వ్యాస ,వాల్మీకి హృదయ కళా మర్మజ్ఞులు

వ్యాస ,వాల్మీకి  హృదయ కళా మర్మజ్ఞులు
శ్రీ కాళూరి వ్యాస మూర్తి గారు 

           కాళూరి వ్యాస మూర్తి గారు మేము ఉయ్యూరు లో 1964 లో వంగల కృష్ణ దత్త శర్మ గారి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ”నన్నయ కళా సమితి ”సభా కార్య క్రమం లో పాల్గొన్నారు .కార్యక్రమం విష్ణా లయం లో జరిపాం .రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వారు వారం రోజులు వాల్మీకి రామాయణం మీద అద్భుత ప్రసంగాలు చేశారు .అంతకు ముందెప్పుడూ మేము విని ఉండని  ,రామాయణ రహస్యాలను వెలికి తీసి తెలియ జేశారు .ఎక్కువ మంది జనం రాక పోయినా ,అదో మధురాను భాతి గా మాకు మిగిలి పోయింది .పంచ ,లాల్చి తో చామన ఛాయా గా ,పొడుగ్గా వుండే వారు .ఒక రకం గా చెప్పా లంటే ,స్వర్గీయ ముళ్ళ పూడి హర్స్చంద్ర ప్రసాద్ గారి లా గా వుంటారు .చాలా నెమ్మది గా మాట్లాడే వారు .కాని సంస్కృత శ్లోకాలు ,వాటికి వారి వివరణ చాలా ఆకట్టు కొన్నాయి నన్ను .ఆ లోతులను యెంత బాగా ఆవిష్కరించే వారే జ్ఞాపకం చేసు కొంటుంటే పులకరింత గా వుంది .దత్తు గారింట్లోనే వారి భోజనం ,పడక .సాయంత్రం సభ .సీతంరాజు సత్యనారాయణ గారు ,ముత్తయ్య మేష్టారు దత్తు గారు నేను మా తమ్ముడు ,రామా చార్యులు గారు ,కొందరు ఆడ వారు తప్పని సారిగా హాజ రాయే వాళ్ళం .మా అమ్మ కూడా వచ్చేది .అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలు రాశారు .అవి దత్తు గారు కొన్నారు .వాటిని మేము చదివాం .
వారు భారతం లోని ప్రతి పర్వం మీద ,తిక్కన రచనా వైభవాన్ని తేలిక మాటలతో ,అర్ధ గాంభీర్యం తో వివ రిస్తూ పుస్తకాలు రాశారు .అవి నేను పదేళ్ళ క్రితం చది వాను .వారు గొప్ప పండితులు .తెలుగు  గీర్వాణం ఆంగ్లం   లో మంచి పాండిత్య ప్రకర్ష వున్న వారు .బహుశా విశాఖ పట్నం వారి నివాసం అను  కుంటా .వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరణ చేస్తూ ,వ్యాస మూర్తి గారు ” రామ రాజ్యం  కుశ లవులు ”అనే పుస్తకం రాశారు .ఇంకా చాలానే రాసి వుంటారు .వారు రాసిన ”కుశ లవులు ”లోని కొన్ని అమూల్య విశేషాలను మీకు అందించే ప్రయత్నం చేస్తూ ,ఆ మహాను భావుడిని స్మరించే అవకాశం కల్గి నందుకు ఆనంద పడుతున్నాను .
 పాయస భక్షణ 
దశరధుడు యజ్న పాయాసాన్ని ,అర భాగం కౌసల్యకు ,నాలుగో వంతు సుమిత్రకు ,ఎనిమిదో వంతు కైకకు ఇచ్చాడు .సుమిత్రకు మిగిలిన ఎనిమిదో వంతు మళ్ళీ ఇచ్చాడు .కనుక చివరగా శత్రుఘ్నుడు ఆమె కడుపున  పడ్డాడు .లక్ష్మణుడు మొట్ట మొదటి సారే ,గర్భస్తు  డైనాడు .శత్రుఘ్నుడు పుట్టే వరకు ,లక్ష్మణుడు   గర్భం లోనే వున్నాడు .జననం రీత్యా  లక్ష్మణుడు చివరి వాడు .గర్భస్థ రీత్యా రెండవ వాడు .కైకేయి  గర్భం కంటే ,ముందుగా సుమిత్ర గర్భం లో లక్ష్మణుడు పడ్డాడు .అందుకే శత్రుఘ్నుడి కంటే పెద్ద వాడు .అంటే భరతుని కంటే కూడా పెద్ద వాడు సుమిత్రానందనుడు .అందుకే శ్రీ రాముని తర్వాత లక్ష్మణునికి వివాహం అయింది .రాముడు కూడా లక్ష్మణుడి  కే  యువ రాజ్యాభిషేకం చేస్తానన్నాడు .
  వాలి -రావణ మిత్రత్వం 

