సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –2
నోటితో పొగుడుతూ నొసలు తో వెక్కి రించటం లోక సహజం .కవులు కూడా ఇందులో ఏమీ తీసి పోలేదు .వారి భాష లో ఇది వ్యాజ నిండా స్తుతి అన్నారు .అలాంటి మాతస్లతో పద్యాలు రాయటమే కాదు శతకాలు కూడా రాసి సాక్షాత్తు విష్ణు మూర్తి నే మెప్పించిన కాసుల పురుషోత్తమ కవి చల్ల పల్లి సంస్థాన కవి .ముక్తేవి పెరు మాలయ్య కవీ సుప్రసిద్ధుడే . సంస్థాన మూల పురుషులలో ఒక రైనా కంచి నీడు గారి వదాన్యత ,దాత్రుత్వాలపై చాలా చాటువులు వున్నాయని ”కమ్మ వారి చరిత్ర ”చెబుతోంది .శ్రీ కృష్ణ లీలా తరంగిణి రాసిన నారాయణ తీర్ధులు ,కూచిపూడి నాట్య కర్త సిద్దేంద్రుడు ఇక్కడి వారేనని అంటారు . .పెరు మాల్లయ్య
యార్ల గడ్డ కోదండ రామయ్య పాలనలో పెడ ముక్తేవి లోని లక్ష్మీ పతి స్వామి దేవాలయాన్ని పునరుద్ధ రించాడు .దీన్ని పంచ లక్ష్మీ నార సింహ క్షేత్రం గా భావిస్తారు .1765 -1785 ప్రాంతం లో నిజాం నుండి నిజాం ఆలీ అనే వాడి నాయకత్వం లో ఒక గుర్రపు దండు దేవర కోట సంస్థానాన్ని దోచుకోవ టానికి వచ్చిందట .ప్రభువు కోదండ రామన్న పెడ ముక్తేవి నివాసి అయిన పెరు మాల్లయ్య కవికి కబురు పెట్టి దండు రాకుండా చేసే ఉపాయం ఆలోచిన్చామన్నారట .కవి గారు వెంటనే శ్రీకాకుళం క్షేత్రానికి వచ్చి అక్కడ వెలసి వున్న ఆంజనేయ స్వామిని ఉపాషించాడు .అపటికే బేజ వాడ చేరిన నిజాఆలీ దండు గుర్రాలపై పిడుగులు అడ్డాయి .ప్రాణ భీతి తో దండు వెనక్కి వెళ్లి పోయేట్లు గా కవి పద్య శతకాన్ని చెప్పాడట .ఈ శతకమే ”హనుమంత శతకం”.కవులు రాజులను మెప్పించి నజరానాలు పొందటమే కాదు అవసర మైన పుదు రాజ్యాన్ని రక్షించే బాధ్యత కూడా తీసు కొంటారని దీన్ని బట్టి తెలుస్తోంది .ప్రభు భక్తీ పరాయణ తాకే కాక భగవద్భక్తి గరిష్టతకు ఇది గొప్ప ఉదాహరణ .”సింహాద్రి నార సింహ శతకం ”వంటి గొప్ప శతకాల సరసన వీరి శతకమూ చేరింది .”శత్రు హంత -శ్రీ హను మంతా ”అన్న మకుటం తో పొదిగిన కంద పద్య శతకమిది .
”ఇత్తరిని నిజామల్లీ -హత్తీలు గురాలు -పాటు తరాహ వ బలముల్ -మొత్తమయి వచ్చేవిచ్చిత్తు పడన్ -శత్రు హంత శ్రీ హను మంతా ”
”వడి గల దేవుడ వనుచును -నుడికారపు శతకమందు -నుతి చేసేదననే -కాదు వడి గుర్రపు దలముల -జేడ దోలుము -శత్రు హంత శ్రీ హను మంతా ”
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే .ఈ కవి రామాయణ కధను 44 సీస పద్యాలలో ”భద్ర గిరి సౌద సంచార భవ విదూర ”మకుటం తో కావ్యం రాశాడట .ఈయన కుమారుడు సుందర దాస కవి సంస్కృతాంధ్రాలలో గొప్ప కవి .దౌహిత్రుడు కోవెల రాఘ వాచార్యులు శ్రీ కాకులాంధ్ర మహా విష్ణువు మీదా ,పెడ ముక్తేవి లక్ష్మీ పతి స్వామి మీదా గేయాలు ,ఏకాంత సేవా ప్రబంధాన్ని రాసి నట్లు ”దేవర కోట సర్వస్వం ”లో ఉందట .
