కృష్ణా జిల్లాలో చిన్న సంస్థానాలు –3
తిరువూరు
వెల్లంకి రాజా వంశీకులు పాలించిన సంస్థానం తిరువూరు .1550 కి పూర్వం మేడూరు ఘాట్ ,జమలవాయి కనక గిరి ,పరగణాలకు తిరువూరు రాజధాని .రాజా వెల్లంకి మల్లా రావు కు గోల్కొండ నవాబులు అధికారాన్ని అప్ప గించారు .ఈయన తర్వాత జానకి రాప్ , రెండవ మల్లా రావు ,లింగారావు రామా రావు ,వెంగళ రావులు జమీందారు లైనారు .వెంగళ రావు అబుల్ హసన్ అంటే తానీషా సమకాలికుడు .మాదన మంత్రి -వెంగళ రావు కు పూర్తి జమీందారి హోదా ఇచ్చాడు .ఔరంగ జేబు పాలన లో ఈ హోదా హుళక్కి అయింది .గండ భేరుండ పక్షి వున్న తెల్ల జెండా ,చామరం ,నాలుగు రకాల డ్రమ్ములు ,రాజ ప్రతిష్టను తెల్పేవి గా ఉండేవని కృష్ణా జిల్లా మాన్యుయల్ లో వుందని మెకంజీ రాశాడు .1698 వెంకట రావు పెద్ద కొడుకు గంపల గుదాన్ని ,రెండవ వాడు వెంగల రావు కు కలగర ,మూడో అతను పెద్ద రామా రావు కు తిరువూరు లభించాయి .అయిదవ కొడుకు జోగయ్యా రావు కు ఎన గడప లభించింది ..నాల్గవ వాడు సంతానం లేకుండానే మర నించాడు .తిరువూరు దక్కించుకొన్న పేద రామా రావు కు నలుగురు పుత్రులు .పెద్ద వాడు చని పోవటం తో మిగిలిన వారికి తిరువూరు ను మూడు భాగాలు చేసి పంచుకొన్నారు .చివరి వాడు సూరా రావు కు ముగ్గురు కొడుకులు .ఇద్దర్ని అన్నలకు దత్తత ఇచ్చాడు .వెంకట కృష్ణా రావు కు రాజు పేట ,చిన రామా రావు కు మధ్య తిరువూరు ముఠా ,రామ కృష్ణా రావు కు పాత తిరువూరు ముఠా లభించాయి .1802 లో వీరంతా జమీందార్లు గా స్థిర పడ్డారు .ఆ సమయం లో రాజ నాయకుడు అనే బంది పోటు దొంగ తీవ్ర అలజడి సృష్టించాడు .1827 లో వాడిని పట్టించి ,ప్రజాభి మానం ,ప్రభుత్వాభి మానం సంపాదించారు .రాజు పేట రాజు కృష్ణా రావు కు జగన్నాధ రావు ,సూరా రావు ,శోభనాద్రి రావు ,అనే ముగ్గురు కొడుకులు .శోభనాద్రి ని కలగర జమీందారు దత్తత తీసుకొన్నాడు .దానితో కలగర తిరువూరు లో కలిసింది .పెద్ద వాడైన జగన్నాధ రావు మూడో కొడుకుని గంపల గూడెం జమీందారు దత్తత తీసుకొన్నాడు .ఈ జమీన్దార్లదరు దేశ భక్తులే .ప్రాజా సొకర్యం కల్గించిన వారే .బెజవాడ లోని రామ మోహన గ్రంధాలయానికి చిన వెంకట్రావు భూరి విరాళం ఇచ్చాడు .తిరుపతి కవులను ఆహ్వానించి ,ఇనగడప జమీందార్లు శతావధానం ఏర్పరచి ఘన సన్మానం చేశారు .వావి కొలను సుబ్బా రావు గారి ”కౌసల్యా పరిణయ ”కావ్యాన్ని ఖర్చులు భరించి చిన వెంకట్రావు ప్రచురించాడు కృష్ణా రావు ప్రభువును ,చెళ్ళ పిళ్ళ వారు శ్లాఘించారు .దాసరి లక్ష్మణ కవి -కవిత లో కాళిదాసునిగా ,ధర్మం లో కర్ణుని గా ,ఇశ్వర్యం లో దేవేంద్రుని గా ,పోలుస్తూ ”భవ్య గుణ సాంద్ర కృష్ణ భూపాల చంద్ర ”అన్నారు .రాజా వారు ”బొబ్బిలి విజయం” నాటకం రచించారు .వీరికి శేషాద్రి రమణ కవులు ఆస్థాన విద్వాంశులు .దేవినేని సూరయ ,లక్ష్మణ కవులను ఘనం గా సత్కరించారు. కర్తా కారయితాగా గంపల గూడెం జమీందారు కృష్ణా రావు బహద్దర్ లబ్ధ ప్రతిష్టులు .