  వాలి రావణుడి తో సంధి చేసుకొన్నాడు  .ఇది ”అవిభక్త సంధి ”భార్య ,పిల్లలు ,పురం ,రాష్ట్రం ,భోగం ,ఆచ్చాదనం ,,భోజనం అంతా ,అవిభక్తం గా నే అనుభ వించాలి .అగ్నితో భ్రాత్రుత్వాన్ని పొంది ,సంధి చేసు కొన్నాడు వాలి .రావణుడు కిష్కింద లో నెల రోజులు వున్నాడు .రావణ మంత్రులు వచ్చి ,రావణున్ని ,బలవంతం గా తీసుకొని వెళ్ళారు .
” దారా పుత్రః ,పురం ,రాష్ట్రం ,భోగాచ్చాదన భోజనం -సర్వ మేవావిభక్తం,నౌ భవిష్యతి హరీశ్వరః ”(ఉత్తర రామాయణం )  దీనితో వాలి చరిత్ర వక్ర గతిన నడి చింది .కార్త వీర్యార్జునితో ,వోడి పోయి ,రావణుడు ”అద్రోహం ”అనే సంధి చేసు కొన్నాడు .కార్తుడు పరశు రాముని చేతిలో మరణించాడు .అందు వల్ల వధార్హుడైన రావణుని సంబంధం తో కార్త వీర్యార్జునుడు ,వాలి కూడా వధార్హు లై నారు .
 అంగద పట్టాభిషేకం 
వాలి మాయావి అయిన స్త్రీ రాక్షసి తో పోట్లాడుతూ ,గుహ లోనే వున్నాడు .గుహ బయట కాపలా వున్న సుగ్రీవుడు చూసి చూసి ,విసుగుతో కిష్కింధకు వచ్చాడు .మార్గం తప్పిన వాడు ,అర్హత లేని వాడు ,రావణునితో భ్రాత్రుత్వం పొందిన వాడు ,అమలు జరగని సంధి క్రమం కల వాడు ,వాలి .అందుకే మంత్రులు వాలిని తప్పించి ,సుగ్రీవుని పట్టాభి షిక్తున్ని చేశారు .అంగదుడు పుట్టక ముందే ,సుగ్రీవ పట్టాభి షేకం జరిగింది .
రామ ,భరతులు ధర్మ నిరతులు .వాలి సుగ్రీవులు అలా కాదు .జ్యేష్టు డైన  రామునికి భరతుని వల్ల రాజ్యం సంక్ర మిస్తే ,ధర్మ మార్గం వదిలి ,సుగ్రీవుని రాజ్యాన్ని వాలి అపహరించాడు .అందుకే వాలి వదార్హుడైనాడు .కనుక తండ్రి రాజ్యానికి వారసునిగా యవ్వ రాజ్య పట్టాభి షేకం చేయించాడు రాముడు .వాలి భార్య తార కూడా ఇదే కోరింది రాముణ్ణి .
 వాలి వధ -సమర్ధ నీయత 
వానరులలో సహజ లక్షణంవిలక్షణం   అనే రెండు లక్ష ణాలు  వున్నాయి .విలక్షణం లో మానవులను అనుసరించారు .ఉపనయనాలు చేసుకున్నారు .వివాహ సంస్కారం వాళ్లకు లేదు .వానర .జాతికి ఉపనయనం విలక్షణమే .వివాహం ”విరోధం ”అవు తుంది వారిలో .వానర జాతికి తాత్కాలిక దాంపత్యమే కాని స్థిర దాంపత్యం లేదు .బుద్ధి మంతు లైన వానరులు జీవితాంతం ”ఇది నా భార్య ”అనే వ్యవస్థ ను కొన సాగించారు .కారణ జన్ము లైన వానరు లలో ,’వివాహం సంస్కార యుక్తం కాదు ”కనుక వాలి భార్యను సుగ్రీవుడు ,సుగ్రీవుని భార్యను వాలి అనుభ వించారు .వీళ్ళ కు అగ్ని పరీక్ష అక్కర్లేదు .
సుగ్రీవుడు జీవించి వుండగా ,వెడల గొట్టి ,అతని భార్య ”రుమ ”ను అనుభ వించాడు వాలి .కనుక వాలి చని పొతే కాని సుగ్రీవుడు రుమను  ను అనుభ వించ లేడు .దీనికి వాలి మృతియె  ”సంస్కారం ”.
రావణుడు సీతా దేవి ని అపహరించి నందు వల్ల ”అవి భక్త సంధి ”ప్రకారం వాలి కూడా రావణుడు వంటి నేర స్తుడే .
మృగాన్ని వేటాడటం రాజ ధర్మం .సుగ్రీవుడే ”మృగాన్ని ఎర ”వేసి ,రాముడు వాలిని మృగం లా చంపాడు .ఇది వేట లో భాగమే .
  సీత అగ్ని ప్రవేశం 
అగ్ని ప్రవేశ సందర్భం లో ,”సీత ను నా దగ్గరకు తీసుకొని రా ”అన కుండా ”సీత నా సమీపానికి రావలసినది ”అని విభీషణుడి తో చెప్పి పంపాడు రాముడు .”హర్షం దైన్యం ,రోషం ‘రాముడు పొందాడు” అన లెదు వాల్మీకి ఈ మూడూ ఆవహించాయి అన్నాడు .జరిగిన దానికి హర్షం ,సీత కష్టానికి దైన్యం ,పర పురుషుని పురం లో వుండడం వల్ల రోషం ,మూగే వానరుల్ని చూసి ”దాక్షిణ్య ,అమర్షాలు ”పొందాడు రాముడు .వానరులను చూసి దాక్షిణ్యం ,సీత ను చూసి రోషం ..
అగ్ని దేవుడు సీతా దేవిని ”నిజామ్కం ”మీద కూర్చో బెట్టు కోని ,శ్రీ రామునికి ఇచ్చి ”పరిగ్రహించు ”అన్నాడు .”ఇదినా ఆజ్న ”అని కూడా హెచ్చరిక గా  అన్నాడు .
”అంకె నాదాయ వైదేహీ ,ముట్ప పాథ విభా వసువుహ్ –విశుద్ధ భావం నిష్పాపాం ,ప్రతి గృహ్ణీష్వ రాఘవ –న కించి దభిదాతవ్య మహా మాజ్ఞాపయామి తే  ”ఇది వాల్మీకి అగ్ని హోత్రుడి తో చెప్పించిన మాట .
బ్రహ్మాదులు లక్ష్మీ నారాయణు లను స్తుతించారు అది బ్రహ్మ వచనం .మనుష్యు లైన సీతా రామ దాంపత్యం అమోఘం గా సాగ టానికే వైదిక సాంప్రదాయం ఇప్పుదేర్పడింది .శృతి వాక్యం ఇలా వుంది .
”సోమః ప్రధమో వివిదే ,గంధర్వో వివిడుత్తరః –త్రుతీయోగ్నిష్టే ,పతిస్తురీయస్తే మానుష్యజః
సోమోదదద్గంధర్వాయ ,గంధర్వోదదగ్నయే -రాయించి పుత్రగీస్చా దా దాగని ర్నఃయ మధో ఇమాం ‘
దీని భావం ఏమిటి అంటే ”కన్య కు సోముడు ప్రధముడు ,గంధర్వుడు తర్వాత పతులు .మూడవ పతి అగ్ని .నాల్గవ వాడు మనిషి .సోముడు గంధర్వుడికి ,గంధర్వుడు అగ్నికి ఇచ్చారు .ధనం ,పుత్రులు ,ప్రయోజన మైన ఈ కన్యకు నాకు అగ్ని హోత్రుడు ఇచ్చు కొన్నాడు .”అని వరుడు వివాహం లోని ”ప్రధాన హోమం ‘ దగ్గర ‘ అంటాడు .ఈ వైదిక సంస్కారమే ఇప్పుడు చెలా మణి లో వుంది .దేవత అయిన అగ్ని ,మనుష్యుడైన రాముడికి ”ఆజ్న చేసి ”సీతా సాధ్విని ఇచ్చాడు అని మనం తెలుసు కోవాలి .
 వాతావరణం 

