ఆత్మ గౌరవ భంగానికి ప్రతీకారం
కుందేరు నదికి పడమర వున్న ”రూపన గుడి ‘గ్రామం లో జన్మించి,ఉయ్యాల వాడ గ్రామం లో నివశించాడు నర సింహా రెడ్డి .ఈ రెండు గ్రామాల్లోను రాచ నగరులు వున్నాయి .అందుకని వీరిని ”నగరిండ్ల వారు ”అనే వారు .వీటికి ఉత్త రాన ఉన్న ”గుల్ల దుర్తి ”గ్రామం లో రెడ్డి బాల్యం గడి చింది .క్రమ శిక్షణ తో చదువు నేర్చాడు .యువకుడయే సరికి ,ఎన్నో విద్యల్లో ఆరి తేరాడు . కసరత్తు వ్యాయామం చేసి దేహ దారుద్యం పెంచుకొన్నాడు .తలకు పట్టు రుమాలు కట్టు కోని ,నుదుట ఊర్ధ్వ పుండ్రాలు దిద్దు కోని ,తెల్లని నేత్రాలలో కెంపు జీరల్తో గుబురు మీసాలతో ,చేతి లో అరి వీర భయంకర మైన ఖడ్గం తో ,మంచి వర్చస్సు తో ఉబ్బిన కండలతో ,శత్రువులకు సింహ స్వప్నం గా రెడ్డి కన్పించే వాడు .ప్రజలకు అతన్ని చూస్తె భయం భక్తీ ,ఏక కాలమ్ లో కలిగేవి .ఎంత యుద్ధ వీరుడో అంతటి శాంత మూర్తి కూడా .ఎంతటి కోపిష్తో అంతటి దయా హృదయుడు .ఎంత నిష్కర్ష గా ఉంటాడో,అంత విశుద్ధ ప్రవర్తన కలిగి వుండే వాడు .కోపం వస్తే అపర త్రినేత్రుడే.తన్ను చేరి కొలిచిన వారికి కల్ప వృక్షమే .మంచి సాహితీ ప్రియుడు కూడా .
దగ్గరలో వున్న కరిస్త పాడు గ్రామం లో వెంకట సుబ్బయ్య నే నిగ్రహానుగ్రహ సమర్ధుడు ,శ్రీ హనుమడుపాసకుడు ,అప్పుడప్పుడు రెడ్డి సభ లో ప్రసంగాలు చేసి దిశా నిర్దేశం చేస్తుండే వాడు .రెడ్డి ఆస్థానం లో విద్యా ,సాహిత్య ,కవిత్వ విశారదు డైన ఓబుళా చార్యులు అనే వైష్ణ వ స్వామి వుండే వారు .
నర సింహా రెడ్డి నడుముకు ఖడ్గం ధరించి ,జాతి గుర్రాన్నేక్కి ,గ్రామాలలో తిరుగుతూ ,ప్రజల బాగోగులు విచారిస్తూ ,ఆత్మ బంధువు అని పించుకొన్నాడు .బ్రిటిష్ వారి ఆగడాలు ,ఆస్తుల స్వాదీనాలు ,దౌష్ట్యం చూసి వారిపై ద్వేషం పెంచు కొన్నాడు .ఏటేటా తనకు ప్రభుత్వం ఇస్తున్న భరణాన్ని తీసుకొని రావ టానికి ,తన మనిషిని రెడ్డి కోవెల కుంట్ల కు పంపాడు .
అక్కడి తాసీల్దార్ పూర్వం రెడ్డి కి ,తనకు వున్న విభేదాన్ని జ్ఞాపకం చేసుకొని అనవసరం గా నానా దుర్భాషలాడి ”దాసరి కింద ఇంకో దాసరా ?-ఆ దాసర్నే వచ్చి తీసు కోమని చెప్పు ”’అని వెట కారం గా ,ఆత్మ గౌరవ భంగ కరం గాఅన్నాడు . రెడ్డి పంపిన మనిషి మారు మాట్లాడ కుండా తిరిగి వచ్చేసి రెడ్డి కి జరిగిన దంతా వివరం గా చెప్పాడు .
