ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

ఊసుల్లో ఉయ్యూరు –19

                                            ఉయ్యూరు సంస్థానం-2

—                                          కృష్ణా జిల్లా సంస్థానాలు 


కృష్ణా జిల్లా సంస్థానాల్లో అతి ప్రాముఖ్యత సంతరించు కొన్నవి నూజి వీడు ,చల్ల పల్లి ,వల్లూరు ,ముక్త్యాల ,మైల వరం .వీటి తో పాటు ఈ జిల్లా లో  మొత్తం 37 సంస్తానాలున్నట్లు ఆరుద్ర వివ రించారు .అవి -చింతల పాటి ,వెంట్ర ప్రగడ ,(నుజి వీడు ),ఉయ్యూరు ,మీర్జా పురం ,కపిలేశ్వర పురం ,తేలప్రోలు ,మేడూరు ,దేవర కోట (చల్ల పల్లి )చెవేంద్ర ,చను బండ ,మైల వరం ,ముఠా పుల్లూరు ,మైల వరం ముఠా 17 గ్రామాలు ,మైల వరం ముఠా ,ఊటుకూరు ,తిరువూరు లో సగం ,గంపల గూడెం లో పడమటి భాగం ,మున గాల పర గణా ,వల్లూరు సముతు ,గూడూరు పరగణా ,పిన గూడూరు లంకా ,కృత్తి వెంటి సమతు ,రాయవరం ,బల్లి పర్రు ,కూచిపూడి ,నరసయ్య గూడెం ,తిరువూరు ముఠా లో సగం, కలగర ,పుట్రేల ,కొండూరు ,కంభం పాడు ,కొకిలంపాడు ,పెనుగొలను ,మును కుళ్ల ,కొమిరె ,లింగ గిరి ,దేవర పల్లి ,చిన గొల్ల పాలెం ,చిట్టి గూడూరు ,.ఇందులో చల్ల పల్లి ని దేవర కొండ గా చెప్పారు .ఇంత మంది జమీందార్ల అధీనం లో వున్న జిల్లా కృష్ణా జిల్లా .వారి రాజకీయ పాలన ప్రజాభ్యుదయం , పై వారి ద్రుష్టి ,,ప్రజా సేవ లో వారి రాణింపు ,సాహిత్యాది కళా పోషణ మొద లైన విషయాలు తెలుసు కొందాం .
 సాహితీ సమర ప్రాంగణం ”నూజి వీడు సంస్థానం ”
కృష్ణా జిల్లా లో వున్న జమీందార్ల లో నూజివీడు జమీందార్లకు ప్రత్యేకత వుంది .పౌరుష ,పరాక్రమాలలో ,కవితా రచన లో ,కళారాధన లో ,దేవాలయ స్థాపనల లో నుజి వీడు సంస్థానాధీశులు అగ్ర గామి గా వున్నారు .జమీందారి పాలనకు నూజివీడు పేరు పొందింది .నుజ్వీడు రాజులు రస హృదయులు .,సరసులు కావ టానికి కారణం ఇక్కడ పండే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ”రసం మామిడి పండు ”అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు .