సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం -1

 సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం -1

          చల్ల పల్లి ”దేవర కోట సంస్థానానికి ”రాజా దాని .కోట ౧౬ ఎకరాల విస్తీర్ణం లో నిర్మించ బడి ,శత్రు దుర్భేద్యం గా వుంటుంది .వందల సంవత్సరాల జమీందారి దర్జా ,దర్పాలకు చల్ల పాలి కోట సాక్షీ భూతం గా నీలి చింది .దివి తాలూకా లోని అతి పురాతన సంస్థానం ఇది .తూర్పున బందరు తాలూకా ,దక్షిణ పశ్చిమాల్లో కృష్ణా నది ,ఉత్తరాన గన్న వరం గుడివాడ తాలుకాలు హద్దులు గా వున్న ప్రాంతం .వైశాల్యం 190 చ.మైళ్ళు .66 గ్రామాలు ,32 శివార్లు ,20 అగ్రహారాలతో కూడిన సంస్థానం .ఈ జమీందార్లు ఏటా ౮౦ వేలకు పైగా ప్రభుత్వానికి కప్పం చెల్లించే వారు .సాలు సరి ఆదాయం మూడు లక్షల రూపాయలు .పెదా వేగి ,కృష్ణా పురం సంస్థానాలు తారు వాత వచ్చి చేరాయి .ప్రభువులు కమ్మ వారు .
 సంస్థాన ఆవిర్భావం
ఈ ప్రాంతపు తోలి ప్రభువు ,మూల పురుషుడు శ్రీమంతు రాజా యార్ల గడ్డ సర్వ నీడు .1576 లో గోల్కొండ నవాబు అబ్దుల్ కుతుబ్ షా కాలం లో సర్వనీడు దేవర కొండ కోటకు సామంత రాజు .ఆయన తర్వాత పెద్ద కుమారుడు తిరుమల నీడు 1607 లో రాజు అయాడు .సర్వనీడు ను గుర్వినీడు అని పిలిచే వారు .తిరుమల నీడు కాలం లో మొగల చక్ర వర్తి కులీ కుతుబ్ షాహి నుంచి ”దేశ్ ముఖ్ ”హక్కులను 1640 లో సంపాదించుకొన్నాడు .ఈయన తరువాత సోదరుడు గంగినీడు రాజి 1695 వరకు రాజ్యం చేశాడు .ఆయన మరణానంతరం కొడుకులు పాపినీడు ,నాగినీడు ,రామినీడు లు 1698 వరకు పాలించారు .1708 లో గంగినీడు ,1710 వరకు నాగన్న ,1723 వరకు అంకన్న ప్రభువు లు గా పాలన చేశారు .1734 వరకు వెంకట రామన్న రాజు గా వున్నాడు .
౧౭౩౪ నుంచి ౧౨ ఏళ్ళు సంస్థానం చిక్కుల్లో పడింది .ఈ కాలం లోనే ”ఫౌజు దారి” సర్వాధికారాలు చేలా ఇంచాడు .రామన్న తరువాత అధికారం హనుమన్నా కు వచ్చింది ఈయనకు మతి భ్రమించటం తో 1745 వరకు రామన్న పాలన సాగింది .౧౭౪౬ లో కోదండ రామన్న ప్రభువై ప్రజా హిత కార్య క్రమాలు చేసి ప్రజలకు దగ్గరయ్యాడు .ఫ్రెంచి వారి నుంచి గూడూరు ,ఆకుల మన్నాడు .దివి సీమ లోని ఆరు లంకలకు ఫర్మానా సంపాదించి ,విస్తరించాడు .అనేక ఆలయాలు ,తటాకాలు నిర్మించి ప్రజా హితం గా పాలించాడు .తరువాత అధికారానికి వచ్చిన కొడుకు వెంకట రామన్న దేశాహి 1791 లో అధికారానికి వచ్చి 1792 లోనే చని పోయాడు .