శ్రీ శైల సందర్శనం –3 శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం

  శ్రీ శైల సందర్శనం –3

                                         శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం
 మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఎత్తైన వేదిక మీద భ్రమరాంబా దేవి ఆలయం వుంది .మెట్లు ఎక్కి వెళ్ళాలి .మెట్లకు ఎడమ వైపు ,సిద్ది వినాయకుని విగ్రహం ,ద్వాపర యుగం లో ద్రౌపదీ దేవి ప్రతిష్టించిన పంచ లింగేశ్వరుడు వుండే వారు .ఆలయ పునరుద్ధరణ లో వీటిని తొల గించారు .కొన్ని మెట్లు యెక్క గానే ,అమ్మ వారి ఆలయ ధ్వజ స్తంభం ,సింహ మండపం ,వున్నాయి .మండపం లోని సింహం భయం కల్గిన్చేట్లున్తుంది .
మరి కొన్ని మెట్లు యెక్క గానే ,ముఖ ద్వారానికి ఎదుట త్రేతా యుగం లో సీతా దేవి ప్రతిష్టించిన ”సహస్ర లింగేశావర స్వామి ”వున్నాడు .
పూర్తి గా మెట్లు యెక్క గానే భ్రమ రామబా దేవి ఆలయం దర్శన మిస్తుంది .నిర్మాణ వివ రాలు తెలీవు .అయితె 1964 లో ప్రదక్షిణ మండపం కట్టారు .సుమారు 2000 సంవత్స రాల క్రితం ఇక్కడ ”వామా చారం ”బలీయం గా వుండేది .నిరంతరం జంతు బలి జరిగేది .శ్రీ శంకరా చార్యుల వారు ఇక్కడ అమ్మ వారి ఎదురు గా శ్రీ చక్రాన్ని ప్రతిష్టితం చేసిన తర్వాత ,”దక్షిణా చార సంప్ర దాయం” అమలైంది .1982 వరకు అమ్మ వారికి బయటే జంతు బలి ఇచ్చే వారు .ఇప్పుడు లేదు .
 అమ్మ వారి ఆవిర్భావం 
అరునాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ను గురించి తపస్సు చేసి ,రెండుకాళ్ళ జీవులు ,నాలుగు కాళ్ళ జీవులు వల్ల తనకు మరణం రాకుండా వరం పొందాడు .బరి తెగించిన ఆ దానవుడు అందర్నీ భయ పెట్టి ,లోకాలకు కంటకుడు గా మారాడు .దేవతలు అందరు తమ శక్తులన్నీ,ఆది పరాశాక్తికి అందించి ,వాడిని చంపమని వేడారు .ఆమె అరునాసురుని తో యుద్ధానికి తల పడింది .వేలాది తుమ్మెదలను వాడి సంహారానికి పూరి గొల్పింది .ఆరు కాళ్ళు జీవులైన అవి ,వాణ్ని ఒక్క సారిగా కుట్టి బాధించి సంహరించాయి .దేవతల కోరిక పై ఆది శక్తి ఇక్కడ ”భ్రమ రాంబా దేవి ”గా అవత రించింది .ఇప్పటికి ,ఆలయం వెనుక గోడల నుండి భ్రమర జ్ఝాన్కారం విని పిస్తుంది .నిల బడి వుండే అమ్మ వారు అలంకారం వల్ల కూర్చున్నట్లు దర్శన మిస్తుంది .18 శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ శైల పీఠం అధిష్టించిన ”భ్రామరీ శక్తి ”భక్తుల మనో భీష్టాలను తీర్చటం లో పేరు పొందింది .
  లోపాముద్ర -శిల్ప మండపం -రుధిర గుండం -యాగ  శాల 
అమ్మ వారి ఆలయం దక్షిణాన అగస్త్య మహర్షి అర్ధాంగి ”లోపాముద్ర ”విగ్రహం వుంది .ఆ దంపతులు శ్రీ శైలం సందర్శించి నట్లు క్షేత్ర మహాత్మ్యం లో వుంది .లోపాముద్ర  విగ్రహాలు ఇంకెక్కడా వున్నట్లు కనిపించదు .
