కృష్ణా జిలాలో చిన్న సంస్థానాలు –2
జుజ్జూరు
కంచిక చర్ల కు ఆరు కి.మీ.దూరం లో జుజ్జూరు వుంది .బెజవాడను పరి పాలించిన కలువ కొలను వారే జుజ్జూరు జమీందార్లు .అక్కడ కోట కట్టి పాలించారు .దీని పక్కనే ఉన్న నంది గామ కు వాసి రెడ్డి వారు ప్రభువులు .జుజ్జూరు మాది రాజు వారికి ,మధిర కలువ కొలను వారికి శత్రుత్వం వుండేది.మధిర జమీందార్లు మాది రాజు వారిని చంపి జుజ్జూరు ను 1750 ప్రాంతం లో ఆక్రమించారని కదా వ్యాప్తి లొం వుంది .ఇది బ్రాహ్మణ ప్రభువులు ఏలిన సంస్థానం .
పరిటాల
పర్తియాల పరిటాల గా మారిందని భావిస్తున్నారు .జూపల్లి వారి సంస్థానం ఇది.జూపల్లి వెంకటాద్రి సాహిత్య పోషకుడు .ఎల కూచి బాల సరస్వతి వ్రాసిన ”చంద్రికా పరిణయం ”కావ్యాన్ని అంకితం పొందాడు .వదాన్యుడు అనే పేరుంది .రంగ రాజు అనే తిట్టు కవి ”నానాటి కొగిన్ భువిని శివాన్విత మగు నీ భవనము జూపల్లి లింగ భవ గుణ భంగా ”అని శపించాడట .దానితో వైభవమంతా పోయింది .విలువైన వజ్రాలు ఇక్కడ దొరికేవి .అందుకే గని పరిటాల అంటారు .అతి విలువైన కోహినూర్ వజ్రం ఇక్కడే దొరికింది .పరిటాల తాలూకా లో ఏడు గ్రామాల్లో వజ్రాలు దొరికేవి .అందుకని ”కన్నాత్ తాలూకా ”అంటే ”గని తాలూకా ”గా పేరొచ్చింది .స్వాతంత్రం వచ్చిన తరు వాత కూడా ఈ ఏడు గ్రామాల ప్రజలు నిజాం పై తిరుగు బాటు చేసి స్వతంత్రం ప్రకటించుకొన్నారు .అణచా టానికి నిజాం విశ్వ ప్రయత్నం చేశాడు .26 -01 -1950 లోభారత ప్రభుత్వానికి స్వాధీనం చేసి ,రిపబ్లాక్ లో కలిపాడు .అప్పుడది కృష్ణా జిల్లా లో భాగం అయింది .
కలిదిండి
రాజా రాజ నరేంద్రుని తాత్కాలిక రాజధాని గా కలిదిండి పేరు తెచ్చుకొన్న చారిత్రాత్మక పట్టణం .ఇక్కడి మూడు శివాలయాలను రాజా రాజ నరేంద్రుడు కట్టించాడు .నన్నయ భట్టా రకుడు ,ప్రభువు రాజా రాజ నరేంద్రుని తో ఇక్కడికి వచ్చి పాతాళ భోగేశ్వర స్వామిని సందర్శించాడు .ఇక్కడే భారత ఆంధ్రీ కారణానికి బీజం పడిందని అంటారు .ఈస్ట్ ఇండియా వారి పాలన వరకు దీని వైభవం బాగా సాగింది .రాజు గారు ఒక వీరుడికి కలిదిండి ని దానం ఇచ్చాడని ఆ వూరి పేరే ఆయన ఇంటి పెరైనదని ప్రచారం లో వుంది .అప్పటి దాకా కలిదిండి వంశీకుడు తిరుపతి రాజే పాలకుడు .1780 లో జమీందారి వ్యవస్థ క్రమ బద్ధ మై శాశ్వత శిస్తు నిర్ణయ పధ్ధతి అమల్లోకి వచ్చింది .శిస్తు బకాయి పడ్డ తిమ్మరాజు నిజాం రాజ్యం లోకి పారి పోయాడు .కలిదిండి కంపెని ప్రభుత్వం అధీన మైంది .కలిదిండి కోట చాలా బలం గా వుండేది .ఎనిమిది ప్రాకారాలున్న కోట .తూర్పు ప్రాకారం కోట కలిదిండి గా పిలువ బడేది .అదే రాజ వీధి కూడా .పడమర వైపు రాజ ప్రముఖులు ,,పుర ప్రముఖులు వుండే వారు .ఇక్కడి పాతాళ భోగేశ్వ రాలయం చాలా ప్రసిద్ధి చెందింది .నీటి జల బుడగల శబ్దం తో ”హర హర ”శబ్దం గా విని పిస్తుంది .పాతాళ గంగ ఇక్కడే వుందని అంటారు .శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం గా పేరు .
