సరస్వతీ పుత్రుని శివ తాండవం –2

 సరస్వతీ పుత్రుని శివ తాండవం –2

      ”వేదాద్రి నరసింహ  విపుల వక్షస్ఫీత -కమనీయ కల్హార గంధ లహరి
ఏడు కొండల రాయడే పూట కాపూట -భోగించు పచ్చ కప్పురపు విడెము
భ్రమ రామ్బికా సమర్చ్య కుమ్కుమోన్మిశ్రీ -పుష్ప చంద్ర కితంము బొలుచు చెలువు
శ్రీ కాళ హస్తీశ   శివతాతి రూపు రేఖా -స్నిగ్ధ నైగ నిగముల ముంపు
కవిత గా ,గానముగా ,చిత్ర కళ గ -నాట్య కళ యుగ ,బ్రతి ఇంట సాక్షాత్కరించి
ఆంద్ర రాష్ట్రమ్ము  మన భాష నలవరించి -ఎదుగు గావుత సంతతాభ్యుదయ మహిమ ”
అని పుట్ట పార్టి వారు సకల దేవతలను ఆవాహనం చేశారు .ఆంధ్రమంతా కవితా గాన ,చిత్రలేఖన ,నాత్యాడులతో ,వర్ధిల్లాలి అని కోరిన మహా కవి .విశ్వనాధ వారి ”ఏకవీర ”నవలను స్వయం గా మళయాళ భాష లోకి అనువదించిన విద్వాద్ వరేన్యులు ..మరాఠీ భాషలో ”భక్తాం చే గాదే ”రాశారు .ఇంగ్లీష్ భాష లో leaves in the wind  ను ,సంస్కృతం లో ”శివ సహశ్రం ”రాశారు .ఇవన్నీ వారి భాషా పాండిత్యానికి వన్నెలు ,చిన్నెలు .ఇన్ని భాషలు నేర్చి,నేర్చిన భాష లన్నిటి లో కవిత్వం చెప్పిన కవులు ఈ భోమి మీద పూర్వం కాని ,నేడు కాని లేరు .తెనుగు గడ్డ పై పుట్టి నందు వల్ల నే పుట్ట పర్తి వారికి రావలసినంత ,రా దగినంత కీర్తి రాలేదనటం ముమ్మాటికీ నిజం .ఇదే ఇంకో భాషా కవి అయితె నెత్తిన పెట్టు కోని ఊరేగించే వారు .
సరస్వతీ పుత్రులైన శ్రీ ఆచార్యుల వారు సంగీతం , ,సాహిత్యం ,నాట్యం నేర్చారు నేర్పించారు .ఇదీ అపూర్వమే .ఇలాంటి కవి రవీంద్రుడు తప్ప భారత దేశం లో ఇంకెవరు లేరు .ఆశు కవిత్వం చెప్పారు .అవధానాలు చేశారు .మేఘ దూతం ,గాంధి ప్రస్తానం ,అగ్ని వీణా ,జనప్రియ రామాయణం ,రామ కధా లహరి ,పండరీ భాగవతం ,వారి ఇతర ముఖ్య కృతులు . తిరు పతి దేవస్తానం వారు తలపెట్టిన భాగవత గ్రంధానికి విపుల మైన పీఠికల తో వ్యాఖ్యానం రాశారు అందులో వారి పాండితీ గరిమకు ఆశ్చర్య పోతాం .అరుదైన మహా కవి శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులు .
 శివ తాండవం 
శ్రీ పుట్ట పర్తి వారి ”శివ తాండవం ”కావ్యాన్ని చదివి ,విని ప్రముఖ హిందీ రచయిత ”దినకర్ ”,మళయాళ కవులు పులకించి పోయారు .అందులోని శబ్ద మాధుర్యానికి విశేషం గా ఆకర్షితు లయారు .శివ తండ వాన్ని ,ఆచార్యుల వారు తమ స్వంత గొంతు తో వినిపిస్తుంటే ,మన మనో నేత్రం ముందు ,ఆ పరమ శివుని తాండవ నృత్య కేళీ వినోదం సాక్షాత్కా రిస్తుంది .అంతటి ధన్య జీవి వారు .శివ తాండవం సమస్త జీవ కోటికీ ,పరమానందాన్ని సమ కూర్చేది .”తపశ్వి ”అయిన కవి మాత్రమే రాయ గలిగిందీ అనుభవించి ,అనుభవింప జేయ గలిగిందీ .”నాన్ రుషి హ్ కురుతే కావ్యం ”   ”అన్నది ఈ సరస్వతీ పుత్రులకు చక్కగా అన్వ యిస్తుంది .వారి మనో గొచరం కాని విష్యం లేదు .అందుకే ఆ కావ్యం మహోన్నత మైంది .అగస్త్యేశ్వర  స్వామి ని ఉపాసించి ,తాపసి లక్షణాన్ని అద్భుత కావ్య సృష్టి చేశారు .శివ కేశవులకు భేదం లేదని చూపారు .శివా లాస్యమే గిరిజా దేవి .-పార్వతీ మాత .అర్ధ నారీశ్వరి .తాండవ శివుని శరీరం లో ఆమె అర్ధ భాగం .
”వాగార్దా వివ సంపృక్తౌ ,వాగర్ధ ప్రతి పత్తయే –జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ”అని కవి కుల గురువు కాళిదాసు వర్ణనను అనుసరించి ,ఈ కావ్యం లో ఆచార్యుల వారు ,అర్ధనారీశ్వర తత్వాన్ని చక్కగా    ఆవిష్కరించారు .అందుకే కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారు తమ నిత్య పారాయణం లో భాగం గా  ”శివ తాండవం ”ను గ్రహించారు .ఎంతటి అదృష్టం ఆచార్యుల వారికి -ఎంతటి గౌరవం కావ్యానికి కలిగిందో వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది .అంతటి విశిష్ట కావ్య మరీ మళాలను మీకు అందించే కృషి నే నేను చేస్తున్నాను .ఆ తాండవ లీలా వినోదం లో మనం అందరం భాగ స్వామ్యులం అవుదాం .ఆ కేళీ విలాసం లో లీన మవుదాం .ఆ అద్భుత రాసా వేశాన్ని పొందుదాం .అలౌకిక ఆనంద పారవశ్యాన్ని అనుభ విద్దాం .పద ఛందస్సు లో సరస్వతీ దేవి పాద పద్మాలకు సమర్పించిన ఆ సరస్వతీ పుత్రుని ,సాహితీ మహత్తును రుచి చూద్దాం .
      తాండవ ప్రత్యేకత 
 
