ఊసుల్లో ఉయ్యూరు –20 ఉయ్యూరు సంస్థానం –3

  ఊసుల్లో ఉయ్యూరు –20

                                       ఉయ్యూరు సంస్థానం –3

ఉయ్యూరు  ఇప్పటికి నూజివీడు రెవిన్యు డివిజన్  లోనే వుంది .కనుక నుజి వీడు   సంస్థానం చరిత్ర తో ఉయ్యూరు కు మొదటి నుంచి అనుబంధం ఉన్నట్లే .అక్కడి సాహితీ ,కళా వికాసం అంతా దీనితో పెన వేసు కోని వుంది .అందుకని అక్కడి సాహితీ సేవ గురించి ఇప్పుడు తెలియ జేస్తాను .
నూజివీడు జమీందార్లు కృతి భర్తలే  కాక ,కృతి కర్తలు కూడా .కళా సాహిత్యం సంగీతాలను విశేషం గా ఆద రించారు .నూజివీడు కవులు గా కుమార  ధూర్జటి ,ఆణి వీళ్ళ వెంకట శాస్త్రి ,నారాయణ శాస్త్రి ,దిట్టకవి రాజమ యోగి ,రామ చంద్ర కవి ,మాడ భూషి నర సింహా చార్యులు ,వెంకటా చార్యులు ప్రసిద్ధులు .బుక్క పట్నం రాఘ వా చార్యులు ,తిరుపతి వెంకట కవులు ,కాశీ కృష్ణా చార్యులు ,చిలక మర్తి వారు ,మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గార్లు ,నూజివీడు లో సన్మానం   పొందారు .
 కుమార ధూర్జటి ”ఇందుమతీ పరిణయం ”,రాసి నృసింహ అప్పా రావు బహదూర్ కు అంకితం ఇచ్చాడు .చిన్న వయసు లోనే రాసిన కావ్యం అది .దీనికే ”పిల్ల వసు చరిత్ర ”అని పేరు .చిత్ర ,బంధ కవిత్వం తో బాగా వుంటుంది .నారయ్యప్పా రావు సోదరులు దీన్ని ప్రచు రించారు .తిరు పతి కవులు ఉత్తమ మైన ఉపోద్ఘాతం రాసి  పరిష్క రించారు .కాకర పర్తి వాసి ,ఆని వెళ్ళ వెంకట శాస్త్రి ”అప్పా రాయ యషస్చంద్రీయం ”అనే అలంకార శాస్త్రాన్ని రాసి ,నరసింహ అప్పా రావు గారికే అంకితమిచ్చారు .మెచ్చిన కృతి భర్త ,కృతి కర్తకు 1745 లో ”వల్లూరు మల్లి ”అగ్ర హారాన్ని రాసి ఇచ్చారు .వెంకట శాస్త్రి ”అలంకార సుధా సింధు ”,”మహేశ్వర మహాత్మ్యం ”,రుక్మిణీ పరిణయం ,భాస్కర ప్రశస్తి   మొద లైన వి రాశారు .ఈ యన కుమారుడే నారాయణ శాస్త్రి ;;సాహిత్య కల్ప ద్రుమం ”రాశాడు .
నారాయణ అప్ప రావు గారి ఆస్థాన కవి దిట్ట కవి రామ యోగి .ఇంటి పేరు లో నే దిట్ట మైన కవి గా ఉన్నపండిత కవి .కంచికి వెళ్లి ,అక్కడి మహా పండితులతో ,వ్యాకరణం లో పోటీ పడి ,గెలిచి ,సన్మానం పొందిన వైయాకరనుడు .అనేక సంస్కృత గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాశాడు .ఇవేవీ దొరకటం లేవు .జమీందార్ మీద చెప్పిన చాటువులు మాత్రం ప్రచారం లో వున్నాయి .రుక్మిణీ పతి శతకం మాత్రం ముద్రిత మైంది .ఆస్థాన పౌరాణికులు కూడా వుండే వారు .రామ యోగి కి బంధువు దిట్ట కవి రామ చంద్ర కవి శాపానుగ్రహ సమర్ధుడు .