ప్రదక్షిణ శిల్ప మండపం లో స్తంభాల పై శిల్పాలు సుందరం గా వుంటాయి .తొమ్మిది మంది స్త్రీలు ఏనుగు ఆకారం లో వున్న ”నవ నారీ కుంజరం ”,భద్ర కాళి ,శివ,విష్ణు ,నట రాజ మూర్తి శిల్పాలు ఆకర్ష ణీయం .
రుధిరం అంటే రక్తం .వామా చారం లో రక్తానికి ప్రాముఖ్యత ఎక్కువ .ఇక్కడ వేలాది జంతువుల బలి వల్ల ,ప్రక్క నున్న గుండం లో నీరు యెర్ర బడింది .అందుకే రధిర గుండం అనే పేరు .ఉత్త రాణ వున్న ఈ గుండం లోని నీటిని అమ్మ  వారి అభిషేకానికి వాడు తున్నారు .
ఆలయానికి ఈశాన్యం లో 16 స్తంభాల యాగ శాల వుంది .ప్రతి పూర్ణిమా ,నాడు ,దసరా ఉత్స వాలు , ,నిత్య చండీ యాగం  ఈ యాగ శాల లోనే జరుగు తాయి .
మల్లికార్జున ఆలయానికి నైరుతి లో సాల మండ పాలలో మెట్లు కని పిస్తాయి .మెట్ల పై భాగాన నట రాజ మూర్తి ,వున్నాడు .మెట్ల పైకి వెళ్తే ,నాగావళి తోట ,అందులో నిత్య కళ్యాణ మండపం వున్నాయి .ఆర్జిత నిత్య కళ్యాణాలు ఇక్కడే జరుగు తాయి .కళ్యాణ మండ పానికి చుట్టూ వున్న నాగా వళి తోట లో శివ భక్తు రాలు ”చంద్రా వతి ”మళ్లి కార్జున స్వామి కి మల్లె మాల వేస్తున్న దృశ్యం ,చత్ర పతి శివాజీ మహా రాజ్ కు  భ్రమ రాంబా దేవి ఖడ్గాన్ని ప్రసాదించే దృశ్యం నయన మనోహరం .అసలు అర్జున చెట్టు కు అంటే తెల్ల దిరిసెన చెట్టు కు మల్లె తీగలు అల్లు కోని అమల్లికార్జున స్వామి లింగం పైన అభిషేకం గా పడే వట .అందుకీ స్వామికి–” మల్లిక -అర్జునుడు అంటే మల్లికార్జునుడు ”  అనే పేరు వచ్చింది .కళ్యాణ మండపం మెట్ల కిరు వైపులా హరి హర మూర్తి ,అర్ధ నారీశ్వరుల శిల్పాలున్నాయి .
  శ్రీ అన్న పూర్ణ
స్వామి వారి ఆలయానికి ఈశాన్యం లో అన్న పూర్నా దేవి మందిరం వుంది .అక్కడ స్వామి వారికి నివేదనలు ,భోగాలు తయారు చేస్తారు .అన్నదానం ఇక్కడే జరుగు తుంది .
ఇప్పటి వరకు ఆలయాల లోపలి విశేషాలు చూసి తెలుసు కున్నాం .ఇప్పుడు ,ప్రాకారం బయట వున్న విశేషాలు చూద్దాం .
   శంకర మఠం -ఆరామ వీరేశ్వరం -గంగాధర మండపం -శారదా మఠం -నందుల మఠం 
రధ వీధి లో ఎడమ వైపు శ్రీ కంచికామ కోటి వారి శంకర మఠం వుంది .ఒకప్పుడు ఇక్కడ వారి వేద పాట్హ శాల వుండేది .
సాల మండ పాలకు ఎడమ వైపు ,దారిలో వెడితే వీర భద్ర స్వామి ఆలయం అంటే ఆరామ వీరేశ్వరాలయం వుంది శ్రీ నాధుడు ఈ దేవుణ్ణి విప రీతం గా వర్ణించాడు .
మెయిన్ గేటు వద్ద గంగాధర విగ్రహం ,శివుని శిరసు నుండి ,గంగ వెలువడే దృశ్యం ఇది .దీని దగ్గర శృంగేరి శారదా మఠం వారి శారదా దేవి విగ్రహం ,ఆదిశంకరుల పాల రాతి విగ్ర హాలు ముగ్ధ మోహనం .
