శ్రీ శైల సందర్శనం –1

 శ్రీ శైల సందర్శనం –1 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ లోని సోమనాధుడు అయితె రెండవది ఆంద్ర దేశం లోని శ్రీ శైలం లోని మల్లి కార్జునుడు . శ్రీ శైల శిఖరం చూస్తేనే పునర్జనం వుండదు అని మన పురాణాలు చెబుతున్నాయి .అంతటి ముక్తి క్షేత్రం .ఈ శివ రాత్రి పర్వ దిన సందర్భం గా (20 -02 -12 -సోమ వారం )ఈ ప్రత్యెక వ్యాస పరంపర .

శ్రీ శైలం కర్నూలు జిల్లా లో ,ఆత్మ కుర్ తాలూకా లో ,నల్లమల అడవుల్లో.ప్రకృతి  రామణీయకత మధ్య వున్న దివ్య క్షేత్రం .ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని గా ప్రవహిస్తుంది .ఇక్కడ ఈ నదిని” పాతాళ గంగ” అని పిలుస్తారు .ఇక్కడి అమ్మ వారు భ్రమ రాంబా దేవి .18 శక్తి పీఠాలలో  ఒకటి .అమ్మ వారి ఆలయం లోపల నిత్యం భ్రమరాల ధ్వని అంటే తుమ్మెద ఝాంకారాం విని పించేదట .అందుకని ఆ పేరు .ఇప్పుడు జన సమ్మర్దం బాగా ఎక్కువైనందు వల్ల వినిపించటం తగ్గింది .చెవులు గోడకు ఆనించి ,గర్భ గుడి లో వింటే బ్రమర నాదం చెవులకు ఇంపు గా విని పిస్తుందని కధనం .భ్రమ రాంబా ,మల్లి కార్జున నిలయ మైన ఈ క్షేత్రం -వేదాలకు,.సకల సంపదలకు నిలయం .ఎనిమిది శృంగాలతో ,44 నదులతో ,60 కోట్ల తీర్ధాలతో ,పరాశర ,భారద్వాజాది మహర్షుల తపోవనాలతో ,వర్ధిల్లిన క్షేత్రం .ఇక్కడ చంద్ర గుండ ,సూర్య గుండ పుష్కరినులు న్దేవి .స్పర్శ వేది మొదలైన లత లతో వున్న అరణ్య ప్రాంతం . .లెక్క లేనన్ని ఓషదులున్న దివ్య భూమి .


ఈ క్క్షేత్రం విజయ వాడకు 230 కి.మీ.దూరం లో ,హైదరాబాద్ కు 220 కి.మీ.దూరం లో వుంది .ఇక్కడ అన్ని కులాల వారికి ఉచిత భోజన సత్రాలు వున్నాయి . .ముందుగా ”కరివెన వారి బ్రాహ్మణ  నిత్యాన్న దాన సత్రం ”ఏర్పడి 110 సంవత్స రాలయింది .దీనికి కాశీ ,షిరిడీ ప్రయాగ లోను బ్రాంచీలు వున్నాయి .వసతి కోసం సత్రాలు బానే ఉన్నాయిక్కడ .దీవస్థానం కాటేజీలు ,గదులు వున్నాయి .దేవస్థానం ఉచిత భోజన సౌకర్యం కల్గిస్తోంది .


