శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

 శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – 

                                        జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

పండిత దీవి గోపాలా చార్యుల  వారు మీ ముద్రిత ప్రతిని అందుకొన్నప్పుడు ,చదివి ”మీ రచన లో జీవం వుంది ,నన్ను యేడి పించింది ,కనుకనే తర్వాత నన్ను ఆనంద పెట్టింది ,శ్మశాన వాటిక లాంటి నవలలు ఇంకా రాయండి ”అని ఇచ్చిన ప్రోత్సాహం -మీకు గొప్ప ప్రేరణ గా నిలి చింది .ఆ నాటి ఆంద్ర దేశం లోని లబ్ధ ప్రతిష్టులైన రచయిత లందర్నీ తమరు దర్శించి ,వారి లోని మంచిని గ్రహించారు .ఎవర్నీ అనుసరించలేదు .మీ పంధా మీదే గా ఒంటరి పయనం సాగించారు .
అయితె అన్న గారూ !మా వడిన ”సీతమ్మ ”గారి గురించి సకృత్తు గా మాత్రమే తెలియ జేశారు .ఆమె మీకు అర్ధాంగి ,సహధర్మ చారిని .మీ కష్టాల నన్నిటినీ భరించి వెన్ను తట్టిన స్త్రీ రాజం .ఉత్తమా ఇల్లాలు ,త్యాగ మూర్తి .పైగా ప్రేమించి పెళ్లి చేసుకొన్నా రాయెను .కాని ఏం మిగిలిందా యమ్మకు ?ఉమ్మడి కుటుంబం లో -ఆకులో ఆకునై అన్నాట్లు ఒదిగి పడి వుంది .ఆ  దొడ్డ ఇల్లాలి పెద్డా మనస్సు మీకు శ్రీ రామ రక్ష .సీతా  కస్టాలు ,పీత కస్టాలు అనుభవించిన భూ పుత్రిక ,.మూన్నాళ్ళ కో సారి  మీరు దేశాలు పట్టి తిరుగు తుంటే ,ఒంటరి గా ఇంట్లో యెంత వేదన అనుభావిన్సిందో ఆ తల్లి .బహుశా తన కష్ట  సుఖాలేవీ వీ మీకు నివేదిన్చుకోనేది కాదేమో మహా ఇల్లాలు .మీరు వూరు విడిచి వన వాసం చేస్తే ,సీతా దేవి లా మీ వెంట బడి ఆ క్లేశాలు అనుభ వించక పోయినా ఇంట్లోనే వన వాసం గడిపిన సీతమ్మ తల్లి ఆమె .ఎప్పుడైనా గుప్పెడు పూలు పట్టు కోని వెళ్లి ,ఒదిన గారి కొప్పున తురిమారా అన్న గారూ !మీ ”అనుభవాలు -జ్ఞాప కాలు ”లో ఆమె పాత్రను చాలా కుదించి పారేసి అన్యాయం చేశారేమో నని పించింది .మీరు ఒంటెత్తు పోకడలతో కొత్త మార్గాల్లో నిర్భయం గా సాంచ రిస్తుంటే కాదని వారించక పోవటం ఆమె సౌజన్యం కాదా .నెలల తరబడి ,ఆమెను ఒదిలేసి ,రికామీ గా తిరుగుతూ ,చడువంతు ,సంధ్య అంతు ,దేశ ద్రిమ్మరిగా ,బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించిన మీకు ఆమె ఎప్పుడు ఎదురు కూడా చెప్పి వుండరు .నిజం గా ఈ సంపుటాలన్నీ ఆ తేజో మూర్తికి ,ఆ త్యాగ మయికి అంకిత మిచ్చి వుండాల్సింది మీరు .ఆ దొడ్డ ఇల్లాలి అణకువకు ,త్యాగ మయ జీవితానికి జోహార్లు .తరువాత సంపుటాల్లో ఆమె గురించి వ్రాస్తారను కోవటం వృధా .ఇవి అర్ధంతరం గా ఆగి పోయాయి కదా .
”నెల కూలీ చాకిరీ ”కి ఒల్లని ,మీ స్వేచ్చా మనస్తత్వం ఆదర్శ ప్రాయమే కాని అందరు అలా ఉండ గలరా మహాను భావా !”పాతకునికీ ,ద్రష్టకీ రసాను బంధం కలిగించి ,తన సందేశం స్ఫుటం గా ,విని పించాలంటే నాటకమే శరణ్యం ”అన్న మీ మాట శిరో దార్యమే .అందుకే అభిజ్ఞాన శాకుంతలం ,కన్యా శుల్కం అంతా ప్రాభవం పొందాయి .”కలం పోటు ”నాటిక మీకు ఇష్టమైంది అని చెప్పు కొన్నారు .వార కాంత ,ప్రేమ పాశం ,నిగల బంధనం ,రాజ రాజు నాటకాలు రాసినా వేసినా అవి రంగస్థలం యెక్క లేదని మీ బాధ అర్ధం చేసుకోన్నాం .
