని గూర్చి ?గురువు గారిని గురించి కాదట .తనకు ప్రాణ ప్రద మైన ఈ తెలుగు నేలపై వివిధ దేవతల ఆకారాలుగా బుగ్గ పొడిచిన ,కాలా తీత మైన  నిత్య చైతన్యం సోమ్మ సిలి నందుకట .-ఇదేం అన్యాయం ?అని అందర్నీ అడిగాడు ఆ దుఖం లో ”అని అతి భావుక మైన ఆత్మీయ స్పర్శను ,ప్రశంసను ,గురు భక్తిని తెలియ జేశారు .తుమ్మ పూడి వారి రస రామ్యాలైన రెండు పద్యాలు
”భద్ర గిరి పొంత వాగుగా పారి పోను -పోను ,సువిశాలమై మహామ్బుధిని గలిసె
నెట సరస్వతీ రసధుని -అచట ,”ముండు” పలుక -నచికేతు డగుచు తత్వములు వింటి (ముండు అంటే ముండక ఉపనిషత్ కోటేశ్వర రావు గారికి కల్గిన దర్శనం ఎలా వుందంటే
”త్రిగుణ ముల్  ,పంచ భూతములుల్ -బ్రుమ్హితమ్ము –సకల త్రైలోక్యమున్ -ప్రాణ సంచయములు
యన్మహః ప్రభా భావమై అందే సుడియ –తన్మహా కాల మూర్తి పాదములకు
అన్మహా మూర్తి ,తాన్డవోద్యన్మహోద్ధ -తాంఘ్రి ,సంరంభ ,సంఘాత మంది ,ఉరలి
స్ఫుట నిటల ,వహ్నిచ్చటా ,త్రుటిత ,మవని –తన్మహా స్మశాన విహార తత్పరుడు
ప్రభు తనూ లిప్తి కిది చితా భస్మ మగుత ”
        అని తన గురువైన విశ్వ నాధను ,ఆయన విరాణ్ మూర్తి ని విశ్వం లో దర్శించారు -అణువణువునా మంత్ర ద్రష్ట, వేత్త అయిన శ్రీ తుమ్మ పూడి కోటేశ్వ ర రావు గారు .వారు శంకర భగవత్పాదుల వారి ”సౌందర్య లహరి ”కి వ్రాసిన విశ్లేషాత్మక మైన వ్యాఖ్య తరచిన లోతులు  చదివి తీర వలసిందే .తుమ్మ పూడి వారుకృష్ణా  జిల్లా గుడి వాడ వారే .
               సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -02  -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.కం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.