శ్రీ శైల సందర్శనం –2 మల్లికార్జున మహా లింగం

 శ్రీ శైల సందర్శనం –2 

                                            మల్లికార్జున మహా లింగం 
    సుమారు మూడు లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల శ్రీ శైల స్వామి ఆలయం చుట్టూ ,2121 అడుగుల పొడవు ,20 అడుగుల ఎత్తు వున్న ఎత్తైన గోడ కోట గోడ లా వుంది .ఈ ప్రాకారం లో 3153 శిలలున్నాయి .వీటి అన్నిటి పైన బైట అంచులో శిల్పాలు చెక్క  బడి వున్నాయి .ఎనిమిది దిక్కుల ,అష్ట భైరవ స్వాములు ప్రతిష్టింప బడి వుంటారు .ప్రాకారానికున్న నాలుగు వైపులా గోడ లపై ,కింది వరుసలో ఏనుగులు ,గుర్రాలు వివిధ భంగి మలలలో చెక్కి వున్నాయి .తూర్పు గోడ మీద పార్వతీ కల్యాణం ,కిరాతార్జు నీయం ,గజాసుర సంహారం ,శివ తాండవం ,మార్కేండేయ కధ ,శిబి చక్ర వర్తి కధ ,క్షీర సాగర మధనం ,శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యం ,,భక్త కన్నప్ప ,తారకాసుర సంహారం త్రిపురాసుర సంహారం ,మహా లింగోద్భవం ,శివ తపోభంగం ,వీర శైవుల ఆత్మార్పణ ,గణేశుడు మల్లికార్జున స్వామిని అర్చించటం ,మొదలైన చిత్రాలు కళ్ళకు విందు చేస్తాయి  .దక్షిణం లో వున్న గోడ పై ,దక్ష యజ్ఞం ,పార్వతీ కల్యాణం కు అష్ట దిక్పాలకుల సన్నాహం ,కన్నప్ప, ,శివుడి భిక్షాటనం ,గణపతి నాట్యం ,చేస్తుంటే ,హనుమ వేణువు ను ఊదే దృశ్యం ,నాగ బంధం మహిషాసుర మర్దిని ,గండ భేరుండం అత్యద్భుత శైలి లో చిత్రాలుగా మలచ బడి నాయి .ఉత్తర గోడపైన శివ తాండవం ,గంధర్వ స్త్రీల నృత్యం ,యమధర్మ రాజు ,గండ భేరుండం ,భ్రున్గీశ్వరుని నాట్యం ,శివుని విశ్వ రూపం ,మనోహరం గా వుంటాయి .పడమటి వైపు పది భుజాల గణ పతి అరుదైన దృశ్యం .
ఈ ఆలయానికి ఆలుగు వైపులా గోపు రాలున్నాయి .తూర్పు గోపురాన్ని కృష్ణ దేవ రాయ గోపురం అంటారు .దీన్ని 15 వ శతాబ్ది లో కట్టించాడు రాయలు .1516 లో ఆ గోపు రానికి ఎదురు గా వున్న రధ వీధిలో రెండు వైపులా రెండు మండ పాలను కూడా కట్టించాడు .దక్షిణ గోపురాన్ని 1405 లోరెండవ హరి హర రాయలు నిర్మించాడు .ఇదే హరిహర రాయల గోపురం .ఉత్తర గోపురమే చత్ర పతి  శివాజీ మహా రాజు గోపురం .1677 లో ఆయనే కట్టించాడు .పడమటి గోపురం ను ౧౯౬౫ లో దేవస్థానమే కట్టించింది .దీన్ని బ్రహ్మా నంద గోపురం అంటారు .
      ఈ నాలుగు గోపురాల మధ్య బంగారు శిఖా రాలతో కనిపించే ప్రధాన ఆలయ విమాన గోపురాన్ని 1230 లో కాకతియ  గణ పతి దేవ  చక్ర వర్తి   సోదరి మైలమ దేవి నిర్మించింది .ఇవి దాటి గర్భాలయం లోకి ప్రవేశిద్దాం
మల్లికార్జున ఆలయం లోని గర్భాలయం చాలా చిన్నది .లింగము చిన్నదే .అందుకే ”మూర్తి చిన్నది ,కీర్తి గొప్పది ”అనే పేరు వచ్చింది .ఇది రెండవ జ్యోతిర్లింగం .మన శిరస్సును స్వామి లింగానికి ఆనించి మొక్కటం ఇక్కడి సాంప్రదాయం .ఇప్పుడు రద్దీ ఎక్కువ అవటం తో ఆ ఆవ కాశం లేదు .
