మహాత్మా గాంధి ప్రభావం

నీ మహత్త నిలువ నిట్టి భాష్యముల -బతింప(bathimpa ) వలయు ,నాదరింప వలయు ”
వా చరణమ్ము ,నందసువు లర్పణ జేసినా వారి పార్ధివ
శ్రీ ,చెలువారు చోట ,తడశ్రు గ్రుచులన్ ,వికశించి వాసనల్
వీచుచు రాలి పోవగా వలెం ,దాడుదాట్ట ”సమాధి మ్రుట్టికన్ ” అని అంజలి ఘటించారు
ధ్యేయము కాదు ,హీనులాటి దీనులు ,మ్లాన తనుల్ ,దారిద్ర ,నా
రాయను లేద్చు చుండిరి ,తడశ్రువుల్ ,దుడువగా బొమ్ము ,,నీ
ప్రేయసి తోడ ,నీకచట లభించును ,కోట్ల కొలంది స్వర్గ ముల్ ”అని ప్రబోధించారు .
సిగ్గు సిగ్గంచు లేచి ,గర్జించి నారు -కనులు గుత్తిన తెల్ల మొగాల వారు ”అని అన్యాప దేశం గా నల్లని వాడు గాంధి అని ,తెల్ల మొగాల వారు బ్రిటిష్ వారు అని భలేగా చెప్పారు” ధనుర్భంగం ”అనే ఖండ కావ్యం లో కరుణశ్రీ .
నవతరించే ,సత్యాహింస లాత్మ గాగ -శాంత రూఆన నిల ,గర్మ (కరంచంద్ ) చంద్రుదగుచు ”అని ఆవేశం తో చెప్పారు అభినవ పోతన వానమామలై వరదాచార్యుల వారు .
” పలికెడిది గాంధి కధ యట ,పలికిన్చేడు వారు తెలుగు ప్రజలాట
బలికిన నూరట యౌనట ,-పలికెడ నిక నొందు మరచి బాపు చరిత్రన్ ”అని ఉప్పొంగి అంటారు తుమ్మల .
”గాంధీ అవతార పురుషుడు -కనుక ఆయన చరిత్రను స్కందాలుగా రాశాను ”అంటారు ఆత్మా కూరి గోవిందా చార్యులు గారు .
”ఆతడజాత శత్రుడు ,-మహాత్ముడు ,శాంత తపశ్వి -విశ్వ విఖ్యాతుడు
ఆతని ఆత్మా శక్తికి లేవసాధ్యముల్ ”అంటారు ”విజయిశ్రీ ”కావ్యం లో ధర్మ రాజు ను పొగిడే నెపం తో గాంధీని పొగుడుతూ కరుణ శ్రీ .
”ఆహవంమిది ,స్వేచ్చా మహాహవంము ,నీవు హోత -ఉపద్రష్ట నేను -స్రువము గాండీ వమ్ము విరోధి మూకలు హవిస్సు -యజ్న ఫలము స్వరాజ్య సంప్రాప్తి పార్ధ ”అని స్వతంత్ర సంగ్రామాన్ని ,కురుక్షేత్ర యుద్ధాన్ని కలిపి జాతీయ భావాన్ రేకెత్తించిన దేశ భక్త కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి .
”పౌసస్త్య హృదయం ”లో కాటూరి వెంకటేశ్వర రావు గా ఋ కూడా గాండీ తత్వాన్ని రావా నుడికి ఆపాదించారు .సమకాలీన సత్యాలను సార్వ కాలీనం చేశారు .
GOD;S GRACE AND REVELATION ,ARE THE MONO PPOLY OF NO RACE ,OR NATION -THOUGH WE KNOW HIM BYA THOUSAND NAMES .GOD IS ONE AND THE SAME .TO ALL US ALL.
”మాలలు మాలలా ,భారత మాత్రు గలస్త చిరత్న రత్న ,సం
లాలిత మాలలు ,ఆంద్ర మహిళా కచ కల్పిత ,నవ్య మల్లికా
మాలలు ,అనార్య సంతతి ,విమాన శిరోగ్ర లసత్పతాకినీ
మాలలు గాని ,వట్టి ,కను మాలపు ఆలలు గారు ,కారు ,ఇలన్ ”
అని గాంధీ ప్రభావం తో బ్రహ్మా భట్ల పట్టాభి రామ శర్మ గారు అంటారు .
”సిరివి నీవే -ఇంటి సిన్గారంమున్నీవే -శక్తి నీవే ,లోక జనని నీవే
విద్య నీవే ,విమల జ్ఞాన నిధి నీవే -మహిళా నిన్ను మించి మహిమ గలదే ”అని శర్మ గారే అన్నారు .
ఆహాత్ముని ప్రభావమే ఇదంతా .
SVADESHEE WITHOUT KHADDAR is like body without life ”అన్నాడు గాంధి
social service is best performed when the left hand knoweth not ,what the right hand is doing ”
అని మహాత్ముడు ఎప్పుడు అంటుండే వాడు
”వండే మాథరమన్చూ ,మండే రాజ్యంబతంచు మరి మందలుపన్ -సందేహ మింత లేదని ,ముందే పూరి గొల్పి నత్తి ముర హరి గాంధీ ”అంతు కీర్తించారు గాంధి శతకం లో గో.ఛి .మల్లికార్జున రావు గారు .
