శ్రీ శైల ద్వార దర్శనం -1
తూర్పు ద్వారం -త్రిపురాంతకం
త్రిపురాంతకం విజయ వాడ ,శ్రీశైలం బస్ మార్గం లో ,శ్రీశైలానికి 80 కి. .మీ .దూరం లో వుంది .ఇక్కడ కుమార గిరి మీద త్రిపురాంతక స్వామి వెలసి వున్నాడు .అమ్మ వారు ”చిదగ్ని కుండ సంభూత అయిన” త్రిపుర సుందరి దేవి” .
ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా లో వుంది .
స్థల పురాణం
మధువు ,కైటభుడు అనే రాక్షస సోదరులుండే వారు .మధు కొడుకు సింహ వక్త్రుడు ,,సింహ శీర్షుడు .కైటభుని కొడుకుసింహ దంతుడు .ఈ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పు పొంది ఇనుము ,వెండి ,బంగారు నగరాలను నిర్మించుకొని బల గర్వం తో విజ్రుమ్భించారు .వీళ్ళే త్రిపురాసురులు .దేవతలంతా శివుడి తో మొర పెట్టు కొన్నారు .ఆ ముగ్గురిని చంప టానికి c శివుడు వారికి అభయం ఇచ్చాడు .భూదేవిని రధం గా చేసుకొన్నాడు శివుడు .నాలుగు వేదాలను గుర్రాలుగా ,,మేరు పర్వతం ధనుస్సు గా ,ఆదిశేషుడు అల్లె త్రాడుగా ,క్షీర సాగరం అమ్ముల పొది గా చేసుకొన్నాడు .మన్మధుడు బాణం గా ,దేవత లందర్నీ సైన్యం గా చేసుకొని వారిపై యుద్ధం చేశాడు .అర్ధరాత్రికల్లా త్రిపురాసుర సంహారం చేశాడు మహా దేవుడైన శివుడు .అందుకే త్రిపురాన్తకుడయాడు .అలసి పోయిన శివుడు ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొన్నాడు .భ్రమ రాంబ ఇక్కడ చిదగ్ని కుండం లో త్రిపురామ్బికా దేవిగా ఆవిర్భవించింది . త్రిపురాంతక స్వామి శిరస్సు పై గంగా ,ఎడమ వైపు పార్వతీ దేవి ,వుంటారు .ఇక్కడి నుంచి కాశీకి శ్రీ శైలానికి సొరంగ మార్గాలున్నాయని అంటారు . స్కందుడైన కుమారస్వామి తారకాసుర సంహారం చేసింది కూడా ఇక్కడే .అందుకే ఇక్కడి కొండకు ”కుమార గిరి ”అనే పేరు వచ్చింది .


ఇక్కడ అనేక వనాలు శిఖరాలు నదులు ,తీర్దాలు ,శివ లింగాలు ,అనేక దేవతా మూర్తులు వున్నట్లు ప్రతీతి ”.శ్రీ పర్వత ఖండం ” లో దీని ప్రశస్తి బాగా వర్ణించ బడింది .ఇక్కడ 15 రోజులు తపస్సు చేస్తే చాలు పునర్జన్మ ఉండదని అంటారు .

ఇక్కడి ఆలయం పెన్నా నది ఒడ్డున వుంది .ఇక్కడ ”దివ్య సిద్ధ వటం” అనే విశాల మైన మర్రి చెట్టు వుంది .దీని కింద చిన్ముద్ర తో దక్షిణా మూర్తి వున్నాడు .మర్రి చెట్టు ను తాకితేనే సర్వ పాపాలు పోతాయనే నమ్మిక వుంది .



జోగులాంబ స్వరూపం





నవ బ్రహ్మాలయం శిల్ప కళా విరాజితం .అన్ని కాలాల శిల్ప కళా దర్శనం ఇస్తున్దిక్కడ .



