విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి –4
వాట్సన్ దొరకూ పరాభవమే
వాట్సన్ అనే ఆంగ్ల దొర నొసం పట్నానికి గొప్ప సైన్యం తో కదిలి వస్తున్నట్లు సమా చారం రెడ్డికి తెలిసింది . చెరువు లో వున్న నీటిని ,కోట చుట్టూ వున్న అగడ్తల లోకి పారేట్లు చేసి ,చెరువు ఖాళీ చేయించి ,బ్రిటిష్ సైన్యానికి నీరు దొరక్కుండా చేశాడు .శత్రువులపై వడిసెల తో రాళ్ళను విసిరేయించి గగ్గోలు పుట్టించాడు .వీరికి వెనుక ఒకే ఒక్క బాణం తో శత్రువును చంపే శక్తి వున్న మొన గాళ్ళను నియమించాడు .అన్ని ఏర్పాట్లను స్వయం గా పర్య వేక్షించాడు .అంజనం వేసి శత్రువు యెంత దూరం లో వున్నారో తెలియ జేశాడు వెంకన్న .కోట గోదాస్లపై నుంచి సాల సాలా మసిలే నూనె పోయించే ఏర్పాటు చేస్వ్హాడు .వెంటనే హెచ్చ రికలు జారీ చేశాడు .ఇంతలో బ్రిటిష్ సైన్యం కోటను ముట్ట దించింది .వదిసేలతో రాళ్ళు విసరుతూ ,,కాగే నూనె కుమ్మ రిస్టు రెడ్డి సైన్యం యుద్ధం చేస్తోంది .కోటాకు ఏ వస్తువు సరఫరా కాకుండా వాట్సన్ జాగ్రత్త పాడు తున్నాడు .దీన్ని ఎదుర్కొంటూ రెడ్డి తీవ్రం గా పోరాడుతున్నాడు ..
ఇంతలో వైశాఖ మాసం వచ్చింది .రేనాటి ఎండలకు తాల లేక ,నోరు తడుపు కోవ టానికి కూడా నీరు లేక తెల్ల సైన్యం మల మల మాడి పోతూ పలాయనం చిత్త గించే పరిస్తితి లో వుంది .వున్న మందు గుండు సామానంతా ఖర్చు చేసే శారు .అయినా కోట అంగుళం కూడా స్వాధీనం కాలేదు .బళ్ళారి నుంచి సైన్యాన్ని ,ఆయుధాలను పంపమని వాట్సన్ మొర పెట్టు కొన్నాడు పై అధికార్లకు .ఇది తెలుసు కొన్న ఒక దేశ భక్తుడు కాగితం పై ఈ వార్త రాసి బాణానికి గుచ్చి కోట లోకి వదిలాడు .ఆ లేఖను భటుడు తెచ్చి రెడ్డికి అప్పా గించాడు .లేఖ రాసిన దేశ భక్తుడి విజ్ఞతకు మనసారా మెచ్చుకొన్నాడు .బ్రిటిష్ సైన్యాన్ని బహిరంగం గా ఎదిరించాలని నిర్ణ యించాడు .
దుర్గం ద్వారాలను తెరిపించి ,ఉత్తమాశ్వాన్ని అధిరోహించి ,హున సైన్యం పై పది నరసింహ మూర్తి లా నంజుకు తినటానికి విజ్రుమ్భించాడు .అందిన వాణ్ని అందినట్లు కట్టి తో నరికి పారేశాడు .అందని వాణ్ని వెంటాడి సంహరించాడు .బోయ దండు సాయం గా నిల్చి రెచ్చి పోయింది .నడుముకు వున్న ఖడ్గం తో శత్రు సైన్య శిరస్సులను ఖండ ఖండాలు గా నరికేశాడు .మొల లోని పిడి బాకుతో గోతులు కోసి వేశాడు .నూపున వున్న గండ్ర గొడ్డలి తో చేతులు ,కాళ్ళు తెగ నరికాడు .గుర్రం మీద వున్న బల్లెం తో రొమ్ముల మీద కుమ్మి ,కుమ్మి చంపాడు .దాక్ష యజ్ఞం లో భీభత్సం సృష్టించినా వీర భద్ర మూర్తి గా వీర విహారం చేశాడు .శత్రువుల పాలిటి కాల మృత్యువే అయాడు .క్షణం తీరిక లేకుండా ,క్యలుపు సొలుపు లేక విజ్రుమ్భించాడు రెడ్డి .ఆ పరాక్రమాతోపానికి భయ పడి శత్రు సైన్యం పారి పోయింది .తన వారందరినీ ఉచిత రీతిని సన్మానించాడు రెడ్డి .నొసలు ప్రాంతం అంతా మైదానం .శత్రు వులకు ఆను పాను లన్ని తెలిసి పోయి వుంటాయి .ఇంక ఇక్కడ శత్రువులను నివారించటం చాలా కష్టం అని తోచింది .అక్కడి నుంచి కార్య రంగాన్ని వేరొక చోటికి మార్చాలని నిశ్చయించాడు . .