”అత్త-అల్లుడు ”,అలం కృతి ,అభిసారిక ,బాలిక -తాత ,ఖండ కావ్య నిర్మాతలు మీరు .”మిధున రాగం ,ఇరువుర మొక్క చోటికే పోదాము ,అనేవి గ్రాంధికం గానే చేశారు .ఆ తర్వాత వచ్చిన మార్పే అసదృశం .వీర పూజ కూడా పాత బాటలోనే నడి చింది .అయితె శైలీ సౌభాగ్యం ,విలువ కలది .శ్మశాన వాటిక ,రక్షా బంధనం నవ లలు ప్రజల్లోకి చొచ్చుకు పోయాయి .సహజత్వానికి నిలు వెత్తు ఉదాహరణలు అవి .
”ప్రబుద్ధాంధ్ర ”పత్రిక ను గీర్వాణ ,ఆంద్ర భాషల్లో వెలువరించిన ఘన త మీది .మీ ఉద్దేశాలన్నీ ఖరా ఖండీ గా అందరికి చెప్పి ,అందర్నీ ఎది రించి తొమ్మిదేళ్ళు నడి పారు అంటే మీ సర్వ గ్రంధ రచనా ఒక ఎత్తు ,ఈ పత్రిక భారం ఒక ఎత్తు .
పద్యం రాశారు ,సంగీతం నేర్చారు ,నాటకం ఆడారు .స్త్రీ పురుష పాత్ర ధారణా చేశారు .మెప్పూ పొందారు .సంగీత సాహిత్య సభలు జరిపి ,కవులను ,కళా కారులను గౌర వించి ,ఆదర్శం గా నిలి చారు .
మీ ”చిన్న కధలు ”జాతి గర్వించ దగిన మిన్న యైన కధలు .తెనుగు దానానికి మచ్చు తునకలు .ఈగడ తారకల్ .పాత్రల మాటల్లో వ్యక్తుల తీరు భంగిమ స్పష్టం గా చూపించే నేర్పు అనన్య సామాన్యం .సజీవ చైతన్య శ్రవంతి మీ వాక్య విన్యాసం .విన్నాణమే .
స్నేహాన్ని మహా మేరువు గా అభి వర్ణించారు మీరు .పురి పండ అప్పల స్వామి  గారి తో ఈ స్నేహం చిరస్మర ణీయం .మీ చివరి ఉత్తరం లో ఆ ఆవేదన అంతా కురిపించే శారు .”నా కుటుంబం చెట్టు కింద వుంది ”అన్నారు . ఆ జాబులో .గుండెలు పిండేసే మాటే అది .ఎంత కుంగి పోయి అలా బయట పడ్డారో ?ఇంత చేసి ,ఇంత సాధించి చివరికి మిగిలిందేమిటి చిన్నబ్బాయి గారు !శ్రీ నాధుని మహా ప్రస్తానం జ్ఞాపకం వస్తుంది .”దివిజ కవి వరుల గుండియాల్ దిగ్గు రనగ ”అనట్లుంది మీ పరిస్తితి .ఆ వుత్తరం లోనే ”నా కేమీ విచారం లేదు నా భార్య నన్ననేక విధాల కాపాడింది .చిన్నప్పటి నుంచీ దాన్ని కష్ట పెట్టాను గాని సుఖ పెట్ట లేదు ఇప్పుడిక ఆ ఊసే లేదు కదా !”అని మీ బాధ వెళ్ళ గ్రక్కుకున్నారు .చేసిన అన్యాయాన్ని స్మరించుకొని ,పశ్చాత్తాపం తో ,ప్రాయశ్చిత్తం చేసు కొన్నారు .ఎంత హృదయ విదారక పరిస్థితి అండీ .ఏ రచయితకు ఆ స్థితి రా కూడదు .మీ స్థితికి సానుభూతి చూప టమేగా మేం చెయ్య గలిగింది .
1891 ఏప్రిల్ 23 న జన్మించి 25 -02 -1961   లో 70 వ ఏట  భువి నుంచి దివికి చేరారు తాత గారూ !.  !అవును -నేను నా మాతామఃహ , ,పితా మహులను చూడనే లేదు .ఆ తృప్తిని ఈ పిలుపు తో తీర్చు కున్నాను .అప్పుడే మీకు శాతాధికాయుస్సు వచ్చేసిందా ?తెలుగు కధకు అడ్డం గా ,నిలువునా విరాడ్రూపం కల్పించి ,విశ్వ కధా  విపంచి లో మూర్చనలు పల్కించిన మీరు ధన్యు లండీ .తెలుగు వెళ్ళు పాదుకు పోయిన అంతర్జాతీయ కధక చక్ర వర్తి ,కధా సార్వ భౌములును .అందుకే ఏ కధ కుడికి దక్కని ”కనకాభి షేకం ”తమరే దక్కించుకొన్నారు .జాతి ఋణం తీర్చుకొని ధన్య మైంది .