రెడ్డి కోపోద్రిక్తు దాయాదు .ఉద్రేకం తో ఊగి పోతూ ”వాణ్ని నా కత్తికి ఆహారం చేసే వరకు నేను అన్నం ముట్టను ”అని శపథం చేశాడు .మళ్ళీ ఆలోచన లో పడ్డాడు .”వాడిని చంపితే బ్రిటిష్ రాజ్యసైన్యం అంతా వచ్చి ఇక్కడే తిష్ట వేస్తుంది .దాన్ని మేపటం కష్టం.దేశ స్వాతంత్రానికి నేను చేయ గలిగి నంతా చెయ్యాలి .ప్రజల్లో సంచలనం సృష్టిస్తాను .బ్రిటిష్ పాలనకు విసు గెత్తిన జనం ధిక్కార స్వరాన్ని ఇప్పటికే విని పిస్తున్నారు .తిరుగు బాటు కు సిద్ధం గా వున్నారు .ఇలాంటి సమయం లో ముందుండాలి .నేనే నాందీ వాచకం పలుకు తాను .” అని నిస్చ యించు కొన్నాడు .
”కలవ టాల ”అనే గ్రామానికి తన మనసు లోని మాటను వార్త గా పంపాడు .వెంటనే 200 మంది బోయలు దండు గా వచ్చి సిద్ధం గా వుంది .ఏదైనా చెప్పే చేయాలి అనే మనస్తత్వం వున్న వాడు రెడ్డి .తహసిల్దార్ వద్ద కు ఒక దూత ను పంపుతూ ”నువ్వు అన్నట్లే నేను దాసరినే -నీకు కాదు -నరసింహ స్వామి దాసరిని .నీ పాలిటి యముణ్ణి .రేపే వస్తా .కాచుకో నాకు మామూలు గా వచ్చే గౌరవ భ్రుతినే నేను పంపించ మని అడిగాను .నువ్వు నా ఆత్మ గౌరవాని దెబ్బ తీశావు .నీ కోశా గారాన్ని ముట్ట దించి ,దోచు కుంటా .చేవ వుంటే కాపాడుకో ”అని తహసిల్దార్ కు చెప్పమని పంపాడు .
మర్నాడు ఉదయమే నరసింహ స్వామి ని అర్చించి సర్వ సాధన సంపత్తి తో బయల్దేరాడు రెడ్డి .మంచి బలాధ్యుడైన ”ఒడ్డె ఓబన్న”అనే అంగ రక్షకుడున్నాడు .కోవెల కుంట్ల మీదు గా రెడ్డి దండు కాడి లింది .సమరోత్సాహం తో ”కోబలీ ”అంతు ,ఉత్సాహ పరుస్తూ ,ముందుంది బోయ సైన్యాన్ని నడి పిస్తున్నాడు .తప్పెట్లు ,భేరీలు ,మురజ ,పతః ,ధక్కా రావా లతో సైన్యం కదను తొక్కుతూ ,నడుస్తోంది .కోవెల కుంట్ల ను కొల్ల గొట్ట టానికి నరసింహా రెడ్డి వస్తున్నాదన్న వార్త దావా నాలం లా వ్యాపించింది .భూమిని తవ్వి డబ్బు ,నగలు దాస్తున్నారు కొందరు .ఏమీ చేయ లేని నిస్సహాయులు రక్షించ మని దేవుళ్ళ ను ప్రార్ధిస్తున్నారు .తాసిల్దార్ వల్లనే తమకు ఈ శని దాపు రించిందని కొందరు శాప నార్ధాలు పెడు తున్నారు .శీలం ,మానం పోతుందే మో నని బిక్క చచ్చి పోతున్నారు స్త్రీలు .ఊరు ఖాళీ చేసి ,చెట్టు కొకరు ,పుట్ట కొకరు గా పారి పోయారు .నగరం అంతా ఖాళీ అయి పోయింది .
రెడ్ది దండు తాసీల్దార్ కార్యాలయం చేరింది .రక్షక భటులు అప్పటికే పలాయనం చిత్త గించారు .దొరకు కాపలా కాళీ .చేసేది లేక తాసీల్దార్ కూడా పరారయ్యాడు .అతన్ని పట్టి తెమ్మని రెడ్డి మనుష్యులను పంపాడు .ఒడ్డె ఓబయ్య మరి ఇంకో సహాయకుడు కార్యాలయం లోని ప్రతి గదిని శోదిస్తున్నారు .ఒక గడి లో తాసిల్దార్ ప్రాణ భయం తో ఒణుకుతూ కనిపించాడు .కోపం తో రెడ్డి తలుపు పై ఒకే ఒక్క గుద్దు గుద్దాడు .అది ముక్కలై ఊడి వచ్చింది .ఉద్రేకం తో నరసింహా రెడ్డి ఖడ్గం తో ఒకే ఒక్క వేటు తో తాసిల్దార్ తల నరికేశాడు .
