శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –4

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు 

                                           జ్ఞాపకాల దొంతర మల్లెలు –4

—          ”తెలుగులో కవిత్వం చెయ్య కూడదని ,అది అప్రతిష్టాకరం అని ,పతనం అనీ ”మీ వాళ్ల నమ్మకాన్ని ,ఎంత కమ్మగా వమ్ము చేశారండీ తరువాత్తరు వాత .ఇంగ్లీష్ ను భాష గా గుర్తించిన వారు ,”తెలుగు మాత్రం కాదు ”అన్న అపోహను ,ఎంత గొప్పగా తొలగించారండీ !ఈ నిరసన భావం మీలో ప్రతీకారం గా మారి ,వైదికాచారాల పట్ల వైముఖ్యం కల్గించా టమే  కాదు ,చివరికి సంధ్యా వందనానికీ ”వందనం -అంటే గుడ్బై చెప్పేసింది  ”అని నిర్మోహ మాటం గా చెప్పేశారు .ఆ తరువాత బాధ పడి పోయారు ఉత్తర కాలాన .పశ్చాత్తాపానికి మించిన్చిన్దేముంది అన్న గారూ !నిజ్హం గా మిమ్మల్ని అన్నగారు అనే సంబోదిస్తున్నాను .మా అన్న గారు లక్ష్మీ నరసింహ శర్మ గారు నా 27 వ ఏట పరమ పదించారు .ఇంగ్లీష్ మాట్లాడటం లో ,రాయటం లో ఇంగ్లీష్ పుస్తకాలను మంచినీళ్ళ ప్రవాహం గా చదివి పారేయటం లో, కొని దాచటం లో ఆయనకు ఆయనే సాటి ..అందులో కొన్ని నా దగ్గర ఇప్పటికీ దాచుకోన్నవి వున్నాయి .అందులో మాక్సిం గోర్కి జీవిత చరిత్ర ముఖ్యం గా నేను చదివాను .ఆ నాటి మా అన్న గారి సహ పాటకులు ఎవరికీ ,అంతటి ఆంగ్ల పరిజ్ఞానం వుండేది కాదని ,వారి మిత్రులే నాకు చెప్పే వారు .ఆయన తాడంకి స్కూల్ విద్యార్ధి .అక్కడి ఆంగ్ల వ్యాస ,వక్క్ర్తుత్వ పోటీల్లో ఎప్పుడు ఆయనదే ప్రధమ బహుమతి అని చెప్పారు హోస్పేట లో రైల్ వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ హటాత్తు  గా     గుండె పోటు తో 1957 లో మర ణించారు . .నాకు ,నా మిత్రులకు ,మా తోమ్మదవ తరగతి లో గాంధీ గారిపై సి ఎఫ్.ఆండ్రూస్ రాసిన ఆంగ్ల పాఠం బోధించటం ఇంకా నేను గుర్తుంచుకోన్నాను .అందులో” స్మోకింగ్ ను బాడ్ హాబిట్ గా” చెప్పిన మాటలు చెబుతూ సిగ్గు పడి పోయారు మా అన్న గారు .కారణం తాను చైన్ స్మోకేర్ అవటమే .మేమూ ఆ పాఠం వింటూ ముసి ముసినవ్వులు   నవ్వుకొనే వాళ్ళం .అసలు ఆ పాఠం ఆయనతో చెప్పించటం  నా గడుసు ప్రయత్నమే .ఆ ఘట్టం ఇంకా కళ్ళ ముందు దృశ్యమానం అవుతోంది . .
