ప్రాచీన కాశీ నగరం –4
విద్యా కేంద్రం
నలంద ,తక్షశిల ,మధుర ,ఉజ్జయిని కంచి నగరాలు సంస్కృత విద్య లకు ఆలా వాలు .వీటి కై దీతింది గా నిలిచింది కాశి .కాశ్మీరం తో సాటి అని పించు కొంది .క్రీ.పూ.ఏడ వ శతాబ్ది నుంచే కాశి ప్రాముఖ్యం పొందింది .క్రీ.పూ.15 వ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు కాశి రాజ్యం స్వతంత్రం గా వుంది .రాజకీయాలకే కాక ,మత ,తత్వ శాస్త్ర చర్చల కూ నిలయం గా వుంది .మహా భారతం ,భాగవతం ,అష్టాదశ పురాణాలు ,వేద వ్యాసుడు ఇక్కడే రచించాడు .తక్షశిల లో చదివిన వాళ్ళు కాశీ లో అధ్యాపకులు గా వుండే వారు .ఒక్కొక్క గురువు 500 మంది విద్యార్ధులకు విద్య బోధించే వాడు .”గాన విద్య ”కూడా కాశీ లో నేర్పే వారు .తక్షశిల క్రీ.పూ.ఏడవ శతాబ్దం నుంచి ,క్రీ.పూ.మూడవ శతాబ్ది వరకు ఒక వెలుగు వెలిగింది .ఆ కాలం లో కాశీ కి ప్రశస్తి లేదు .తర్వాతే ప్రశిద్ధి పొందింది .నీల కాంతుడు అనే జ్యోతిష్య పండితుడు కాశి లో జన్మించాడు .దివోదాసు ,ప్రతిర్డునుల నగరం కాశి .దివోదాసే ధన్వంతరి అనే ఆయుర్వేద ప్రవక్త .”యద యాతం దివో దాసాయ భారద్వాజాశ్వినా హ యంతా ”అని ఋగ్వేదం లో వుంది .దివోదాసు భారద్వాజుడు ,అశ్వినీ దేవతలే ఆయుర్వేదాన్ని ఉపదేశించారని భావం .
కాశీ రాజుల్లో 17 వ తరం వాడు అజాత శత్రువు .అతని కొడుకే ”భద్ర సేనుడు ”క్రీ.పూ.900 ప్రాంతం లో ఋషులు శిష్యులకు సంత రూపం లో వేదం బోధించే వారు .౧౭ వ శతాబ్ది లో భారత దేశం వచ్చిన ”బెర్నియర్ ”కాశీ లోని విద్యా వ్యవస్థ ను గురించి రాస్తూ ”ఆరామాలలో ,స్వంత ఇండ్ల లో ఒక్కొక్క అధ్యాపకుడు ఆరు లేక ఏడు మంది విద్యార్ధులను దగ్గర ఉంచు కొని చదువు చెప్పే వారు .బాగా ప్రాచుర్యం పొందిన వారి దగ్గర 12 నుంచి 15 మంది దాకా విద్యార్ధులు వుండే వారు .12 సంవత్స రాలు విద్య నేర్పించే వారు .తత్వ శాస్త్రం ,ఆయుర్వేదం మొదలైన శాస్త్రాలు నేర్పే వారు ”అని రాశాడు .భార తీయులకు ఖగోళ శాస్త్రం తెలియదని ,భూమి బల్ల పరుపుగా ఉండేదని నమ్మే వారని పాశ్చాత్య చరిత్ర కారులు హేళన చేసే వారు .ఆచార్య నాగార్జునుని శిష్యుడు ”’ఆర్య దేవుడు ”ఇక్కడి బ్రాహ్మణులను ,వారు పొందే భక్తీ గౌరవాలను చూసి ఎలాన చేసే వాడని ఆంద్ర హిసోరి లో కే.ఆర్.సుబ్రహ్మణ్యం రాశాడు .,శరీర శాస్త్రం ,భూగోళ ,ఇతి హాసాలు తత్వ బ్రహ్మ విద్యలు వగైరా కాశీ లో నేర్పే వారని స్పష్టం గా తెలుస్తోంది.ప్రపంచం లో అగ్ర స్థానం ఆహించిన విద్యా విధానం కాశీ లోనే వుందని నిర్ద్వంద్వం గా చెప్పా వచ్చు .
కాశీ లో మల్ల యోధులు బాగా వుండే వారు .మల్ల యుద్ధాలు తరచూ జరిగేవి అని మల్ల యుద్ధం నేర్పే వ్యాయామ షాలు ఉండేవి అని ”అన్గుత్తర నికాయం ”,”షోడశ మహా జన పద యుగం ”పుస్త కాలలో వుంది .బుద్ధుని కాలం లో ఇవి దెబ్బ తిన్నాయి .కాశి చివరికి కోసల రాజ్యం లో చేరి పోయింది .16 సంవత్స రాలు 18 గణ రాజ్యాలు యుద్ద్ధం చేశాయి .చివరికి వైశాలి ,విదేహ ,కాశి ,కోసల ,లో కొంత భాగం అజాత శత్రువు అధీనం లోకి వచ్చింది .మళ్ళీ స్వతంత్రం అనేది ఎండ మావి ఏ అయింది .క్రీ.పూ.ఆరవ శతాబ్ది వరకు కాసహి ఉచ్చ స్థితి లో వుంది .స్వతంత్ర రాజ్యం గా వుంది .గొప్ప విద్యా కేంద్రం గా ,సాంస్కృతిక కేంద్రం గా ,పవిత్ర క్షేత్రం గా నిల బడింది .చివరకు కోసల దేశానికి ఆ తర్వాత మిధిల కు లొంగి పోయింది కాశి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 =02 -12 .