శ్రీ శైల సందర్శనం —5

 శ్రీ శైల సందర్శనం —5

                                 నాగ లూటి వీర భద్రుడు 
భీముని కోలనుకు ఇరవై కి.మీ.దూరం  లో నాగలూటి వస్తుంది .ఇక్కడ పెద్ద చెరువు వుంది .కర్నాట యాత్రికులు ఇటే ప్రయాణం చేస్తారు .కొంత దూరం వెడితే ,’వీర  భద్ర విగ్రహం ”చాలా ఎత్తు గా  భయంకరం గా కన్పిస్తుంది .

  అక్క మహాదేవి గుహలు 
శ్రీ శైలం లో చుక్కల పర్వ తానికి సుమారు ఇరవై కి.మీ.లో వాయవ్యం గా  ఆరు గుహలున్నాయి .ఇందులో మధ్య గుహే అక్క మహా దేవి గుహ .ఆమె 12 వ శతాబ్ది ”శివ శరణుల ”లో పేరున్న మహా భక్తు రాలు.ఇక్కడే నివశించి ,ఒక గుహ లోని సహజ శివ లింగాన్ని పూజించింది .ఇక్కడికి రావా లంటే ,పాతాళ గంగ నుంచి , నీటిపై తేలే బుట్ట లలో చేరాలి .

ఇష్ట కామేశ్వరి 
శ్రీ శైల శిఖ రానికి కొంచెం దూరం లో వెలసిన అమ్మ వారే ఇష్ట కామేశ్వరి .కోరిన కోర్కెలు తీర్చే దేవి గా ప్రసిద్ధం .
 కదళీ వనం 
అక్క మహా దేవి గుహ నుండి అవతలి ఒడ్డు కు వెళ్లి ,పది కిలోమీటర్లు నడిస్తే కదళీ వనం చేర వచ్చు .ఇక్కడే అక్క మహా దేవి తపస్సు చేసింది./ఇక్కడ సుమారు 2000 మంది కూర్చుని తపస్సు చేసుకోవా టానికి వీలుగా ,కొండ సహజం గా ఏర్పడిన మండపం .ప్రక్కనే సన్నని నీటి వాలుంది .అందులోని నీరు సహజ మధురం గా వుండటం విశేషం .సాధకులకు తప్ప మిగిలిన వారికి ఈ కదళీ వనం కన పడదు అని శేష నాధుడు  రాసిన ”శ్రీ పర్వత పురాణం ”లో వుంది .
 దత్తాత్రేయ పాదుకలు 
కదళీ వనం సమీపం లో ,ఎడమ వైపు లోయ అంచు భాగం లో దత్తా త్రేయ పాదుకలు కని పిస్తాయి .దత్తాత్రేయ స్వామి శ్రీ శైలం రాక ముందు ,కర్నాటక లోని ,నర్సోబా వాడి ,ఔడుమ్బరం ,గంగా పురం ,మొదలైన క్షేత్ర సందర్శనం చేశారు .ఇక్కడ అరటి పత్రాల దొన్నె లో కృష్ణా నది దాటి శ్రీ శైలం వచ్చారు .కదళీ వనం లో తపస్సు చేసి మల్లికార్జున స్వామిని దర్శించి నట్లు ఆధారాలున్నాయి .
దత్తాత్రేయుడు అత్రి మహర్షి కుమారుడు .కలియుగం లో ,గోదావరి తీరం లో పిథా పురం లో శ్రీ పాద వల్లభుడు అనే పేరు తో జన్మించారు .కృష్ణా నదీ తీరం లో ”కురు గడ్డ ”దీవి లో భక్తులకు మోక్ష మార్గం ఉప దేశిస్తూ ,,తరువాత మహా రాష్ట్ర లోని ”కారంజ నగరం ”లో ”నృసింహ సరస్వతి ”గా జన్మించి ,శ్రీ శైలం  చేరారు .ఇక్కడ కదళీ వనం లో తపస్సు చేసినట్లు సంస్కృత మరాఠీ భాషల్లో రాసిన ”నరసింహ సరస్వ్త్యుపాఖ్యానం ”లో వుంది .
ఇప్పటి వరకు శ్రీ శైలం దగ్గర ఉన్న అన్ని ముఖ్య ప్రదేశాలను తనివి తీర చూశాం కదా .ఇప్పుడు స్వామి సేవలో తరించిన మహా రాజుల గురించి తెలుసు కొందాం
 మల్లికార్జున స్వామి సేవలో మహా రాజులు 
చారిత్రిక ఆధారాలను బట్టి శ్రీ శైలం క్రీ.శకం ఒకటవ శతాబ్ది నుండే  ప్రాభవం లో వుంది .శాత వాహన రాజులు దీని ”సిరిదాన్ ”అని పిలిచారు .క్రీ.శ.102 నుండి 130 వక్రకు దక్కను పీథ భూమిని పాలించిన శాత వాహన రాజు ”పులమావి ”
గోదావరి ఒడ్డున ఉన్న ”నాసిక్ ”లో గుహలో చెక్కిన శాసనం లో సిరిదాన్ పేరు కని పిస్తుంది .
ఇక్ష్వాకు మహా రాజులు క్రీ.శ.మూడవ శతాబ్ది లో ఈ ప్రాంతాన్ని పాలించారు .దీని శ్రీ పర్వతం అన్నారు .ఇక్ష్వాకులకు ”శ్రీ పార్వ తీయులు ”ఆనే పేరుంది .”వశిష్ట పుత్ర క్షాంత మాల ”ఈ ప్రాంతాని పాలించాడు .ఇతని ఏలుబడిలో పాక నాడు ,నుండి గుండ్ల కమ్మ మీదుగా ,బంగాళా ఖాతం వరకు పరి పాలించాడు .ఇతడు కుమార స్వామి భక్తుడు .శ్రీ శైలాన్ని విశేషం గా అభి వృద్ధి పరిచాడు .

