విప్లవ సింహం ఉయ్యాల వాడ నర సింహా రెడ్డి –1
రచనకు నేపధ్యం –
మేము కిందటి జూలై లో బెంగలూరు లో మా అబ్బాయి శర్మ వాళ్ళింట్లో నెల రోజులున్నాం . నాకు ఆప్తులు ,మా ఉయ్యూరు నివాసి ,ప్రస్తుతం అమెరికా వాసి అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఒక రోజూ ఫోన్ చేసి ,శ్రీ తంగిరాల వెంకట సుబ్బా రావు గారు తనకు చాలా ఆత్మీయులని ,చాలా కాలమ్ నుంచి వారితో పరిచయం వుందని వారు బెంగళూర్ విశ్వ విద్యా లయమం లో తెలుశాఖా ధ్యక్షులు గా పని చేసి ర్రిటైర్ అయి అక్కడే వున్నారని ,మంచి సాహితీ ప్రియులని చెప్పి ,వారి ఫోన్ నెంబర్ ఇచ్చి ,వారికి నేను బెంగళూర్ లో వున్నట్లు తెలియ జేశారు .నేను ఆ ప్రకారమే సుబ్బా రావు గారికి ఫోన్ చేసి మాట్లాడాను .వారు ఎంతో ఆప్యాయం గ మాట్లాడారు .తాము ప్రచురించిన పుస్త కాలు నాకు పంపు తానని నా అడ్డ్రెస్ తీసుకొన్నారు .వారిని కృష్ణా జిల్లా రచయితల సంఘం విజయ వాడ లో నిర్వ హించిన మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభలో కవి సమ్మే ళనం లో చూసిన జ్ఞాపకం వుంది .మంచి వక్త .గొప్ప కవిత్వం విని పించారు .ఆ విషయం గుర్తు చేశాను ..వారు సంతోషించారు .మేము ఉయ్యూరు వచ్చేసరికి సుబ్బా రావు గారు పంపిన పుస్తకాలు అందాయి .అందులో ”రేనాటి సూర్య చంద్రులు ”అనే పుస్తకం బాగా ఆకర్షించి చదివేశాను .మనసుకు పట్టింది .నేను కూడా వారికి సరస భారతి ప్రచురించిన పుస్త కాలు పంపాను .

‘‘రేనాటి సూర్య చంద్రులు ”పేర శ్రీ సుబ్బా రావు గారు పరిశోధన చేసి ,1969 లో పీ.హెచ్.డి.పొందారు .అందులో సూర్యుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి .చంద్రుడు మహా దాత బుడ్డా వెంగళ రెడ్డి .
ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి పై ప్రౌఢ కవి శ్రీ పాణ్యం నరస రామయ్య గారు పద్య కావ్యం రాశారు

శ్రీ కృష్ణ రాయ రసజ్న సమాఖ్య (శ్రీ. ర. స..)ఆచార్య తంగి రాల వెంకట సుబ్బా రావు గారి సంపాద కత్వం లో ”రేనాటి సూర్య చంద్రులు ”పేర మూడు సంపుటాలను వెలువరించింది .నాటకాలు కూడా ప్రదర్శనకు నోచుకోని మంచి ప్రాముఖ్యం పొందాయి .వీరిద్దరి చరిత్ర లపై బుర్ర కధలూ వచ్చి గొప్ప ప్రచారం చేశాయి .
శ్రీ శైలం లో ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ,బుడ్డా వెంగళ రెడ్డి గార్ల కాంశ్య విగ్ర హాలను ఏర్పర చారు .ఉయ్యాల వాడ ,కోవెల కుంట్ల లలో ఆరతి ఏటా నరసింహా రెడ్డి బ్రిటిష్ వారు ఉరి శిక్ష విధించగా వీర మరణం పొందిన ఫిబ్రవరి 22 వ తేది నాడు విప్లవ సింహం నర సింహా రెడ్డి వర్ధంతి సభ జరిపి నాటకాలు ప్రదర్శిస్తారు .ఉయ్యాల వాడ లో ”రేనాటి సూర్య చంద్రుల స్మారక సమితి ”ఆధ్వర్యం ఈ కార్య క్రమాలు జరిపి నివాళు లందించి జాతీయతా స్పూర్తి కలి గిస్తున్నారు .వీటికి అన్నిటి కి వెనక వుండి.స్పూర్తి కలిగిస్తున్న వ్యక్తి ఆచార్య శ్రీ తంగిరాల వెంకట సుబ్బా రావు గారే అన్నది నిర్వి వాదం .
ఇంతటి సాహితీ మూర్తి తో నాకు పరిచయం కల్గించిన ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ,ఇంత విలువైన పుస్తకాన్ని నాకు ఆత్మీయం గా పంపి ,నాతొ చదివించిన ఆచార్య శ్రీ తంగి రాల వెంకట సుబ్బా రావు గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .
నాకు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి పేరు తెలుసు .కాని ఆయన జీవిత చరిత్ర తెలియదు .పై పుస్తకం చదివిన తర్వాత ,నాకు రెడ్డి పై ఆరాధనా భావం కలిగింది . నాకు తెలిసినది అందరికి అంద జేయాలని సంకల్పించి ప్రౌఢ కవి శ్రీ పాణ్యం నరస రామయ్య గారు రాసిన పద్య కావ్యం ”స్వాతంత్ర వీరుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ”ని ఆధారం గా చేసుకొని ఈ వ్యాస పరంపర రచిస్తున్నాను . దీన్ని-విప్లవ సింహం, రాయల సీమ రైతు ఉద్యమ నాయకుడు,రేనాటి సూర్యుడు అయిన ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి కి అంకితమిస్తున్నాను . ఇదీ నా రచనకు నే పద్యం .
రెడ్డి బాల్యం
ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి 1846 -1847 కాలమ్ లో రాయల సీమ రైతు హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏది రించి నిల్చి పోరాడిన వీర యోధుడు .ఆయన చేసిన తిరుగు బాటు స్వార్స్దానికి కాదు అది రాయల సీమ రైతు విప్లవమే .ఔరంగా జేబు జిజియా పన్ను విధిస్తే ,అంత కంటే యేడాకులు ఎక్కువ చదివిన కుమ్ఫినీ ప్రభుత్వం ఇంకా ఎకువ పన్నులు వేసి రైతు నడ్డి విరిచింది .గత్యం తరం లేక రైతులు తిరగ బడ్డారు .వారందరి తరఫునా పోరాడి వీర మరణం చేసిన రాయల సీమ రైతు విప్లవ నాయకుడే ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి రేనాటి ప్రభువు .ఫిబ్రవరి ఇరవై రెండున 1947 లో రెడ్ది ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది .అంటే ఆ అమర వీరుడు వీర మరణం పొంది 165 ఏళ్ళు అయింది . .
రెడ్డి కులం లో మొతాటి శాఖ లో జన్మించిన వీరాధి వీరుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి .ప్రధమ భారత స్వతంత్ర ఉద్యమానికి ,పదేళ్ళ ముందే ,ఆంగ్ల సంమ్రాజ్యం పై కట్టి కట్టిన స్వాతంత్ర సమర యోధుడు రెడ్డి .నాసామ అనే నాగ రాన్ని రాజా దాని గా చేసుకొని జయ రామి రెడ్డి పరి పాలిస్తున్నాడు .66 గ్రామాలకు అది పతి .ప్రజా రంజకం గా పాలన చేస్తున్నాడు .ఇది బ్రిటిష్ వాణిజ్య వేత్తలకు కారం రాచి నట్లింది . రాజ్య విస్తరణ కోసం ,వ్యాపార లబ్ది కోసం అందర్నీ జయించటం ప్రారంభించారు తెల్ల దొరలూ .మహా బల వంత మైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన అల్ప సేన తో ఎదుర్కోవటం అసాధ్యం అని తలచి జయ రామి రెడ్డి ,తన స్వాధీనం లో వున్న గ్రామాలను అధికారాలను తగ్గించుకొని ,తనకు ,తన వారసులకు ,తర తరాలుగా అనుభ వించ టానికి వీలుగా ”తవర్జీ ”అనే వార్షిక భ్రుతిని పొందే షరతు తో బ్రిటిష్ వారి తో సంధి చేసు కొన్నాడు .
జయ రామ రెడ్డి అధికారాన్ని తగ్గించుకొన్నందుకు మనసు లో బాధ పడుతున్నాడు .పుత్ర సంతానమూ లేదు .”మజ్జారి ”వంశానికి చెందిన నరసింహా రెడ్డి అనే కుర్రాడిని దత్తత చేసు కొన్నాడు .ఆ నర సింహా రెడ్డే బ్రిటిష్ ప్రభుత్వ నక్క ల పాటి సింహమైనాడు .వారి సేనాధి పతి ”ఆత్సన్ ”కు గుండెలో మేకు అయాడు .వాడితో యుద్ధం చేసి రేనాటి వీరుడు అని పించుకొన్నాడు .”కుముద్వతీ నది ”నే కుందేరు అంటారు .అది ప్రవహించే నల్ల రేగడి నెల ప్రాంతాన్ని ”రేనాడు ”అంటారు .అదే రెడ్డి జన్మ స్థానం .రేనాడు మధ్య లో వున్న గ్రామమే ”నది గడ్డ ”ఇక్కడి వారంతా ఆత్మాభి మానులే.కష్టించి అని చేసి బ్రతికే వారు .ఆత్మ గౌర వాణికి ఎవరు భంగం కల్గించినా వాణ్ని మత్తు బెట్టె దాకా నిద్ర పోని మగటిమ గల వారు .కనుక నరసింహా రెడ్డి కి సహజం గానే రాజసం ,ఠీవి ,ఆత్మగౌరవం ఏర్పడ్డాయి .వీటి తో రెడ్డి వీరాధి వీరుడు అని పించుకొన్నాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com