”దిట్ట కవి రామ చంద్రుడు -దిట్టిన ,రాయైన బగులు -దీవించిన బెట్టిన చిగురు వేట్టును -గట్టిగ -దోల్లింటి ,భీమ కవి కా బోలున్ ”అన్న చాటువు వల్ల   ఆయన శక్తి ఏమిటో తెలుస్తోంది .ఈయనే గొట్టు ముక్కాలా రాజ గోపాల శతకం ,మహిషాసుర మర్దినీ శతకం ,రఘు కుల తిలక శతకం ,హేలావతీ దండకం  రాశాడు .వుయ్యూరు  దగ్గర లోని పేద మద్దాలి గ్రామం లో కొంత కాలం వున్నాడు .పుట్టింది నంది గామ దగ్గర గొట్టు ముక్కల .ఉద్దండ రాయ శతకంకూడా  రాశాడు .
మాడ భూషి నర సింహా చార్యులు గారు ఆగిరి పల్లి శోభనా చాల నర సింహ స్వామి కి అంకితం గా ”మదన గోపాల చరిత్ర ”కావ్యం  రాశారు .”వల్లకీ పల్ల వోల్లాసం ”అనే ప్రబందాన్నీ రాశారు .
గాంగేయ సూరి అనే కవి శోభ నాద్రి అప్పా రావు గారి సమ కాలీనుడు .అసలు పేరుగాన్గేస్శ్వరేశ్వర   సూరి .”సాత్రాజితీయం ”అనే సంస్కృత చంపూ ప్రబంధం రాశాడు .
మాడ భూషి వెంకటా చార్యులు అనే మహా విద్వాంస కవి కి ”అభినవ పండిత రాయలు ”అనే బిరుదు వుంది .1835 -95 నాటి వాడు .తెలుగు లో ”అవధాన విద్యకుఆద్యుడు ”.అనేక రాజ ఆస్థానాలు సందర్శించి ,ఆశు కవిత్వం తోమెప్పింఛి  ఘన సత్కారాలు అందుకొన్నారు .నారయ్యప్పా రావు బహద్దూర్ గారి ఆస్థాన కవి .రాజు గారి అధ్యక్షతన ,నరస రావు పేట ,పిథా(PITHAA PURAM ) పురం జమీందారుల సమక్షం లో ,ఆస్థాన విద్వత్ కవులందరూ కొలువై వుండగా ,వీరు ”శతావ దానం ”చేసి చరిత్ర సృష్టించారు .తెలుగు తోలి శతావ దాని గా గణన కెక్కారు ఆద్భుత మైన ,ఆ శతావధాన ,ఆశు కవిత్వానికి మెచ్చి ,”స్వర్ణ కవచం ”,పండిత శాలువా ,1116 రూపాయలు బహూక రించి,జమీందారు గారు వీరిని సత్క రించారు .ఆ సమయం లోనే పితా పురం రాజా రావు వెంకట మహీ పతి గంగా ధర రామా రావు గారు వీరికి ”అభినవ పండిత రాయలు ”అనే బిరుదును కర తాల ధ్వనుల మధ్య ప్రదానం చేశారు .కవి గారు -భారతాభ్యుదయం ,పుష్ప బాణ విలాసం ,రామా వధూటీ తారా వళీ గ్రంధాలు రాశారు .మాడ భూషి వారి ఆశు కవిత్వ పంధానే ,తామూ అనుసరిమ్చాము అని తిరుపతి కవులు చెప్పు కొన్నారు .మొదట ఒక పాదం చెప్పటం ,ఆవర్తనం ఆవ గానే రెండో పాదం చెప్పటం ,తరు వాత మూడో పాదం పూరించటం అని శతావ దాని వేలూరి శివ రామ శాస్త్రి గారు గుర్తు చేసు కొని ,ఆచార్యుల వారి కవితా ధారా   చాలా శుద్ధ మైనదని ,అపార మైనదని ప్రశంశించారు .షట్ దర్శనాలను , అవ లోడనం  చేశారు .విశిష్టా ద్వైతి అయినా  ,ద్వైతా అద్వైతాలలో అపార పాండిత్యం ఉన్న వారు ఆచార్యులు .”శత దూషిని ”మీద ఖండనం చెప్పిన మేధావి .ఏక సంతా గ్రాహి ”మాడ భూషికి నిది తోడి వేద మయ్యే ,తిరు పతి కవుల జేరే ”అని తిరుపతి కవులు మాడ భూషి వారి వైదుష్యాన్ని   మెచ్చు కొన్నారు ”.మాడ భూషి వారి కి  ఉన్న పాండిత్యం  తిరు పతి కవు లకు లేదు” అని పండిత లోకం అంటుంది .చాలా సంవత్స రాల తరు వాతఅంటే ప్రబంధ యుగం తర్వాతా  మళ్ళీ శతావ దాన ప్రక్రియ ను వెలుగు లోకి తెచ్చి ,మిగిలిన అవధానులకు మార్గ దర్శకులు అయారు మాఢ భూషి వెంకటా చార్యుల వారు .
