యజ్న నర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ- శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ -1

 యజ్న నర్తన సృష్టి కర్త  నృత్య ప్రపూర్ణ-
శ్రీ  సప్పా దుర్గా ప్రసాద్ -1 

          నట రాజ రామ కృష్ణ అంటే ఆంద్ర నాట్యానికి నిలు వెత్తు మూర్తి అని భావిస్తాం .అలాంటి రామ కృష్ణ గారి ని గురువు గా స్వీకరించి ,అంతే వాసిగా వుండి ,ఆయనపై వీర అభిమానాన్ని మనస్సంతా నింపుకొని ,తన గురువు ”పేరిణి శివ తాండవాన్ని పునః సృష్టి చేస్తే ,గురువుకు తగ్గ శిష్యుడి గా  తాను ”యజ్న నర్తనం ”అనే ప్రక్రియను సృష్టించి ,నృత్య విద్యాలయాన్ని స్థాపించి ,ఎందరికో నేర్పి ,గురు ప్రశంసను పొందిన ఆంద్ర నాట్య కళా కారులు ,”నృత్య ప్రపూర్ణ ”బిరుదాంకితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ గారు .వారి జీవితం ఎందరికో స్ఫూర్తి .వారి జీవిత విశేషాలను తెలుసు కొందాం .
 నట రాజు తో పరిచయం
నట రాజ రామ కృష్ణ గారు వీరికి మాతామహుల తాలూకు తాత వరుస .రాజ మండ్రి నివాసి అయిన నాట్యా చార్యులు సప్పా  సత్య నారాయణ గారి కుమారులు .తండ్రి గారు ”వెంకటరాయ నాట్య బృందం ”స్థాపించి ,ఎన్నో ప్రదర్శనలిచ్చి ,దేశం లోనే పేరెన్నిక గన్న సుప్రసిద్ధ నాట్యా చార్యులు .వీరికి కళా రసజ్న సేఖరు లైన నార్ని కేదారీశ్వరుడు  గారు సహచరులు .నట రాజు గారు రాజమండ్రి వచ్చినపుడల్లా వీరింటి లోనే ఆతిధ్యం .చిన్న తనం లోనే రామకృష్ణ గారిని చూసి ,వారి వైదుష్యానికి ముగ్ధులై నారు దుర్గా ప్రసాద్ గారు .తాను కూడా వారి వద్ద హైదరాబాద్ లో నాట్యం నేర్చుకోవాలన్న ఉబలాటం వుండేది .అది చాలా ఖర్చు తో కూడిన పని అని తండ్రి గారు ప్రోత్స హించ లేదు .అయినా కోరిక పెరిగిందే  కాని తగ్గ లేదు .
విశ్వ విఖ్యాతనాట్య పండితులు నట రాజ రామ కృష్ణ గారికి ”సువర్ణ మకుటాభిషేకం”  కాకి నాడ లో జరిగింది .ఆ కార్య క్రమాన్ని ”ఆంద్ర గోపి కృష్ణ ”గా గుర్తింపు పొంది ,నాట్య రంగం లో రాష్ట్ర పతి ప్రశంసలు పొందిన ,నృత్య కళా కారులైన  వీరి తండ్రి గారే అందరి సహకారం తో ఏర్పాటు చేశారు .కాని ఆ రోజూ ఆయన  అనారోగ్య కారణం వల్ల కాకి నాడ వెళ్ళ లేక పోయారు .కుమారుడైన దుర్గా ప్రసాద్ ను నట రాజ  ను పుష్ప మాల తో అలంకరించ మని పంపారు .అక్కడే  రామ కృష్ణ గారి ముఖ్య శిష్యుడు ”కళా కృష్ణ ”తో  తొలి పరిచయం జరిగింది .నట రాజు గారికి పుష్ప మాల సమర్పించే అరుదైన అదృష్టం తనకు కలిగి నందుకు దుర్గా ప్రసాద్ పొంగి పోయారు .నట రాజు గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన నాట్యా చార్యులుగా ,నృత్య అకాడెమి అధ్యక్షులుగా వుండే వారు .అప్పుడు తూర్పు గోదావరి జిల్లా పసల పూడి దగ్గరున్న ”కుతుకు లూరు ”లో ”జాన పద నృత్యోత్సవం” నిర్వ హించారు .ఎందరెందరో కళాకారులు ఎన్నో వైవిధ్య భరిత నృత్యాలు చేసి అందర్నీ ఆశ్చర్య పర చారు .అది చూసి నటరాజు పరవశం చెందారు .తానూ ఒకడిగా మారి ఊగి పోయారు .దుర్గా ప్రసాద్ గారు రామ కృష్ణ గారి లోని కళా తత్వాన్ని ఇక్కడే పూర్తిగా అర్ధం చేసుకొన్నారు .ఆ సభలో ప్రముఖ నాట్యాచార్యులు కోరాడ నరసింహా రావు గారు కూడా వుండి గొప్ప ప్రేరణ కలిగించారు .
