ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -1

  ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -1

     సంస్కృత సాహిత్యం లో విశాఖ దత్తుడు రచించిన” ముద్రా రాక్షసం” నాటకానికి ఒక ప్రత్యేకత వుంది ,నంద రాజా వంశ నిర్మూలనకు ,మౌర్య చంద్ర గుప్తుని అభిషేకించ టానికి ,అవమానం పాలై ప్రతీ కారం తీర్చు కోవాలనే ఆచార్య చాణక్యుని యుక్తి విశేషాలకు ఇది గొప్ప రంగ స్థలం .రాజకీయ మైన ఎత్తు గడలు ,వ్యూహాలు ,అపోహలు జిత్తులు ప్రతి అంకం లోను కని పిస్తాయి .రాజకీయం కోసం రాజ్యాధికార సాధన కోసం ,అధికారాన్ని నిల బెట్టు కోవటం కోసం ఇటు చాణక్యుడు ,అటు ,నందరాజ్య మంత్రి రాక్షసుడు చేయని ప్రయత్నం లేదు ,మితలాభం మిత్ర భేదం ,సంధి వగైరా లన్నిటికీ ఈ ఆటకం కేంద్రం .అన్ని పాత్రలను ,రచయిత అద్భుతం గా సృష్టించి ,పోషించి ,సేహబాస్ అని పించుకొన్నాడు .”రాజకీయం రాక్షసం ”అన్న పేరు ఈ నాటకాన్ని బట్టి వచ్చినదను కొంటె తప్పేమీ  కని పించదు .అయిన వారి మధ్య చిచ్చు ,కాని వారిని కావలించు కోవటం ,చూస్తే ఔరా అని పిస్తుంది .ప్రతి క్షణం ఉత్కంత భరితం గా సాగే నాటకం .చివరికి చంద్రుని గ్రహాణా లన్ని   తొలగి ,సింహాసనం పై ప్రతిష్టించి ,ఏ రాక్షస మంత్రి ఇన్ని అనర్ధాలకు కారకుడై నాడో ఆతనినే చంద్ర గుప్తుని మంత్రి గా చేసి నిష్క్రమిస్తాడు ఆర్య చాణక్యుడు .చాణక్య నీతి ని ”కౌటిల్యం ”గా రచించి భావి తరాలకు చక్కని పరి పాలనా యంత్రాంగాన్ని చూపించి ,తెర మరుగౌతాడు మహా మంత్రి చాణక్యుడు .ఇంతటి క్షణ ,క్షణ రాచకీయ సంఘటనల్లోనూ ,అక్కడక్కడా మంచి ,మానవతా ముద్ర ను వేశాడు విశాఖ దత్తుడు .ఆ ముద్రా విష్కరణమే   ఈ వాసం ధ్యేయం .
 నౌకరి -కోరిక 
మహాత్మా గాంధి ని ” వన్  మాన్ ఆర్మీ ”అంటాడు మౌంట్ బాటెన్ .చాణక్యుడూ అలాంటి వాడే .జరిగేది జరగ బోయేది జరుగు తున్నది , అంతా ఆయన మేధో విలసితమే .అంతటి శూక్ష్మ నిష్ఠ దృష్టి ఉన్న వాడు .అందుకే కవి ,చాణక్యుని తో నిజ మైన సేవక లక్ష నాలేమిటో  చెప్పిస్తాడు .తెలివి ,పరాక్రమం వున్నా ,స్వామి భక్తీ లేని నౌకరు పనికి రాడు. భార్య లా వుంటే ,భారమే తప్ప ,ప్రయోజనం లేదు.సంపద లో ,ఆపదలలో ,రాజు మేలు కోరే వాడు ,చేసే వాడే మంచి సేవకుడు అంటాడు .కోరికను ,వయసు మీద పడ్డప్పుడు వదిలించు కోవాలి .లేక పొతే శిరో భారమే అవుతుంది అని కంచుకి తో మూడో అంకం లో చెప్పిస్తాడు .ముసలి వాడికి లోకం మీద విసుగు ,కోరికా ఇంకా తన్ను వదల లేదని బాధ .కళ్ళు కని పించవు .వాసన తెలీటం  లేదు ..దేహం మొద్దు బారి పోతోంది .వినికిడి లేదు .కాళ్ళూ చేతులు స్వాధీనం తప్పాయి .ఒకోరికా !ఇంకా ఎందుకు నన్ను వదల లేక పోతున్నావు ?అని అని పిస్తాడు .ఇది అందరం ఆలోచించాల్సిందే .అనుసరించాల్సిందే .వ్యధకు ,బాధకు మూల మైన కోరిక యెంత పని చేస్తుందో అందరికి తెలిసిన విషయమే .