అక్కడ ఖజానాను తుపాకీ తో జాగ్రత్త గా కాపలా కాస్తున్న ”బొందిలి నరసింగ్ ”అనే క్షత్రియుడు కని పించాడు .అతని ప్రభు భక్తికి సంతోషించాడు .అతని తో ”అన్నా !ఉత్తమ వంశం లో జన్మించటం వల్ల నీకు గొప్ప సంస్కారం అబ్బింది .నేను భారత మాత దాశ్య సృన్ఖ లాలను చేదించే ప్రయత్నం లో వున్నాను .అడ్డు రావద్దు .ఖజానా అంతా దోచుకొని వెద తాను .అడ్డ గిచ కుండా చూస్తూ ఊరుకో .బ్రిటిష్ వారికి దాస్యం చేసి భారత మాట కు అవమానం కల్గించకు .”అని ఇతవు చెప్పాడు .అప్పుడా సింగు ”నాకూ దేశ భక్తీ నర నరాణా వుంది .నిన్ను చూస్తె గౌరవం కల్గు తోంది .మా వాళ్ళంతా ”బుందేల్ ఖండ్ ”వాసులు .జ్జన్మ భూమి దాస్య విముక్తి కోసం ధైర్య సాహసాలతో ముందున్న వారే .బ్రిటిష్ వాళ్ల ఉప్పు తింటున్నాను కనుక కర్తవ్యమ్ విషమ రిస్తే తప్పూ చేసిన వాడినవుతాను”అని విన్న విన్చుకొన్నాడు .
అతడి నిర్మల ధర్మ వీరత కు ,వివేకానికి విస్మితు డయాడు రెడ్డి .అయినా తాను వచ్చిన పని ఆగ రాదు అని నిస్చ యించుకొని అతడి చేతి లోని తుపాకీ ని లాగి ఆవ తల పారేశాడు .వాడుం మాహా వీరత్వం తో పిడి బాకు తీసి రెడ్డి మీదకు దూకాడు .ఇక ఊరుకో రాదనీ ఒడ్డె ఓబన్న సింగు కుత్తుకను కత్తి తో ఉత్త రించేశాడు .చని పోయిన నర సింగు ను చూసి విహ్వాలుడయాడు రెడ్డి .ఓబన్న తో ”నువ్వు చేసింది తప్పు అన లేను .కాని ఇంత మంచి వాడి మరణం మాత్రం బాధిస్తోంది ”అన్నాడు .తాను ప్రతిజ్న చేసి నట్లే ఖజానా అంతా పూర్తి గా దోచేశాడు .తాసిల్దార్ తలను ఒక బల్లానికి గుచ్చమని అనుచరుడికి చెప్పి దాన్ని ఎత్తి పట్టించి పట్టణం అంతా ఊరేగాడు దండుతో రెడ్డి .కోవెల కుంట్ల లోని రంగ నాయక స్వామిని అర్చించి ,మళ్ళీ స్వగ్రామానికి చేరాడు విజయోత్సవం
గా .ఇలా ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన తాసిల్దార్ అంతు చూసి ,మొన గాడు అని పించుకొన్నాడు ఉయ్యాల వాడ నర సింహా రెడ్డి .