వాయువ్యాన  ”నందుల మఠం ”వుంది .గుహలతో చూడ ముచ్చట గా వుంది .
 మల్లమ్మ కన్నీరు -గిరిజా శంకర -వరాహ తీర్ధం -పశు పతి నాద లింగం ,గోగర్భం
నందుల మఠం ను ఆనుకొనే మల్లమ్మ ఆవుల దొడ్డి ,ఆమె విగ్రహం వున్నాయి .విగ్రహం దగ్గర చిన్న గుంత నుండి నిరంతరం ప్రవిహిస్తుంది .దీన్నే ”మల్లమ్మ కన్నీరు ”అంటారు భక్తులు .స్కాంద పురాణం లో దీన్ని ”బిందు తీర్ధం ”అన్నారు .
బిందు తీర్దానికి దగ్గర లో మహా భక్తు రాలు  మల్లమ్మ పూజించిన గిరిజా శంకర ఆలయం వుంది .
దీనికి ఎదురుగా వరాహ తీర్ధం వుంది .తాగటానికి యోగ్య మైన నీరుండి .స్కాంద పురాణం లో దీన్ని వరాహ కుండం అని వుంది .
దీనికి ఎదు రుగా పశు పతి నాద లింగం, దానికి నాలుగు వైపుఅలా నాలుగు   ముఖాలు వుండటం తో దీన్ని ”పంచ ముఖ లింగం ”అంటారు .
దీని కి దగ్గరలో చెవి ఆకారం లో వున్న తీర్ధాన్ని గోకర్ణ లేక గోఅర్భ  తీర్ధం అంటారు .గోకర్ణ రుషి ఇక్కడ తపస్సు చేసి  నట్లు  చెబుతారు .
ఆలయానికి ఆగ్నేయం లో ”బయలు వీర భద్రుడు ”వున్నాడు .ఈ క్షేత్రాన్ని కాలి కాస్తాడు కనుక ”కావాలి వీర బహాద్రుడు ”అనీ అంటారు .ఈ మండ పానికి పై కప్పు వుండదు .కారణం -ఎండా ,వాన అని చూడ కుండా క్షేత్ర పాలకుడి లా అనుక్షణం  కాపలా కాయాలి కనుక .
  శివాజీ స్ఫూర్తి కేంద్రం 
శివాజీ మహా రాజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి,కోత కాలమ్ ఇక్కడ వున్నాడు .ఆలయానికి ఉత్త రాణ శివాజీ గౌరానికి ఎదురు గా పూర్వం శివాజీ నివశించిన భవనం వుండేది .దీన్నే శివాజీ ధ్యాన మందిరం గా భావించే వారు .ఇది శిదిలయం అయింది .ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి స్ఫూర్తి మందిరం ,అందులో ఎత్తైన శివాజీ విగ్రహం నిర్మిస్తున్నారు .
దీనికి ఉత్త రాన చంద్ర కుండం  వుంది .దీన్ని ఇప్పుడు పూడ్చే శారు .ఇక్కడే . పెద్ద గుహ ఉండేదట .ఎక్కడికి దారి తీసేదో తెలీదు అని పెద్దలు చెబుతారు .దీన్ని గురించి స్కాంద పురాణం లో వివరం గా వుంది .
ఇప్పటి వరకు మల్లికార్జున ఆలయానికి సమీపం లో వున్న దేవాలయాలను, విశేషాలనుతెలుసు కున్నాం .
మిగిలిన విశేషాలు   మరో సారి
శ్రీ శైల సందర్శనం –1
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -02 -12 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in శ్రీ శైలం and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీ శైల సందర్శనం –3 శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం

  1. muthevi ravindranath అంటున్నారు:

    shreeshailam visheshaalu kallaku kattinatlu varnisthunnaaru.idi chadivinavaaru ika sreeshailam vellae avasaram undadannanthagaa unnaayi vivaranalu.Arjuna vruksham antae thella dirisena chettukaadu– thellamaddi chettu.Daani shaastreeya naamam Terminalia arjuna.
    Dirisena chettu antae shireesha vruksham.nidraganneruku errani vinjaamarala vanti pooluntae dirisena laeka sireesha pushpaalu thella vinjaamarallaa untaayi.Achchu tappulu dorlakundaa meeru marintha jaagrattha vahisthae baaguntundani naa soochana.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.