”ఘోషాల వల్ల స్త్రీకి పర పురుష ప్రీతి పెరిగి నట్లు ”మీకూ ,మీ వాళ్ల నిర్బంధం అనే ఘోషా వల్ల ”తెలుగు పురుషోత్తమ కాంక్ష ”పెరిగింది .అక్కడ స్వైర వృత్తి అయితె ,ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం .ధన్య జీవులండీ !మీ తెలుగు ”వీర పూజ ”సద్యోఫలితాన్నిచ్చి ,మీకు ఊరట కల్గించింది .”ప్రచ్చన్న బ్రహ్మ సమాజి కుంణీ అయి పోయాను ”అని మీరు బాధ పడి పోయారు .మీ వాళ్ల తీరు తెన్నూ చూసి విసిగి పోయి మీ దారి మీరు చూసుకున్నారు .మీరేం చేస్తారు అంతా కాల ప్రభావం ,కర్మ ఫలితమూను ..
మీ పిత్రువంశాన్ని ఎంత ఘనం గా పొగిడి ,పొగడ పూజ చేశారండీ అన్న గారూ !మీ పితామహులు ”శివ రామ సిద్ధాంతి దీక్షితులు ”గారు ,యజ్ఞం చేయక పోయినా ,”రాజర్షి ”గా ప్రసిద్ధులు .మేధా దక్షిణా మూర్తిఉపాసకులు .మీ కుటుంబానికి వచ్చిన ప్రజ్న అంతా ,ఆ ఉపాసనా ఫలిత్సమే .మీ మేధా ,ప్రజ్ఞకు అదే కారణం .అదే మీకు ఆగ్రహాల పెట్టు .మీ తండ్రి గారు లక్ష్మీ పతి సోమయాజులు గారు ”వేదం ఆశీతిద్వాయము ,శ్రౌతం ,కాండ త్రయం ,జ్యోతిషం స్కంద త్రయం క్షుణ్ణం గా అభ్యసించిన పుణ్యులు .స్మార్తం లో ఆపస్తంభులే.ధర్మ శాస్త్ర పారంగతులు కూడా .మంత్ర శాస్త్రం లో ”పాడుకాంత దీక్షా పరులు ”మీదు మిక్కిలి దక్షిణా మూర్తి ధ్యాన మూర్తి కూడా . .
అదీ మీకు కల్ప వృక్షమే అయింది .,కామదేనువూయింది .ఏది నేర్చినా ”ఇతిశ్రీ ”గా నేర్చి ,అవలోడనం చేశారు .”సంగ్రహీనా వసీదతి ”తత్వజ్ఞులు .సభల్లో సింహ సద్రుశులు .మరి ఆ సింహం కదుపున పిల్లి పిల్ల ఎలా పుడుతున్దండీ .అందుకే కిషోర ప్రాయం నుంచే తాము ”యువ కిశోరాలు ”అయి విజ్రుమ్భించారు .ఆ” జీన్” అలాంటిది .కుల విద్యలన్నీ మీకు దాదాపు అబ్బినా ,ఎవరు తొక్కని మార్గాలు తొక్కి ,కొత్త దార్లు వేసి ,మార్గ దర్శకులని పించుకునారు .అదే మీ ప్రత్యేకత .ఆ ఠీవీ అబ్బిన వారు మీరు .”వైదికా చారాల మీద ఇప్పటికీ కొంత అశ్రద్ధ వుంది నిజమే .కాని ,వేదం వినడం మాత్రం పరమ ప్రీతీ ”అని నిండుగా చెప్పారు అన్న గారూ మీరు .అలాంటిదే నా ప్రవ్రుత్తీ కూడా.మా తండ్రి గారు మృత్యుంజయ శాస్త్రి గారు అపర శివావతారమే .మా తల్లి గారు సాక్షాత్తు ఆ ”భావానమ్మే ”.వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులే .వాగార్దాల్లా మెలిగిన పుణ్య జంట .విభూతి పెట్టు కొని ,పంచె కట్టు కట్టి ,మా నాన్న గారు వుంటే మాకు” శివానంద లహరే” .పచ్చని బంగారం లాంటి మా అమ్మగారు అన్న పూర్నా దేవే .సౌందర్య లహరే మాకు . వైదికం ఘనం గా నేర్చిన వారు మా తండ్రి గారు .శ్రౌత ,స్మార్తాలలో దిగ్దంతులని పేరు .వాటిల్లో ఏ తప్పు వచ్చినా ,సరి దిద్ద గలిగే ప్రతిభా ,పాండిత్యం ఉన్న వారు .సంస్కృత కావ్యాలనీ అధ్యనం చేశి పాతం చెప్పా గల సర్వ సమర్ధులు .