ఊసుల్లో ఉయ్యూరు –23 ఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు

 ఊసుల్లో ఉయ్యూరు –23 
 ఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు 

           మా నాయనమ్మ గారి పేరు గబ్బిట నాగమ్మ గారు .మేము ”మామ్మ” అనే పిలుస్తాం .ఆమె తండ్రి గారు గుండు నరసింహా వదానులు గారు .ఉయ్యూరు లో మా పక్క ఇల్లే .మా తాత గారు గబ్బిట దుర్గా పతి శాస్త్రి గారు .ఏలూరు దగ్గర రామా రావు గూడెం అగ్రహారీకులు ..బోలెడు ఆస్తి, సంపద వున్న వారు .మా మామ్మ వివాహానికి యాభై ఎడ్ల జతలతో ఉయ్యూరు వచ్చారట .వారందరికీ వీరు వసతి కల్పించారట .సదస్యం సమయం లో మా తాత గారి తండ్రి గారు  వేదం చదువుకొన్న విప్రోత్త ములకు బంగారు మాడలు కానుక గా ఇచ్చే రట .అది చూసి ఉయ్యూరు జనం నివ్వెర పోయారట .అంత ..కలిమి ,సంపదా పొలం పుట్రా నగా నట్రా వున్న కుటుంబం  మా తాత గారిది .ఆ వైభవాన్ని చాలా కాలమ్ ఉయ్యూరు జనం మర్చి పోలేదట .రంగ రంగ వైభవం గా మామ్మ తాతయ్యల వివాహం జరిగింది . ఆ దంపతులకు మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు జన్మించారు .అగ్రహారీకులు కదా అందుకని ”ముత్తయ్య గారు ”అని అక్కడ పిలిచే వారు .గ్రామం అంతా మా కిందే ఉండేదట .ఎడ్లు వ్యవ సాయం దానం ధర్మం ,ఆతిధ్యం లో ప్రశిద్ధి చెందారు .
మా నాన్న గారి ని మా మామ్మ గారు  కడుపు తో ఉండ గానే మూడో నెలలకు ఉయ్యూరు వచ్చింది .అక్కడ మా తాత గారు అకస్మాత్తు గా మరణించారట . అగ్రహారం ఏమయిందో ఆస్తి ఏమయిందో తెలీదు .దాదాపు అంతా మాయ మయి పోయిందట .ఏదో కొంత భాగమే మిగి లింది .ఇల్లు వ్యవసాయం వున్దిఅక్కడే .మమ్మ  తండ్రి గారింట్లోనే ఉయ్యూరు లోనే వుండేది .మా మామ్మ గారికి ఒక అక్కయ్య ,ఇద్దరు చెల్లెళ్ళు వుండే వారు .అందరికి పెళ్ళిళ్ళు అయినా ఎవరికి సంతానం చాలా కాలమ్ కలుగ లేదు .మా నాన్న గారే ఆ కుటుంబలో తొలి మగ పిల్ల వాడు. అందుకని మా మామ్మ తండ్రి గారు లక్ష్మీ నరసింహా వ దానులు గారు తన యావ  దాస్తినీ ,దౌహిత్రుడైన మా నాన్న గారి పేర రాశారు .