యజ్ననర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –2

 యజ్ననర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ  
 శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –2
సప్పా దుర్గా ప్రసాద్ గారు నట రాజు వద్ద తీవ్ర సాధన చేసి నృత్య కళా మర్మజ్నత సాధించారు .వారి అభిప్రాయాలు కూడా చాల విలువైనది గా కళా కారులు భావించే వారు .”మగ వారి లో మగటిమి ని ,నిలబెట్టే ఏకైక పురుష తాండవ విన్యాసం పేరిణి శివ తాండవం .అందుకే నట రాజు గారు దాన్ని పునరుద్ధరించారు .”అని ప్రసాద్ ప్రశంశించారు కాకతీయ ఆంద్ర రాజ్య కాలమ్ లో వీర శైవు లైన వీరులు ,మహేశులు ,పశుపతులు ,మైలార దేవులు అనే కుటుంబాలు పేరిణి శివ తాండవ  ప్రదర్శన చేసే వారు .వీటిని శివాలయం లో శివ ప్రీతికి ,సైన్యంయుద్ధానికి సన్నద్ధం అవుతున్నప్పుడు ముందు రోజు ఉత్తేజ పరచటానికి ,సామాన్య ప్రజల వినోదానికి ప్రదర్శించే వారు .కాకతీయ గజ సైన్యాధ్యక్షుడు జాయప సేనాని రచించిన ”నృత్య రత్నావళి ”ని ,రామప్ప గుడి లోని ఎనిమిది ప్రధాన శిల్పాల భంగిమలను ఆధారం గా తీసుకొని ,నట రాజ రామ కృష్ణ ”పేరిణి శివ తాండవం ”ను మూడు గంటల  నిర్విరామ ,మహోధృత విన్యాసం గా పునః సృష్టి చేశారు .అది అసాధారణ ప్రజ్న అని నట రాజు గారి శేముష్శికి  కీర్తి కిరీటం పెట్టారు .ప్రసాద్ గారు గురువు గారి ఆధ్వర్యం లో రోజుకు ఎనిమిది గంటల పాటు తీవ్ర సాధన చేసి దాన్ని కరతలా మలకం చేసుకొన్నారు .నట రాజు చెప్పినట్లు ”శరీరం లోని ప్రతి అవయవం కదిలి ,ప్రతి కండరం నర్తించి ,ప్రతి రక్తపు బిందువు ఉప్పొంగి ”నాట్యం ఆడే వారు ప్రసాద్ గారు .పేరిణి ప్రదర్శన లో ముందుగా శివ ప్రేరణ ,తరువాత తాహన నర్తనాలు ,ఆ తర్వాత శృంగ నర్తనం ,ఆ పిమ్మట పృధ్వీ ,ఆపస్ ,తేజో ,వాయు ఆకాశ పంచ ముఖ శబ్ద నర్తనాలు ,చివరికి సమీరణ యతి వరుస క్రమం లో వుంటాయి .
 అకాడెమి రద్దు భాగవతం 
యెన్.టి.రామా రావు ముఖ్య మంత్రి అయిన తారు వాత ఒక ”దుర్ బ్రాహ్మీ ముహూర్తం ”లో అకాడెమీలను ,ఆస్థాన విద్వాంసుల పదవులను ఒకే కలం అనే కత్తి పోటు తో రద్దు చేశాడు .నట రాజు ఏమీ అనలేక మూగ నోము పట్టారు .రామా రావే ఒక సారి వచ్చి మాట్లాడ మని నట రాజు గారికి కబురు చేశారు .రామ కృష్ణ గారితో దుర్గా ప్రసాద్ కూడా రామా రావు దగ్గరకు వెళ్ళారు .”రద్దు బాదిం  చిందా   ?”అని రామా రావు అడిగాడు నట రాజు గార్ని .”అంజయ్య గారు ముఖ్య మంత్రిగా ఇస్తే పొంగీ పోలేదు ,మీ రద్దు వల్ల కుంగీ పోలేదు .నేను కళా కారుడిని.బ్రహ్మ చారిని. నాకే బాధా లేదు ”అన్నారు రామ కృష్ణ గారు .ప్రక్కనే ఉన్న దుర్గా ప్రసాద్ గారు మాత్రం ఒకఅడుగు  ముందు కు వేసి ”ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వారెవరు ఆస్తులు లేని వారు కాదు .ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి వల్ల ఇబ్బంది ఎదు రైతే ,గౌరవ వేతనాలు తీసేసి ,పదవుల్ని వుంచండి .అప్పుడు గౌరవం గా వుంటుంది ”అని నిక్కచ్చిగా తగిన సూచన చేశారు .ఇంత ముక్కుకు సూటిగా మాట్లాడిన సప్పా వారి వివ రాలు తెలుసుకొన్నారు అన్న గారు .”ఆలోచిస్తాం ”అని ఆ నట సార్వ భౌముడి సమాధానం .అంతే .మళ్ళీ అడుగు ముందుకు సాగ లేదు .ఒక కళా కారుడు గా రామా రావు తగని పనే చేశాడు .ఎవరో చెవిలో పోరటం వల్లే జరిగిందని ఆ తరు వాత అందరికి తెలిసింది .ఒక రకం గా సకల కళల పట్ల అపచారమే జరిగింది .చరిత్రలో దుర్దినం .అనా లోచిత నిర్ణయం.ఇప్పటి వరకు మళ్ళీ వాటి పునరుద్ధరణ జరగ లేదంటే కళల పట్ల మన ప్రభుత్వాలకున్న తేలిక భావం ఏమిటో తెలుస్తోంది .ప్రక్క రాష్ట్రాలు కళా కారులను అందలం ఎక్కిస్తుంటీ ,మనం వెర్రి మొహాలేసుకొని చూస్తున్నాం .ఇంత మంది పార్లమెంట్ సభ్యులు ,ఇందరు శాసన  సభ్యులు వుండి ఆసన సభ్యులు గా మాత్రమె వుంటూ  చేతులు ముడుచుకు కూచుంటే  చరిత్ర  క్షమించదు .తెలుగు వారి ఆత్మా గౌరవం పేరు తో గద్దె నెక్కిన కళా కారుడు చేయాల్సిన పని కాదు .చరిత్ర లో అదొక దురదృష్ట సంఘటన గానే మిగిలిపోయింది . ..
  గురు దక్షిణ 
గోదావరి తీరానికి సాంస్కృతిక రాజ దాని రాజ మహేంద్ర వరం .ఆ చుట్టూ ప్రక్కల వేలాది కళా కారులు వివిధ కళల లో ఆరి తేరిన వారున్నారు .ఎందరో యువకులు ఉత్సాహ వంతులు కళల పట్ల ఆసక్తి కలిగి వన్నారు .వీరికి మంచి శిక్షణ నిస్తే రాణించి అభివృద్ధి సాధిస్తారనే మంచి ఆలోచన దుర్గా ప్రసాద్ గారికి వచ్చింది .గురువు గారు అనుమతినిచ్చారు .వెంటనే ”నట రాజ నృత్య నికేతన్ ”ను రాజ మండ్రి లో స్థాపించారు .1983 ఆగస్ట్ 18 న ,గురువు నట రాజు గారితో ప్రారంభింప జేశారు .శ్రీ వెంకటేశ్వరా ఆనం   కళా కేంద్రం లో సప్పా దుర్గా ప్రసాద్ ఒక్కరే రెండున్నర గంటల సేపు ఏక ధాటిగా ”పేరిణి శివ తాండవం ”ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు .క్రిక్కిరిసిన రసజ్ఞులు ఆనంద నృత్యమే చేశారు. కోరాడ నరసింహా రావు గారు  ప్రశంసా పూర్వకం గా మాట్లాడుతూ”’ఈ కీర్తి ,గౌరవంనాకు   దక్కాల్సింది .ఆ అదృష్టం రామ కృష్ణ కు దక్కింది .దుర్గా ప్రసాద్ మా అబ్బాయే కనుక ,పెద తండ్రిగా మాత్రమే నాకు ,కన్న తండ్రిగా సత్య నారాయణకు కీర్తి దక్కినా ,గురువు అనే కీర్తి మా రామ కృష్ణ కొట్టే శాడు  ”అంటూ ఆనంద బాష్పాలు రాల్చేశారు కోరాడ వారు .ఈకేంద్రం గురువు గారికి తాను ఇచ్చిన గురు దక్షిణ అంటారు ప్రసాద్ .ఇంతటి మధుర మైన ఘట్టం తన జీవితం లో అదే నంటారు సంతృప్తిగా ప్రసాద్ గారు .ఆ నాటి సప్పా వారి ప్రదర్శనకు గురువు గారు నట రాజు రామ కృష్ణ గారు స్వయం గా ”నట్టువాంగం ”చేయటం తన అదృష్టం అని పొంగి పోయారు శిష్యుడైన దుర్గా ప్రసాద్ గారు .
