శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –జ్ఞాప కాల దొంతర మల్లెలు 5

  శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు —

                                  జ్ఞాప కాల దొంతర మల్లెలు –౫
 ఏలూరు లో వేద పండితులను ”పంతులు గారు ”సత్కరించిన సన్నివేశం నన్ను బాగా ఆకట్టు కుంది గురూగారూ !వింత సంబోధన కాదు .మీ లాంటి రహ్మన్యులను సంబోధించాల్సిన పద్ధ తే అది .నేను మీకు మానసిక అంతే వాసుణ్ణి .
వందల మంది ”వేద పండులు ”ఏలూరు వెళ్లి పంతులు గారికి కనిపించరు .కటిక నెల మీద కూర్చున్న పంతులు గారు ముగ్గు వంటి తలలతో ,మేడలో సూత్రం మాత్రమే వున్న ఆయన ఇల్లాలు ,-దరిద్రం లోను దాన ధర్మ వ్రుత్తి -తలో రూపాయి సంభావన .”చీర మడిచి ”అందరికి” రెడ్ కార్పెట్ ”వెల్కం చెప్పారా దంపతులు .”దయ చెయ్యండి ”అని దోసిలి ఒగ్గి ,ఆహ్వానిస్తున్నారు .చెమ్మగిలిన కళ్ళ తో అవధానులంతా ,మ్రాన్పడి పోయారు -ఆ వినయ విదేయతలకు అబ్బుర పడి .
మీ కంఠం ఒనికి ,కళ్ళు చెమ్మ గిల్లాయి అన్నారు .సహృదయులు ఎవరి కైనా అంతే .అప్పుడు మీ గురు దేవులు బ్రాహ్మణ్యాన్ని అంతటినీ ఆ దంపతులను ఆశీర్వ దించమని శాశించారు .”ముందు జన్మ లో పంతులు గారు దేవేంద్ర వైభవం అనుభవించాలి అ”అని నిండు మనసు తో ”ఎనభై శంఖాలు ఉరిమాయి .వేద మంత్ర స్మరణ తో .”ఉచ్చారణ తో .ప్రాకృత వాతావరణం  దాటి పోయారు అవధాను లందరూ .సామ గానం మీరు చేస్తుంటే ,ఎనభై వీనేలు ఒక్క మాటుగా పలికాయి .సామగానం తో ఆకశం ముఖరితమైంది .”యెంత గొప్ప వర్ణన అండీ .కవులు ,పండితులు ,వేద విశారదులు ,విద్వాంసులు ,సంగీతా శాస్త్ర పారంగతులు అయిన మీరు మీరు మాత్రమే చూప గల భావ చిత్రం అది .విచిత్రం అది .భళారే చిత్రం .ఈ ఘట్టం నాకుసంతత ధారా పాతాన్నితెస్తోంది నా నయన అభ్రాల నుండి .చిత్తం నిశ్చలమైంది . భావోద్వేగం  కుదిపేసింది .”ఆ రాజర్షి దంపతులు ”మీరు వెళ్లి పోయే వరకు అలానే దోసిలి ఒగ్గి నిలబడే ,మోకరించే వున్నారు .ఈ మాట చదివి చలించి పోని హృదయం వుండదు గాక ఉండదు .ఎంతటి రస బంధురం గా గుండెల లోని తేమను బయటికి రప్పించేట్లు చెప్పా రండీ .ఎంతటి ఉదాత్తత ను   ఆపాదిన్చారండీ ..దాత .ప్రతి గ్రహీత  పూర్తీ గా ధన్యులైన సన్ని వేషం ఇది .పవిత్ర దృశ్యం .అసదృశం .
ఇలాగే మా ఇంటికీ వేద విద్వాంశులు వస్తూందే వారు అన్న గారూ !నాన్న గారు వారి విద్వత్ ను పరీక్షించి ,తగిన బహుమానమిచ్చి సత్కరించే వారు .వారు వచ్చి చదివిన వేద పనస లను విని నాకు కొంత ఆ ధోరణి పట్టు బడింది .అందులో కొంత కృషీ చేయ గలిగాను .అప్పటి నుంచి ,ఇప్పటి వరకు అలా సంభావన ఇస్తూనే వున్నాను .నాన్న గారు చూపిన మార్గం అది .అమ్మ కు కూడా వేదం అంటే విపరీత మైన ఆసక్తి .నాన్న గారి మరణం తర్వాతా అమ్మే ,ఆ వచ్చిన వారి సామర్ధ్యాలను గుర్తించి ,బేరీజు వేసి ,నాతో తగినంత ఇప్పించేది .ఇది అనూచానం గా వస్తూనే వుంది ఇప్పటివరకు .ఆమె కూడా గతించిన   తర్వాతా నేనే ,నా బుద్ధికి తోచినట్లు సమర్పిస్తున్నాను .వచ్చిన వారు వేదోక్తం గా ఆశీస్సులు అండ జేస్తూనే వున్నారు .ఇదో తృప్తి అన్న గారూ !