 బుక్క పట్నం రాఘ వా చార్యులు గారు -1880 ప్రాంతం వారు .సంస్కృత ,ఆంద్ర ”ఆంగ్లం ”లలో అవధానాలు చేసిన ఆశుకవి .ఆంగ్లం లో అవధానం చేసిన  మొదటి అవధాని గా పేరు పొందారు .కువలయాశ్వ చరిత్ర ,అనే ప్రబంధం రాశారు .ఆంద్ర దేశ చరిత్ర రాశారు .
ఇప్పటి వరకు నూజివీడు అసంస్తాన కృతి కర్తల గురిచి తెలుసు కొన్నాం .ఇప్పుడు జమీందారులు చేస్సిన సాహితీ కృషి గురించి తెలుసు కొందాం .
 రాజా రంగయ్యప్పా రావు –సంస్కృతాంధ్ర ,పార శీక భాష లలో గొప్ప పాండిత్యం ఉన్న వారు .”షానామా ”అనే పారశీక కావ్యాని తెనిగించారు .”పారశీక ధరా దీశ చరిత్ర ”అనే చారిత్రిక కావ్యాన్ని ,లక్ష్మణా చార్యుల చే రాయించారు .ఆస్థాన విద్వాంసు లైన గోపాల కృష్ణా చార్యుల తో ”శోభనాద్రీశ్వర వైభవం ”అనే సంస్కృత చంపూ ప్రబంధ రచన చేయించారు .ఇది రామాయణా త్మక మైనది . అముద్రితం గా ఎన్నో గ్రంధాలను వెలుగు లోకి తెచ్చిన ఘనత వీరిది .నిత్య సాహితీ పోషకులు .ఆస్థాన విద్వాంసు లైన నల్లాన్ చక్ర వర్తుల సంపత్కుమార లక్ష్మీ నర సింహా చార్యులు వివిధ సందర్భాలలో పూరించిన ”సమస్యా పూరణ పద్యాలను ”ముద్రించారు .చర్ల భాష్య కార శాస్త్రి ”మేకాదీశ  శబ్దార్ధ  శత కోటి ”అనే సంస్కృత కృతి రచించారు .ఈ జమీందారు గారి కాలం లోనే విజయ వాడ లో రాజా రంగయ్యప్పా రావు, చుండూరు వెంకట రెడ్డి కళా శాల ఏర్పడింది .ఇదే  S.R.R.ANDC.V.R.COLLEGE గా ప్రసిద్ధమైంది .