స్వాతంత్ర్య సమర యోధులను అందించిన వీర గడ్డ నూజివీడు .ఎందరో దేశ భక్తులు మాత్రు దేశ బానిస సంకెళ్ళను త్రుంచ టానికి పోరు బాట పట్టారు .ఆంగ్ల సామ్రాజ్యం పై ,భారత దేశం లోనే మొత్త మొదట ,సమర శంఖారావం పూరించింది నూజివీడు లోనే .ఆ తిరుగు బాటు వీరుడే నారాయణ అప్పా రావు .కృష్ణా ,గోదావరి నదుల మధ్య వున్న భూ భాగాన్ని 18 పరగణాలు గా ఏర్పరచి ,నూజివీడు ను రాజ దాని గా చేసు కోని ,”మేకా వంశానికి ”చెందిన పద్మ నాయక జమీందార్లు పరి పాలించారు .ఎన్నో దేవాలయాలను నిర్మించారు . .నిత్య పూజాదికాలకు వేలాది ఎకరాలు రాసిచ్చారు .ఆకిరి పల్లి శోభనాచల దేవా లయం ,గొల్ల పల్లి రఘునాధ దేవాలయం ,హనుమాన్  జంక్షన్  లోని అభయ ఆంజనేయ దేవాలయం ,ద్వారకా తిరుమల లో వేంకటేశ్వర దేవాలయం నిర్మించింది వీరే .ఎన్నో క్షేత్రాలను అభి వృద్ధి చేసి ,భక్త జనులకు సౌకర్యాలు కల్పించారు .వీరందరూ ”వెలమ దొరలు ”.
 మేకా వంశం ఏర్పడిన విధం 
మేకా వంశానికి మూల పురుషుడు ”విప్పర్ల బసవ దండ నాధుడు ”.ఈయన 12 వ శతాబ్ది కాకతీయ సామ్రాజ్య ప్రఖ్యాత దండ నాయకుల మలో  ఒకరు ”.రాణి రుద్రమ దేవి ”కి అంగ రక్షకుని గా వ్యవ అరించారు .ఈయన తర్వాత ఏడవ తరం లో జన్మించిన ”విజయ అప్పా రావు” (అప్పన్న )నూజివీడు ను నిర్మించారు .అందుకని ఆయనకు ఘన నివాళిగా అప్పటి నుంచి మేకా వంశీకులు తామ పేరు చివర ”అప్పా రావు ”అని గౌరవ బిరుదు ను చేర్చు కున్నారు .అలా ఆయన్ను చిరస్మర నీయుడిని చేశారు .
నూజివీడు లో కోట నిర్మించ టానికి ఒక కధ వుంది .మేకా విజయ అప్పా రావు అనే బిరుదు పొందిన అప్పన్న గారు ,16 వ శతాబ్దం లో ,నూజివీడు మండలానికి చెందిన గొల్ల పల్లి దుర్గం నుండి ఒక రోజు  వేటకు బయల్దేరారు .దుర్గమ మైన అరణ్యం లో నుంచి వెడు తుంటే ,”నువ్వు చేల గట్టు” మీద ఆకులు మేసే మేకను ,తోడేలు చంప బోవటం చూశాడు .మేక ధైర్యం తో ఎది రించి ,తోడేలుతో భీకరం గా పోరాడింది .ఆశ్చర్య పడ్డ అప్పన్న ,మేక పౌరుషానికి మెచ్చి ,ఆ ప్రదేశం పౌరుషానికి నిలయమైన గడ్డ గా భావించి ఆ ప్రాంతం లోనే కోట కట్టా లని నిర్ణ యించాడు .నువ్వుల చేను బీడు వద్ద ఈ సంఘటన జరగటం తో ఆ ప్రాంతమే ”నువ్వుల జేలు బీడు ”గా మారి ,చివరికి ”నూజివీడు ”అయిందని స్థానికుల కధనం .అలాంటి పౌరుషపు గడ్డ నూజివీడు ,నూజివీడు నిర్మాత విజయ అప్పా రావు .వీరిది ”విప్పర్ల గోత్రం ”.