మీ అనుభవాలు జ్ఞాప కాలు వంటి విలక్షణ గ్రంధం ”భారతీయ భాష లో లేదు ”అని పూరి పండా వారు అన్నారంటే స్వభావోక్తే .”ఆ నాటి తెలుగు పల్లె తూళ్లలో జీవితము  ,ఆచారాలు ,శ్రౌతుల శోభ ,ఆ సంస్కృతి ,సర్వము రమణీయం గా దర్శింప జేశారు ””సత్య ప్రఖ్యాపన కు తార్కాణా  గా నిలిచిన ,సజీవ సాహిత్య సంపుటం ”అన్న ఏటుకూరి వారి మాట ,పుట్హం పెట్టిన బంగారు మూట ..కధగా ,కవిత్వం గా ,స్వీయ చరిత్ర గా ,సమకాలీన చరిత్ర గా ,తేదీలు లేని డైరీ గా ,బల్ పసందు గా మలచిన ,,పోహళించిన ,వచన చరితా కధా సరిత్సాగరం .మీ పుస్తకం .సరస్వతీ దేవికి హస్త భూషణం .తెలుగు వారికి శిరో భూషణం .
తెనుగు వచన రచనకు చేవ ,పదును తెచ్చింది మీరు ,మల్లాది రామ కృష్ణ శాస్త్రీ, చలంగార్లు .అందుకే నా ద్రుష్టి లో మీరు ”వచన రచయిత త్రయం ”అందులో మీది సర్వ స్వతంత్ర మైన గంగా ప్రవాహం .గౌతమీ దఘ్నం  .సప్త గోదావరుల పావిత్ర్యం .జన జీవ నానికినిత్యం ఉప యోగ పడే” సహకారం” .మీ వచన గమన వైఖరి లో ”రాయంచ నడకలు ”వున్నాయ్..
ఏ ముహూర్తాన మీ పేరు నా చెవిన పడిందో ,ఏ శుభ లగ్నం లో మీ రచన చదివానో ,ఏ శుభ వేళ ,మీ భావ జాలాన్ని ఔదల దాల్చానో ,అప్పటినుంచీ ,మనసులో ,హృదయపు లోతుల్లో ,బుద్ధి లో ,శుద్ధాంత రంగం లో అంతటా మీరే నిండి పోయారు అన్న గారూ !అందుకే ఈ చిరు కానుక .చదివి ,చదివి ,ఆర్ద్ర మైన గుండె తో అర్పిస్తున్న నివేదన .బ్రాహ్మీ మూర్తు లైన మీకు ఈ అక్షరాభి షేకం .అక్షర లక్షల కనకాభి షేకం .నా జన్మ  ధన్యం ,చరితార్ధం కావ టానికి చేసిన చిరు యత్నం .అంతర్ముఖు లైన మీరు నిండు మనసు తో  మీరు, మా ఒదిన గారుసీతమ్మ తల్లి అక్కడి నుంచే ఆశీర్వ దిస్తారని ఆశ .
”విశ్వామిత్ర ,అఘ మర్షణ ,కౌశిక త్రయార్శేయ ప్రవరాన్విత కౌశిక గోత్రోద్భావస్య శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిహ్ ,భ్రాత్రు వత్సలః ”ఇదం ప్రణామం .
ఈ వ్యాస పరంపరను శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారికి ,వారి శ్రీమతి  సీతమ్మ గారికి  ,భక్తి ప్రపత్తులతో అంకితం .
సర్వం సంపూర్ణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

  1. Anyagaami అంటున్నారు:

    గబ్బిట వారికి నమస్కారం. శ్రీపాదవారి గురించి ఎవరు వ్రాసినా చదివి మురిసిపోవటం నాకలవాటు. వారిని స్మరిస్తూ మీరు వ్రాసిన ఎనిమిది భాగాలు అద్భుతం. మీ మిగిలిన శీర్షికల్లో అనుకోలేదు కానీ, దీంట్లో మాత్రం టైపింగ్ దోషాలు కొంచెం ఇబ్బంది పెట్టాయి. దయచేసి మున్ముందు వీటిని దృష్టిలో ఉంచుకోవలిసిందిగా నా ప్రార్థన.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.