ఆయనే వుయ్య్యురు లో ని సువర్చలాన్జనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి ధ్వజ స్తంభం ఏర్పాటు చేసి   ధూప   దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు .ఆయన తరు వాత మా నానాన్న గారు ధర్మ కర్తలయారు .,ఆయన మరణానంతరం నేను శాశ్వత వంశ పారం పర్య ధర్మ కర్త గా  వ్యహరిస్తున్నాను . ..మేము అనుభ విస్తున్న ఆస్తి అంతా మా నాయనమ్మ గారి తండ్రి గారు మా నాన్న గారి కి ఇచ్చిన వే .అంటే మామ్మ ఆస్తినే అనుభ విస్తున్నాం .
మామ్మ చాలా భారీ మనిషి .కోపం వుండేది కాదు ఎనభై నాలుగు ఏళ్ళు జీవించి ,1966 లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అంటే దుర్గా స్టమి నాడు   ఉయ్యూరు లో నా చేతుల మీదు గా  మరణించింది . మామ్మ తో తమాషాకి అంటుండే వాడిని ”మామ్మా !నువ్వు కానిపోతే నాకు  సెలవలు కలిసి వచ్చేట్లు చనిపో ” అనే వాడిని ఆరి భడవా కానా ! నీ కడుపు లో ఇంతాఆశ ఉందా .సరే నీ కోసం అలానే చేస్తాలేరా నాయనా “‘అనేది ముసి ముసి నవ్వులు నవ్వుతు .నిజం గానే అన్నంత పనీ చేసి ,దసరా సెలవల్లో చని పోయింది ”. నాన్న గారు ఆమె కంటే ముందే అంటే 1961 లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు   చనిపోయి ఆమెకు పుత్రశోకం మిగిల్చారు .మామ్మ చాలా  మంచి వ్యక్తీ ,నాకు   మా తాత గారి పేరు ”దుర్గా పతి ”అని పెట్టారు నేను దాన్ని దుర్గా ప్రసాద్ గా మార్చుకొన్నాను .అందుకని భర్త పేరు తో పిలావాల్సి వస్తుందని మామ్మ నన్ను ”ప్రసాదూ ”అని మాత్రమే పిలిచేది .ఒక్కోసారి అది ”పెసాదు ”గా వినిపించేది .నేనంటే వల్ల మాలిన అభిమానం .మామ్మ తో కబుర్లు చెప్పటం తక్కువే .కాని పాపం ఆమె అమాయ కత్వానికి నాన్న తో సహా అందరం నవ్వే వాళ్ళం .యేడి  పించే వాళ్ళం .అప్పుడు అది తప్పూ అని తెలియదేమో .లేక ఒళ్ళు బలుపో .ఇప్పుడు తలుచుకొంటే సిగ్గేస్తుంది నాకు మాత్రం .
హిందూ  పురం లో వుండగా, మామ్మే పగటి పూట  వంట చేసేది