శ్రీ శైలానికి  ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం తూర్పు ద్వారం .కడప జిల్లా లోని సిద్ధ వటం దక్షిణ ద్వారం .మహబూబ్ నగర్ లోని అలంపురం పశ్చిమ ద్వారం ఉమా మహేశ్వరం ఉత్తర ద్వారం గా వున్నాయని పురాణాలు చెప్పాయి .అలాగే నాలుగు మూలలా నాలుగు   ఉప ద్వారాలున్నాయి .ఆగ్నేయం గా పుష్ప గిరి ,నైరుతి లో సోమ శిల ,వాయువ్యం లో సంగ మేశ్వరం ,ఈశాన్యం లో ఏలేశ్వరం వున్నాయి .
ఈ క్షేత్రం  కృత యుగం లో హిరణ్య కశిపుని కి పూజా మందిరం గా,అహోబిల క్షేత్రం సభా మండపం గా  ఉండేదని , త్రేతా యుగం లో శ్రీ రాముడు అరణ్య వాసం చేస్తూ ఇక్కడ సీతా దేవి తో కలిసి మల్లి కార్జున స్వామిని దర్శించి ”సహస్ర  లింగాన్ని” ప్రతిష్టించాడని ,ద్వాపర యుగం లో పాండ వులు .ద్రౌపదీ సమేతం గా ఈ క్షేత్రాన్ని దర్శించి ,”సద్యోజాత లింగాన్ని ప్రతిష్టించారని పురాణ కధనం .ఇప్పుడు కూడా ఇక్కడ రామ సహస్రలింగం ,సీతా సహస్ర లింగం ,పాండవ సద్యోజాత లింగం నిత్యం భక్తుల పూజలు అందు కొంటున్నాయి . .
శ్రీ శైలం భూమికి నాభి స్థానం .భారతీయుల నిత్య పూజా విధానం లో సంకల్పం చెప్పే టప్పుడు  ”శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే ”అని మనం చెప్పు కొంటాం .మన లాగే అందరు కూడా .శ్రీ శైలానికి ఏ దిక్కున వున్న వారు ,ఆ దిక్కు పేరు చెప్పి పూజించటం అలవాటు .అంతటి ప్రాచుర్యం పొందిన క్షేత్రం . .దక్షిణ కైలాసం గా శ్రీ శైలం ప్రసిద్ధి చెందింది .ఇక్కడ మల్లి కార్జున మహా లింగాన్ని ,యాత్రికులు ,కాళ్ళు కూడా కడుక్కో కుండా సరాసరి గుడి లోకి వెళ్లి స్వయం గా లింగాన్ని తాకి ,శిరస్సును లింగానికి ఆనించి పూజించి అభిషేకం చేసు కుంటారు .దీన్ని ”ధూళి దర్శనం ”అంటారు .ఇలా ,ఇంకెక్కడా వుండదు .కాశీ లో మాత్రం ఈ అవకాశం వుంది .
కృష్ణా నది ఇక్కడికి వచ్చే ముందు ,బ్రహ్మ గిరి ,విష్ణు గిరి ,రుద్ర గిరి అనే మూడు పర్వతాలను చుట్టి వస్తుంది .స్కాంద పురాణం లో ఏకం గా ”శ్రీ శైల ఖండం  ”వుంది .18 పురాణాలలో భారత ,రామాయనాలలో ,అన్ని భాషల గ్రంధాలలో శ్రీ శైల ప్రస్తావన వుంది .ఇక్కడే శంకర భగవత్పాదులు .మల్లి కార్జున భ్రమ రాంబా దర్శనం చేసి ,ఇక్కడ తపస్సు చేసి ”శివానంద లహరి ”రాశారు ”సేవే శ్రీ గిరి మల్లికార్జున మహా లింగం     శివా లింగితం ” అని చెప్పుకొన్నారు .ఇక్కడి ప్రశాంత వాతా వరనానికి ముగ్ధులై శ్రీ శంకరులు ” యోగ తారావళి” అనే గ్రంధం లో” శ్రీ శైల పర్వత గుహలలో సిద్ధిని పొందాలి అని కోరు కోవటం ఈ క్షేత్రం గొప్ప తనం ”అని ప్రశంశించారు .
శ్రీ శైల క్షేత్రం తో శిలాద మహర్షి , గుప్త వంశానికి చెందిన చంద్ర వతి, కుమార స్వామి ,వసుమతి ,అక్క మహా దేవి ,మహా శివ భక్తురాలు హేమా రెడ్డి మల్లమ్మ ,సిద్ధ రామప్ప ,కుమ్మరి కేశప్ప ,ఉబ్బలి బసవన్న ,వృద్ధ మల్లికార్జునుడు ,మొదలైన వారి కధలన్నీ ముడి పడి వున్నాయి .