ఉమామహేశ్వర స్వామి
ఉమామహేశ్వరలింగం స్వయంభు లింగం .కింది నుండి ,సుమారు 500 అడుగుల ఎత్తున కొండ చివర ఒక మహా శీలా బయటికి వచ్చింది .దానికిందనే ఉమా మహేశ్వరుడు వెలిశాడు .ఆ తర్వాత ఆ మహా శిలనే పై కప్పు గా చేసి ఆలయం నిర్మించారు .గర్భాలయాన్ని ఆనుకొని ఉమాదేవి ఆలయం వుంది .దేవతా మూర్తుల ముందు శిలతో నిర్మించిన ”శ్రీ చక్రం ”వుండటం విశేషం.మహిషాసుర మర్దిని నందీశ్వర విగ్రహాలున్నాయి ,సంక్రాంతికి మూడు రోజుల బ్రహ్మోత్స వాలు జరుగు తాయి
ఇప్పుడు మూలలో వున్న ద్వారాల దగ్గరకు వెళ్దాం
ఆగ్నేయ ద్వారం -సోమశిల
దీనికి ”స్కంద సోమేశ్వరం ”అని కూడా పేరు .నెల్లూరు ,కడప మధ్య నల్లమల లో పెన్నా తీర్సం లో వుంది .స్కందుడు అనే రుషి ఇక్కడ తపస్సు చేసి పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని తెచ్చి సోమ గుండం గట్టున పెట్టి స్నానం చేయటానికి సోమ తీర్ధం లో దిగాడు .సోమేశ్వరుడు ప్రత్యక్షమై ,నాడు .
ఆ లింగం అక్కడే ప్రతిస్టించాడు .అమ్మ వారు కామాక్షీ దేవి
నైరుతి ద్వారం -పుష్ప గిరి
దీనికి’ ప్రసూనా చలం” అనే పేరు .కడప జిల్లా లో ఉత్తర పినాకినీ నదీ తీరాన వున్న క్షేత్రం .గరుత్మంతుడు అమృత భాండం తెస్తుంటే ,అందులోంచి ఒక బిందువు పుష్ప గిరి లోని సరస్సు లో పడింది .ఆ నీరు తాగిన వారందరికీ చావు ,పుట్టుక లేకుండా సుఖ సంతోషాలతో వున్నారు .
త్రిమూర్తులకు తెలిసి ఈ సరస్సును పూడ్చేయమని దేవతలను ఆజ్ఞా పించారు .వాయుదేవుడు ఎన్ని కొండ రాళ్ళను తెచ్చి అందులో వేసినా ,పూడి పోలేదు .చివరికి హను మంతుడు లక్ష్మీ దేవి ని పూజించి ,ఒక పెద్ద కొండను అందులోకి విసిరేశాడు .
అది కూడా మునగ కుండా పువ్వు లాగా తేలింది .అది చూసినా పున్దరీకుడనే రాజు దానికి ”పుష్ప గిరి ”అని పేరు పెట్టాడు .హరి హరుడు కొండను తొక్కి పడితే అది నిలిచింది .
ఈ కొండ పై ఆదికేశవ స్వామి ,సంతాన మల్లేశ్వరుడు ,లక్ష్మీదేవి ,తోక లేని హనుమంతుడు విగ్రహాలున్నాయి ఉమా మహేశ్వర ,నంది విగ్రహాలు దర్శనీయం.ఇక్కదిదేవతా విగ్రహాలను జనమేజయుడు ప్రతిష్టించినట్లు ఇతిహ్యం .
మనకున్న పీఠాలలో పుష్ప గిరి పీఠం ఒక్కటే” అసలు సిసలు తెలుగు పీఠం ”.
వాయువ్య ద్వారం -సంగమేశ్వరం
ఇక్కడ కృష్ణా నది అతి విశాలం గా సముద్రం లా గా కనిపిస్తుంది .కర్నూలు జిల్లా నది కొట్కూరు కు దగ్గరలో వున్న క్షేత్రం .దీనికి ”నివృత్తి సంగమేశ్వరం ”అని పేరు .కృష్ణ ,వేణి ,తుంగ, భద్ర ,భీమ ,రది ,,మాల భవ నాశిని అనే ఏడు నదులు ఈ క్షేత్ర నాధుడైన సంగామేశ్వరున్ని సేవిన్కాతానికి ఇక్కడికి చేరాయట .ఇక్కడే దక్ష యజ్ఞం సందర్భం గా తండ్రి చేత అవమానం పొందిన దాక్షాయిని తన శరీరాన్ని నివృత్తి చేసుకోవా టం వల్ల నివృత్తి సంగ మేశ్వరం అనే పేరొచ్చింది .
గ్రహణం రోజున సప్త సాగరాలు అన్ని తీర్దాలు ఇక్కడికి చేరుతాయని ,అప్పుడు ఏఎ సప్త సింధు లో స్నానం చేస్తే సర్వ తీర్ద్ సర్వసాగర స్నాన ఫలితం లభిస్తుందని నమ్మకం .
వసిష్ఠ మహర్షి శాపం వల్ల ”కల్మాష పాడుదు ”అనే రాజు ,రాక్షస రూపం పొందాడు .అతడు వసిష్టుని వంద మంది కొడుకుల్ని చంపి బ్రహ్మ హత్యా పాతకం తెచ్చుకొన్నాడు .విశ్వామిత్రుడు అతనిపాపాలన్ని పోగొట్టి ,తాను ఆ పాపాలకు బలి అయాడు .ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది .ఇక్కడికి వచ్చి సంగమేశ్వరం లో స్నానం చేసి గాయత్రి జపం చేసి శివుడిని ప్రతిష్ఠిస్తే పాపాలు పోయాయట .విశ్వామిత్ర గుహ ఇక్కడ వుంది .శాండిల్య మహర్షి ఇక్కడే తపస్సు చేసి అంగ వైకల్యాన్ని పోగొట్టు కొన్నాడు .విశ్వామిత్ర గుహకు దగ్గరలో వసిష్టుడు ప్రతిష్టించిన నృసింహ స్వామి విగ్రహంవుంది .సప్త సోమేశ్వరులున్నారు .కపిల మహర్షి ప్రతిష్టించిన శివ లింగం వుంది .ధర్మా రాజు భీముడు ప్రతిష్టించిన లింగాలు వున్నాయి .
