ప్రాచీన కాశీ నగరం –5

ప్రాచీన కాశీ నగరం –5

                                        పరిశ్రమలు
 కాశి మొదట్నించి వర్తక వాణిజ్యాలకు ప్రసిద్ధి .కాశి పట్టు చీరలకు కేంద్రం .మెకాలే దీన్ని గురించి రాస్తూ ”కాశీ నుంచి అతి సున్నిత మైన వస్త్రాలు ,పట్టు బట్టలు ,-సెయింట్ జేమ్స్ ,వర్ష లీస్ నగ రాలకు ఎగుమతి అయేవి ”అని రాశాడు .క్రీ.పూ.రెండవ శతాబ్ది నాటి ”మిళింద పన్హా ”లో కాశీ లో పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు ఉండేవని ,,కాశీ బట్టలు నాణ్య మైనవి అనీ  రాసి వుంది .”యషుడు ”అనే వైశ్య కుమారుడు మూడు ఋతువుల కోసం మూడు విలాస వంట మైన పెద్ద మెడలు కట్టాడని ,తర్వాత అన్నీ వదిలి బుద్ధుని శిష్యుదయాదని అతాని స్నేహితులు కూడా బౌద్ధం స్వీకా రించారని వుంది .కాశీ చుట్టూ ప్రత్తి చేలు విశేషం గా వున్నట్లు ”తుండిలా జాతకం ”వల్ల తెలుస్తోంది . కాశి బట్టలు చాలా సన్న గా వుంది ,నూనె ను పీల్చని లక్షణం కలిగి వుండే వట .గుర్రాల వ్యాపారం కూడా కాశి లో బాగా జరిగేది
మొగలాయిల కాలమ్ లో వచ్చిన ”టావెర్నియర్ ”-కాశి నగరం లో ని వస్త్ర సౌందర్యాన్ని గురించి తెలియ జేస్తూ ”రాజు గారి కొలువు మధ్య వున్న రెండు గాలరీలలో ప్రత్తి ,కాలికో ,పట్టు వస్త్రాలు ,ఇతర పదార్ధాలు తయారు చేసే వారే అమ్ముతారని చెప్పాడు .ముద్ర లేకుండా అమ్మితే జరిమానా .కొరడా దెబ్బలు తప్పవు అని రాశాడు .బుద్ధుని కాలమ్ లోను వస్త్ర పరిశ్రమ ,వ్యాపారం ఆగా అభివృద్ధి చెందింది .
ఇత్తడి పరిశ్రమ కు కాశి పేరు .చిత్రాలు ,లతలు అల్లిన కాశీ వస్త్రాలు ,పట్టు బట్టలు విశేష ఆకర్షణ .బుద్ధుడు ”మహాభి నిష్క్రమనానికి ”వెళ్ళే ముందు కాశీ వస్త్రాలు ధరించటం బావ్యం కాదని ,వాటిని వదిలి వేశాదట .అంటే బుద్ధుడు కూడా బుద్ధిగా కాశీ పట్టు బట్టలే కట్టాదన్న మాట .మహ్మద్ బీన్ తుఘ్లక్ పాలన లో  14 వ శతాబ్ది లో 500  ,మంది నేత కారులు నేసిన నాణ్య మైన వస్త్రాలను అంతఃపుర స్త్రీలు ధరించే వారట .అందులో బంగారు పట్టు బట్టలున్దేవత .ఇత్తడి తో బాటు ,రాగి చెంబులు  ,గంగా జలాన్ని దాచుకోనేందుకు ఉండేవి విగ్రహాల తయారీ కి కూడా మంచి పేరు ..బంగారు నగిషీ పని ,జర్మన్ సిల్వర్ పాత్రలు ,వెండిజరి    ,ఆట వస్తువులకు  కాశీ  పేరు పొందింది .ఈ విషయాలన్నీ బ్రిటానికా లో పొందు పరచినవే ..