పల్లవ రాజు సింహ వర్మ తన రాజ్యం లో దీన్ని కలుపుకొన్నాడు .త్రిలోచన పల్లవుడు ,ఇక్కడి అడవినికొంత  కొట్టించి ,నివాస యోగ్యం చేశాడు .ఇతన్ని ఓడించి పాలించిన కరి కాల చోళుడు ఆగి పోయిన పని పూర్తీ చేశాడు .
నాల్గవ శతాబ్దం లో విష్ణు కుండినుల యేలు బడి లోకి వచ్చింది తమ శాసనాల్లో తమను ”శ్రీ పర్వత స్వామి పాద ధ్యాతలు ”గా చెప్పుకొన్నారు .వీరు తూర్పు కనుమల లోని ”వాకాటకులు ”తో ,వివాహ సంబంధం కలుపు కోవటం వల్ల  వీరిద్దరి పాలన లోకివచ్చింది .
ఆరవ శతాబ్ది లో పల్లవరాజు మహేంద్ర వర్మ ,ఈ ప్రాంతాన్ని వశం చేసుకొన్నాడు .ఆరవ శతాబ్ది లోనే బాదామి చాళక్యులు కర్నాటక ను పాలించారు .అప్పుడే కరి కాల చోళుడు ,అతని సంతతి ఈ ప్రాంత రాజులైనారు .వారిలో రేనాటి చోళులు శ్రీ శైల పాలకులయారు .రాష్ట్ర కూట రాజు  దంటి దుర్గ బాదామి చాళుక్యులను ఓడించి,తెలుగు చోలులను కూడా జయించి నందు వల్ల రాష్ట్ర కూటుల అధీనం లోకి శ్రీ శైలం వెళ్ళింది .క్రీ.శ.973 లో మళ్ళీ చాళుక్యుల వశమైంది .తర్వాతా చాళుక్య చోళుల ఏలుబడి కి వచ్చింది .
 కాకతీయ రాజులు
కాకతి రాజు ప్రోలయ ఈ ప్రాంతాన్ని జయించి పాలించాడు 1162 నాటికి ఇది పూర్తిగా కాకతీయుల పాలన లోకి వచ్చేసింది .
1313 లో ప్రతాప రుద్రుడు ఇక్కడి అడవిని నరికించి ,వాస యోగ్యం చేశాడు .సతీ సమేతం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి తులాభారం తూగి స్వామికి కానుకలు సమర్పించాడు .అతని మంత్రి ”వేపేటి కొమ్మయ ”కమ్మ నాడు లో కొంత భాగాన్ని స్వామి మధ్యాహ్న అర్చనకు దానం చేశాడు .ఇక్కడ వేర్వేరు వ్యక్తుల చేతుల్లో వున గ్రామాలను ”ఈశ్వర శివా చార్యులు ”స్వాధీన పరచు కొని  వాటిని చక్క గా పర్య వేక్షించాడు .1323 వరకు ఇది కాకతి రాజుల పాలన లోనే వుంది .
 కొండ వీటి రెడ్డి రాజులు
అద్దంకి ప్రభువు వేమా రెడ్డి రాజ్యాన్ని శ్రీ శైలం నుండి ,కృష్ణా నది కి దక్షిణం గా తూర్పు  తీరం వరకు వ్యాపింప జేశాడు .