కాశీ నాధుని మల్లనార్యునికి కోదండ రామన్న ప్రభవు ”మలేశ్వర పురాగ్రహారాన్ని ”దానం గా చ్చినట్లు ,దానికి ఆయన ”చల్ల పల్లి ధరణీ జాని యా కోదండ రాముడు మల్లేశ్వర పుర మిచ్చే —నత సమస్త భూమి పతి మల్లనా రాదయ పుణ్య రాశికి ”అని కృతజ్ఞత గా ”సత్యవత్సుపాఖ్యాన ”అవతారికలో చెప్పాడు .మొత్తం మీద కోదండ రామన్న రాజ్యాన్ని పెరుమాళ్ళ కవి హనుమద్భక్తి తో కాపాడి ప్రభువుకు ,ప్రజలకు మేలు చేశాడన్నది నిర్వి వాదాంశ విషయం .అంటే శ్రీ కుల ఆంజనేయ స్వామి అంతటి మహిమాన్వితుడు అని మనకు తెలిసిన విషయం .రాజా గారి ఈవి కూడా ప్రశంశ నీయమే .
కాసుల పురుషోత్తమ కవి
శ్రీ కాకుళం అంటే ఆంద్ర శ్రీ మహా విష్ణువు తో పాటు కాసుల పురుషోత్తమ అవీ గుర్తుకు వస్తాడు .ఈ కవి శ్రీ మంటూ రాజా ఇమ్మిడి అంకినీడు బహద్దర్ 1798 -1819 గారి ఆస్థాన కవి .రాజును గురించి ఒక చాటువు ప్రచారం లో వుంది
”కలలో వెంబడి కృష్ణ రాయ విభుచే గబ్బంబు చెప్పించి బె -ర్వేలయన్ మున్నొక నాటి సేవ గొని ,యా శ్రీకాకులాన్ద్రేశ్వరుం -డలరంగా ,నిపు దంకినీన్న్రుపతి సేయం బూను విద్యోత్సవా –కలనన్ ,దానిక నేనని సన్నుత కృతుల్ గావింప గా జేయునో ”?
అంకి నీడు గారి పాలన లోనే శ్రీ కాలులాంధ్ర విష్ణువుకు పూజలు సక్రమంగా జరగటం లేదని కోపించిన స్వామి అంతర్ధానమై భూ గర్భం లో చేరాడని ఇది తెలిసి రాజు గొప్ప ఉపాసనా బలం వున్న కాసుల పురుషోత్తమ కవిని గొరవం గా ఆస్థానానికి రప్పించి ,స్వామి అనుగ్రహం కోసం ఏదైనా చెయ్య మని అర్ధించాడు అర్ధి జన బాన్ధవుడే స్వయం గా వెడితే కవి గారి మనసు కరిగి నీరైంది .వెంటనే శ్రీకాకుళం వెళ్లి కృష్ణా నది లో స్నానం చేసి పుఈతుడై స్వామి ఆలయం లో నిష్టగా నిలబడి ఆశ్తోత్తరస్హత పద్యాలను భక్తీ భావ బంధురం గా స్వామి హృదయం కరిగే టట్లు ఆశువుగా పద్య ధార కొన సాగించాడు .ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున స్వామి వారి విగ్రహం భూ గర్భం నుంచి పైకి వచ్చి నిలిచిందట .స్వామి భక్తీ ,ప్రభు భక్తీ తో చెప్పిన పద్యాలతో శ్రీకాకుల స్వామి సర్వాంగ సుందరం గా దర్శన మిచ్చాదట .స్థిరం గా కొలువై ఉన్నాడని ఐతిహ్యం .ఆ నాడు చెప్పిన శతకమీ ”ఆంద్ర నాయక శతకం ”గా జగత్ ప్రశిద్ధి పొందింది .అంకినీడు ప్రభువు పురుషోత్తమ కవిని ఆస్థాన కవీశ్వరుని గా చేసి ఋణం తీర్చుకొన్నాడు ”చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ -హత విమత జీవ శ్రీ కాకులాంధ్ర దేవ ”అన్న మకుటం తో శతకాలకే మకుటాయ మానమైంది .