  సార నాద్ 
కాశి లో ఒక భాగాన్ని ”రుషి పట్టణం ”అంటారు .పాళీభాష   ”ఇని పత్తనం ”అంటారు .”మహా వస్తువు ”అనే బౌద్ధ గ్రంధం లో ఇక్కడ ఒక అరణ్యం ఉండేదని ,500 మంది బౌద్ధులు ఇక్కడ తపస్సు చేసే వారని ,వారంతా ఆత్మ శక్తి తో ఆకాశం లోకి చేరితే వారి శరీ రాలు ఇక్కడ పడ్డాయని అందుకే ఆ ప్రదేశం ”రుషి పతనం ”అయిందని అదే క్రమేపి రుషి పట్నం గా మారిందని వున్నది .దీనికి దగ్గరే ”మృగ దావం ”అనే అంద మైన తోట వుంది .లేళ్ళు బాగా వుండటం చేత ఆ పేరు సార్ధకమయింది .ఇక్కడే బోధి సత్వుడు రాజు బారి న పడ్డ లేడిని రక్షించాడని జాతక కధ లో వుంది .బుద్ధుణ్ణి ”సార నాధుడు ”అంటారు .ఇక్కడి శివుడూ సారంగ నాధుడే .ఆ పేరే క్రమంగా సార నాద్ అయింది .
బుద్ధుడి కోసం ”నందీయ ”అనే వర్తకుడు సార నాద్ లో విహారం నిర్మించాడు ”.రైవతి ” అనే ఆమె తలి దండ్రుల కోరిక పై బౌద్ధ భిక్షువు లకు సేవ చేస్తూ బుద్ధుని బోధనలను వింటూ ఇక్కడే ఉండేదట .ఆమె సేవా ధర్మాన్ని గుర్తించి ”నందీయుడు ”వివాహం చేసు కొన్నాడు .”ఇసి”లో విహారం కట్టించాడు .సార నాద హిందూ జైన బౌద్ధ పుణ్య క్షేత్రం .బుద్ధుడు పూర్వ జన్మలో ఇక్కడే ”కశ్యపుని ”గా జన్మించాడు .మొదటి ధర్మ బోధ ఇక్కడే చేశాడు .జైన తీర్ధంకరుడు దీనికి దగ్గర లో వున్న ”సింఘ పురం ”లో నిర్యాణం చెండాడు . మహేశ్వరాలయం వుండటం వల్ల హిందువుల పుణ్య క్షేత్రమైంది .గయ లో బోధి వృక్షం కింద నిర్వాణ యోగం పొంది, తధాగతుడు బుద్ధుడయాడు .తనను వదిలి వెళ్ళిన అయిదుగురు శిష్యులకు జ్ఞాన బోధ చేయ టానికి కాలి నడకన ఒంటరి గా గయ నుండి బయలు దేరి 11 రోజుల్లో 288 ఆ మైళ్ళు నడిచి సార నాద్ చేరాడు .ఆ అయిదుగురు శిష్యులను చూసి వారికి జ్ఞాన  బోధ ఇక్కడే చేశాడు .బౌద్ధులకు బుద్ధుడు జన్మించిన కపిల వస్తు ,బుద్ధత్వం పొందిన గయ ,మొదట బోధ చేసిన సార నాద్ ,నిర్యాణం చెందిన ”కుశ వనం ”పరమ పవిత్ర స్థలాలు .
బుద్ధ గయ లో వైశాఖ పూర్ణిమ నాడు ”సుజాత ”అనే మహిళ అప్పుడే జన్మించిన తన కుమారుడిని తీసుకొని ,బుద్ధుని దర్శించి పాయసం వున్న బంగారు  కలశాన్ని ఆయనకు సమర్పించిందట .బుద్ధుడు నేరన్జనా నది లో స్నానం చేసి ఆ పాయసాన్ని 49 ముద్దు చేసి తిన్నాడట .ఆ స్వర్ణ కలశాన్ని ఆయన నదిలోకి విసిరేశాదట .అశ్వత్థ వృక్షం కింద 49 రోజులు నిరాహారం గా దీక్ష గా తపస్సు చేయ బోతూ ,”నా ఎముకలు ,నరాలు ,చర్మం గుల్ల అయి రక్త మాంసాలు శోషించి పోయినా పరమ జ్ఞానం పొంద కుండా అఆసనం నుంచి కాలు కదల్చను ”అని శపథం చేసి కూర్చున్నాడట.49 వ రోజు రాత్రి దివ్య జ్ఞానోదయమై బుద్ధత్వ ప్రాప్తి ,ఆత్మ జ్ఞానం కల్గాయి .
