నలుని కధ లో భారత కధ

 నలుని కధ లో భారత కధ 

           మహా భారతం కధలో నల కధ ఒక ఉపాఖ్యానం .అరణ్య పర్వం లో ధర్మ రాజు ”బృహదశ్వ మహర్షి ”ని సందర్శించి ,”మా లాగానే ,రాజ్యం ,సంపదా పోగొట్టు కోని ,కస్టాలు పడ్డ  వాళ్ళెవ రైనా వున్నారా “?అని ప్రశ్నించాడు .దానికి మహర్షి ”నువ్వు పరివారం తో సహా అరణ్య వాసం చేస్తున్నావు .వన వాసం అన్న మాటే కాని ,రాజ్యం లో ఉన్నట్లే అన్నీ అనుభావిస్తున్నావు .నీ కష్టం ఒక లెక్కా ?నల మహా రాజు కస్టాల  ముందు  నీ కస్టాలు ఎంత ” ?అన్నాడు .ఆ కధ చెప్పమంటే ,మహర్షి వివరించాడు 
         నలుడి కధ లోనే భారత కధ  బీజం లో మర్రి చెట్టు లాగా వుంది .పాండవులు ,నలుడు చంద్ర వంశ పు రాజులే .పాండవుల లక్షణాలన్నీ నలుడి లోను వున్నాయి .ధర్మ బుద్ధి తో పాటు జ్యూద  వ్యసనం కూడా .బాహుబలం లో నలుడు భీముడే ,వంట వండే వందే నేర్పు తో సహా .అందుకే నల బ్భీమ పాకం అనే పేరు వచ్చింది .పరాక్రమం లో అర్జునుడే .బృహన్నల -రూప భేదం తో బాహుకుడు .నకులుడి లోని అందం ,అశ్వ హృదయ వేదిత్వం సహదేవుడి లోని వివేకము వున్నవాడు నల మహా రాజు .
                ద్రౌపదిది స్వయం వరం కాదు .మత్స్య యంత్రం కొట్టే షరతు .దమయంతిది సాక్షాతూ స్వయం వరమే .స్వయం వరం తోనే నలుడి కస్టాలు ప్రారంభం అయాయి .ఇంద్రాదులకు ఈర్ష్య కలుగ లేదు .పైపెచ్చు నలుని దౌత్యానికి సంతోషించి వరాలు  ఇచ్చారు .ఇక్కడ దుర్యోధనుడు కలి అంశ తో పుట్టాడు .నల కధ లో కలి ప్రధాన పాత్ర పోషించాడు .”ఆచారం నుండే ధర్మం పుదు తుంది -ఏమరు పాటు వల్ల ఆచారం చెడితే ,సందు చేసుకొని ,కలి మనసు లో ప్రవేశిస్తుంది” .అలానే ధర్మ మూర్తి అయిన నలుని లో కలి ప్రవేశించాడు .ద్వాపర  యుగాన్ని ‘పాచికలలో ”ప్రవేశించ మని అంటాడు .
         కలి పట్ట్టిన నలుడు రాహుగ్రస్త చంద్రబింబం  లాంటి వాడు .కురు పాండవులకు, నలునికి, జ్ఞాతివైరమే  దెబ్బ కొట్టింది .పుష్కరుడు నలుడి పిన తండ్రి కొడుకు .మొదటి సారి జూదం లో ద్వాపరం ప్రవేశించటం వల్ల ,నలుడు ఓడిపోయాడు .మహా భారత కధ లో ద్రౌపది centre of activity అవుతుంది .రాజ్యం కంటే ,ద్రౌపదీ పరాభవమే కురుక్షేత్రా యుద్ధానికి కారణం అయింది .దమయంతికి పరాభవ ప్రశ్న లేదు .నల కధ లో దమయంతి centre of activity .రెండు సార్లు నలుడిని గుర్తించింది దమయంతి .ద్రౌపది కంటే దమయంతి విదుషీ మణి .మహిమ కలది కూడా .అడవిలో ద్రౌపది చూపులతోనే కిరాతకున్ని భస్మం చేసింది .భారత కధ లో ద్రౌపదికి జరిగిన పరాభ వ్కానికి భీముడు ప్రతీకారం చేయాల్సి వచ్చింది .
          రెండు కధల్లోనూ ,వనవాసం ,అజ్ఞాత వాసం వున్నాయి .నల కధ లో వీటికి కాల పరి మితి  లేదు .నలుడు ఋతు పర్నుని కొలువు లో ఆశ్వాధ్యక్షుడు గా వున్నాడు .దమయంతి ,తన పిన తల్లి వద్దే  చేది రాజ అంతఃపురం లో వుంది ..పాపం సైరంధ్రి ది అజ్ఞాత వాసం .ఊర్వశి శాపం అర్జునుడికి అజ్ఞాత వాసం లో ఉపయోగ పడింది .అలాగే ,కార్చిచ్చు లో చిక్కు కున్న కర్కోట కుడు అనే సర్పాన్ని  నలుడు కాపాడి రక్షిస్తే ,ఆ పామే కాటు వేసింది .పాముకు పాలు పోసి చేటుతెచ్చుకున్నట్లయింది నలుడి పని .నలుడి రూపమే విక్క్రుతం గా మారి పోయింది .అందాల నలమహా రాజు నల్లని  బొగ్గు రూపం లో భయంకరం గా మారి పోయాడు .బాహుకుడి లా మారి ,అజ్ఞాతం గా జీవించాడు .