విస్సన్న పేట
నూజివీడు ,తిరువూరు మధ్య విస్సన్న పేట వుంది .వారి గొండ వంశీకుల కాలమ్ లో రాజధాని .వరిగొండ నీలం రాజు ఈ వంశ మూల పురుషుడు .ఇతని తర్వాతే 14 వ తరం లో వరిగొండ రామన్న పాలించాడు .అప్పుడే శాశ్వత కౌలు హక్కులు లభించాయి .సంతానం లేక పోవటం తో ,రమనప్ప ను దత్తత చేసుకొని కావలి వెంకట సుబ్బయ్య కూతురు లక్ష్మీ దేవమ్మ తో వివాహం చేశాడు .ఆమె అన్న గారు కావాలి బోర్రయ గ్రామ చరిత్రలు ,కైఫీయత్తులు వ్రాసే వాడుగా ప్రశిద్దుడైనాడు .రమణయ్య కు సంతానం లేదు .కంపెనీకి బకాయి వున్నాడు .రమణయ్య మరణించే ముందు ,బంధువులు ఒక కుర్రాణ్ణి దత్తత చేయించారు .భార్య లక్ష్మీ దేవమ్మ ఎదురు తిరిగింది .కంపెని ఆమెను సమర్ధించి ,ఎస్టేటు ను అప్పగించింది .జమీందారి తన చిన్నన్నయ్య లక్ష్మయ కు ఇవ్వాలను కొంది .వరి గొండ వంశీకులు ఆడ్డు తగిలారు . .క్కోర్టు లక్ష్మీ దేవమ్మకు అనుకూలం గా తీర్పు నివ్వటం తో లక్ష్మయ్య జమీందారు అయాడు .ఇతని తర్వాత కొడుకు నారాయణ రావు ,తరువాత మనుమడు ,వెంకట పతి రావు లు పాలిచారు .ఇతనికి సంతానం లేక పోవటం తో ,బ్రిటిష్ ప్రభుత్వం కావాలి సీతయ్యకు జమీ ని ఇచ్చింది .౧౮౮౬ లో జమీందారి అప్పుల పాలైంది .ఏలూరు వారైన మోతే వారు జమీందారి ని కొనుక్కొని పాలకు లైనారు . మోతే గంగ రాజు ,నారాయణ రావు లు వీరి లో ప్రశిద్ధులు .గంగ రాజు కు రావు బహద్దర్ బిరుడుండేది .షష్టి పూర్తి నాడు తులా భారం తూగి ,దాన ధర్మాలు చేశాడు .తిరుపతి వెంకట కవుల మెప్పు పొందిన వదాన్యులు .స్వాతంత్ర సమరం లో పాల్గొన్నాడు .సంఘ సంస్కరణ చేశాడు .ఆంద్ర నాటక కళా పరిషత్ ను స్థాపించాడు .తిరుపతి కవుల మ్రుచ్చ కటిక నాటకాన్ని ప్రదర్శింప జేశాడు . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -02 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com