స్కాంద పురాణం లో 64 అధ్యాయాల ”శ్రీ శైల ఖండం ”వుంది .మహా భారతం లోని అరణ్య పర్వం లో ,హరి వంశం ల౪౦ వ అధ్యాయం లో ,పద్మ పురాణం లో 20 వ అధ్యాయం లో ,మార్కండేయ పురాణం లో 11 వ అధ్యాయం లో ,శివ పురాణం లో రుద్ర సంహిత లో ఆరవ అధ్యాయం లో ,భాగవత దశమ స్కంధం లో 80 వ అధ్యాయం లో ,ఆదిత్య పురాణం లో ,సూత సంహిత లో ,శ్రీ శైల క్షేత్ర విశేషాలన్నీ వివరం గా ఉల్లేఖింప బడి వున్నాయి .సిద్ధ నాధుడు రచించిన ”రస రత్నాకరం ”అనే గ్రంధం లో శ్రీ శైలం లో దొరికే వనమూలికల గురించి ,ఇక్కడి వివ్య విభూతి గురించి వివరణ వుంది .సోమేశ్వరుని ”కధా సరిత్సాగరం ”లో,భవభూతి రాసిన ”మాలతీ మాధవం ”లో ,బట్టభానుని ;;కాదంబరి ”లో ,శ్రీ హర్షుని ‘రత్నా వళి ”నాటకం ”
లో శ్రీ శైల ప్రస్తావన వుంది .
     నన్నయ గారు అర్జుని తీర్ధ యాత్ర సందర్భం గా శ్రీ శైలానికి రప్పించారు .పాల్కురికి సోమన బసవ పురాణం లో శ్రీ శైలాన్ని అద్భతం గా వర్ణించి తన వీర శైవాన్ని చాటు కొన్నాడు .”శ్రీ పర్వత ప్రకరణం ”లో శ్రీ శైల మహిమలు వర్ణించాడు .పండితా రాదయ చరిత్ర ,”ప్రభు లింగ లీల ”లో దీన్ని బాగా వివరించాడు . .త్రిపురాంతకుడు రాసిన ”త్రిపురాన్తకోదాహరణం ”లోను ,శ్రీ నాధుని ”హర విలాసం ”లోను ఈ క్షేత్ర ప్రాధాన్యత వుంది .నాగ లూటి శేష నాధుడు తన ”శ్రీ పర్వత పురాణం ”లో ,శ్రీ నాధుని ‘పల నాటి వీర చరిత్ర ”లో ”,శివరాత్రి మహాత్మ్యం’ లో ,పోతన గారి భాగవతం లో గౌరన ” నవ నాధ చరిత్ర లో తాళ్ళ పాక తిమ్మక్క రాసిన ”సుభద్రా కల్యాణం ”లో ,పింగళి సూరన ;”కళా పూర్ణోదయం  ”లో ధూర్జటి ”కాళ హస్తీశ్వర శతకం ”లో ,మల్లన రచించిన ”రుక్మాంగద చరిత్ర ”లో ,చేమ కూర వెంకట   కవి ”విజయ విలాసం ”లో శ్రీ శైల ప్రసక్తి వుంది .రఘునాధ నాయకుని ”వాల్మీకి చరిత్ర ”,లోను దీని ప్రాశస్త్యం వర్ణింప బడింది .ఇలా సంస్కృత ,తెలుగు  గ్రంధా లలోనే కాక అనేక బార తీయ భాషల్లో ముఖ్యం గా కన్నడ ,తమిళ ,మరాఠీ భాషల్లో శ్రీ శైల ప్రస్తా వన వుంది .శ్రీ శైల పర్వ తాన్ని  ”శ్రీ పర్వతం ”అంటారు .మరిన్ని విశేషాలు మరో మారు .
సశేషం
మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -02 -12 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in శ్రీ శైలం and tagged . Bookmark the permalink.

2 Responses to శ్రీ శైల సందర్శనం –1

  1. Vyasam అంటున్నారు:

    స్కంద పురాణమందు గల శ్రీశైల ఖండము డౌన్లోడుకు లేదా బయట పుస్తక ప్రతి దొరుకుతుందా. దయచేసి తెలియచేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.