సార నాద్ లో క్రీ.పూ.522 లో ఆషాఢ పౌర్ణమి సంధ్యా కాలమ్ లో తన ముఖ్య శిష్యుడైన కౌండిన్య ,దశ బల కాశ్యప ,వసప ,అశ్వ జిత్ ,భద్రికి అనే అయిదుగురికి మొదటి ధర్మోప దేశం చేశాడు .ఇక్కడ 10 ఏళ్ళు వున్నాడు .క్రీ;పూ.557 లో బుద్ధుడు జన్మించాడు .538 లో యశోధర తో వివాహం ,528 లో సన్యాస స్వీకరణ ,477 లో నిర్యాణం ..
సార నాద్ లో ”ధర్మ చక్ర పరి వర్తనం” జరిగింది .ఇక్కడి నుండే బౌద్ధ ధర్మ వ్యాప్తి కోసం శిష్యులను ఇతర ప్రదేశాలకు పంపించాడు .అశోక  ,కనిష్క  కుమార గుప్త ,కుమార దేవి లు నిర్మించిన స్తూపాలు ఇక్కడ వున్నాయి .మందిరాలు ,విహారాలు ఆకర్షణీయం గా వుంటాయి .ఇక్కడ 25 శాసనాలు లభించాయి .ఫాహియాన్ హుయాన్ సాంగ్ ,ఇత్సింగ్ ,తాయి సింఘ  అనే చైనా యాత్రికులు దర్శించి వివరాలు రాశారు .అశోక ధర్మ చక్రం ,నాల్గు సింహాల రాతి ఫలకం ,ఇక్కడే వున్నాయి .అశోకునికి ”దేవానాం ప్రియా దర్శి ”అనే బిరుదు వుంది .ఆయన రాయించిన శాసనం లో పాటలీ పుత్రం లో కాని ,ఇంకెక్కడైనా కాని సంఘాన్ని విడ దీయ వద్దు అని ,విడ దీసే వారికి తెల్ల బట్టలు కట్టించి ,వేరే చోట ఉంచాలని తన ఆజ్ఞా ప్రతిని ఈ కార్యాలయం లోను ,ఉపాసకుల గ్రుహాలోను ఉంచాలని ,ఉపాసకులు దీని పై విశ్వాసం కలిగి వుండాలని ,ఉప వాసం రోజున భిక్షులు ఎక్కడికీ కదల రాదనీ ,రాజ్యం వ్యాపించి వుండే ప్రదేశా లన్నింటికీ ఉద్యోగస్తులను అమ్పాలని వారు ,కింది ఉద్యోగులకు ఈ శాసన విషయాలను తెలియ జేయాలని శాసనం వేయించాడు అశోక చక్ర  వర్తి .అదీ బౌద్ధం మీద ,ధర్మాల మీద వాటి ఆచరణ మీద అశోకునికి వున్న నిబద్ధత .
  సార నాద్ శిధిలాలు బయల్పడిన విధం
కాశీ రాజు ”చేత సింగ్ ”గారి దివాన్ ”జగత్ సింగ్ ”౧౭౯౪ లో సార నాద్ వెళ్లి ,ఇటుక రాళ్ళ తో కట్టిన పునాది ని తవ్వించాడు .దాని వ్యాసం 110 అడుగులు .అది అశోకుని ”ధర్మ రాజిక స్తూపం ”.త్రవ్వ కాల్లో ఇటుక ,చలువరాయితో నిర్మించ బడి ఒక దానిలో ఒకటి వున్న రెండు పాత్రలు లభించాయి .చలువ రాతి పాత్రలో మానవ అస్థికలు .ముత్యాలు ,బంగారు రేకులు వున్నాయి .అవి బుద్ధుని అస్తికలే .బుద్ధ విగ్రహమూ దొరికింది .వాటి విలువ తెలియనిజగత్   సింగ్ వాటిని గంగా నది లో పారవేయించాడు  .సాహనీ ,ఒర్గ్హళ్ అనే వారిద్దరూ పరిశోధన జారి పారు .ఒక మట్టి పాత్ర లో కాయ ధాన్యాలు ,వండిన అనం దొరికాయి .అందు వల్ల మహ్మదీయ దండ యాత్ర చాలా ఆకస్మికం గా జరిగిందని తేల్చారు .