కుందేరు నదికి పడమర వున్న ”రూపన గుడి ‘గ్రామం లో జన్మించి,ఉయ్యాల వాడ గ్రామం లో నివశించాడు నర సింహా రెడ్డి .ఈ రెండు గ్రామాల్లోను రాచ నగరులు వున్నాయి .అందుకని వీరిని ”నగరిండ్ల వారు ”అనే వారు .వీటికి ఉత్త రాన ఉన్న ”గుల్ల దుర్తి ”గ్రామం లో రెడ్డి బాల్యం గడి చింది .క్రమ శిక్షణ తో చదువు నేర్చాడు .యువకుడయే సరికి ,ఎన్నో విద్యల్లో ఆరి తేరాడు . కసరత్తు వ్యాయామం చేసి దేహ దారుద్యం పెంచుకొన్నాడు .తలకు పట్టు రుమాలు కట్టు కోని ,నుదుట ఊర్ధ్వ పుండ్రాలు దిద్దు కోని ,తెల్లని నేత్రాలలో కెంపు జీరల్తో గుబురు మీసాలతో ,చేతి లో అరి వీర భయంకర మైన ఖడ్గం తో ,మంచి వర్చస్సు తో ఉబ్బిన కండలతో ,శత్రువులకు సింహ స్వప్నం గా రెడ్డి కన్పించే వాడు .ప్రజలకు అతన్ని చూస్తె భయం భక్తీ ,ఏక కాలమ్ లో కలిగేవి .ఎంత యుద్ధ వీరుడో అంతటి శాంత మూర్తి కూడా .ఎంతటి కోపిష్తో అంతటి దయా హృదయుడు .ఎంత నిష్కర్ష గా ఉంటాడో,అంత విశుద్ధ ప్రవర్తన కలిగి వుండే వాడు .కోపం వస్తే అపర త్రినేత్రుడే.తన్ను చేరి కొలిచిన వారికి కల్ప వృక్షమే .మంచి సాహితీ ప్రియుడు కూడా .

దగ్గరలో వున్న కరిస్త పాడు గ్రామం లో వెంకట సుబ్బయ్య నే నిగ్రహానుగ్రహ సమర్ధుడు ,శ్రీ హనుమడుపాసకుడు ,అప్పుడప్పుడు రెడ్డి సభ లో ప్రసంగాలు చేసి దిశా నిర్దేశం చేస్తుండే వాడు .రెడ్డి ఆస్థానం లో విద్యా ,సాహిత్య ,కవిత్వ విశారదు డైన ఓబుళా చార్యులు అనే వైష్ణ వ స్వామి వుండే వారు .
నర సింహా రెడ్డి నడుముకు ఖడ్గం ధరించి ,జాతి గుర్రాన్నేక్కి ,గ్రామాలలో తిరుగుతూ ,ప్రజల బాగోగులు విచారిస్తూ ,ఆత్మ బంధువు అని పించుకొన్నాడు .బ్రిటిష్ వారి ఆగడాలు ,ఆస్తుల స్వాదీనాలు ,దౌష్ట్యం చూసి వారిపై ద్వేషం పెంచు కొన్నాడు .ఏటేటా తనకు ప్రభుత్వం ఇస్తున్న భరణాన్ని తీసుకొని రావ టానికి ,తన మనిషిని రెడ్డి కోవెల కుంట్ల కు పంపాడు .

అక్కడి తాసీల్దార్ పూర్వం రెడ్డి కి ,తనకు వున్న విభేదాన్ని జ్ఞాపకం చేసుకొని అనవసరం గా నానా దుర్భాషలాడి ”దాసరి కింద ఇంకో దాసరా ?-ఆ దాసర్నే వచ్చి తీసు కోమని చెప్పు ”’అని వెట కారం గా ,ఆత్మ గౌరవ భంగ కరం గాఅన్నాడు . రెడ్డి పంపిన మనిషి మారు మాట్లాడ కుండా తిరిగి వచ్చేసి రెడ్డి కి జరిగిన దంతా వివరం గా చెప్పాడు .
రెడ్డి కోపోద్రిక్తు దాయాదు .ఉద్రేకం తో ఊగి పోతూ ”వాణ్ని నా కత్తికి ఆహారం చేసే వరకు నేను అన్నం ముట్టను ”అని శపథం చేశాడు .మళ్ళీ ఆలోచన లో పడ్డాడు .”వాడిని చంపితే బ్రిటిష్ రాజ్యసైన్యం అంతా వచ్చి ఇక్కడే తిష్ట వేస్తుంది .దాన్ని మేపటం కష్టం.దేశ స్వాతంత్రానికి నేను చేయ గలిగి నంతా చెయ్యాలి .ప్రజల్లో సంచలనం సృష్టిస్తాను .బ్రిటిష్ పాలనకు విసు గెత్తిన జనం ధిక్కార స్వరాన్ని ఇప్పటికే విని పిస్తున్నారు .తిరుగు బాటు కు సిద్ధం గా వున్నారు .ఇలాంటి సమయం లో ముందుండాలి .నేనే నాందీ వాచకం పలుకు తాను .” అని నిస్చ యించు కొన్నాడు .