అయితె ఇదంతా పూర్వ వైభవమే .శ్రీశైలం డాం కట్టటం వల్ల ఇదంతా మునిగి పోయింది .సంగామేశ్వరాలయాన్ని ఇక్కడి నుంచి తర లించి అలంపురం లో నిర్మించారు
ఈశాన్య ద్వారం -ఏలేశ్వరం
మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఏలేశ్వర క్షేత్రం వుంది .ఒకప్పుడు మహా పట్టణం .అనేక దండయాత్రల వల్ల నిర్జనం అయింది నాగార్జున సాగర్ ముంపు వల్ల ఆనవాలు కోల్పోయింది .ఏలేశ్వర స్వామి కాత్యాయినీ ,హాటకేశ్వారి దేవేరులతో విలసిల్లె క్షేత్రం . అష్ట భైరవ ,నవ దుర్గ ,నవ నార సింహ ప్రతిమలున్నాయి . .నదికి ఎడమ వైపు వున్న మల్లికార్జున గుట్ట పై రెండుఆలయాలున్నాయి .ఇక్కడి గుహలో ఇప్పటకీ సిద్ధులు వున్నారని నమ్మకం వుంది . ఈ ఆలయాన్ని కూడా సాగర్ దగ్గర స్తూపం వద్దకు తరలించి అక్కడ పునర్నిర్మించారు . .
పంచ మఠాలు
శ్రీశైలం లో ఆలయానికి వాయువ్యం గా 100 మీటర్ల దూరం లో,”ఘంటా మఠం ”వుంది .ఇదే బ్రహ్మం గారి మఠం .ఆయన ఇక్కడ తపస్సు చేశారని కధనం.దీని పక్కనే ఆరుముఖాలున్న విగ్రహం వుంది .ముందు మూడు ,వెనుక మూడు ముఖాలున్డటం ప్రత్యేకత .ఇది గాయత్రీ దేవి విగ్రహం గా బావిస్తారు .దీనికి ముందు ఎప్పుడూ నీరు ఊరే ఘంటా తీర్ధంవున్సి ఇక్కడి కుండం ,దానిపై వేలాడే గంటా వున్నాయి .షణ్ముఖ కుమారస్వామి విగ్రహం ముచ్చట గా వుంటుంది .
దీనికి కొంచెం దూరం లో నల్ల రాయి మీద బీజాక్షరాలు రాసి వున్న యంత్రం వుంది .శాంతి మల్లయ్య అనే అతను ఇక్కడ మఠం లో వుంటూవిభూతి తయారు చేసి భక్తులకు ఉచితం గా ఇచ్చే వాడు .అందుకే ఆపేరు .ఇప్పుడిది లేదు
దీనికి దగ్గరలో రుద్రాక్ష మఠం వుంది .ఇక్కడి శివలింగానికి రుద్రాక్ష లతో పూజించటంవల్ల ఆపేరు వచ్చి ఉండచ్చు .మల్లి శంకరస్వామి అనే మహనీయుడు మేలి రకం రుద్రాక్షలు తెప్పించి భక్తులకిచ్చి ,ఆశీర్వ దించే వాడట .
దీనికి పైన ఎత్తున పది అడుగుల పుట్ట,అందులో.పదకొండు అడుగుల సర్పం వుంది .అనాదిగా ఇది ఇక్కడే వుంది .
ఇక్కడే వున్న” శివలింగానికి జటా జూటం ,రుద్రాక్ష మాల” వుండటం విశేషం .
దీనికి దగర లో సారంగధర మఠం వుంది దీనికి చుట్టూ ఎత్తైన ప్రాకారం వుంది ..కుడి వైపున నేలలో పెద్ద గుహ వుంది .తపస్సు కు అనుకూలం ..సారంగేశ్వరుడు అనే మహర్షి దీన్ని నిర్మించాడు .నందీశ్వర శివ లింగాలు నల్ల రాతి తో చెక్క బడి నాయి .
ఈ మఠానికి ఎదురుగా కపాల భైరవ స్వామి ఆలయం వుంది .
ఇవి శ్రీశైల ద్వార ,మఠా విశేషాలు
శ్రీ శైల యాత్ర సర్వం సంపూర్ణం
”సంధ్యా రంభ విజ్రుమ్భితం శృతి శిరస్థానాంత రా దిష్టితం
సప్రేమ భ్రమ రాభి రామ మసక్రుత్సద్వాసనా శోభితం
భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం ,గుణా విష్క్రుతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ”.( శ్రీ శంకారాచార్య విరచిత- ”శివానంద లహరి”)
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .
శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
పుష్పగిరి గుడి ఫోటో చాలా బాగుంది. నే కాపీ తీసేసుకున్నా 🙂