మిత భాషి .ముక్కు మీద కోపం .ఇదీ చాల దన్నట్లు మద్రాస్ లో తెలుగు విద్వాన్ పట్టం సాధించారు .విద్వాన్ అంటే అక్షరాలా విద్వాంసులే .కృష్ణా జిల్లాలో మా నాన్న గారంతటి పాండిత్యం ఉన్న వారు లేరని మా కాలం లో చెప్పుకొనే వారు .ఆయన సహచరులే ఆ మాట చెప్పే వారు .ఆబ్దిక మంత్రాలను సుస్వరం గా చెప్పటం లో ఆరి తేరిన వారనీ ,ఆ భాగం నిష్ణాతులు ,మా ఇంటి పురోహితులు నాతొ చాలా సార్లుచెప్పారు . .మా నాన్న గారు వుంటే తామంతా ఒళ్లుదగ్గర పెట్టు కొని ఉండాల్సిందే నని అనే వారు .వేసవి సెలవుల్లో మాకు మా మిత్ర బృందానికి సంస్కృతం  నేర్పే వారు .శబ్ద మంజరి KANTHO పాఠం చెయ్యాల్సిందే .అందులో బాల రామాయణం బాగా  వచ్చు మాకు .ఆ తర్వాత కాళిదాసు గారి రఘు  వంశ ,కుమార సంభావ కావ్యాలు చెప్పారు .తప్పని సరిగా సంత వేయాల్సిందే .అలసత్వం పనికి రాదు .మర్నాడు అప్పగించాల్సిందే .వారి చూపు లోనే ”నియంత ”లక్షణం కని పించేది .ఎదుట పడి మాట్లాడ టానికె భయం .నాకు మరీని .
అనంతపురం జిల్లా హిందూ పురం లోని యి.సి.ఏం ..హై స్కూల్ లో22 ఏళ్ళు సేనియర్   తెలుగు పండితులు గా పని చేసి చేశారు .ఆ సర్వీసు తోనే ,కృష్ణా జిల్లా కు బదిలీ అయి ,జగ్గయ్య పేట ,వుయ్యూరు ఉన్నత పాథ శాలలో పని చేసి వుయ్యూరు లో నే పదవీ విరమణ చేశారు తెలుగు . పాఠం చెప్పటం లో అందె వేసిన చెయ్యి గా ప్రసిద్ధులు .ఎందరో కవులు ,విద్వాంసులు కవిత్వం రాసుకొని వచ్చి మా నాన్న గారితో సరి దిద్దిన్చుకొనే వారు .ఇదంతా జ్ఞాపకం వచ్చింది మీ  వంశ చరిత్ర చదువు తుంటే .అక్షర బద్ధం చెయ్య కుండా ఉండ లేక పోయాను .నేనూ ఉడతా భక్తీ ని ప్రకటించాలి అనే తపన వున్నా వాణ్ని .నాకూ  మీ లాగే కొత్త దనం ఇష్టమే .కొత్త పోకడలు ఇష్టమే ”.ఆధారం ఆర్షమై ,కొత్త నిర్మాణాలు చేయాలి” అన్నది నా ఉబలాటం .అందుకే మీ రచనలు అంటే అంత ఇష్టం .మీరంటే మరీ ఇష్టం .మీ పోకడ ఇష్టం .మీ మార్గం మరీ మరీ ఇష్టం .మీ నీతి నిజాయితీ లంటే చెప్పలేనంత ఇష్టం .మీ కవిత్వం ,మీ పాండిత్యం ,మీ ప్రతిబా త్రివేణీ సంగమమే. మీ అంతఃకరణ అందుకే అంత పవిత్రం .అలా వుండాలని నేనూ అనుకొనే వాడినే .కానీ వుంటున్నానా ?ఉండాలన్న ఆశ.మీ రచన  లపై మక్కువకు కారణం అయింది .మీ రచన లోని చదివించే శక్తి నన్ను అతిగా ఆకర్షించింది అన్నయ్య గారూ  !
సశేషం


మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -02 -12

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.