 నూజివీడు కోట నిర్మాణం
క్రీ.శ.1565 -70 ల మధ్య 30 ఎకరాల స్థలం లో  కోటను ,చుట్టూ నగరము వుండే టట్లు నూజివీడు సంస్థానం ఏర్పడింది .తోడేలును చూసి పారి పోవాల్సిన మేక ధైర్యం గా ఎది రించి ,పోరాట పటిమను చూపింది కనుక తమ ఇంటి పేరు ను అప్పటి నుంచి ,ఆ వంశీకులు ”మేకా ”గా మార్చుకొని ,పౌరుషానికి చిహ్నం గా ,ఆ పేరు ను భావించారని తెలుస్తోంది .మేక పోరాటం చేసిన చోట త్రవ్వగా బయల్పడిన శ్రీ రాజ గోపాల స్వామి విగ్రహాన్ని ,అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ట చేశారు .ఆ స్వామే వారి ఇల వేలుపు . విజయ అప్పా రావు కుమారుడు వెంకటాద్రి అప్పా రావు కోటను బాగా వృద్ధి చేశారు .కోటకు ,వూరికి నీటి వసతి కల్పించ టానికి చెరువు త్రవ్వించారు .రాజ గోపాల స్వామి దేవాలయం నుంచి ,”రహస్య  భూ మార్గం ”ఏర్పాటు చేశారు .
ఆ తర్వాత 14 వ తరానికి చెందిన వెంకట నర సింహ అప్పా రావు   (శని వారప్పేట )ను ,ధర్మ అప్పా రావు అనే వారు .చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేయటం తో ,ఆ పేరు సార్ధకమయింది .ఏలూరు సంతాన వేణు గోపాల స్వామి ,నందమూరి వేణు గోపాల స్వామి ,పెండ్యాల సకలేశ్వర స్వామి ,మంద పాక ఎల్లారమ్మ దేవాలయాలను ,భక్తీ శ్రద్ధ ల తో నిర్మించి ,,నిత్య ధూప  దీప నైవేద్యాలకు ”ఈనాములు” ఇచ్చారు .కాశీ ,రామేశ్వర మార్గాలలో ,యాత్రికులకు సౌకర్యాలు కల్పించారు .ధర్మ అప్పా రావు గారిది మెత్తని మనసు .రాత్రి పూట కుక్కలు అరుస్తుంటే ,విని ,ఎందుకు అరుస్తున్నాయో  సేవకులను అడిగి తెలుసు కోని ,చలికి తాళ లేక అరుస్తున్నాయని వారు  చెప్పారట .ఒక ధర్మ నిధి ని ఏర్పాటు చేసి ,కుక్కలకు గోమ్గల్లు ” ‘గొం గళ్ళు  ”కోని పించి ,కప్పించిన భూత దయా పరుడు .గొప్ప సంస్క్రుత్త పండితుడు కూడా .

