శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –7

 శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు 

                                         జ్ఞాపకాల దొంతర మల్లెలు –7

— తెలుగు లో తీపిదనం ఏ ప్రాంతానిది ,ఆ ప్రాంతానికి గొప్ప అని ”ఒక్కొక్క సీమ లో ఒక్కొక్క జీవ కణం వుంది తెలుగు రక్తం లో ,అన్నీ ఒక్క చోట చేర్చ గల -అన్నీ ఒక్క తెలుగు వాడి రక్తం లో నిక్షే పించ గల మొన గాడు పుట్టుకు రావాలి ”అన్న మీ భావం ఆశావహమైనదే .  .అది utopia అని అనిపిస్తుంది నాకు .మన భాషను ”తెనుగు ”అనే మీరు సంబోధిస్తారు ”.”లు” లో లేని తీయదనం ,మాధుర్యం” ను” లో వుందని అన్నారు .”నా తెలుగు భాష శాస్త్రీయం ”,తాటా బూటం” కాదు .సరస్వతికే తేనే చినుకు లందించింది .గాని ,నిరు చప్పనిది కాదు .నా తెనుగు ”అని కీర్తి కిరీటం పెట్టారు .”తెనుగు భాష స్వతంత్రం గా బతగ్గలది .కాని ,కృత్రిమ ప్రాణ వాయువు కూర్చుకోవలసింది కాదు” .భాష పై మీ కున్న మమకారం శ్లాఘ నీయం .మీరు నిర్వహిచాల్సిన పాత్ర ను గురించి మీరే ”యావద్భారతం లోను ,ఈ విశాల విశ్వం లోను ,కూడా ,తెనుగు వాణ్ని గా ,”నేనే ”నిర్వ హించాల్సిన కార్యక్రమం కొంత వుంది .నా ధృఢ విశ్వాసం ఇది ”అన్నారు .ఆ బాధ్యత బుజానికెత్తు కోని సంతృప్తిగా నెర వేర్చి ,అన్న మాట నిల బెట్టు కొన్నారు .
మే నెలలో ఎండ ఖమ్మం లో ఎలా వుందో మీ మాటల్లోనే చెప్తాను ”చివాడ కాల్చిన ఇనుప గుండు లాగ ,వూరి మధ్య గా ,నున్న గా చెక్కేసిన పే -ద్ద  కొండ ను గోప్ప్హ గా వర్ణించి,ఆ అనుభవం మాకు కల్పించారు . ఉదారుని మనస్తత్వం చాలా ఉదాత్తం గా వర్ణించారు .మీ నేత్రావదాన్ని చూసి ముగ్ధుడై న బూకింగ్ క్లార్క్ మీకు మీ సత్య నారాయణ గారికి బెజవాడ దాకా టికెట్లు కోని ,చేతిలో పెట్టి నమస్కారం చేసినపుడు ,ఆ సాహితీ మిత్రునికి మాటల ”లాల్ సలాం ”చేశారుమీరు . .”కోట్లు డబ్బిచ్చి నా ,అలాంటి తృప్తి కలుగదు .కళా కారులకు ”అన్న మీ మెచ్చి కోలు మీ దొడ్డ మనసుది .”బహు సామాన్యుడు ఎంతెంత మహోన్నత శిఖరాలు అందు కో వచ్చో చూపించాడాయన  ”అని ఆయన హృదయం ”రస బంధురం ”అన్నారు .”అమ్మకం అయిన ఆ బడుగు దేహాన ,అదిగో -పరి పూర్ణ మాన వత్వం స్వస్వరూపం తో ,తేజ రిల్లు తోంది .అమరం అదీ -ద్వంద్వాతీతం ,జగజ్జ్యోతి ”అని కృతజ్న తాంజలి ఘటించారు .”లోభి బతుక్కి ,గడ్డి పరచ కూడా అక్కర్లేదు తూచ టానికి.ఉదారుడు అటుక్కి ,బంగారు కొండ అయినా చాలదు ”అని మీరు పర్వతం ఎక్కించారు .ఆ దృశ్యాన్ని విశ్వ నాద్ సినిమా లా ఆర్ద్రత తో తడిపెశారండీ అన్న గారు.
మీ ”వీర పూజ   ”మీ వచన రచనకే వీర పూజ .”తెనుగు లో అపూర్వ రచన .అంతకు ముందే కాదు ,తర్వాత కూడా అలాంటి రచన పుట్ట లేదు మన వచన వాగ్మయం లో ”అని భేషైన పొగడ్త చేశారు .”చెడు -దేశం అంతా పాకి పోతుంది .మంచి పుస్తకం ను ఇంకా ఆద రించటం లేదానాడు  ”అని నిర్వేదం చెందారు ,జన హృదయం లోకి పాకి పోనందుకు .”వర్త మానం అంటే ,ముందు వెనుకల కలయిక ”అని నిర్వచించి ఉదాహరణ గా నీలి చారు మీరు .