ఈయన దత్త పుత్రుడే శ్రీ మంటూ రాజా ఇమ్మడి అంకినీడు బహద్దర్ మైనరు అయి నందు వాళ్ళ తండ్రి నాగేశ్వర నాయుడు 1792 నంచి 1798   వరకు పాలన చేశాడు .మేజరు అయిన అంకినీడు 1798 నుంచి 1819 వరకు పాలించాడు .అంకినీడు కు సంతానం లేదు .సోదర కుమారుడైన దుర్గా ప్రసాద్ ను దత్తత తెసుకొన్నాడు .౧౮౦౨ లో కుంఫిని వారు ఇమ్మడి అంకినీడు పేరనే ”సన్నద్ -యి -మిల్కియత్ -ఇస్తి మీరార్ ”అండ జేశారు .అంకినీడు పూనా వెళ్లి పీశ్వాను దర్శించి శ్రీ మంటూ బిరుదును ,నిజాం నుంచి ”రాజ బహద్దర్ -జబ్దతుల్ అక్రాన్ ”బిరుదు పొందాడు .తరువాతి పాలకులకు ఇవి సంకర మించాయి .చల్ల పల్లి కోట లోని రాచ నగరు అంకినీడు      ప్రభువు కట్ట్టిన్చినదే .కాశీ రాజ సౌధం నమూనా లో రెండు లక్షలు వ్యయం చేసి కట్టించారు .చల్ల పల్లి రాజులు ”రేచర్ల గోత్రం” వారు .
అంకినీడు ప్రభువు మచిలీ పట్నం దగ్గర ”శివ గంగ ”లో ఈశ్వరాలయం నిర్మించాడు .1819 లో అంకినీడు చని పోయాడు .దత్త పుత్రుడు దుర్గా ప్రసాద్ మైనరు అవటం తో సంస్థానం ”కోర్ట్ ఆఫ్ వార్స్ ”పాలన లో కొంత కాలం నడిచింది .మేజర్ అయిన కొద్ది కాలానికి దుర్గా ప్రసాద్ 1895 లో అతి పిన్న వయసు లోనే అసువులు బాశాడు .అంకినీడు కు మరో దత్త పుత్రుడు యార్ల గడ్డ రామ అంకినీడు ౧౮౪౬ లో రాజ్యానికి వచ్చాడు .దాన ,ఉదార గునా లున్న ఈయన ౧౮౬౪ లో వచ్చిన పెను తుఫానుకు దివి సీమ అతలా కుతల మైతే అపార సేవ లందించి ఆడు కొన్నాడు .దిక్కు ,మొక్కు లేని వారందరికీ తన కోట లోనే రోజుకు లక్ష మందికి పైగా రెండు నెలల పాటు భోజనం పెట్టి తానా యోగ్యతను చాటుకున్న కరుణా మయుడు అంకినీడు ప్రభువు .తుఫాను ప్రభావం తగ్గి ప్రజలు ఇంటికి బయల్దేరి నపుడు అందరికి డబ్బు ,ధాన్యం అందించి తానా దాతృత్వాన్ని చాటు కొన్నాడు .ఇప్పటికీ ఈ విషయాలను అక్కడి ప్రజలు కధలు గాధలు గా చెప్పు కొంటారు .తుఫానుకు దెబ్బ తిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పునర్నిర్మించాడు .కాలువలను మరమ్మత్తు చేయించాడు .
ఆస్థానం లోనే కాదు ప్రజల హ్రుదయాస్థానం లోను స్థానం సంపాదించుకొన్న పుణ్య మూర్తి అంకినీడు బహద్దర్ .కోట చుట్టూ 20 అడుగుల ఎత్తున ప్రహరి గోడ నిర్మించాడు .బురుజులను దక్షిణాన 30 అడుగుల ఎత్తైన ద్వారాన్ని ఆయనే ఏర్పరిచాడు .