రాజధాని ని అడంకి నుంచి కొండ వీడు కు మార్చటం తో వీరిని కొండ వీటి రెడ్డి రాజులన్నారు .ప్రోలయ వేమా రెడ్డి తానూ శ్రీమల్లికార్జున స్వామి పాద సమారాధకుడి గా చెప్పు కొన్నాడు .ఇతనే మెట్లు కట్టిచి యాత్ర చేయ టానికి వీలు కల్పించాడు .తరువాతి రెడ్డి రాజులు పాతాల గంగ కు మెట్లు కట్టించారు .అనపోతా రెడ్డి కుమారుడు అన వేమా రెడ్డి మళ్ళీ స్వాధీనం లోకి తెచ్చుకొన్నారు .పిన తండ్రి అన్నయ రెడ్డికి పుణ్యం కోసం వీర శిరో మండపాన్ని కట్టించాడని చెప్పుకొన్నాం .1387 -1407 మధ్య కాలపు రాజు కుమార గిరి రెడ్డి శ్రీ శైల శిఖా రానికి మెట్లు కట్టించాడు .
  విజయ నగర రాజులు 
౧౩౯౩-౯౪ లో విజయ నగక్ర రాజు రెండవ హరి హర రాయల భార్య వితలాంబ పాతాల గంగకు మేట్లుకట్టించింది .వీటినే భక్తులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు .హరి హర రాయలు ముఖ మంద పాన్ని దక్షిణ గోపురాన్ని నిర్మించాడు .పేద కోమటి వేమా భూపాలుడు ఇతన్ని ఓడించి ,మళ్ళీ శ్రీ శైలాని వశం చేసుకొన్నాడు .రెడ్డి రాజ్యం అంట రించిన తరువాత మొదటి దేవ రాయలు శ్రీశైలం స్వాధీనం లోకి తెచ్చుకొన్నాడు .1456 లో సాలువ తిరుమలయ్య గుడికి చానా దానాలు చేశాడు .ప్రౌఢ దేవ రాయల  పరి చారిక కూడా చాలా దానాలు చేసింది .వీర నరసింహ రాయల వంశం వాడు మహా మంద లేశ పర్వ త్య భూములు ,తోటలు కట్టడాలు దానం చేశాడు .కృష్ణ దేవ రాయలు తోరపు గోపు రానికి ఎదురుగా ఉన్న రాధా వీధిలో రెండు ప్రక్కలా మండపాలు కట్టించాడు .రాయల సేవకుడు మల్లప్ప కానుకలేనో సమర్పించాడు .చంద్ర శేఖరా మాత్యుడు 1529 లో కళ్యాణ మండపం కట్టించాడు .గర్భాలయ ద్వారాలకు బంగారు రేకులు తాపటం కృష్ణ దేవ రాయ ,తిమరుసుల విగ్రహాలను పెట్టించాడు .ఆలయ విమానానికి కొంత వరకు బంగారం పూయించాడు . చేయించాడు .
   శివాజీ మహా రాజు
1674 లో శివాజీశ్రీ శైలాన్న్ని దర్శించి ఉత్తర గోపురాని న్ర్మించాడు .ఆలయ రక్షణ కోసం మరాఠీ సైనికులను  కాపలా గా ఉంచాడు . ”రోహిల్లా ”దండు ఆలయం పైకి దండెత్తి వచ్చినపుడు మరాఠీ సైనికులలో ఆఖరి సైనికుడు చనిపోయ వరకు వీర పోరాటం చేసి ఆలయాన్ని రక్షించు కోవటానికి శతధా  ప్రయత్నించారట .
 నవాబులు 