”కోటి పల్లి భాగవతి హరి  శాస్త్రి ”గారి ఉదంతాన్ని ,ఆసాంతం ఆస్వాదనీయం గా రాశారండీ మీరు .తపస్సు ,వేద పాథ ప్రవచనము మాత్రమే జీవనం గా గల ,వ్యాకరణ వేత్తలు వారు .ఊరు దాటని అంటే ”ఆపురి బాయకుండు ”బాపన స్వామి .పితా పురం రాజా వారిని కలవాతానికి వెడితే ,ఆ బ్రాహ్మణ ప్రభువు దారిలోనే దర్శనం ఇచ్చి ఆనందం కల్గించారు .రేవులో స్నానం చేసి వస్తున్న హరి శాస్త్రి సాక్షాతూ శుద్ధ సాత్విక మూర్తి యైన శివుని లా వుంటే ,పట్టు బట్టలు కట్టు కోని ,ఊర్ధ్వ పుండ్ర ధారణం తో ప్రభువు తేజస్సు తో ,రాజసం తో ,దేవేంద్ర ప్రభ గా వెలిగి పోతున్నారు అంటారు మీరు .రాజేంద్ర ,భూసురేంద్ర సమాగమ నాన్ని మనోజ్ఞం గా వర్ణించారు .నమస్కరించిన రాజు కానుక లిస్తా నంటే గ్రామ దేవత గుడి శిధిలమై పోతోందని జనం ఆందోళన చెందు తున్నారని ,దాన్ని తక్షణమేబాగు   చేయించ మని ధనాన్ని తృణ ప్రాయం గా  భావించి ,శాశించిన .ఆ తేజో మూర్తి ఉదంతం ఆదర్శ వంతం కాదా ?”మహా రాజ్యం వా పాలఏన్మహా భాష్యం వా పాట్హ ఎత్ ”–అంటే చేత నైతే  రాజ్యం పాలించు .లేదా మహా భాష్యం పాఠం చెప్పు అన్న పతంజలి మహర్షి వాక్యం ను సార్ధకం చేసిన బ్రాహ్మీ మూర్తి శాస్త్రి గారు .
వదాన్యులు దేశోద్ధారకులు ,విశ్వ దాత కాశీ నాధుని నాగేశ్వ ర  రావు పంతులు గారి ఆహ్వానం పై మీ పుస్తకం అచ్చు వేసే ప్రయత్నం లో చెన్న పట్నం చేరిన సంఘటనా రామ ణీయమే . .”పొలమూరు చెరువు లా స్తంభించి పొతే ,రాజా మండ్రి గోదావరి ప్రవాహం లా వుంటే ,ప్రగమ శీల యితే ,మద్రాసు సముద్రం లా ,అల్ల కల్లోలం గా వుంది -ఉత్సాహమే కాదు ఉద్వేగము వుంది అక్కడ ”అని చిన్న మాటలతో నగర గందర గోలాన్ని వర్ణించారు .నగర మాయా మోహ జాలాన్ని వర్ణించి ”మద్రాస్ తుఫాన్ ”అన్నట్లు గా వుంది అన్నారు .”ఆంద్ర పత్రిక బతుకు అమృతాంజనం   గుప్పిట వుంది ”అన్న చిదంబర రహశ్యాన్ని బయట పెట్టె శారు మీరు .
గాంధీ మీద ,ఖద్దరు మీద ,హిందీ మీద మీకు సదభి ప్రాయం లేనే లేదు .మరి ఎలా నెగ్గు కొచ్చారో ఆ నాడు .”గాంధి గారు కొత్త గా దక్షిణ ఆఫ్రికా నుంచి అప్పుడే వచ్చారు .దేశం బాగు పడుతుంది ఆయన నాయకత్వం లో ”అని రాయ ప్రోలు వారు అంటే ”-ఠాట్”కొత్త దారి పెడ దారి అవుతుందని అని అంటారా పెడసరం గామీరు హన్నా !ఎన్ని గుండెలండీ మీకు ?మీది వైదిక సంస్కారము ,గాంధీ గారిది జైన సంస్కారము అని తేల్చేశారు మీరు . ”రామ మోహన రాయి పరధర్మం వరవడి లో ,మరో కొత్త మతం స్థాపిస్తే ,దయానంద సరస్వతీ ఆర్య సమాజం ఏర్పరిస్తే ,ఇంత కంటే బలం గా ”జాతీయత కు కూకటి వేరు పురుగు పుట్టింది ”అని ఆందోళన చెంది ”ఇది అపాయకరం అని గుర్తించింది వివేకా నంద  స్వామి ”ఒక్ఖడే ”అని ఘంటా పధం గా చెప్పింది మీరే .ఆ స్వామి ఆవిర్భవించక పొతే ,మన ధర్మం ,నీతి ఏమి పోయేవో ?ఆయన అవతార పురుషుడే సందేహం లేదు .                అమృతాంజనం పంతులు గారి ”ఈవి ”ని -”అడిగిన వాడికి లేదన కుండా ఇవ్వడం జీవితాధిక మైన వ్రతం వారికి ”అని ప్రస్తు తించారు .మీ రచనల్లో ప్రభుత్వాన్ని ధిక్కరించిన మాట లేకున్నా ,చాణక్య మతంవిషయం   లో మీరు పంతులు గారితో .చెన్నా  ప్రగడ భాను మూర్తి గారితో ,పడిన మధన ,మీ  ఆత్మీయతకు ,  ,ఆదర్శానికి ,స్వతంత్ర త కు అద్దం పట్టింది .
చారిత్రాత్మక మహా పరి శోధకులు కొమర్రాజు లక్ష్మణ రావు గారి దర్శనం మీకు మహద్భాగ్యమే అయింది .”చారిత్రాత్మ కం గా వారి మాటే వేద వాక్యం మన జాతికి -నా రచన నేనే చదివి విని పించాలి ఆయనకీ –అదే పెద్ద మనన ‘అంటూ ,”హిమవత్పర్వత సానువుల్లో వొక చలి చీమ వంటి వాణ్ని ”అని వారి మహోత్క్రుష్టతను అంత ఎత్తు న నిలి పారు .దాదాపు సమాన ప్రతిభ మీది .అయినా ఒద్దిక గా ,వినయం గా ,అల్ప జీవి తో మిమ్మల్ని మీరు పోల్చుకొన్నారు .ఈ వినయ విదేయతలకు తల వంచుతున్నాను స్వామీ !వారి నివాసమే ‘వేద విలాసం ”తమాషా గా పవిత్రం గా వుంది మా బోంట్లకు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.