హిందూపురం లో మేము ఉన్న ఇల్లు

.రాత్రి వంట అమ్మది .అందరం అన్నా లకు కూర్చునే వాళ్ళం .మామ అన్నం వండితే కొంత చిమిడేది .   లేక సబ్బు బిళ్ళ లానో వుండేది .అందుకు నాన్న ”పచామ్యన్నం చతుర్విధం  ”అనే వాడు .మేము నవ్వే వాళ్ళం .పులుసుబాగా   కాచేది .చారు పెడితే నాన్న ”ఏంచారు అమ్మా ?”చిన్చారా ”?అనే వాడు .అంటే చింత పండు చారా అని అర్ధం .పులిహోర ను చిత్రాన్నం అనే వాడు .హిందూ పుర లో బావి నీళ్ళు ఎంతో లోతు గా ఉండేవి .తోడటం కష్టం .మామ్మ ఆవ లీలగా తోడేది .మేము వేసవి సెలవలకు ఉయ్యూరు వచ్చే వాళ్ళం .అప్పుడూ సందడే సందడి .అక్కడ అందా తో చింత పొట్టు తో వేరుసెన గ పొట్టు తో నీళ్ళు కాచేది .మాకందరికీ ఓపిగ్గా తలంటి పోసేది .శీకాయ పొడి కుంకుడు కాయ పులుసు కళ్ళల్లో పడ కుండా జాగ్రత్త గా పోసేది .
హిందూపురం – మరొక సారి – ప్రయాణం
ఉయ్యూరు  చేరాక భోజనాలు ”పడమటింట్లో చేసే వాళ్ళం ”.దానికి తూర్పున వంటిల్లుండేది .పగలు భోజనాలు  ఎవరి సమయం వారిదే .రాత్రి భోజనాలలోనే అందరం కలిసే వాళ్ళం .అదో గొప్ప సరదా మాకు .నేను మా తమ్ముడు పక్క పక్క కూర్చొనే వాళ్ళం .తింటూనే వాడి వీపు గిల్లే వాడిని .వాడు కోపం తో ఏడ్చే వాడు అందరం నవ్వే నవ్వు .మామ్మ చేసిన పదార్ధాలు బాగా లేక పొతే వ్యాఖ్యానాలు చేశే వాళ్ళం .ఒక్కోసారి నవ్వు ఆగక నోట్లోని అన్నం చిమ్ముకుంటూ బయటికి వచ్చేదితాగిన నీళ్ళ తో సహా . .నాన్న కి ఈ సమయం లో కోపం వచ్చేది కాదు .ఆ తరువాత ఎప్పుడు అల్లరి చేసినా వీపు విమానం మోతే ,నన్ను బాగా వాయించే వాడు .ఆమ్మ కు ”అమ్మాజమ్మ” గారు అనే బంధువు వుండే ది .ఏదైనా సరిగ్గా లేక పోయినా సలహా చెప్పినా ”అమ్మా జెమ్మ గారి గురుత్వమా “?అనే వాడు. అమ్మ సలహా చెప్తే ”సావిత్రమ్మ గారి గురుత్వమా ?”అనే వాడు .గోసుకొండ శాస్త్రి గారి భార్యే  సావిత్రమ్మ  గారు .పెద్ద ముత్తైదువు .మంచి సలహాలిస్తుండేది అమ్మకి .
మామ్మ ”పులుసు ”అనటానికి బదులు ”పుస్సు ”అనేది .ఆ మాట పదే పదే చెప్పుకొని నవ్వే వాళ్ళం .ఆవిడా నవ్వేదే కాని కోపం వుండేది కాదు .మాట పడాల్సి వస్తుందని భయం,భయం గా వుండేది .నిష్కల్మష హృదయం ఆమెది .ఎవరి నైనా చూడ గానే ,వారి అంద చందాల గురించి వ్యాఖ్యానించేది .అందం గా వున్న ఆడ పిల్లల్ని దగ్గరకు తీసుకొని బుగ్గలు చిదిమేది ఆప్యాయం గా .అమ్మ అంటే మామ్మకు అమితమైన ఆపేక్ష .కోడలు గా కంటే కూతురు అనుకొనేది .నాకు ప్రభావతి తో వివాహం అయి కాపురానికి వస్తే ,చాలా ఆప్యాయం గా ఆదరించింది .ఎంతో ప్రేమ ఒలక బోసింది .”ప్రభాకరా ”అని ప్రభావతి ని పిలచేది .మగ పిల్లలంటే బాగా ఇష్టమే అయినా మాకు రెండో సంతానం మగ పిల్లాడు శర్మ  పుడితే” ఆడ పిల్ల అయితె బాగుండేది” అన్నది ..మా పెద్దబ్బాయి శాస్త్రిని బాగా ఎత్తు కొని ముద్దు చేసేది. ముని మనవడు కదా .మా అక్కయ్యలను సూటి పోటి మాటలతో చికాకు పెట్టేది