గురజ సంస్థానం
కొల్లేటి ఒడ్డున కైకలూరు ,గుడివాడ మధ్య లో ”గురజ ”వుంది .౧౭౦౦ ణాఆటీఈ ౪౦౦ చదరపు మైళ్ళ విస్తీర్ణం తో ౨౬౦ గ్రామాలతో పెద్ద సంస్థానం గురజ .సంస్థానాధీశులు ”కమదన ”వంశీకులు .పద్మ నాయక కులానికి చెందినా విప్పర్ల గోత్రీకులు .మొదట్లో గురవయ్య ,అంకన్న పాలించారు .కలిదిండి ,గుడి వాడ ,బట్టర జల్లి ,విన్న కోట ప్రాంతాలన్నే గురజ లవ్ .ఇవే చార్ మహాన్ అని చెప్పుకొన్నాం .మహల్ అంటే మండలం .కానుకొల్లు ,బేతవోలు కూడా గురజ రాజ దానులు గా ఉండేవి .1713 -1748 కాలం లో నూజివీడు సంస్థానాధిపతి రామ చంద్ర అప్పా రావు శిస్తు బకాయి పడటం తో దక్కను సుబేదారు అతని తల నరికి ఏలూరు కోట కు వేలాద దీశాడు .రుస్తుం ఆలి ఖాన్ నూజివీడు ను స్వాధీనం చేసుకొన్నాడు .సరిగ్గా పాలించక పోవటం తో ,కమదన అప్పయ్య ,రాయన్న లకు శిస్తు వసూలు బాధ్యతా లభించింది .ఈ ప్రభువులు గోల్కొండ ప్రభువు ఆదరం సంపాదించి ,నూజివీడు జమీని పునరుద్ధ రించారు .వెంకటాద్రి అప్పా రావు అప్పుడు నూజివీడు ప్రభువయాడు .కాని గద్దె నెక్కే లోపే మరణించాడు .వెంకతాద్రికి అధికారం సాధించి ఇచ్చిన కమదన సోదరులు ,నిస్వార్ధం గా ఆలోచించి ఆయన తమ్ముడు మేకా జగన్నాధ అప్పా రావు ను జమీన్దారును చేశారు .ఇతన్నే జగ్గయ్య అనీ అంటారు .జగ్గయ్య అధికారం లోకి రాగానే కమదన సోదరుల అధికారం పెకించే యానం చేశాడు .తిరుగు బాటు చేసిన సోదరులు ,జగ్గయ్య ను బంధించారు .నిడద వోలు ,పెంట పాడు ,ఇస్తానని బేరం పెట్టి ,విడుదలయాడు జగ్గయ్య .విడుదల ఆవ గానే ఈ సోదరులను దేశ బహిష్కారం చేశాడు .వీరిద్దరూ గోల్కొండ చేరి సుల్తాన్ కు అనీ వివ రించారు .నూజివీడు సంస్తాననాన్ని మొత్తం తమ పేరా రాయించుకొని తెచ్చుకోనారు .జగ్గయ్య కాళ్ళా వెళ్ళా పది బ్రతిమి లాడాడు .కొల్లేరు ప్రాంతం రాశిస్తా నన్నాడు .సోదరులు మాలీ మోస పోయారు .జగ్గయ్య మొండి చెయ్యి చూపాడు నూజివీడు గద్దె నెక్క గానే .హతాశులైన సోదరులు ఫ్రెంచ్ వారిని ఆశ్రయించారు .ఫ్రెంచి వారితో జరిగిన యుద్ధం లో జగ్గయ్య ఒడి పోయాడు .బందీ గా గుల్బర్గా కు తీసుకొని పోయారు .అక్కడే చచ్చిపోయాడు .కృతఘ్నత కు మారు పేరు గా జగ్గయ్య చరిత్ర లో నిలిచాడు .