”నాట కాంతం కవిత్వం ”అన్న ఆలంకారికుల మాటనే వ్యత్యస్తం చేశారు మీరు తాత గారూ !అవును అసలు తాతయ్య ఎలా ఉంటాడో తెలీని వాణ్ని .ఆ బుల పాతం కూడా ఇలా తీర్చు కుంటున్నాను .”నాటకాద్యం  కవిత్వం ”గా మార్చేసి .మళ్ళీ మార్గ దర్శనం చేశారు .
”గ్రంధాలు చదివి భాష నేర్చాను .స్త్రీలనాశ్రయించి ,నేర్చుకున్నాన్నేను తెలుగు భాష .ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీ ల వల్లనే అలవడింది నాకు .చదివింది పద్య వాగ్మయం అయినా ,రచిస్తోంది వచన వాగ్మయం .స్త్రీల భాష లో మాధుర్యం హృదయాలను పట్టి వేసే జాతీయతా కనబడింది నాకు ”అని ,మిమ్మల్ని ప్రబోధ పరచిన స్త్రీ మూర్తుల కు ఘన మైన నివాళులు  అంద జేశారుమీరు . ”కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసింది కాళికా దేవి .అలాగే ,నా చెవిలో ,ఆ మాత్రు దేవతల బీజాక్షరాలు ,కుమ్మరించారు .ఇవాళ నేను రాస్తున్న భాష ,వారు అనుగ్రహించిన దాన్లో ,సహశ్రామ్షమూ లేదు” . అనడం,మీ గొప్ప తనానికి నిదర్శనం .వారి పట్ల మీ గౌర వానికి ,చిహ్నం .నేర్చుకొనే మీ చిత్త వృత్తికి దర్పణం .”జాతీయ మైన తెలుగు భాష కావాలంటే ,స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి .మర్యాద గల తెలుగు భాష కావాలంటే ,మళ్ళీ క్షత్రియ రమణుల దగ్గరే నేర్చుకోవాలి .మరో దారి లేదు .”ఎంత నిక్కచ్చి గా చెప్పారండీ మీరు .?
”  నిజ్హం గా” మీ గాడ్ ఫాదర్ ”మల్లిడి సత్తి రెడ్డి గారే కదా అన్న గారూ   !”కీలక నామ సంవత్సర పంచాంగం అచ్చుపని మీ రచనా వ్యాసంగం పరా కాష్ట కు చేర టానికి” కీలక” మైంది .వారూ ,మీరూ చూసుకొన్న తోలి చూపులు హృదయం లోతులను పరి శీలించాయని ,ప్రవ్రుత్తి ని పరి శోదిన్చాయనీ ”అద్భుతం గా అన్నారు మీరు .అక్కడి” పుస్తకాల పోగు”మీకు ”వరహాల గుట్ట” లా కన పడిందని వరహాల మాట అన్నారు .నవ నిదుల్నీ తిరస్కరించి ,ఆ సరస్వతీ సామ్రాజ్యాన్ని ,అందుకోవాలను కొన్న మీ  ఆలోచన -నవ్య మైనదీ ,సవ్యమైన్దీ , మీకు బహు ఇష్ట మైన దీను ..అవన్నీ నూరుకొని ఒక్క మాటుగా తాగేద్దామన్నంత ”ఆబ ”మాత్రం పుట్టుక వచ్చిందన్నారు .యెంత ఉబ లాటం అండీ .ఆ పుస్తకాలు మీ కిచ్చి ,చదువు కొమంటే ,”పొంగి పోతూ ,”యేఘిరి” పోతూ ,” ఆనందం పొందారు మీరు .బ్రహ్మా నందం ,సహజా నందం ,మీ నడక ”నెమిలి పిట్ట తుర్రు ”మన్నట్లు ఉందా ?భలే ప్రయోగం అండీ .బుద్ధి స్థిమితంగా వుంటే రాత వెళ్ళ దనీ    ,అలజడి ,ఆందోళన లో భావం చిలక రింప బడుతుందని చెప్పారు -ఏ కవికైనా ,రచయిత కైనా అనుభవమే ఇది .
”భారతీ తిలక ముద్ర శాల ”మీ పట్ల సరస్వతీ పీతమే అయింది .రెడ్డి గారు దేశికులు,ఉపదేశికులు ,ఊతా ,మార్గ దర్శీ ,ప్రాతస్మరనీయుడే కాక ,సచివుడు ,స్నేహితుడు కూడా .అది మీకు పట్టిన అదృష్టం .మీరు కోరుకొన్న వరం .మీ సాధనకు ప్రేరణ ,బలం .సరి అయిన సమయం లో నే మీకు పెన్నిధి దొరికింది .మీ కోరిక తీర్చింది .మీ భావా వేషానికి ,ద్వారాలు తెరిచింది ,కూలంకష అయింది .తెనుగు జాతికి వర ప్రసాదం అయింది .నిండుగా ఉన్న తెలుగుదనం దర్శనం ఇప్పించిన ,తిరు మంత్రం అయింది .తిరు పతే అయింది .తిరుమలా అయి ,కలియుగ వైకున్తమే అయింది .తెలుగు ప్రజల మనో వాంచితా సాఫల్యం కల్గింది .”ప్రాప్తవ్య మర్ధం లభతే ,మనుష్యః ”-మనిషి కి రావాల్సింది రానే వస్తుంది అప్రయత్నం గా . .అలాగే జరిగింది మీ కూనూ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -02 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.