భక్త సులభుడు గా స్వామి నిరూపించుకొన్నాడు .తాను అలిగి అంతర్ధాన మైతే తన దాసుని ప్రార్ధన తో పునహా ప్రతిష్టిటు డయాడు స్వామి .సీస పద్యాలతో అమోఘ ధారా శుద్ధి తో మాధుర్య విలసితం గా వ్యాజ స్తుతి తో అలరారిన అద్భుత శతకమిది .ఈ శతక పద్యాలన్నీ ఆంద్ర దేశం లో ఆనాడు అందరి నోళ్ళలోనూ నానినవే .”మొదటి నుండి నీవు దామోదరుడవే ”అనే పద్యం అందరికి చిర పరిచితమే నిండా స్తుతికి మచ్చు తునక ..
పురుషోత్తమ కవి పెడ ప్రోలు నివాసి .తండ్రి అప్పల రాజు తల్లి రమణమ్మ .కాశ్యప గోత్రుడు .కవి గారి గురువు అడ్డంకి తిరుమలా చార్యులు .భట్రాజ కవి గా పురుషోత్తమ కవిని అందరు భావిస్తారు .భట్రాజుల్లో ఆసుల వారు ఇపటికి పెడ ప్రోలు గ్రామం లో వున్నారు .ఈ కవి కృష్ణా సాగర సంగమం అయిన హంసల దీవి వద్ద వెలసిన శ్రీ వేణు గోపాల స్వామి మీద ”వేణు గోపాల శతకాన్ని ””భక్త కల్పద్రుమ శతకాన్ని ”చెప్పాడు .”బమ్మెర పోతన హాగావాతం రాసి ఉండక పొతే కాసుల పురుషోత్తమ కవి రాసి వుండే వాడు ”అని విశ్వ నాద సత్య నారాయణ గారు మెచ్చిన మాధుర్య కవి పురుషోత్తమ కవి .ఒక రకం గా ”కవి పురుషోత్తముడు ”.
ఆంద్ర నాయక శతకం లో ఒక మచ్చు తునక
”ఆలు నిర్వాహకు రాలు భూదేవి యై అఖిల భారకుదన్న ఖ్యాతి దెచ్చె
— ఇష్ట సంపన్ను రాలిందిర భార్యయై కామితార్దుదన్న ఘనత దెచ్చె
కమల గర్భుడు సృష్టి కర్త తనూజుడై బహు కుతుమ్బకుదన్న బలిమి దెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమారియై పతిత పావను దన్న ప్రతిభ దెచ్చె
అందరు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతి గాని -మొదటి నుండియు నీవు దామోదరుడవే
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య బావ -హత విమత జీవ శ్రీ కాకులాంధ్ర దేవ ”
అలాగే వేణుగోపాల శతకం లో ఒక పద్యం రుచి చూద్దాం
శ్రీ రుక్మిణీ మనస్సార సేన్దిందిరా -సత్య భామా ముఖాబ్జ సామిత్ర
జాంబవతీ పాటు స్థాన శైల జీమూత -ఘన సుదంతా వయో వానమ దేభ
లక్షణా పరి రంభ లలిత పంజర కీర -భాద్రావాలీ తరంగ వన మరాళా
మిత్రవిన్దాధర మృదు పల్లవ పికా -రవి జాడ్రు గుత్పల రాజా బింబ
షోడశ సహస్ర కామినీ స్తోమ కామ -భావజా విలాస హంసల దీవి వాస
లలిత కృష్ణా సంగమ విహార -పరమ కరుణా స్వభావ గోపాల దేవ ”
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -03 -12
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master