”కలవ టాల ”అనే గ్రామానికి తన మనసు లోని మాటను వార్త గా పంపాడు .వెంటనే 200 మంది బోయలు దండు గా వచ్చి సిద్ధం గా వుంది .ఏదైనా చెప్పే చేయాలి అనే మనస్తత్వం వున్న వాడు రెడ్డి .తహసిల్దార్ వద్ద కు ఒక దూత ను పంపుతూ ”నువ్వు అన్నట్లే నేను దాసరినే -నీకు కాదు -నరసింహ స్వామి దాసరిని .నీ పాలిటి యముణ్ణి .రేపే వస్తా .కాచుకో నాకు మామూలు గా వచ్చే గౌరవ భ్రుతినే నేను పంపించ మని అడిగాను .నువ్వు నా ఆత్మ గౌరవాని దెబ్బ తీశావు .నీ కోశా గారాన్ని ముట్ట దించి ,దోచు కుంటా .చేవ వుంటే కాపాడుకో ”అని తహసిల్దార్ కు చెప్పమని పంపాడు .

అక్కడ ఖజానాను తుపాకీ తో జాగ్రత్త గా కాపలా కాస్తున్న ”బొందిలి నరసింగ్ ”అనే క్షత్రియుడు కని పించాడు .అతని ప్రభు భక్తికి సంతోషించాడు .అతని తో ”అన్నా !ఉత్తమ వంశం లో జన్మించటం వల్ల నీకు గొప్ప సంస్కారం అబ్బింది .నేను భారత మాత దాశ్య సృన్ఖ లాలను చేదించే ప్రయత్నం లో వున్నాను .అడ్డు రావద్దు .ఖజానా అంతా దోచుకొని వెద తాను .అడ్డ గిచ కుండా చూస్తూ ఊరుకో .బ్రిటిష్ వారికి దాస్యం చేసి భారత మాట కు అవమానం కల్గించకు .”అని ఇతవు చెప్పాడు .అప్పుడా సింగు ”నాకూ దేశ భక్తీ నర నరాణా వుంది .నిన్ను చూస్తె గౌరవం కల్గు తోంది .మా వాళ్ళంతా ”బుందేల్ ఖండ్ ”వాసులు .జ్జన్మ భూమి దాస్య విముక్తి కోసం ధైర్య సాహసాలతో ముందున్న వారే .బ్రిటిష్ వాళ్ల ఉప్పు తింటున్నాను కనుక కర్తవ్యమ్ విషమ రిస్తే తప్పూ చేసిన వాడినవుతాను”అని విన్న విన్చుకొన్నాడు .

అతడి నిర్మల ధర్మ వీరత కు ,వివేకానికి విస్మితు డయాడు రెడ్డి .అయినా తాను వచ్చిన పని ఆగ రాదు అని నిస్చ యించుకొని అతడి చేతి లోని తుపాకీ ని లాగి ఆవ తల పారేశాడు .వాడుం మాహా వీరత్వం తో పిడి బాకు తీసి రెడ్డి మీదకు దూకాడు .ఇక ఊరుకో రాదనీ ఒడ్డె ఓబన్న సింగు కుత్తుకను కత్తి తో ఉత్త రించేశాడు .చని పోయిన నర సింగు ను చూసి విహ్వాలుడయాడు రెడ్డి .ఓబన్న తో ”నువ్వు చేసింది తప్పు అన లేను .కాని ఇంత మంచి వాడి మరణం మాత్రం బాధిస్తోంది ”అన్నాడు .తాను ప్రతిజ్న చేసి నట్లే ఖజానా అంతా పూర్తి గా దోచేశాడు .తాసిల్దార్ తలను ఒక బల్లానికి గుచ్చమని అనుచరుడికి చెప్పి దాన్ని ఎత్తి పట్టించి పట్టణం అంతా ఊరేగాడు దండుతో రెడ్డి .కోవెల కుంట్ల లోని రంగ నాయక స్వామిని అర్చించి ,మళ్ళీ స్వగ్రామానికి చేరాడు విజయోత్సవం

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com