ఇక్కడి భిక్షువులు నేపాల్,టిబెట్ పారి పోయినట్లు ,కొందరు  హిందూ మతం పుచ్చుకోన్నట్లు ”తారా నాద్ ”రాశాడు .అన్నీ ధ్వంస మైనాయి . .కన్యా కుబ్జ రాజు  గోవింద  చంద్రుని భార్య రాణీ  కుమారీ దేవి కట్టించినదే చివరి విహారం .గోవింద సింగ్ -రాణీ సంయుక్త తండ్రి జయ చంద్రుని తాత .ఇదీ ధ్వంస మైంది 1794 వరకు వీటి విషయం ఎవరికీ తెలియదు .అంటే సుమారు ఆరు వందల ఏళ్ళు సార నాద్ అజ్ఞాతం లోనే ఉంది .వీటి నన్నిటినీ తవ్వించి వెలుగు లోకి తెచ్చింది డంకెన్ ,మెకంజీ, కన్నింగ్ హాం కిట్టూ,ఓర్తల్  అనే మహాను భావులకు భారత జాతి  ఎంతైనా రుణ పడి వుంది .వారు మనకు నిత్య స్మరణీయులు .
1891 లో జపాను కు చెందిన ”అంగ రీక ధర్మ పాలుడు ”బౌద్ధ భిక్షువు  లతో వచ్చి ”ధమ్మేక  స్తూపం, జైన దేవాలయం శిదిలమవటం చూసి చలించి పోయాడు . 1914 లో ”మూల గంధ కుటి ”ఆలయం కట్టాడు .మళ్ళీ తీర్ధ యాత్రా స్తల మైంది సారాద్ . హుయాన్ సాంగ్ రచనలను పరికిస్తే ఇక్కడ ఒక స్తూపం మీద ”బంగారు మామిడి పండు ”వున్నట్లు తెలుస్తుంది .
సమాప్తం
ఆధారం –శ్రీ కొడాలి లక్ష్మీ నారాయణ గారి ”వ్యాసా వళి ”
శ్రీ కొడాలి లక్ష్మీ నారాయణ   గారు చాలా గ్రందాలు రాశారు .ఎన్నో చారిత్రాత్మక మైన విషయాలను చరిత్ర పుటల నుంచి తవ్వి తలకెత్తి అద్భత పరిశోధన తో ,నిశిత పరి శీలన తో రాశారు .ఆయన తెనాలి వాస్తవ్యులని చదివి నట్లు జ్ఞాపకం .ఇంత చరిత్ర రాసిన ఆ మహోదయుడి గురించి ఏవ రైనా రాశారో లేదో నాకు తెలియదు .ఏది రాసినా మూలాలలోకి వెళ్లి ,తగిన ఆధారలో రాయటం వారి ప్రత్యేకత .అని విషయాలను అంత కూలం క్షం గాఅధ్యయనం  చేయటం నాకు అమితాశ్చర్య మేసింది. వాటిలోని విషయాలను notes రాసుకొని ఈ వ్యాస పరంపర తయారు చేశాను .
ఆ చారిత్రిక పరిశోధనా పర బ్రహ్మ స్వర్గీయ కొడాలి లక్ష్మీ నారాయణ గారి కి ఈ వ్యాస పరంపర అత్యంత భక్తీ తో అంకిత మిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -02 -12 .

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.