కమదన సోదరులు నూజివీడు మేకా వారి పై న ఉన్న గౌరవం తో మేకా వెంకటాద్రి అప్పా రావు ను రాజుగా ప్రతిష్టించి ,1759 లో అమర్ దారీ సనద్ ను ,1763 లో జమీందారి సనాడు ను ఇప్పించి ,కృతఘ్నతకు మారుగా కృతజ్ఞతను చూపారు.1764 వరకు సోదరులు గురజ ను పాలించారు . సంస్థానం అప్పుల పాలైంది .చల్లపల్లి ,నూజివీడు ,మొగల్తుర్రు జమీందార్లు గురజ ను కౌలుకు తీసుకొని పోషించారు .చివరికి ఈస్ట్ ఇండియా కంపెని వశమయింది . 1792 లోశోభనాద్రి నాయుడు కంపెని ఆకి చెల్లించి జమీన్దారయ్యాడు .1803 లోమళ్ళీ కంపెని వశమయింది . 1813 లో కలిదిండి ,బత్తర జల్లి పరగణాలను వేలం వేసి వచ్చిన డబ్బుతో గురజ సంస్థానాన్ని నిల బెట్టారు ..1876 లో పూర్తీ గా అంత రించింది సంస్థానం .
1792 -1836 కాలం లో పాలించిన శోభనాద్రి నాయుడు సారస్వత సేవ బానే చేశాడు .మల్లం పల్లి మల్ల్కార్జున శాస్త్రి అనే కవి ”సత్య వతీ ఉపాఖ్యానం ”లో నాయున్ని కీరించాడు .”కమదన శోభ నాద్రి మహేన్ద్రుడిదే వ్రుత్తి యలమర్తి నల శోభనాద్రి పురము ”అని అవతారిక లో రాశాడు .కమదన వంశం లోని పాపయ్యా రావు కూడా పించను తీసుకొన్న మొదటి జమీందారు .ఇతని కొడుకు నరసింహారావు ,మనవడు వెంకట్రావు సాహిత్య పోశాకులే .వెంకరావు ”వైదర్భీ పరిణయం ”నాటకం రాశాడు .”సత్కవీన్డ్రుల సేవించి సాహిత్య మొక కొంత చవి గొని ,సరస మైన కవిత నల నేర్చి ”అని కవులచే ప్రశంశించ బడ్డాడు .మండ వల్లి లో ”ఆంద్ర ప్రబోదినీ గ్రంధ నిలయం ”అనే ప్రచురణ సంస్థ స్థాపించి సాహిత్య గ్రంధాలను ముద్రించాడు .ఈ వంశీకులు అందరు సాహిత్యాభి లాశులే .ఆంద్ర బారతి ,సారస్వత సర్వస్వం ,వెలువ రించా టానికి ముఖ్య కారకులు గురజ జమీన్దారులే .స్వార్ధ రహితం గా ,ప్రభు భక్తీ పరాయణు లు గా ప్రజాసేవ ,సాహిత్య సేవ చేసి గురజ సంస్థానాధీశులు పేరు ప్రతిష్టలు పొందారు . చిన్న సంస్థానాల విషయం సమాప్తం .వీలు వెంబడి ముక్త్యాల ,చల్ల పల్లి, మైల వరం సంస్థానాల గురించి తరువాత కొంత ఆలశ్యం గా తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా రాసాద్ –23 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com