విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి –5

విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి –5

                                            స్వచ్చంద సాయం
 రెడ్డి ఏమీ అడగక పోయినా ,ఆ చుట్టూ పక్కల ప్రజా లంతా ,దేశ స్వాతంత్రం కోసం పాటు పడుతున్న అతనికి కావల సిన ధాన్యం ,ధనం ,సామగ్రి ని శక్తి కొలది అండ జేసి తామూ ముందు ఉంటూనే  వున్నారు .కంబం ఆ చుట్టూ ప్రక్క గ్రామాల వారు కూడా అదే రక మైన సాధన సంపత్తి ని సమ కూరుస్తూ మద్దతు పలుకు తున్నారు .ఇదే అదనుగా ఆంగ్ల తాసిల్దారు వాళ్ళను భయ పెడుతూ ,పై వారి మన్నన లను పొందు తున్నారు .అతడు భారతీయుడే అయినా మెప్పు కోసం మెహర్బానీ చేస్తున్నాడు .వీడి వార్త కూడా నరసింహా రెడ్డి కి చేరి ,వాడికి కూడా బుద్ధి చెప్పాలని తలచాడు .భారతీయుడైనా స్వంత లాభం కోసం దేశాన్ని మర్చి పోయాడు కనుక వధార్హుడే అని తీర్మానించు కొన్నాడు రెడ్డి .
  దేశ ద్రోహానికి తగిన శిక్ష
చుట్టూ ప్రక్కల జరిగే కోడి పందాలను చూడ టానికి గ్రామీణులు  రెడ్డిని ఆప్యాయం గా ఆహ్వానించారు .రెడ్డి వస్తున్నాడనే వార్త తాసీల్దారు తెలుసు కోని ,పట్టించి ప్రమోషన్ కొట్టేద్దామని ఆశించాడు .పోలీసు సూపెరిందేంట్ ను కలిసి ,విషయం వివరించి ,బలగం పెంచుకొని ,రెడ్డిని ప్రాణాలతో పట్టి బంధించి అప్పగించే అనుజ్న పొందాడు .కోడి పందాలను చూడ టానికి రెడ్డి ఏ అనుమానం లేకుండా వచ్చాడు .తాసీల్దారు అతన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు .అతన్ని రక్షించే ప్రయత్నం లో గ్రామస్తులు రక్షణ వలయం గా చేరి కాపాడు కొన్నారు .అసమాన శూరుడైన నర సింహా రెడ్డి సాహసమే ఊపిరిగా ,వాళ్ళను వారించి ,కత్తి పట్టు కోని ,ఆ అధికారులను కత్తి కో ఖండం గా నరక టానికి ముందుకు దూకాడు .పోలీసులు కాల్పులు సాగించారు .తుపాకి గుండ్లకు గుండెల్ని ఎదురు గా పెట్టి ,ప్రజలు రెడ్డి ని రక్షిస్తున్నారు .తెల్ల వాళ్ల చేతుల్లోంచి తుపాకీ లను లాగి పారేశారు .చేసేదేమీ లేక అది కారు లిద్దరూ గుర్రా లెక్కి ప్రాణ భయం తో దౌడు తీశారు .నరసింహా రెడ్డి గుర్రమెక్కి వారిని వెంబడించాడు .దెబ్బ కొక్కాన్ని గా వాళ్ల తలలు కత్తి తో నరికి పారేశాడు .దేశ ద్రోహులకు ఇదే శిక్ష అని అందరికి ప్రకటించాడు .తాను చేసిన ప్రతిజ్న ను నెర వేర్చుకోన్నాను అనే పరమ సంతోషాన్ని రెడ్డి పొందాడు .మళ్ళీ కోడి పందాల దగ్గరకు వెళ్లి ,అసలేమీ జరగనట్లు గా ,హాయిగా చూసి వారితో ఆనందం అనుభ వించాడు .అక్కడున్న వారందరికీ తన ఉద్యమ లక్ష్యాన్ని వివరించి ,దేశ స్వాతంత్రం కోసం అందరు కలిసి పని చేయాలని ప్రోత్స హించి కార్యోన్ముఖుల్ని చేసి జయ జయ ధ్వానాల మధ్య కోటకు చేరాడు .
 నార్టన్ కూ పరాభవమే