          ఋతు పర్ణుడు విరాట రాజు లాంటి వాడు .మంచి వాడే కాని దూర ద్రుష్టి ,వివేకం లేవు .అజ్ఞాత వాసానికి అటు వంటి వాడే బాగా ఉపయోగ పడు తాడు .దమయంతి ద్వితీయ స్వయం వారానికి వెళ్లి భంగ పడ్డాడు .ఉత్తర కుమారుడే, గోగ్రహణ సమయం లో కౌరవులను గెలిచాడని విరాట మహా రాజు భావించాడు .ఆ మాట నమ్మి ,అది నిజం కాదు అని చెప్పిన కంకుభట్టు (ధర్మ రాజు )ను ,జూదపు పలక తో కొట్టి ,దయనీయ మైన స్తితి తెచ్చుకొన్న అజ్ఞాని విరాటుడు .
          నలుని కధా మళ్ళీ జూదం తోనే ముగుస్తుంది .ధర్మ రాజు లాగా ,నలుడూ భార్యను జూదం లో పణం గా ఒడ్డాడు .నలుడు గెల్చాడు .ధర్మ రాజు ఓడాడు .అందుకని భారత కధలో రక్తం యేరు లై ప్రవహించింది .నలుడి కధ  లో రక్తం  బిందువు కూడా చింద లేదు .
        కష్టాల్లో ఉన్న వాళ్లకు ,తన కంటే ,ఎక్కువ కస్టాలు అనుభవించిన వారిని గురించి ,చెప్తే ఊరట కలుగు తుంది ,అందుకే ”బృహదశ్వ మహర్షి ”నలుని కధ సవివరం గా తెలియ జేశాడు .అంతే కాదు బారత కదాంశాలన్నీ ,నలుడి కధ  లోనే వుండటం మరీ విచిత్రం .ఆలోచనలను రేకెత్తించేది కూడా .చివరిగా కలి దోషాన్ని పోగొట్టే కధ  నలుడిది .నలుడు పుణ్య శ్లోకుడు .పాండవు లందరి సమాహార స్వరూపమే నలుడు .నలుని అనుభవం అనే సముద్రం లో ,పాండవులు బిందువులు .నల కధ కృత యుగం నాటిది .భారతం ద్వాపర యుగాన్తానికి  చెందినది .భారత యుద్ధం అంటే ద్వాపర యుగాంత ప్రళయమే నన్న మాట .
        కాలం అనంతం .చక్ర భ్రమణం .పూర్వం జరిగినవే ,మరో యుగం లో ,కొంచెం మార్పులతో మళ్ళీ జరుగు తాయి .ఇదే సృష్టి రహశ్యం .అందుకే సృష్టి రహశ్యానికి ,నిదర్శనం గా ,భారత కదా లో నల కధను ,నిబంధించాడు మహర్షి వేద వ్యాసులు వారు . ఇదే తెలుగు లో ”నన్నయ గారి ప్రసన్న కదా కలితార్ధ యుక్తి ”.నల కధ  తర్వాత శ్రీ రామావ తార కధను వివ రిస్తాడు ధర్మ రాజుకు బృహదశ్వ మహర్షి .రామ కధ త్రేతాయుగానికి  చెందినది . ఆయన  కస్టాలు వర్ణనా తీతమే కదా .ఇందరి కస్టాలు విన్న ధర్మ రాజు హృదయం కొంచెం శాంతించింది .తన కంటే కష్టాల కడలి లో మునిగి తేలిన వారు ఎందరో వున్నారు అనే ఎరుక కలిగింది .స్థిత ప్రజ్ఞతఏర్పడింది . .ఆ తర్వాత వచ్చే కదాంశమే ”యక్ష ప్రశ్నలు .”.ఇందులో యుదిస్తిరుని  వివేకం ,లోక జ్ఞానం అనుభవం ,ఆదిభౌతికత ,ఆధ్యాత్మిక వైభవం  వైభవం ,అతీంద్రియ జ్ఞానం ,విశ్వ రూపం గా కని పిస్తాయి .
          ఈ విషయాలన్నీ నేను సాహితీ మండలి లో 19 -03 -2002 లో ప్రసంగించినవి .వీటి నన్నిటిని అప్పుడు నేనెక్కడో చదివి రాసు కొన్నవీ దాచు కొన్నవీ .  .ఆ రచయిత పేరు  నాకు జ్ఞాపకం రావటం లేదు .మహత్తర మైన వ్యాసం చదివాను అనే ఆనందం లో ఆ ప్రసంగం చేశాను .ఆ అజ్ఞాత రచయితకు శిరసు వంచి పాదాభి వందనాలు చేస్తున్నాను .చాలా గొప్ప స్పూర్తిని కల్గించిన వ్యాసం అది ఇది వారికే అంకితం . 
                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -02 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

2 Responses to నలుని కధ లో భారత కధ

  1. krjsrikanth అంటున్నారు:

    sir am Telugu person but unable to type in Telugu using these keyboards other wise want to explain in Telugu,

    I understod the life cycle of Earth is fixed but it’s rotation is always fixed, like Human life is just like cycle he ll always rotate in his dreams and the same life, The story explain how to think

  2. తిరుమలేశ్వర రావు అంటున్నారు:

    చాలా విషయములు తెలియచేశారు. సంతోషం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.