పుణ్యాత్ముల ,పాపాత్ముల వల్ల వాతా వరణం లో మార్పులు వస్తాయి .ఈ విషయం  రామాయణం లో స్పష్టం గా చూపించాడు వాల్మీకి మహర్షి .తాటక చని పొతే ,”ఘోర సంకాశమై ,దారుణం గా వున్న వనం ,ముక్త శాపమై ,కుబేరుని చైత్ర రధం లా రమణీయం గా ప్రకాశించిందట ”ఇంద్ర జిత్తు చచ్చి పొతే జలాలు ,దిశలు శుద్ధ మైనా యట .(శుద్ధ ఆపో దిశస్చైవ)
రావణాసురు దు మరణిస్తే మరుద్గానాలు శాంతించాయి .దిక్కులు విక శించాయి .భూమి నిశ్చల మైంది .గాలి చల్లగా వీచింది .స్థిర ప్రభ గా భాస్కరుడు ప్రకాశించాడు .అలాగే భరతుని హృదయం స్పష్టం అయే వరకు పట్టాభి షేకం  విషయం  స్పష్టం కాలేదు .కనుక రాముడు ”గంభీరం ”గానే వున్నాడు .
 శ్రీ లంక 
రావణుడి లంక శాపోప  హతం .లంక లోని ఏనుగులు కూడా పర హింస చేసేవట (కులీనాన్ రూప సంపన్నాన్ ,గజాన్పర గజాను జాన్ ).లంక వాసులు బుద్ధి కుశలురు .బుద్ధి ప్రధానులు కూడా .ఎవరి బుద్ధి వారికే ప్రధానం కూడా ”.స్వైర గతి ”వాళ్ళది .స్త్రీలు అంతా మద వతులు .అందుకే లంక ఎప్పుడు ఆరని అగ్ని జ్వాల లా ,రావణా కాష్టం గా వుంటుంది .

— సంపూర్ణం
ఇవన్నీ అభినవ వ్యాసు లైన ,అభినవ వాల్మీకు లైన స్వర్గీయ కాళూరి వ్యాస మూర్తి గారి వాల్మీకి  రామాయణ సుధా సాగర అంతర్గతనిధి నిక్షేపాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.