”ఒక్క స్వరాజ్య దీక్ష గొని ,దేహమ్మోడ్చి -నూల్పోగుతో
నవలీలన్ ,జగ మెల్ల గట్టితి వాట్య గాంధి దేవ ప్రభో ‘;అని కీర్తించారు విశ్వ నాద శాస్త్రి
”గాంధి నామమే మంత్రము ,-గాంధియ వేడంబానగా గాన్తువు గాంధీ ”అన్నాడు వడ్ల మూడి గోపాల క్రిష్నయ్య .
”నా బ్రతు కెల్ల దారమై -కందులు గట్టి ,నీడు చరఖా పయి నేనొక చేరుమాలనై
ఉండెద మెత్త గా ,పెదవు లోత్తుచు ,”అని అసలైన గాంధి శిష్యునిగా భక్తీ తో అంటారు కరుణశ్రీ .
శక్తి సంపన్నుల ఆయుధమే అహింసా వ్రతం అని తేల్చి చెప్పాడు మహాత్ముడు ..
ఒకరిపై చూపే ప్రేమతోకూడిన సేవే నిజ మైన ఆరాధన అన్నారు గాంధి
”నీవు పలికిన పలుకు నిగమ భాష యగుచు ,నినదించు చుండును ,మహాను భావ”అంటారు నండూరి రామ కృష్ణ మా చార్యుల వారు .
”కలియుగంబున దైవమె గాంధి తాత ”అన్నారు కృత్తి వెంటి వెంకటేశ్వ ర రావు .
”కొల్లాయి గట్టి తే నేమి ,మా గాంధి కోమటి పుట్టి తే నేమి -వెన్న పూసా మనసు -కన్న తల్లీ ప్రేమపండంటి మోము పై బ్రహ్మ తేజస్సు ”అనారు బసవ రాజు అప్పా రావు గారు .ఇదో మంత్రం లా ఆంద్ర దేశ జనులంతా పాడుకొన్నారు . .
”మనిషి శివుడవుటయే గాంధి యుగం -బాపు ననుసరిస్తే చాలు మన మందరం ”అని కృష్ణ శాస్త్రి కితాబు .
మహాత్ముని జీవనం -జాతికి ఉజ్జీవనం (inspiration )అన్నారు పాపయ్య శాస్త్రి .
”హిమాలయం మా హృదయ భారం -గంగా నది మా కన్నీరు ”అని ఎవరు చెప్పానంత గొప్ప గా శ్రీ శ్రీ అన్నాడు .
మనం మాత్రం గాంధి ని మరిచి బ్రాందీ ని పూజిస్తున్నాం .
”మహాత్ముడు ఒక అద్భుతం .ఇలాంటి వ్యక్తీ భూమి పై జన్మించాడు అంటే ,భవిష్యత్తు లో జనం నమ్మరేమో ”అన్నాడు మహావిజ్ఞాని శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ .
మహాత్ముని అహింస ,సహనాన్ని సాహసోపేతం గా అనుసరించి వుంటే -ప్రపంచం లో ఇంత సంక్షోభం వుండేది కాదు .కాశ్మీర్ యుద్ధం ,ఆతంబామ్బులతో పనీ వుండేది కాదు అన్నాడు ”tom alter అనే బొంబాయి లో స్తిర పడ్డ కళా కారుడు .
”గాంధీ ని భారతీయులు మర్చి పోయారు .గాంధి లాంటి మనిషి అంతకు ముందు లేరు .తర్వాత రారు ”అన్నారు ప్రఖ్యాత నర్తకి మృణాళినీ సారా భాయ్ .
”మిమ్మల్ని నిరాడంబరం గా ఉంచ టానికి ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది ”అని మహాత్ముడితో మేల మాడింది తెలుగింటి కోడలు సరోజినీ దేవి .
గాంధీ దేవాలయాన్ని ఆంద్ర దేశం లో కడప లో మేదర కులస్తుడు సుబారావు 1957 లో బెజవాడ గోపాల రెడ్డి గారితో ఆవిష్కరింప జేశాడు .
గడ్డి పరక లా పచ్చ గా నిత్య నూతనం గా వుండాలి ”అన్న గురు ఆనక్ సూక్తిని రెండవ ప్రధాని ,గాంధీ అంటే వాసి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎప్పుడు జ్ఞాపకం చేస్తుండే వారు .
జనవరి 30 న మహాత్మా గాంధీ వర్ధంతి అమర వీరుల సంస్మరణ దినం .ఆరు రోజులు ఆలశ్యం గా నైనా ఆ మహాత్ముని ప్రభావాన్ని ఒక్క సారి గుర్తు చేసుకొందామని ఈ ప్రయత్నం .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
అధ్భుతమైన పలుకుల కలబోత. ఈ మధ్యే “మాహాత్ముడు” అని రాజ్ మోహన్ గాంధీ రాసిన పుస్తకం చదువుతున్నాను. గాంధీ గురించి మరో కోణంలో చెబుతున్న పుస్తకమది.
బాగుంది.. ఆ తరం వారి కన్నా ఈ తరానికే గాంధీ గారి అవసరం ఎక్కువగా ఉంది
Good Collection.
Naku mahathma gandi sukthulu kavali…… Na email ke pampandi