 బ్రిటిష్ వారిపై సంధించిన అస్త్రం నారాయణ అప్పా రావు(రెబెల్ అప్పా రావు )


ఈ వంశం లో రెబెల్ అప్పా రావు గా నారాయణ అప్పా రావు గారిని భావిస్తారు .బ్రిటిష్ వారితో ”,గెరిల్లా పోరాటం ”చేసి ,వారిని లొంగ దీసుకొన్న ధీరుడు ,వీరుడు .”కప్పం చెల్లించను ”అని ఎదురు తిరిగి ,తన మాటే నేగ్గించుకొన్న ఆత్మాభి మాని .”దండెం గార్డెన్స్ ”అనే చోట ,ఫిరంగుల యుద్ధం జరిగింది .ఆ పేరు తోనే ఆ ప్రాంతాన్ని పిలుస్తారు .స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న మరో వీరుడు నూజివీడుకు చెందిన ”తానంకి యేసు రత్నం ”,”చలసాని రాజ గోపాల రావు లు .14 వ ఏట ‘లూధియానా కమిషన్ ”ను ఏది రించి న ధీరులు .బ్రిటిష్ సైనికులకు వ్యతి రేకం గా ,విజయ వాడ రైల్వే సెషన్ లో దూది బేళ్ళ మధ్య దాక్కొని ,,ఒక్క సారి గా బయట పడి ,వ్యతి రేక నినాదాలు చేసిన సాహస బాలుడు .అతన్ని కాల్చి చంప వద్దు అని సైనికులకు ”లూధియానా ”హెచ్చరిక చేసి నట్లు స్థానిక కధనం . .
1814 లో రామ చంద్ర అప్పా రావు మరణించారు .ఆయన కుమారుడే శోభనాద్రి అప్పా రావు .1830 లో పసి తనం లోనే నూజివీడు ప్రభువు అయారు .ఈయనకు ఏడుగురు కొడుకులు .నారయ్య ,రంగయ్య ,వెంకట జగన్నాధ ,వెంకట నర సింహ ,వెంకటాద్రి సింహాద్రి ,వెంకట రామయ్య లు .వీరి లో వీరికి వ్యాజ్యాలు నడి చాయి .ప్రీవీ కౌన్సిల్ దాకా పోయారు .1871 లో,నూజివీడు సంస్థానం ఆరు వాటాలు అయింది .నారయకు వెంట్ర ప్రగడ ,రంగయ్యకు ఉయ్యూరు ,వెంకట నర సింహానికి ,మీర్జా పురం ,వెంకటాద్రి కి కపిలేశ్వర పురం ,సింహాద్రికి తేల ప్రోలు ,వెంకట రామయ్య కు మేడూరు ఎస్టేట్లు దక్కాయి .వెంట్ర ప్రగడ చీలి ,గన్నవరం ముసునూరు ,వెంట్ర ప్రగడ జమీ లు గా మారింది .గన్నవరం వరద రాజ యా రావు కు వెళ్ళింది .
 ఉయ్యూరు రాజా
ఉయ్యూరు రాజా గా మేకా రంగయ్యప్పా రావు గారు  నూజివీడు కేంద్రం గా చక్కగా పరి పాలించారు .1906 లో ఈయనకు ”రాజా ”బిరుదు వచ్చింది .ఈయన కుమార్తె లక్ష్మీ వెంకయ్యమ్మ ను ,నరస రావు పేట జమీందారు కు ఇచ్చి వివాహం చేశారు .రంగయ్యప్పా రావు గారి దత్త పుత్రుడు వెంకటాద్రి అప్పా రావు .వీరి పై జాతీయోద్యమ ప్రభావం బాగా పడింది .మహాత్మా గాంధీ ని నూజివీడు ఆహ్వానించి ,,జమీందారి బట్టలు వది లేసి ,ఖద్దరు ధరించి ,గాంధీజీ కి స్వాగతం పలికిన సంస్కారి .స్వాతంత్రోద్యమానికి నిధులు సేకరించి సమర్పించిన దేశ భక్తుడు .వీరి కుమారుడే ”కుమార రాజా ‘అని పిలువ బడే రాజా రంగయ్యప్పా రావు బహద్దర్ .1894 లో జన్మించారు .తండ్రి తరు వాత రాజ్య పాలన చేశారు .సంస్కృతాంధ్రాలలో మహా గొప్ప పండితుడు .ఆంద్ర  రాష్ట్ర మంత్రి వర్గం లో చేరి విద్యా శాఖా మాత్యులు గా ఎన లేని కృషి చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయ వైస్ చాన్సెలర్ గా వ్యవహరించారు .
ఈ విధం గా మేకా వారి వంశం తర తరాలుగా అభివృద్ధి చెంది ,పాలనకు ,వదాన్యతకు పౌరుషానికి ,విద్వత్తు కు ,నిలయమైంది .ఎందరో కవి పండితులకు ఆలవాలం నూజి వీడు సంస్థానం .నూజివీడు ”వీణలు ”తయారు  చేసే ముఖ్య కేంద్రం .నాణ్య మైన వీణలకు నూజివీడు ప్రసిద్ధి .మిగిలిన సంస్థానాల కంటే ఇక్కడే సాహిత్య పోషణ ,కళా పోషణ ఎక్కువ గా జరిగింది .మంచి సంస్కారం తో నూజివీడు జమీందార్లు ప్రజాభి మానాన్ని పొందారు .ప్రజల హృదయం లో సుస్తిర స్తానం సంపాదించు కొన్నారు .
నుజి వీడు సంస్థానం లో జరిగిన కళా సాహిత్య సేవ గురించి తరు వాత తెలియ జేస్తాను

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -02 -12 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.