ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

 ఊసుల్లో ఉయ్యూరు –18 

                                            ఉయ్యూరు సంస్థానం–1

ఉయ్యూరు ఒకప్పుడు నూజి వీడుసంస్థానం లోవుండేది .ఆ తర్వాత , ఆ రాజుల పంపకాలలో ఉయ్యూరు సంస్థానం వేరు పడింది ,ఆ వివ రాలన్నీ నేను ”కృష్ణా జిల్లా సంస్థానాలు -సాహిత్య సేవ ”అనే పెద్ద వ్యాసం లో  20 -01 -2007  న రాశాను .ఇది ”కృష్ణా జిల్లా సర్వస్వం ” లో చోటు చేసు కొంది .అందులో వున్నప్రధాన  విషయాలు మీ ముందు ఉంచు తున్నాను .ముందుగా అసలు సంస్థానాలు ఎందుకేర్పడ్డాయి అని తెలుసు కోని ,ఆ తర్వాత ,నూజి వీడు సంస్థానం ఏర్పడిన విధానం అందు లోంచి ఉయ్యూరు సంస్తానంఎర్పడిన వైనం తెలుసు కొందాం .

 సంస్థానాల ఆవిర్భావం

              విజయ నగర రాజ్య పతనం తర్వాత ఆంద్ర దేశం గోలు కొండ ,బీజా పూర్ సుల్తానుల యేలు బడి లోకి వచ్చింది .1686 లో మొగలాయీలు గోల్కొండను వశం చేసు కొన్నారు . తమ అధీనం లో ”దక్కన్ సుబా ”గా మార్చారు .మొగలు సామ్రాజ్యం పతన దశ కు చేరి నపుడు 1713 లో ”కమ రుద్దీన్ అసఫ్ జా  ”ను”నిజాం ఉల్ ముల్క్ ”బిరుదును ఇచ్చి ,దక్కను సుబెదారుని గా చేశారు .ధిల్లీ కి విశ్వాస పాత్రుడు గా వుంటూ ,చివరికి ,వారినే  ఎది రించే ధైర్యం తెచ్చు కోని ,హైదరాబాద్ సుబెదారీ ని స్వతంత్రం గా పరి పాలించాడు .మహా రాష్ట్రు లతో స్నేహమూ చేశాడు .1748 లోఆసఫ్జా చని పోయాడు .సుబా పై పట్టు కోసం ,కొడుకులు పోటీ పడ్డారు .ఇదే అదనుగా ఈస్ట్ ఇండియా కంపెని వారు ,పరాసు వారు ,కొడుకులను చేరా దీశారు .విభజించి ,పాలించే నైజాన్ని నిరూపించారు .1757 నుంచి 1857 వరకు ”కుంఫిని యుగం ”గా భావిస్తారు .ఉత్తర సర్కారు నవాబు ,ఆర్కాటు నవాబు ,హైదరాబాద్ సుబేదారు కు  లోబడి పోయారు .అవసరం అయినపుడు ,నిజాముకు సేనలు పంపటం ,,సంవత్స రానికి తొమ్మిది లక్షల రూపాయలు  నిజాం కు చెల్లించే ఒడంబడిక చేసు కొన్నారు .కుమ్ఫినీ వారి దుబాసి ”కాండ్రేగుల జోగి పంతులు ”నిజాం కు ,కంపెని కి మచిలీ పట్నం లో ఒడంబడిక కుదిర్చాడు .1768 ,1779 లలో సర్కారు జిల్లా ల పై కూడా ,కంపెని అధికారం పొందింది .1788 లో ”మూర్తి జోన్నగరు  ”(గుంటూరు జిల్లా )కూడా ,వారి స్వాధీనమై పోయింది .భూస్వాములు బల వంతు లై ,కంపెనీ వారి దాక్షిణ్యం తో జమీందారి భోగాలను అనుభ వించారు .పన్నులు వసూలు చేయటం ,స్థానికం గా వుండే వీరి వల్లే సాధ్యం అని గ్రహించి ,1793 అప్పటి గవర్నర్ ”కారన్ వాలీసు ”–”శాశ్వత భూమి శిస్తు విధానం ”తెచ్చి ,జమీందార్లకు భూమి పై వంశ పారం పర్య హక్కు కల్పించాడు .వీరి ద్వారా శిస్తు వసూలు చేయించాడు .ఆస్తి హక్కు ఇస్తూనే ,వారి ప్రాబల్యం తగ్గించే జాగ్రత్తలు కంపెనీ ప్రభుత్వం తీసు కొన్నది .1802 లో దక్షిణ దేశం లో ”శాశ్వత శిస్తునిర్ణయ విధానం ”అమలు లోకి వచ్చింది .శిస్తు బకాయి కట్టక పొతే ,జమీందారు ను తొల గించి ,జమీ ని లాకునే వారు .సర్కారు భూములను ,తామే స్వయం గా రైతులకు ఇచ్చి సాగు చేయించే వారు .ఈ సమయం లోనే జమీందార్ల రాజా రికం ఖాయం చేస్తూ ,”హవేలీ ”భూముల్ని బహిరంగం గా  వేలం పాట పెట్టె ”రెవెన్యు సెటిల్   మెంట్ ”చేశారు .రెండొంతులు కంపెనీకి ,ఒక వంతు జమీందార్లకు చెడె ఒడంబడిక ఇది .1938  .నాటికి ఆంద్ర జిల్లాలలో జమీందారీ ల సంఖ్య 448 . అరవైశాతం గ్రామాలు జమీందార్ల అధీనం లోనే ఉండేవి .రైత్వారీ గ్రామాలు ముప్ఫై మూడు శాతమే నని ఆచార్య తూమాటి దోణప్ప తేల్చి చెప్పారు .