    ఆలయానికి ముందు రంగ మండపం వుంది .దీనికి తూర్పు,దక్షిణ ,ఉత్తర దిశల్లో ద్వారాలు ,వాటి ముందు స్తంభాలతో వసారాలు గల ముఖ మండపాలు వున్నాయి .రెండు వైపులా వున అరుగు ల పై శాసనాలు చాలా వున్నాయి .మండపాన్ని విజయ నగరచక్ర వర్తి రెండవ హరి హర రాయలు 1405 లో నిర్మించాడు .ఈ మండపం లోపల ఒక వైపు రత్న గణ పతి ,రెండవ వైపు హద్ర కాళి ,వీర భద్ర విగ్రహాలున్నాయి ..
రంగ మండ పానికి ముందున మండపమే” వీర శిరో మండపం ”రెడ్డి రాజు అన వేమా రెడ్డి తండ్రి అన్నయ్య రెడ్డి పుణ్యం  కోసం 1378 లో దీన్నికట్టించాడు .ఈ మండపం లోనే ఎంతో మంది వీర శైవ భక్తులు తమ నాలుకలను ,చేతులు ,కాళ్ళను ,శిరస్సులను ఖండించుకొని శివునికి అర్పించే వారని  ఇక్కడి శాసనం తెలియ జేస్తోంది .38 స్తంభాలతో వుండేది ..ప్రస్తుతం 16 మాత్రమే వున్నాయి .  .
   వీర మండ పానికి ముందు నంది మండపం వుంది .కాకతియ  ప్రతాప రుద్ర చక్ర వర్తి కట్టించినట్లు కధనం .ఇదే బసవన్న మండ పం .కన్నడం లో బసవన్నను ‘చెన్ను కళ్ళు బస వన్న ”అనే వారు .ఇప్పుడు కూడా గంగి రెడ్డు ల వాళ్ళు గంగి రెడ్డు ను నంది అవతారం గా భావించి ”బసవన్న ”అని పిలుస్తున్డటం మనకు తెలుసు .డూ డూ బసవన్న అనే పేరు తెలుగులో జాతీయం అయింది కదా .చెన్ను కళ్ళు బస వన్న కాళ క్రమం లో ”సెనగల బస వన్న ”అయాడు .ఈ బస వంనకు సెనగలు ప్రీతి .శనగలు మొక్కుకొని ,ఆయనకు నివేదన గా అందిస్తారు .మల్లికార్జున స్వామి లాగే ఈయనా భక్త సులభుడే .గిద్దెడు సెనగలు బసవన్న మూతికి కడితే భక్తుల కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం .ఈ మండ పానికి మూడు వైపులా మండపాలున్నాయని చెప్పుకొన్నాం .పై భాగం లో దక్షిణా మూర్తి ,లోపల అష్ట దిక్పాలకుల శిల్పాలు ఆకట్టు కుంటాయి .
  సప్త మాతృకలు
ఆలయానికి ఉత్తర ,దక్షిణ భాగాలలో సాల మండపాలున్నాయి .దక్షిణ సాల మండ పానికి ఆనుకొని బ్రాహ్మీ ,మాహేశ్వరీ ,కౌమారీ ,వైష్ణవీ ,వారాహీ ,ఇంద్రాణీ ,చాముండీ ,అనే సప్త మాత్రుకల విగ్రహాలున్నాయి .చైత్ర పున్నమి  తారు వాత అమ్మ వారి కుంభోత్సవం జరుగు తుంది .అప్పుడు ,ముందుగా ఈ సప్త మాత్రుకలకు నైవేద్యం పెట్టిన పదార్ధాన్నే ,భ్రమ రాంబా దేవికి తీసుకొని వెళ్లి నైవేద్యం పెడ తారు .మిగతా కాలమ్ లో వీటికి ఏ రక మైన ప్రాధాన్యతా లేదు .
         మనోహర గుండం 
సప్త మాత్రుకలకు ముందు ,మండపం లా కని పించే పై కప్పు ఒకటి వుంది .దీనికి కిందికి దిగ టానికి మెట్లు వున్నాయి .ఇందులో నీళ్ళు తియ్య గా మనోహరం గా వుంటాయి .ఇలాంటివి ఆలయ ఆవరణ లో 100 దాకా ఉండేవని చెబుతారు .పూర్వ కాలమ్ యాత్రికులకు ఈ జలమే ఆధారం .ఇప్పుడు కృష్ణ నీరు కొండ పైకి గొట్టాల ద్వారా వస్తోంది కనుక దాదాపు అన్నిటినీ పూడ్చేశారు .
 బ్రహ్మ గుండం -విష్ణు గుండం
మల్లికార్జునాలయానికి ఆనుకొని దక్షిణ దిశ లో బ్రహ్మ గుండం వుంది .సప్త మాత్రుకలను ఆనుకొని పడమర వైపు విష్ణు కుండం వుంది .దిగటానికి మెట్లున్నాయి దీన్ని ”పాతాల బావి ”అంటారు .