         అప్పుడు దక్షిణా పదాన్ని -చెన్న పట్నం కేంద్రం గా తెల్ల వాళ్ళు పాలిస్తున్నారు .క్రూరుడైన వాట్సన్ దొర గారే చేతు లెత్తే శాడని తెలుసు కోని ,ఆంగ్లేయులు ప్రాణాలు అర చేతి లో పెట్టు కోని బతుకు తున్నారు .బానిస గా వున్న నరసింహా రెడ్డి దండు సమ కూర్చుకొని ,తమపై యుద్ధం చేస్తూండటం దుస్సాహసం గా వాళ్ళు భావించారు ఊరుకొంటే సామ్రాజ్యాధి పత్యానికే ఎసరు పెడ తాడని గట్టి గా నమ్మారు .ఆ నాటి కెప్టెన్ -నార్టన్ ఉపేక్ష తగదు అని భావించి ,పెద్ద సైన్యం తో ,మండూ ,ఆర్బలం తో బయల్దేరాడు .రెడ్డి వుండే దుర్గానికి సమీ పం లో ”గిద్ద లూరు ”వద్ద సేనను దింపేశాడు .అక్కడికి దుర్గం ఆమడ దూరం.అడవిలో చెట్లు కొట్టించి ,బండలు పగుల కొట్టించి మార్గాలు ఏర్పాటు చేస్శాడు .ఇతని ప్రయత్నాలన్నీ రెడ్డికి తెలుస్తూనే వున్నాయి .ముఖ్యుల్ని సమా వేశ పరిచి ” తెల్ల సైన్యం భారీగా మొహరించి వుంది .బయటి నుంచి మనం దేన్నీ తెచ్చ్చు కొనే వీలు కన్పించటం లేదు .వాళ్ళు రానివ్వరు కూడా .దుర్గం దగ్గరకు తెల్ల వాళ్ళు చేరా కుండా మనం జాగ్రత్త తీసుకోవాలి .వాళ్ల సైన్యానికి ,మన సైన్యానికి భేదం హస్తి మశాకాంతరం గా వుంది .కనుక  ఏమరు పాటు గా వున్న ప్పుడే ,వాళ్ళను ఎదుర్కొని చంపాలి .సమయాన్ని సద్విని యోగం చేసు కోవాలి .తెల్ల వాళ్ళను అంత  మొందిస్తే మనల్ని మనమే పాలించుకొనే శుభ ఘడియలు  వస్తాయి .ప్రజలు కోరు కొనేది కూడా ఇదే నని మనందరికీ తెలుసు కదా .ఈలక్ష్య  సాధనకు మనమందరం అంకిత భావం తో కలిసి పని చేద్దాం .మన ఉద్యమం భారత మాత  చేతికి ఉన్న బంధనాలను త్రెంచేయటమే .మనం మన  జన్మ లను  ధన్యం చేసు కోవాలి ”అని అందరిలో దేశ భక్తి  రగిలించి ,కోట నుంచి బయల్దేరాడు
ఆ రోజూ అమా వాస్య .చిమ్మ చీకటి అర్ధ రాత్రి .రెడ్డి దండు తో శత్రు శిబిరం చేరాడు .అక్కడ వెలిగే దీపాల్ని రెడ్డి దండు ఆర్పేసింది .కాపలా వాళ్ళు మేల్కొని కేకలు వేశారు .ఇంతలో రెడ్డి వాళ్ల మీద విరుచుకు పడ్డాడు .తప్పించుకొని పారి పోయే వారు ఆయుధాలను తీసుకొని పోకుండా జాగ్రత్త పడ్డాడు .గుడారం లో దూరి బోయ దండు కత్తు లతో  సైనికుల గొంతులు పర పరా కోసే శారు .కార్య శూరుడైన రెడ్డి ,ప్రమద గణంతో బయల్దేరిన ఫాలాగ్ని నేత్రం తో భయంకరం గా కని పించే ప్రళయ కాల రుద్రుడు లాగ కని పించాడు .అనుకోకుండా మీద పడిన రెడ్డి సైన్యాన్ని చూసి చీకటి రాత్రిలో ఏమీ కని పించక ,ఏదీ పాలు పోక ,తెల్ల సైనికులు కకా  వికలై ప్రాణాలు కాపాడు  కోవటం కోసం పారి పోయారు .గుడారాలన్నీ ఖాళీ .  చిక్కిన ధన ,సాధన సంపత్తి ని, ఆయుధాలను దోచుకొని, మళ్ళీ కోటకు చేరాడు విప్లవ వీరుడు ఉయ్యాల వాడ నర సింహా రెడ్డి .నార్టన్ పరాభవం తో తల్ల డిల్లాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -03 -12

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.