గిరిజనుల కు బాసట
నల్లమల అడవుల్లో అహోబిల క్షేత్రానికి ఉత్తరాన ,తన పూర్వీకులు కట్టించిన వన దుర్గానికి మకాం మార్చాడు .దాన్ని శత్రు దుర్భేద్యం గా తీర్చి దిద్దాడు .వివిధ సమారాలను విస్తృతం గా సమ కూర్చుకొన్నాడు .రెంజర్ వుద్యోగం లో వున్న ఒక ఆంగ్లేయుడు ,జాత్యహంకారం తో ,రుద్రవరం గ్రామలో వున్నాడు .అడవి లో వున్న కంద మూలాలను తెచ్చుకొనే మన్య జీవుల్ని కసురు కొంటున్నాడు .గుడిసెల మీద కప్పు కొనే గడ్డి కోసం వెళ్ళే వారి నుంచి లంచాలు గుంజు తున్నాడు .పసుల కాపర్ల వద్ద నుంచి మేకలు .గొర్రెల్ని బేవార్సుగా పొంది అనిభ విస్తున్నాడు .కట్టే పుల్లల కోసం అడవికి వెళ్ళే ఆడ వాళ్ళను బల్లత్కబలాత్కారిస్తున్నాడు .రావణ రాజ్యం గా అడవి పాలన చేస్తున్న వీడి విషయం రెడ్డి చెవిన పడింది .వాణ్ని చంపి ,మన్య జీవుల బాధ తీర్చాలని నిర్ణయించాడు .ఒడ్డె ఓబన్న ను తోడూ తీసుకొని ఒక రోజూ రాత్రి రుద్ర వరం చేరాడు .వాడుండే బంగాళా వద్ద నిలిచి ”ఒరే !అడవి సంపద మా వాళ్ల స్వంతం .వాళ్లకు దక్క నీయ కుండా బొక్కు తున్నావు .బయటికి రా.నిన్ను కాపాడే వాడు లేదు .నీ ఆగడాలు మితి మీరుతున్నాయి .నిన్ను చంపి కాకులకు గద్దలకు వేస్తా .”అని సింహం లా ఘీంకరించాడు .వాడికి భయం వేసి ,పెళ్ళాం పిల్లల సంగతి ఒదిలేసి ప్రాణ భీతి తో వెనుక దారి గుండా పారి పోయాడు .ఎక్కడ రెడ్డి పట్టుకొని నరుకు తాడో నని సందులు గొందులలో దాక్కొని తిరుగు తున్నాడు .చివరికి ఒక చాకలి ఇంట్లో దూరి కాళ్ళా వెళ్ళా పడి ప్రాణం కాపాడ మని వేడుకొన్నాడు .జాలి గుండెలున్న ఆ చాకలి వాడిని పాత బట్టల మూటల మధ్య దాక్కో మన్నాడు .రెడ్డి -రేంజరు ఇల్లంతా సోదా చేసి ,వాడు దొరక్క పోయే సరికి పట్నం లో వెదక టానికి బయల్దేరి ఇక్కడున్నాడని కనిపెట్టాడు .చాకలిని బెదిరిస్తే శరణార్ధి గా వచ్చాడు కనుక ఆశ్రయం ఇచ్చానని నిజం చెప్పాడు .బట్టల మూటల కింద వాణ్ని చూసి ,హెచ్చిన కోపం తో ముష్టి ఘాతాలతో శిరస్సు ముక్కలు చేసి చంపేశాడు .నిజం చెప్పిన చాకలిని మెచ్చి మళ్ళీ కోటకు చేరాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -03 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com