దర్బార్

దర్బార్

అంకినీడు మరణాంతరం 1876 వరకు మల్లికార్జున ప్రసాద్,1921 నుంచి అంకినీడు ప్రసాద్ 1926 డిసెంబర్ 26 -నుంచి  శ్రీమంతు రాజా యార్ల గడ్డ శివరామ ప్రసాద్ బహద్దర్ చల్ల పల్లి సంస్థానాన్ని పాలించారు .శివరామ ప్రసాద్ గారినే అందరు ”చల్ల పల్లి రాజా ”అని ఆప్యాయంగా పిలిచే వారు . ఈ సంస్థానానికి ఆఖరి వారసుడు శివ రామ ప్రసాద్ బహాద్దరే.
ఇమ్మడి వంశం యార్ల గడ్డ వంశం గా మారిన తారు వాత ఇమ్మడి దుర్గా ప్రసాద్ మరణానంతరం ఆయన సూచన మేరకు భార్య దుర్గా భావాన్ని దేవి మెరకన పల్లి లంక వాస్తవ్యులు యార్ల గడ్డ వెంకట రామన్న గారి మూడవ కుమారుడు అంకినీడు ను దత్తత తీసుకోవటం వాళ్ళ మళ్ళీ మారింది .ఈయన 1846 నుంచి 1875 వరకు పాలించాడు . చల్ల పల్లి లో సంస్కృత కళా శాలను స్థాపించిన విద్యాభి మాని .వీరి కుమారుడే మల్లికార్జున ప్రసాద్ ముక్త్యాల రాజాకుమార్తె విశాలాక్షమ్మను వివాహం చేసుకొని 1876 లో పట్టాభి షిక్టు లయారు .   అన్న దమ్ములు ఆస్తి కోసం ప్రీవి కౌన్సిల్ దాకా వెళ్ళారు .1890 లో జ్క్యమీ అవిభక్తం అని తీర్పు వచ్చింది .  వీరి కుమారుడు రాజా యార్ల గడ్డ అంకినీడు ప్రసాద్ ముక్త్యాల రాజా సోదరి భవానీ దేవి ని వివాహ మాడి 1921 లో రాజ్యాభిషిక్తు లయారు .వీరి కుమారుడే మనం చెప్పు కొన్న చల్ల పల్లి రాజా శివ రామ ప్రసాద్ గారు .  వీరు 1919 లో జ్కన్మిన్చారు . వీరి కోసం తండ్రి గారు ముంజులూరు ,పెనమ కూరు ఎస్టేట్లను కోని ఇచ్చారు .ఈయన హైదరాబాద్ లో సారధి స్టూడియో నిర్మించారు .  కృష్ణా జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గాను ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖా మాత్యులు గాను పని చేశారు
చల్ల పల్లి రాజా గారి కుమారులు  మల్లి కార్జున ప్రసాద్ ,అంకినీడు ప్రసాద్ శివ రామ ప్రసాద్ లు .అంకినీడు పార్లమెంట్ మెంబర్ అయారు .ఎస్టేట్ కు  25 వేల ఎకరాల భూమి వుండేది .భూగరిష్ట చట్టం వల్ల చాలా భూమి ప్రభుత్వ పరం అయింది .కొంత అన్యా క్రాంత మైంది .కోటలో పులలు ఏనుగులు ఉండేవి .కోట గోడ పై ఏమల్లు నాట్య మాడటం ఇప్పటికీ జనం గొప్ప గా చెప్పు కొంటారు .రాజా వారు శివ గంగ ఉత్సవాలకు ఏనుగు అంబారి పై వూరేగటం చూడ ముచ్చట గా వుండేది .కోటలోని గంట మైళ్ళ దూరం విన పది కాలాన్ని తెలియ జేసేది .ఇప్పుడు కోట శిధిలా వస్తా లో వుంది .ఆనాడే స్వంత జేనేరతోర్ తోవిద్యుత్ట్ ను తయారు చేసి కోటలో ఉపయోగించే వారు .చల్ల పల్లి కోటకు 500 ఏళ్ళ పైన చరిత్ర వుంది .
కృష్ణ దేవ రాయలుశ్రీ కాకులాంధ్ర మహా విష్ణువు ను దర్శించి అక్కడి మండపం లో స్వామి కలలో ఇచ్చిన ఆజ్ఞా ప్రకారం ఆముక్త మాల్యద ప్రబంధాన్ని మొదలు పెట్టడు .దివి సీమ లో కోట నిర్మించి దాన్ని ”దేవర కోట ”గా తన పేరు వచ్చేట్లు చేయాలను కొన్నాడని అదే నేటి చల్ల పల్లి దేవర కోట అని డాక్టర్ జి వి.పూర్ణ చంద్ రాశారు .రాయల భువన విజయం లో ఒక సారి రాయల వారే శ్రీ రాముని సోదరులకన్నా ,ధర్మ రాజు సోదరులే గొప్ప వారు అని సమన్వయము చేశారని ,వింజామర వీచే వాడు ధైర్యం గా ”రాయలు ఆనాడు ,ఈనాడు కూడా ఆండవ పక్ష పాతే ”అన్నాడని రాయలు విని సంతోషించి తాను విశ్న్వంశ సంభోతుడిని అని అతను చెప్పిన మాటలకు ముచ్చటపడి ఏమి కావాలో కోరుకో మంటే ”దేవరా !కోట ఎలాలని వుంది ”అని అతడు అన్నాడని యుక్తిగా తిమ్మరుసు మంత్రి ”దేవర కోట ”కు పాలకుడిగా అతన్ని పంపారని ఒక కధ ప్రచారం లో వుంది .ఇంతకీ దేవర కోట అనే గ్రామం ఘంట సాల కు దగ్గరలో వున్నది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -03 -12

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.