  విస్తృత ప్రచారం 
నృత్య నికేతన్ ప్రారంభించిన ఒక్క ఏడాదికే ప్రసద గారి కృషి వల్లా ,ఆకట్టుకొనే చక్కని ఉపన్యాసాల వల్ల ఆంద్ర నాట్య ,పేరిణి శివ తానదవాల్కు విస్తృత ప్రచారం లభించి ,ఆ బాల గోపాలం వీటికి ఆకర్షితు లైనారు .అప్పుడప్పుడు నట రాజు వచ్చి సలహాలిచ్చే వారు .1984 ఉగాది నాటికి 18 మంది యువకులు పేరిణి శివ తాండవం అభ్య శించారు .అయిదుగురు ”బాల పేరిణి వీరులు ‘నేర్చారు . . యువకులలో ఆచంట చంద్ర శేఖర్ ,బోడపాటి శ్రీనివాస్ ,చంద్ర రావు ,కృష్ణ మూర్తి ,వెంకట్రావు .బాబు రావు ,రాజేష్ ,అప్పా రావు ,రామ కృష్ణ  మొదలైన వారున్నారు .ఇంత మంది ఒకే చోట నేర్వటం తాను ఎక్కడా చూడ లేదని ,నట రాజు మనస్పూర్తి గా మెచ్చారు .గురువును మించిన శిష్యుడని పించుకొన్నారు ప్రసాద్ గారు .పేరిణి ని నర్తించే వారు దేశం లో వున్నారు కాని ,నాట్యా చార్యులు గా శిష్యులను తయారు చేసి ప్రదర్శిస్తున్న ఏకైక వ్యక్తీ ,తన శిష్యుడు బిడ్డ లాంటి వాడు అయిన దుర్గా ప్రసాద్ ఒక్కడే నని లోకానికి తెలియ జేశారు నట రాజ రామ కృష్ణ .ఉగాది కానుక గా శిష్యుడైన సప్పా వారికి పేరిణి నట్టువ తాళాలు ,కుంభ హారతి ,పేరిణి మృదంగం కానుక గా అంద జేశారు గురువులు రామ కృష్ణ గారు .వాటిని మహద్భాగ్యం గా స్వీకరించారు .
  కళా కృష్ణ   ఉదంతం 
నట రాజు శిష్యులలో మొదటి వాడు కళాకృష్ణ .ఆ తరువాతే మిగతా వారు .అతనోక్కడికే  నట రాజు గారు ”నవ జనార్దన పారి జాతం ”విద్యనూ అంతా నేర్పారు .గురువు తో చాలా కాలం ఉన్న కృష్ణ .ఏదో కారణం వల్ల నట రాజుకు దూరం అయాడు .ఇది ఆయనకు ,సప్పా వారికి బాధ గానే వుండి .నవ జనార్దన పారిజాతం మొత్తం వెళ్లి పోయినట్లు ఇద్దరు బాధ పడ్డారు .పేరిణి మాత్రం సప్పా వారితో పాటు ఏడుగురికి నేర్పారు రామ కృష్ణ .నవ జనార్దన పారిజాతం కళా కృష్ణ ఒక్కడికే సాధ్యమని నమ్మారు దుర్గా ప్రసాద్ .కళా కృష్ణ గురువు గారిని వదిలి వెల్ల టానికి కారణం గురించి చర్చించారు ప్రసాద్ .తాను అతనికి అన్నీ నేర్పానని కొడుకు లా చూశానని గురువు గారన్నారు .అయితే దుర్గా ప్రసాద్ ఒప్పుకోలేదు అతనికి అన్యాయం జరిగింది మీవల్ల అని నిష్కర్ష గా చెప్పారు .కళా కృష్ణ కోసం నట రాజు గారు ఏమీ చెయ్య క పోవటం విచారకరం అన్నారు .గురువు జరిగిన దానికి బాధ పడ్డారు .ప్రసాద్ గారు ఒక చక్కని సలహా ఇచ్చారు కళా కృష్ణ కు ఘన సన్మానం చేస్తే ,అన్నీ సమసి పోతాయని తెలియ జేశారు .గురువు ఆనందం గా సమ్మ తించారు .నవ జనార్దన పారిజాతం వెల్లి విరిసిన కుంతీ మాధవ క్షేత్రం లో ,పిఠాపురం రాజా వారి కోట ప్రాంగణం లో కళా కృష్ణ తో ”నవ జనార్దన పారిజాతం ”ప్రదర్శింప జేసి ,”అభినవ సత్య భామ ”బిరుదు ప్రదానం చేసి అత్యంత వైభవం గా ఘన సన్మానం చేశారు .ఆంద్ర దేశం నలు మూలలో ఉన్న నట రాజు శిష్య బృందం ,నవ జనార్దన కళా కారులు ,వందలాది గా పాల్గొని కన్నుల పండువ చేశారని గురు శిష్యులిద్దరూ మళ్ళీ దగ్గరవటం తన కెంతో ఆనందం , సంతృప్తి కల్గించిందని ,స్వయం గా పాల్గొని అభినందించారు దుర్గా ప్రసాద్ .కళా కారులు మరువ లేని రోజు గా ఆ రోజు నిలిచి పోయింది అన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -02  -12 -మహా శివ రాత్రి పర్వ దినం

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.