నాగమ్మ గారు అంటే వూళ్ళో అందరికి గౌరవం .వూళ్ళో బంధువుల ఇళ్ళల్లో శుభ కార్యాలయితే వంటకు సహాయం చేసేది .యెంత పెద్ద గుండిగ అయినా వండి వార్చేది ఆవ లీలగా .మామ్మ యేది చేసినా మహా రుచి కరం గా ఉండేదని పెద్ద లందరూ చెప్పే వారు .ఒక సారి వూళ్ళో ఎవరింట్లోనో పెళ్ళికి ‘సరదా గా వాళ్ళను యేడి పించ టానికి ”గరిక ”తెప్పించి పచ్చడి చేసి వడ్డిన్చిందట .మహా కమ్మ గా వుందని లోట్టలేసు కుంటు తిన్నారట ,అది ఏమి పచ్చదో తెలీకుండానే .తిన్న తర్వాత అడిగితె  ”గరిక పచ్చడి” అని చెప్తే ఆశ్చర్య పోయారట .బరువు గల వస్తువుల్ని అతి తేలిగ్గా మోసేదట .పెద్ద ఇత్తడి గుండి గల తో  పుల్లేరు కాలువ నుంచి మడితో మంచి నీళ్ళు మోసుకొని వచ్చేది .అంతటి బలశాలి .బంధువు ల  నందర్నీ ఆప్యాయం గా పలక రించేది .ఆప్యాయతకు మరో పేరు మామ్మ .
రామా రావు గూడెం అగ్రహారం లో మా తరుఫున వ్యయ సాయం చేసే వారు .వేసవి సెలవల్లో  నేను, నాన్న వెళ్లి చూసుకొని ,కౌలు డబ్బు తెచ్చుకొనే వాళ్ళం .అక్కడ బండీ ఎడ్లు ఉండేవి పాలేరు వుండే వాడు .ఉండటానికి ఇల్లు వుండేది .వండి పెట్ట టానికి మా బంధువుల కుటుంబం వుండేది .చింత చెట్లు ఈత చెట్లు తాడి చెట్ల తో ఆవరణ నతా ముచ్చట గా వుండేది .మెట్ట పంట పొగాకు వేరు సెనగ పండేది .రైల్ లో ఏలూరు దగ్గర’ దెందు లూరు” దిగి ,అక్కడికి ఎడ్ల బండీ వస్తే దానిలో వెళ్ళే  వాళ్ళం నీటి సౌకర్యం లేదు.కౌలు తక్కువే .అందుకని మొత్తం అక్కడి పొలాలు ఇల్లు వగైరా అన్నీ నాన్న కాలమ్   లోనే అమ్మే శారు . కాని అక్కడి వాళ్ళు మేమిద్దరం వెడితే ఎంతో ఆప్యాయం గా పలకరించే వారు .నాన్న ను ”ముత్తయ్య దొర గారు ”అనే వారు .నన్ను ‘చిన్న దొర గారు ”అనే వాళ్ళు .ఇప్పుడు భూగర్భ జలాలతో బంగారం పండిస్తున్నారు .చిన్న తిరుపతి వెళ్ళే టప్పుడు ఆ వూరి మీదుగా వెళ్లి పాట అనుభవాలను గుర్తు చేసుకొంటూ ఉంటాము .
ఈ పుస్తకం లోని కొన్ని దేవాలయ చరిత్రలు ”దర్శనీయ క్షేత్రాలు ”అనే శీర్షికన  ”భక్తి సుధ ”మాస పత్రిక లో ధారా వాహికం గా ప్రచురితమైనాయి .వాటిని ఇందులో చేర్చ టానికి ఆమోదం తెలిపిన భక్తి సుధ సంపాదకులకు ,యాజ మాన్యానికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .
సరస భారతి ప్రచురిస్తున్న ఏడవ పుస్తకం ”దర్శ నీయ దేవాలయాలు ” ఆప్యాయతకు మారు పేరైన మా మామ్మ నాగమ్మ గారికి సభక్తి కం గా, వినయపూర్వ కం గా  అంకిత మిస్తూ  ఇన్న్నేళ్ళు గా ఈ పని చేయ నందుకు సిగ్గు పడుతూ ,ఇప్పటికైనా చేస్తున్నందుకు ,సంతోషిస్తూకొంతైనా  ఋణం తీర్చుకొంటున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -02 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –22 వల్లూరు సంస్థానం -2

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు –23 ఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు

  1. Madhavi అంటున్నారు:

    chaalaa bagundi.chaduvutuntea nijanagaa choostunnattu undi..chaalaa baagaa raasaaru.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.