 నవ బ్రహ్మాలయాలు 
  దేవాలయానికి పడమటి వాయువ్యం లో తొమ్మిది ఆలయాలున్నాయి .శివ దేవుని అష్ట మూర్తు లైన భవ మూర్తి ,సర్వ మూర్తి ,ఈశాన మూర్తి ,పశు పతి మూర్తి ,రుద్ర మూర్తి ,ఉగ్ర మూర్తి ,భీమ మూర్తి మహాదేవ మూర్తి ,ఆలయాలు ఇవి .ఇవి వరుసగా జల లింగ ,భూలింగ ,సూర్య లింగ యాజమాన లింగ ,అగ్ని లింగ ,వాయు లింగ ,ఆకాశ లింగ ,చంద్ర లింగాలు .ఈ పేరు ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పలేదు .వీటికి ఆనుకొని కుమారస్వామి ఆలయం లో షణ్ముఖుడు గా అద్భుత మూర్తి తో స్కందుడు విరాజిల్లు తున్నాడు .దీనికి ఆనుకునే ”ఆస్థాన మండపం ”వుంది .పూర్వం మల్లికార్జున దర్శనానికి వచ్చే రాజులు ఇక్కడే కొలువు తీరే వారు .ఇక్కడే ఉత్సవ మూర్తులకు అలంకరణ చేసే వారు .అందుకే ”అలంకార మండపం ”అనీ అంటారు .
                              మల్లమ్మ -అక్క మహా దేవి
ఆస్థాన మండపానికి లోపల ఒక గదిలో మళ్లి కార్జున భక్తు రాళ్ళు అయిన హేమా రెడ్డి మల్లమ్మ ,అక్క మహా దేవి విగ్రహాలున్నాయి
   ఉమామహేశ్వర స్వామి 
ఉత్తర సాల మండపం ఆలయాలలో పార్వతీ దేవిని తన వాఆంకం మీద కోర్చో పెట్టు కొన్న ఉమా మహేశ్వర స్వామి వున్నాడు .మనోహర మైన శిల్పం .దీనినే  ”పంచ నందీశ్వరుడు ”అంటారు .
 అద్దాల మండపం
ఉత్తర సాల మండపం చివర అద్దాల మండపం వుంది .దీన్ని 1529 లో చంద్ర సేఖరామాత్యుడు కట్టినట్లు శాసనం వుంది .స్వామి వార్ల కల్యాణం ఇక్కడే జరిగేది భక్తుల సంఖ్య పేర గతం తో ను ,నిత్య కళ్యాణాలు జరుగు తున్డటం తోనూ పెద్ద కళ్యాణ మండ పాన్ని దేవాలయం కట్టించింది .ఇప్పుడు పాథ దాన్ని ”అద్దాల మండపం ”గా తీర్చి దిద్దారు .స్వామి వార్ల పవ లింపు సేవ ఇప్పటికీ ఇక్కడే జరుగుతుంది .అంటే కాదు -మహా శివ రాత్రి నాడు జరిగే భ్రమ రాంబా మళ్లి కార్జున స్వామి వార్ల కల్యాణం ,సంప్రదాయ బద్ధం గా ఈ అద్దాల మందిరం లోనే జరగటం విశేషం .దీనికి ప్రక్కనే శ్రీ రాజా రాజేశ్వరి ఆలయం వుంది .
  అర్ధ నారేశ్వర -పాండవ లింగాలు –వీర భద్ర స్వామి 
గర్భాలయానికి ఉత్తరం వైపు అర్ధనారీశ్వర ఆలయం వుంది .దీనికి ఉత్త రాణ ద్వాపర యుగం లో పాండవులు ప్రతిష్టించిన అయిదు లింగాలు ,వాటికి ఆలయాలు వున్నాయి .వీటికి ఉత్త రాన వీరభద్ర స్వామి ఆలయం వుంది .ఆయుధం ధరించి భీకరం గా కనిపిస్తాడు .ప్రాకారం పైన ,బయటా అనేక వీర భాద్రులున్నారు .వీర శైవ సంప్రదాయానికి ఇవి ప్రతీకలు .
 మల్లికా గుండం -బలి పీఠం -వృద్ధ మల్లికార్జునుడు
    వీర భాద్రాలయానికి తూర్పున మల్లికా గుండం వుంది .దీనిలో ఆలయ శిఖరం కని పిస్తుంది .గుండం మధ్య చిన్న మండపం లో తెప్పోత్సవం జరుపే వారు .ఇప్పడు అభిషేకానికే ఈ జలాన్ని ఉపయోగిస్తున్నారు .ఆలయం లో అంతర్వాహిని గా ”సరస్వతీ నది ”ప్రవహిస్తూ వుండటం వల్ల .ఈ గుండం లో సరస్వతీ నదీ జలం,ఎప్పుడు చేరుతూ ఒకే స్థాయిలో నీతి మట్టం వుండటం విశేషం .ఈ జలం వ్యాధులకు దివ్యౌషధం గా ప్రసిద్ధి .