  జమీందారి యుగం 

1887 నుంచి జమీందారి యుగం ప్రారంభమైంది అంటారు చారిత్రిక పరి శోధకులు ఆరుద్ర .జమీన్ అంటే భూమి .దార్ అంటే అది పతి .వీళ్ళనే పాశ్చాత్య దేశాల్లో ”ఫ్యూడ లిస్టులు” అన్నారు . ఈ భాగాలను ”సంస్థానాలు ”అని కూడా పిలుస్తారు .సంస్థ అంటే ఉనికి అని అర్ధం .సంస్థానం అంటే ఆకృతి ,సన్ని వేశం ,గుర్తు అని నిఘంటువు చెబుతోంది .అంటే ,ఆయా ప్రదేశాల ఆకృతిని చెప్పేవి సంస్థానాలు .వాటి ఉనికికి ,ప్రజల మనికి కి తోడ్పడేవి .వారి పరి పాలనకు ,పోషణకు ,రాజా కీయ చతురత కు ,న్యాయ నిబద్ద ట కు గుర్తు గా ,నిలి చేవి అని భావించాలి .సంస్థానాల పాలకులను సంస్తానా దీశులుగా భావిస్తాం .సంస్తానా దీశుల్లో కవులు ,రచయితలు సంగీత జ్ఞులు వున్నారు . వ్యాస నాలతో ,ఆడంబరాలతో డబ్బును ,మంచినీళ్ళ ప్రవాహం గా ఖర్చు చేసి ,జమీ లోని ప్రజల గోడు పట్టించు కోని వారూ వున్నారు .కళా పోషణ చేసి ,చరితార్దు లయిన వారూ వున్నారు .స్త్రీలు కూడా జమీన్దారినులు గా వుండి ,సుపరి పాలన అందించారు .ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకొన్న వారు కొంద రైతే ,పనులతో నడ్డి విరగ కొట్టిన వారు కొందరు .ఇలాంటి వారి పై చిలక మర్తి లక్ష్మీ నరసింహం గారు ”నేల దున్నుద మన్న ,
జాల తరము పన్ను ,-నీరు గావలె నన్న నీటి పన్ను ” అన్న పద్యం లో చక్కగా ఎండ గట్టారు .రాబడి పన్ను ,సంత పన్ను ,మున్సిపల్ పన్ను ,హాసిల్ పన్ను ,స్టాంపు పన్ను వగైరా లతో ప్రజల్ని పీల్చి ,పిప్పి చేసే వైనాన్ని వివ రించారు .పంట పండించే వారికి గడ్డి మాత్రమే మిగులు తోందని ,రైతుల బాధలను కళ్ళకు కట్టించారు .పాను గంటి వారు కూడా సాక్షి వ్యాసాల్లో జమీందారీ అది కారాన్ని తూర్పార  బట్టారు .
  జమీందారీ రద్దు 
జమీందారీ దౌష్ట్యాన్ని సహించ లేని ప్రజల్లో క్రమం గా ఆలోచన పెరిగి ,సంఘటితం అయారు .1915 లో కృష్ణా జిల్లా రైతు సంఘం ఏర్పడి ,మిగతా జిల్లాలకు ఆదర్శ ప్రాయం ఆయనది .కమ్యూనిస్టులు ,సోషలిస్టులు ,చేయూత నిచ్చారు .ఉద్యమాలకు వెన్ను దన్ను గా నిలిచారు .1936 లో ”అఖిల భారత కిసాన్ సభ ”జరిగింది .ఆంద్ర రాష్ట్ర రైతు రక్షణ  యాత్ర 1937 లో జూలై  మూడు న ఇచ్చాపురం లో ప్రారంభం అయింది .1532 మైళ్ళు ,కాలి నడకన ,మిగిలిన దూరాన్ని బస్సుల్లో పర్య టించి ,1938 మార్చ్ 27 న మద్రాస్ చేరింది .మద్రాస్ అసెంబ్లీ స్పీకర్ బులుసు సాంబ మూర్తి గారికి ,రాజాజీ జి కి వినతి పత్రాలు సమర్పించి ,వేలాది మంది కిసానులు ఆదు కోమని కోరారు .జమీందారి రద్దు కు సిఫార్సు చేయ మన్నారు .చివరికి రాయీ గా భూమికి యజ మాని రైతే నని ,జమీందారు ఏజెంట్ మాత్రమే నని ,అడవులు వగైరా ప్రజలవే నని ,రాజాజీ ప్రభుత్వం ప్రకటించింది .1940 లో గొట్టి పాటి బ్రహ్మయ్య గారు మునగాల జమీ లోని అక్రమాలను అధ్యయనం చేసి ,రిపోర్ట్ ఇచ్చారు .దీన్నే ”బ్రహ్మయ్య అవార్డ్ ”అంటారు .చివరికి ప్రభుత్వం దిగి వచ్చి సంస్థానాలను ,జమీనులను రద్దు చేసి ,రైతులకు ,ప్రజలకు శాశ్వతం గా మేలు చే కూర్చింది .
దీని తర్వాత” నూజి వీడు సంస్థానం ఆవిర్భావం ” గురించి తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -02 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.