 రాజా  వెంకటాద్రి అప్పా రావు బహద్దర్ —రాజా రంగయ్యప్పా రావు గారి దత్త పుత్రుడే వెంకటాద్రి అప్పా రావు .కావ్య ,సాహిత్య కళ లలో నిష్ణాతులు .కళా పోషణ చేసిన సరస హృదయులు .1927 లో కాకి నాడ లో జరి గిన ”ఆంద్ర సారస్వత పరిషత్ ”సభ కు అధ్యక్షత వహించారు .రామ దాసు ,జ్యోతిర్లీల ,గోవర్ధనోద్ధారణం ,నాట కాలు రాశారు .ఆంద్ర గీత గోవిందం ,ఆంధ్రాష్ట పదులు శోభనా చల మహాత్మ్యం కావ్యాలు రాశారు .”జ్యోతిర్లీల ”అనే అయిదు  అంకాల నాటకం రాశారు .కృతి కర్త పేరు లేకుండా ,పూర్వ కావ్య స్తుతి చేశి కొత్త దారి తొక్కారు .  .జ్యోతిష్ శాస్త్ర విషయాలను దృశ్య మానం చేసిన నాటకం ఇది .త్రిభంగి ,ధ్వని ,చంద్ర వర్మ ,నారి ,స్త్రీ ,శ్రీ ,మ్రుణీ ,పంక్తి ,సామాని మొద లైన ” అప్పూర్వ  వృత్త పద్యాలు ”రాశారు తిరుపతి కవులు వీరిని దర్శించి ,సత్కారం పొందారు .”నానా రాజ సందర్శనం ”లో ఈ జంట కవులు రాజా గారి రాజ రికాన్ని  రమ ణీయం నీయం గా వర్ణించారు .. ,
నారయ్యప్పా రావు గారు శనివారప్పేట జమీందారు .తిరుపతి కవులను పిలి పించి సత్కరించిన సంస్కారి .
రామ చంద్ర అప్పా రావు –ముసునూరు పాలకులు .సంస్కృతాంధ్ర పారశీక భాషల్లో లోతైన పాండిత్యం ఉన్న వారు .కాశీ కృష్ణా చార్యులు ,తిరు పతి కవులు ,విశ్వ నాద సత్య నారాయణ వంటి లబ్ధ ప్రతిష్టు లైన కవి పండితులను ఆహ్వానించి కవితా గోస్ష్టులు నిర్వ హించి ,సత్క రించే వారు .కవులకు వార్షికాలు అంద జేశారు .వీరు మరణించినపుదు  తిరు పతి కవులు చెప్పిన పద్యం గుండెలను పిండేసింది .వీరికే విశ్వ నాద ”అనార్కలి ‘నాటకం అంకితం   ఇచ్చారు .
 వీరి కుమారులు సింహాద్రి అప్పా రావు ,రాజ గోపాల అప్పా రావుబహాద్దర్లు   కవి పోషకులే .”ప్రతిజ్ఞా శాంత నవం ”మొద లైన కృతులు వీరి కాలం లోనే వెలువడి నాయి .వీరు ధర్మ అప్పా రావు గారి వంశీకులు అయి ,వంశ గౌర వాన్ని కాపా డారు .
  రాజా రంగయ్యప్పా రావు బహద్దర్ (ఏం .ఆర్ .అప్పా రావు )—వుయ్యూరు కుమారా రాజా గా ప్రసిద్ధులు .పేదల పాటి పెన్నిధి .ఏం.ఆర్ అని అందరు ఆప్యాయం గా పిలిచే వారు .1915 మార్చ్ 21 న రాజా మేకా వెంకటాద్రి అప్పా రావు ,రాణి రామాయమ్మా రావు దంపతులకు జన్మించారు .నూజివీడు లో ఉన్నత విద్య పూర్తి చేసి ,మద్రాస్ ,మచిలీ పట్నా లలో కాలేజి విద్య నేర్చారు .వేలాది ఏక రాలను దాన చేసిన వితరణ శీలి .వీరిని పేదలు ఆత్మ బంధువు గా కొలుస్తారు .1950 నుండి 1978  వరకు 28 సంవత్స రాలురాష్ట్ర శాసన సభకు ఎన్నిక అవతు ,తన ప్రజాభిమానాన్ని నిరూపించు కొన్నారు .రహదార్లు ,మంచినీటి సౌకర్యాలు కల్గించారు .1974 -80 ల మధ్య  రెండు సార్లు ఆంద్ర విశ్వ విద్యాలయం కు ఉపాధ్యక్షులు గా పని చేశారు .శ్రీ కాకుళం ,కాకినాడ ,నూజివీడు లలో ఫై.జి.సెంటర్లు ఆయన కృషి వల్లనే ఏర్పడ్డాయి .1937 లో తండ్రి తో కలిసి ,విజయ వాడ లో ఎస్.ఆర్.ఆర్ కాలేజి ని ,1966 లో నూజివీడు లో  ధర్మ అప్పా రావు కళాశాల ను స్థాపించారు .1976 లో ఫై.జి.కేంద్రం తెప్పించారు .