 శ్రీ పర మేశ్వరుడు నట రాజు అవతారం దాల్చి ,నృత్యం చేస్తుంటే ,అఖిల భువనమే ఒక రంగస్తలం గా మారి పోతుంది .అర్ధాంగి పార్వతి ఆనంద పారవశ్యం తో వీక్షిస్తుంది .ధమరుకం చేతిలో మోగుతూ వుంటే ,గంధర్వులు గంధర్వ గానం ఆల పిస్తుంటారు .చర్మ వసన దారి అయిన శివుని మెడలో సర్ప హారాలు అందుకు తగిన విధం గా ఊగుతూ నర్తిస్తాయి .పాదాలు వ్యత్యస్తం గా ,నర్తించే ఆ భంగిమ ప్రపంచ కళా జగత్తు లో మరెక్కడా లేదు .నట రాజ మూర్తి భార తీయ శిల్ప కళ కే శిరో భూషణం .ఆ నృత్య భంగిమకు పాశ్చాత్య పండితులే అబ్బుర పది పోయారు .ఆ నట రాజ స్వామిని గురించి డాక్టర్ జార్జి అరండేల్ ” when shall I see thou  o lord ?When shall thou deem me worthy to have vision Thy holy daance /o thou who are the lord of universe ,who art clothed witha infinite space who holdeth very infinity itself within thy grasp who art the lord of dance of universe and of worlds who art very bliss of life ?”అని పొంగి పోతారు .
భారతీయ నృత్యం దైవాన్ని ఆశ్ర యించింది .ఒక నృత్యమేమిటి ?సకల కళలు అంతే .ఆత్మ ప్రబోధం చేసి ,అంతర్ముఖ సౌందర్యం తో ,ఆముష్మికాలై ,బ్రహ్మానందాన్ని కల్గిస్తుంది నాట్యం .భారత దేశం లో నృత్యానికి ,నాట్యానికి దగ్గర సంబంధం వుంది .ఒక భావాన్ని స్పష్టం చేయ టానికి గానం తోనూ ,వాద్య సమ్మేళనం తోనూ ,చేసేది నృత్యం .దీనిలో ఆహార్యం ,ఆంగికం ,వాచికం ,సాత్వికం అనే నాలుగు విధాల అభినయాలున్నాయి .భారతీయ నృత్యం లో పురుషులు   చేసే నృత్యాన్ని ”తాండవం ‘అంటారు .ఇది చాలా ఉద్ధృతం గా ,పటిష్టం గా వుంటుంది .స్త్రీలు చేసేదాన్ని ”లాస్యం ”అంటారు .ఇది లలితం గా ,కోమలం గా వుంటుంది .
వైదిక కాలమ్ నుంచి నృత్యాలు మనకు సంప్రదాయం గా వస్తూనే వున్నాయి .వర్షాల కోసం ,అశ్వ మేధ యాగం సందర్భం గా ,నెట్టి ఈద నీళ్ళ బిందెలు పెట్టు కోని ,కన్యలు ”ఇదం అమృతం ”అంతు పాడుతూ నృత్యం చేసే వారు .వివాహాల్లో కూడా నృత్యాలు చేసిన ఆధారాలు కని పిస్తాయి .ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళే ముందు నృత్యం చేసే వాడట .
అయితె వీటి నన్నిటినీ మించింది -నాట్య పోషకుడు ,విశ్వ నటుడు ,అయిన పరమ శివుడు చేసే తాండవం .దాని ప్రాముఖ్యత దేనికీ లేదు .”అభినయ దర్పణం ”లో
”ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాజ్మయం -ఆహార్యం చంద్ర తారార్కం తం నమః సాత్వికం శివం ”  అనే శ్లోకం అందరికి పరిచయ మైనదే .దీని అర్ధం ఒక సారి చూదాం ”ఎవరి ఆంగిక విన్యాసం ,ప్రపంచ క్రమమో ,ఎవని వాక్కు ,సర్వ గ్రందాల సారమో ,ఎవని అలంకరణ  చంద్రుడు ,, ,నక్షత్రాలో ,అట్టి సాత్విక భావ స్వరూపు డైన ”శివునికి ”అంటే ,మంగళ ప్రదం చేసే వానికి నమస్కారం .” తాండవానికి రంగా లంకరణ ఎలా ఎర్పాటయిందో తరువాతి భాగం లో తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సరస్వతీ పుత్రుని శివ తాండవం –2

  1. narasimharaomallinanarasimharao mallina అంటున్నారు:

    అయ్యా నమస్కారము.నేను కూడా శివతాండవాన్ని నా బ్లాగు ద్వారా పరిచయం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నవాడిని.
    ఈ క్రింది లింకులు చూడండి.
    http://kasstuuritilakam.blogspot.in/search/label/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82%20%28%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%29

    http://kasstuuritilakam.blogspot.in/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.