మొఘల్ చక్ర వర్తి ఔరంగా జీబు ఈ ప్రాంతాన్ని జయించి ”రాజా భీమ సింగ్ ”ను గవర్నరు ను చేశాడు .సేనాని దావూద్ ఖాన్ కు దీన్ని జాగీరు గా ఇచ్చాడు .తరువాత అతడి తమ్ముడు ఇబ్రహీం కు ఇది దక్కింది .అతడు 1712  నాటి దాస్తా వేజుల ప్రకారం ,శ్రీ శైలం దేవాలయం కింద భూము లన్నీ పట్టాలిచ్చి స్వాధీనం చేసే శాడు .మొగలాయి పాలన తరువాత హైదరాబాద్    నవాబుల కాలం లో  ” ఆసఫ్జ్హా” 1782 లో శ్రీశైల దేవ స్థాన నిర్వ హణ బాధ్యతను పుష్ప గిరి పీఠానికి దఖలు పరచాడు .
  పుష్ప గిరి పీఠం
బ్రిటిష్ వారు కూడా 1840 లో  ఆలయ బాధ్యతలను పుష్పగిరి పీఠానికే అప్ప గించారు .సుమారు 100 సంవత్స రాలు ఈ పీఠం అధీనం లో ఆలయం వుంది .అయితే పీఠం నిర్వహణ ఏ మాత్రం బాగా వుండేది కాదు .భక్తులా సౌకర్యాలను పట్టించుకొనే వారు కాదు .ప్రభుత్వం కొంతకాలం జిల్లా కోర్ట్ ఆదీనం లో ఉంచింది .తర్వాత పాణ్యం రామయ్య అనే వారి అధ్యక్షతన మేనేజి మెంట్ బోర్డు ను ఏర్పర చింది .1949 లో దేవాదాయ ధర్మా దయ శాఖ అధీనం లోకి ప్రభుత్వం శ్రీ శైల దేవాలయాన్నితెచ్చింది .అప్పటినుంచి ,మంచి అభివృద్ద కార్య క్రమాలు రవాణా సౌకర్యాలు  సత్రాల నిర్మాణం చేబట్టి ప్రజల ఆద రాభిమానాన్ని పొందింది . ఇక్కడితో శ్రీ శైల దేవాలయ సందర్శనం పూర్తి అయింది .ఇక మిగిలింది నాలుగు ద్వారాల విశేషాలు ,నాలుగు మూలల విశేషాలు న్నాయి . .వాటిని గురించి ఈ సారి తెలియ జేస్తాను  .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -02 -12 .

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in శ్రీ శైలం and tagged . Bookmark the permalink.

2 Responses to శ్రీ శైల సందర్శనం —5

 1. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  Sir,
  గతం లో కూడా మీ కేదార్నాథ్ యాత్ర post లు చూసి ముగ్దుడనైతిని
  అలానే ఇప్పుడు
  శ్రీశైలం గురించిన సమస్త సమాచారం ఇస్తున్నారు చాల సంతోషం

 2. Subrahmanyam అంటున్నారు:

  శ్రీశైల క్షేత్రంలోని వివిధ ప్రదేశాలగూర్చి ఎంతో వివరంగా వ్యాసాలను వ్రాసి అందజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s