 సమర్ధుని దే రాజ్య లక్ష్మి
సౌఖ్యం కోసం సంపద అవసరమే .అయితే దానిపై వ్యామోహం ,జీవితాన్ని ఆట లాదిస్తుంది .లక్ష్మీ దేవి చంచల మైంది .వేశ్యలా కుదురు లేని దాని చంద్ర గుప్తుడే అంటాడు .ఆమె కు కోపంగా ఉన్న వాడిని చూస్తె భయం.మెత్తని వాణ్ని పరాభ విస్తుంది . తెలివి తక్కువ వానిని చేరాడు .పండితుడి నంత మాత్రాన వాడితో స్నేం చేయదు .వీరుణ్ణి చూస్తె భయ పడు ర్తుంది .పిరికి వాని హేళన చేస్తుంది .రాజ్య లక్ష్మి ఎక్కువ గా చనువు గా వుండే వెలయాలి లా ,ఎప్పుడూ ,కష్టం తో ,దుఖం తో సేవింప దగినది గా ఉంటుందని అని పిస్తాడు నాటక కర్త మౌర్య చంద్ర గుప్తుని తో ..
 వినయం 
ఋతు వర్ణన లోను కవి ప్రత్యేకత చూపిస్తాడు .మాన వీయ కోణాలను విశాఖ దత్తుడు ఆవిష్కరిస్తాడు .శరదృతువు లోకం లో జనానికి అణకువ నేర్పిందట .జలాశయాల్లో నీరు తగ్గి ,వారి చేలు పంటల అరువు తో వంగి వున్నాయి .నెమల్ల పొగరు కూడా తగ్గింది .అందుకే శరత్తు అందరికి వినయం నేర్పిందంటాడు .మనం ఎలా మాసాలు కోవాలో ,ప్రవర్తించాలో ఋతువు కూడా హిత బోధ చేసిందన్న మాట .రాజు దగ్గర సేవ చేయటం చాలా కష్టం .ఏ క్షణం లో వాళ్ల మనసు ఎలా ప్రవర్తిస్తుందో గ్రహించటం కష్ట తరమే .సేవ అనేది కత్తి మీది సాము లాంటిది .ఈ బాధ అనుభవించి ,అనుభవించి తన అనుభవాన్ని ఒక కంచుకి తెలియ జేస్తాడు .ముందు రాజు వల్ల ,తర్వాత మంత్రి వల్లా ,రాజు కిష్టమైన వాడు ,విటులు ,అతని అనుగ్రహం వున్న వాళ్ళు ,మిగిలిన అందరి వల్లా   భయ మేనట .సేవా వృత్తి ,శ్వ( కుక్క నడ వడి ) వృత్తి ,గా ఉంటుందట .యెంత అనుబావ సారమో ?ముఖం పైకెత్తే వీలే వుండదు .శ్రమకు తగ్గ ఫలితం వుండదు .అందుకే పండితు లైన వారు అందరు చులకన గా భావంచే నౌకరీని ,దెబ్బకు ఒళ్ళు ముడుచు కొనే కుక్క  నడ వడి గా భావిస్తారని బావురు మంటాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -1

  1. muthevi ravindranath అంటున్నారు:

    lokareethini kaachi vadaposinavaadu vishaakhadatthudu.’mudraa raakshasam’yokka antassaaraanni chakkagaa odisipatti maakandisthunnanduku meeku dhanyavaadaalu.

  2. srikanth అంటున్నారు:

    Narationand Explanition of the storyexcellent

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.