ఏం.ఆర్.మంచి పుస్తక ప్రియులు .స్వత హాగా రచయిత .తెలుగు ,ఇంగ్లీష్ లలో గొప్ప రచనలు చేశారు .”ఉమర్ ఖయ్యాం ”ను తెని గించారు . వారు రాసిన ‘‘dEMOCRATIC SOCIALISM ” ,”ఆంధ్రుల చరిత్ర ”అనే పుస్తకాలు రెఫెరెన్స్ పుస్తకాలుగా మంచి పేరు పొందాయి .’ జయదేవ మహా కవి రచించిన ”గీత గోవిందం ”ను ఆంగ్లం లోకి అనువ దించారు .
RURAL  DEVELOPMENT OF ADULT EDUCATION ”రచించారు .ఆయన మంచి టెన్నిస్ క్రీడా కారులు .ఫుట్ బాల్ ఆట బాగా ఇష్టం .ఎన్నో రాజ కీయ ,ఆర్ధిక వ్యాసాలూ రాసి సమాజపు పోకడను చూపారు . రాష్ట్ర స్థాయి  ఎడ్ల పందాలు ,చెడు గుడు పోటీలు నూజివీడు లో సమర్ధ వంతం గా  నిర్వ హించారు .వీటితో నూజివీడు కు మంచి  పేరు వచ్చింది .”కీర్తి తప్ప సర్వస్వం దానం చేసి ,అల నాటి దధీచి సరసన నిలిచారు ”అని ఏం .ఆర్.గురించి అందరు చెప్పు కుంటారు .ప్రజల మనిషి .ప్రజలే బంధువులు ఆయనకు . జమీ లోని అందర్నీగుర్తుంచుకొని  ఆత్మీయం గా   పలకరించి,అభిమానం పొందిన మహాను భావుడు మా వుయ్యూరు కుమారా రాజా .పార్ధివ శరీరాన్ని 31 -01 -2003 లో వదిలి శాశ్వ తం గా దూర మయినా వారి స్మ్రుతిప్రజల మనసులో చెరిగి పోలేదు .
వెంకట రామా చార్యులు రాసిన ”అనార్కలి ”పద్య కృతిని ,ఎర్రోజు మాధ వాచార్యులు రచించిన ”మాఘ వలయం ”కృతులను అందుకొన్న కృతి భర్త ఏం,ఆర్. ”
వుయ్యూరు గ్రామ లో రాజా శోభనాద్రి అప్పా రావు వేణు గోపాల స్వామి ,పంచ పట్టాభి రామ స్వామి ఆలయాలకు (విష్ణాలయం ) ఈనాములు ఇచ్చి పోషించారు .ఈ ఆలయం శ్రీ కృష్ణ దేవ రాయల నాటికి ముందే వున్నట్లు తెలుస్తోంది .ఇక్కడ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి ఆలయం 12 వ శతాబ్ది లోనూజివీడు రాజ వంశీకులు కట్టించారు .రాజా వెంకటాద్రి అప్పా రావు గారు ఈనాము భూము లిచ్చి పోషించారు .ఇప్పటికీ ఈ రెండు దేవాలయాలలో విప్పర్ల గోత్రోద్భావు లైన మేకా వారి పేరు తోనే ప్రధమ అర్చన జరుగు తుంది .
ఇంతటి తో వుయ్యూరు సంస్థానం కధ సమాప్తం .
వీలు ని బట్టి మిగిలిన” కృష్ణా జిల్లా సంస్థానాల చరిత్ర” ను మీకు తరువాత అంద జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.