ఆ తర్వాత నట రాజు గారు రాజ మండ్రి లో వీరింటికి వచ్చి  ఆతిధ్యం స్వీకరిస్తూ బాల దుర్గా ప్రసాద్ ను ఆత్మీయుని గా భావించి దగ్గరకు తీసుకొన్నారు .ప్రసాద్ తండ్రి ”క్రీస్తు చరిత్ర ”ను నృత్య నాటకం గా ప్రదర్శించాలనే సంకల్పం తో అకాడెమి నుంచి ఆర్ధిక సాయం కోరారు .ఆ నాటకాన్ని స్వయం గా పరిశీలించా టానికి రామ కృష్ణ గారు రాజ మండ్రి విచ్చేశారు .వారి సమక్షం లో ప్రదర్శన జరిగింది .ఆ నాటకం లో దుర్గా ప్రసాద్ నాలుగు పాత్రలు ధరించారు .ఆ రోజూ ఒక నటుడు రాక పొతే ఐదో పాత్ర కూడా చేశారు .చూసిన నట రాజు ఆనంద తాండవమే చేశారు .ప్రసాద్ నటన ను మెచ్చారు .ఆ కుర్రాడు తన స్నేహితుడు సత్య నారాయణ గారి కుమారుడే నని తెలుసు కోని మరీ ఆనంద పడి పోయారు .కుర్రాడికి ఉజ్వల భవిష్యత్తు వుందని ఆశీర్వ దించారు నట రాజు .ఇంటికి వెళ్ళిన తరువాత కుర్రాడిని తన శిష్యునిగా చేయమని తండ్రి ని కోరారు .తండ్రి ఒప్పు కోలేదు .ఆ తర్వాత రెండు మూడు సార్లు రామ కృష్ణ ఒత్తిడి కూడా చేశారు .టేలిగ్రాములిచ్చారు .దుర్గా ప్రసాద్ గారిలో ”వీరుని లక్షణాలు ”పుష్కలం గా వున్నాయని ,అతన్ని ఉత్తమ కళా కారునిగా తీర్చి దిద్దే బాధ్యత  తనకు అప్ప గించమని కోరారు .ప్రసాద్ గారు స్వయం గా నట రాజు గారిని కలిసి తమ కుటుంబం పెద్ద దని ,పెళ్లీడు ఆడ పిల్లలున్నారని , తండ్రి గారి ఆరోగ్యం బాగా లేదని పెద్ద కుమారిడిగా తన బాధ్యత పెద్దదని తాను రాజ మండ్రి పేపర్ మిల్లు లో పని చేస్తునానని తనకు నేర్చుకోవాలని వున్నా పరిస్తితుల వల్ల రాలేనని మర్యాదగా వినమ్రం గా వినయం గా తెలియ జేశారు .ఖిన్నుడైన నట రాజు మౌనం వహించి వెళ్లి పోయారు .
 నృత్య శిక్షణ 
నట రాజు గారు ప్రసాద్ ను పంపమని తండ్రి గారికి చెబుతూనే వున్నారు ,కుటుంబానికేమీ భయం వద్దని  ,ప్రసాద్ భవిష్యత్తు ను తన చేతి లో పెట్ట మని మరీ బల వంతం చేశారు .అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .రాజ మండ్రి ఆంద్ర పేపర్ మిల్లు కూలీల సమ్మె వల్ల మూసే శారు .ప్రసాద్ గారికి మంచి అనువైన సమయం .ఆలశ్యం చేయ కుండా తండ్రి గారితో హైదరాబాద్ చేరి నట రాజు గారి వద్ద చేరారు .వారింట్లోనే తిండి మకాం .నట రాజు పూజా సామగ్రి తానే తెచ్చి నాట్య శిక్షణ ప్రారంభించారు .కోరిన  విద్యార్ధిశిష్యుడి గా  లభిస్తే గురువు ఆనందానికి  అవధులు వుండవు .ఉదయం అయిదు గంటల నుంచి ఏడు గంటల వరకు గురు సమక్షం లో ,శిక్షణ తో నృత్యాభ్యాసం చేసే వారు .ఆ తర్వాత ఉదయం పద కొండు గంటల వరకు పేరిణి శివ తాండవం నేర్చుకొనే విద్యార్ధులకు ప్రసాద్ గారు ఆయన సహ నటులు వారికి శిక్షణ నిచ్చే వారు .త్యాగ రాజ గాన సభకు వెళ్లి వాద్యాల సహ క్రంతో సాధన చేసే వారు .
గురువు తో కలిసి వీలైనప్పుడల్లా రవీంద్ర భారతి లో వున్న ”కళా భవన్ ”కు వెళ్లి కార్య క్రమాలను వీక్షించే ఇలా ఆరు నెలలు గది చింది .నటరాజు గారి పుత్ర వాత్సల్యం ముగ్ధుణ్ణి చేసింది .ఆయన దీక్ష ,పట్టుదల ,సాధన కు అబ్బుర పడ్డారు .లాకౌట్ ఎత్తేయటం తో మళ్ళీ రాజ మండ్రి వెళ్లి ఉద్యోగం లో చేరారు .రెండు నెలలు నాట్యశిక్షణ   ,ఒక నెల ఉద్యోగం గా దీర్ఘ కాల సెలవులను పెట్టి సాదించుకొన్నారు . .చాలా కాలమ్ ఇలానే జరిగింది .ఉద్యోగం చేస్తూ శిక్షణ నేర్చారు .ఆంద్ర నాట్యం ,పేరిణి శివ తాండవం లలో మంచిశిక్షణ   లభించింది .గురువంత వాడు అయారు .పేరిణి శివ తండ వాణ్ని నట రాజు పునః సృష్టి చేస్తున సమయం లో దుర్గా ప్రసాద్ ”నట్టు వాంగం ”జతి పలుకుతూ ,అందులో దిట్ట అని పించుకొన్నారు .ఇది తన గురువు  పెట్టిన భిక్ష అనే వారు దుర్గా ప్రసాద్ .దుర్గా ప్రసాద్ జతి చెబుతుంటే ”వేద నాదం ”విని పిస్తున్నట్లు వుండేది అని నిష్ణాతులు మెచ్చుకొనే వారు .తరువాత వేదాధ్యనము చేసి అందులోని తీరు ను స్వయం గా దర్శించారు ..http://nrityaprapurnasappadurgaprasad.com/dance.html
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -02 -12 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.