ఈ గుండానికి తూర్పున ముఖ మండ పానికి ఉత్తర ద్వారానికి ఎదురుగా ,అండ మైన అలీ పీఠం వుంది .అష్ట దిక్పాలక విగ్రహాలతో రెండస్త్రుల విమానం వుంది పీఠం పై భాగాన లింగము ,నంది ముచ్చట గా వుంటాయి 1235 లో రాజ మండ్రి కి చెందిన గంగ మల్లి శెట్టి బలి పీఠం నిర్మించినట్లు తెలుగులో వుంది .
బలి పీఠానికి తోర్పున ”వృద్ధ మల్లికార్జున స్వామి ”ఆలయం వుంది .మల్లి కార్జున స్వామి వారికంటే ప్రాచీన విగ్రహం గా గా భావిస్తారు .ఎత్తు పల్లాలతో వున్న పెద్ద లింగం అతి ప్రాచీనం గా వృద్ధ లింగం గా వుంటుంది . .చంద్ర గుప్త మహా రాజు కుమార్తె ,ఈ స్వామినే అర్చించి నట్లు కధ ప్రచారం లో వుంది .
                రామ ప్రతిష్టిత సహస్ర లింగం
వృద్ధ మల్లి కార్జున స్వామి వెనుక వైపు త్రేతాయుగం లో శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన ”సహస్ర లింగం ”,ఆలయం వున్నాయి .నల్ల రాతి లింగం .కాకతీయ కట్టడం గా ఆలయం వుంది . .
 త్రిఫల వృక్షం 
వృద్ధ మల్లి ఆర్జునుని తూర్పున మేడి ,రావి ,జువ్వి చెట్లు ఒకా దానికొకటి పెన వేసు ఆని పేరిగినా వృక్షమే ”త్రిఫల వృక్షం ”దత్తాత్రేయ మహర్షి ,సిద్ధ నాగార్జునుడు మొదలైన వారెందరోదీని కింద తపస్సు చేసి మనోఫల సిద్ధి పొంది అట్లు ప్రతీతి .3000 సంవత్స రాల కంటే ఎక్కువ వయసు వున్న వృక్ష రాజం ఇది .త్రిఫల చూర్ణం ఆయుర్వేదం లో గొప్ప మందు .అయితే ఇందులోని మూడు -ఫలాలు -ఉసిరిక ,కరక్కాయి ,తాడి నే త్రిఫలాలు అంటారు మరి త్రిఫల వృక్షం అని ఎందుకు పిలుస్తున్నారో తెలీదు .సంతానం కోసం దీని చట్టు ప్రదక్షిణాలు చేస్తారు .
భ్రమ రాంబా దేవి దర్శనం తారు వాత చేద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —  16 -02 -12శ్రీ శైల సందర్శనం –1


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in శ్రీ శైలం and tagged . Bookmark the permalink.

2 Responses to శ్రీ శైల సందర్శనం –2 మల్లికార్జున మహా లింగం

 1. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  Choosina anubhoothi, marala choodali ane prerana kalugu thunnayi Sir

  Shiva
  ?!

 2. nagendra అంటున్నారు:

  చక్కగా వివరించారండీ,
  ఇక్కడి త్రిఫల వృక్షానికి ఆయుర్వేద త్రిఫలాచూర్ణ మందులో వాడబడే కాయల సంబంధ వృక్షాలకీ సంబంధంలేదు.
  సహజంగానే మర్రి, జువ్వి, మేడి చెట్లు ఫలవంతములైనవి, ఆశ్రయించినవారికి కోరికలు తీర్చేవి అని అవి మూడూ ఒకే చోట ఉండి దాని కింద ధ్యానం చేసిన వారి కోరికలను ఫలింపచేసేవిగా ఉన్నాయి. అందువల్ల అది ’త్రి’ ఫల వృక్షంగా పేరొందింది. ఇప్పటికీ అలా కోరికలు తీర్చుకుంటున్నవారెందరో…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.