సాహిత్య సరస్వతి లీల -ముక్త్యాల సంస్థానం –2
సాహిత్య పోషణ
రాజా వాసిరెడ్డి చైనా వెంకటాద్రి ప్రభువు మంచి సాహిత్య పోషకులు .అప్పుడు తాతం భట్టు గురు మూర్తి శాస్త్రి ”కృష్ణా నదీ మహాత్మ్యం ”అనే కావ్యాన్ని రాసి భవానీ ముక్తేశ్వర స్వామికి అంకితమిచ్చాడు .మూడు ఆశ్వాసాల పద్య కావ్యం ఇది .రాజు మెచ్చి చింతల పాడు లోని ”కుచ్చెల ”భూమి ని ఈనాం గా రాసి ఇచ్చాడు .కవి నందిగామ తాలూకా ఏటూరి నివాసి .ఈ పుస్తకాన్ని ”మాహిష్మతీ ముద్రాలయం ”లో ,రాజా గారి ప్ర పౌత్రులు చంద్ర మౌళి ప్రసాద్ అచ్చు వేయించారు .ఇది వీరు ఏర్పరచిన స్వంత ప్రెస్.కోప్ప రాజు సుబ్బా రాయ కవి రాసిన ”కాంచీ మహాత్య్మం ”ను భవానీ ముక్తేశ్వర ప్రసాద్ గారికి అంకితమిచ్చాడు .ప్రసాద్ గారు వీరేశ్వర శాస్త్రి గారి వద్ద పంచాక్షరీ మంత్రోప దేశం పొందారు .”సాహితీ గీతాది సత్కళా భూషణా వళికి మంజూష ,ఈ ప్రభు మనీష ”అని కవుల మన్ననలు అందుకొన్నారు .
కోప్ప రాజు సుబ్బ కవి -ఆత్రేయస గోత్రజుడైన ఈ కవి 1850 -90 కాలమ్ వాడు .ఇతని వంశపు పూర్వ కవుల్లో అనంతా మాత్యుడున్నాడు .త్రికూతా చాల ఆహాత్మ్యం ను కూడా ఈ కవి రాశారు .
అమర వాది రామ కవి –హరితష గోత్రుడు .వీరి పూర్వీకుల్లో గంగాధరాధ్వరి కాశీ పండితులచే ప్రశంస పొందాడు .తాత గనేశ్వర దీక్షితులు ”వర కళా నిధి ”అనే పేరు పొందాడు .తాత వాసి రెడ్డి వారి ఆస్థాన కవి .ఎనిమిది ఆశ్వాసాల ‘ద్రౌపదీ పరిణయం ”ప్రబంధం రాశాడు .
ఆతుకూరి పాప కవి -”లలితాంబో పాఖ్యానం ”రాశి అమరావతి లోని అమరేశ్వర స్వామికి అంకిత మిచ్చాడు .ములుగు పాపయా రాధ్యుడు ఈయన శిష్యుడే .దక్ష యాగం నుంచి తారకాసుర వధ వరకు కధ ఇందులో వుంది .వేదాద్రి దగ్గర కాట్రేని పల్లి అగ్రహారాన్ని కవికి ఈనాం గా ఇచ్చారు .
శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి –కవి సార్వ భౌమ శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధమ ఆస్థాన కవి .భారత ,భాగవత రామాయణాలను ఒంటి చేత్తో రాసిన కవి పండితులు .ముక్త్యాల సంస్థానాన్ని దర్శించి ,క్రుతలను ఇచ్చి సత్కారాలు పొందారు .”వేదాద్రి మహాత్మ్యం ”రాసి ,చంద్ర మౌలీశ్వర ప్రసాద్ గారికి అంకిత మిచ్చారు .”శ్రీ కృష్ణ భారతం ”అనే 60 వేల గద్య పద్యాల భారతాన్ద్రీకరణం ఇది .వ్యాసునికి యధా మూల అనువాదం గా పేరు పొందింది .శ్రీ పాద వారికి నెలకు 116 రూపాయల పారి తోషికాన్ని 12 సంవత్సరాలు రాజా వారు అంద జేశారు . శ్రీ పాద వారి కుమార్తెల వివాహాల ఖర్చు లన్ని రాజా వారే భరించారు .శాస్త్రి గారు అంటే రాజా వారికి అంత అభిమానం .”తన ఆస్థాన కవీంద్ర మాత్రునిగా .చిత్తంబందు ఇస్టునిగా మిత్రునిగా ,గురూత్తముని గా చుట్టంబు గా నెంచుట ”ను రాజా వారి ఔన్నత్యాన్ని మనసార వర్ణించారు శ్రీ పాద వారు .ఆనాటి రాజా రాజా నరెంద్రుడే ఈ నాటి రాజా బహాదోర్ అనీ ,ఆనాటి నన్నయ భారతమే నేటి శ్రీ కృష్ణ భారతం అనీ ,ప్రశంసించారు శ్రీ పాద రాసిన ”విజయ విలాస కృతి -విమర్శన ”ను కూడా చంద్ర మౌలీశ్వర ప్రసాద్ కే అంకితమిచ్చారు .చేమ కూర వెంకట కవి రాసిన విజయ విలాసాన్ని ,కూచిమంచి జగ్గ కవి రాసిన ‘సుభద్రా పరిణయం ”ను తుల నాత్మకం గా పరిశీలించి వ్రాసిన పుస్తకం ఇది
పిషు పాటి చిదంబర శాస్త్రి –౧౯౨౨ లో ముక్త్యాల జమీ లో ఆశు కవితా ప్రదర్శన చేసి ”కపోత కిరాత కధ ”ను శత పద్య మంజీరం గా రాసి సన్మానం పొందారు .
చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి –శాతావదానులైన తిరుపతి కవుల్లో ఆశు కవిత కు వన్నె తెచ్చిన వారు వీరు .అర్ధి జన కల్ప భూజుదని ,అభినవ భోజుడని ,ముక్త్యాల రాజా ను ప్రశంశించారు .నానా రాజా సదర్శనం లో చంద్ర మౌలీశ్వర ప్రసాద్ ను కీర్తించారు .తన తోబుట్టువు భారత కృతికి రాజా గారు రుతి భార్ర్త అవటం తో రాజుతో చుట్టరిం కలిసింది అన్నారు .ఆయన దాతృత్వానికి భయపడి కుటుంబం లో జరిగే వివాహ శుభ లేఖ కూడా పంపక పోయినా రాజా వారు ధనం పంపిస్తూనే వున్నారని పొంగి పోయారు .గురువు కృష్ణ మూర్తి శాస్త్రి గారికి యెంత గౌరవం ఇచ్చారో శిష్యుడు వెంకట శాస్త్రి గారికీ అంటే ఔరవం చూపించటం రాజా గారి గొప్ప దనం .శ్రీ పాద వారి భారతాన్ని ప్రశాం శిస్తు ”భారత మన్న వేదపుం గందము ”అంటే భారతం వేదానికి దుంప అని మెచ్చారు .భారత యుద్ధాన్ని స్వయం గా శ్రీ కృష్ణుడు చూశాడు .తన గురువు కృష్ణ మూర్తి శాస్త్రి గారు కూడా స్వయం గా చూసి నట్లు రాశారు అని చమత్కారాన్ని వ్యంగ్యాన్ని మేళ వించి రాశారు .
విశ్వనాధ సత్య నారాయణ –కళా ప్రపూర్ణ ,కవి సామ్రాట్ మ్జ్ఞాన పీత పురస్కార గ్రహీత శ్రీ విశ్వ నాద సత్య నారాయణ గారు ”రామాయణ కల్ప వృక్ష ”కావ్యానికి ప్రత్యక్ష శ్రోత శ్రీ రాజా వాసి రెడ్డి చంద్ర మౌలీశ్వర ప్రసాద్ .”ముక్తి నెల యవని పాలుడు చంద్ర మౌళి నృపుడు వినిన లీల గాను ”అని విశ్వ నాద అన్నారు .వారిద్దరి ఆత్మీయ స్నేహం .
చంద్ర మౌలీశ్వర వర ప్రసాద్ –విద్యాభి మానిగా ,లలిత కలాభి మానిగా మాన్యునిగా ,దేశ భక్తీ మూర్తీభవించిన వ్యక్తిగా వీరు ప్రశంసల నందుకొన్నారు .”మాహిష్మతీ ముద్రాలయం ”స్థాపించి అనేక అమూల్య గ్రంధాలను ముద్రించారు .తాల పాత్ర గ్రంధాలను సేకరించి పరిష్కరిమ జేసి అచ్చోట్టించారు .ఉద్భటా రాదయ చరిత్ర ,నాచి కేతూపాఖ్యానం ,వీరి ముఖ్య ప్రచురణలు .ఆయుర్వేద ఔశాదాలయం స్థాపించి శాస్త్రీయ పరిశోధనలు చేయించి ఔషధాలను తయారు చేయించారు .ఉచిత చికిత్స వీరి ప్రత్యేకత .ఆయుర్వేదాచార్యులైన శ్రీ ఆచంట లాక్ష్మీ పతి గారు రాసిన ”ఆయుర్వేద దర్శనం ”ప్రచురించారు .వేటూరి వారి ‘నీతి నిధి ”చర్ల వెంకట శాస్త్రి గారి ”గుణ రత్నా వళి ”అనే అలంకార శాస్త్రం ఆత్కూరి పాపయా మాత్యుని ”లలితాంబో పాఖ్యానం ”మల్ల పల్లి బుచ్చి కవి ”హాలాష్య ఆహాత్మ్యం ”మొదలైన సంస్కృత ,ఆంద్ర రచనలను ముద్రించి ఆంద్ర పాథక లోకానికి అందించిన సరస్వతీ సమార్చకులు .విశ్వ నాద రామాయణాన్ని శ్రీ పాద వారి విజయ విలాస కృతి విమర్శనాన్ని వీరే ముద్రించారని మనకు ముందే తెలుసు .వీరి ఆస్తాసంగీతా విద్వాంశుడు సగీత రత్న బిరుదాంకితుడు పిరాట్ల శంకర శాస్త్రి .అనేక కీర్తనలు ,వర్ణనలు రాశారు .”శంకర శతకం ”రాశారు .ఆంద్ర రవి వర్మ అనే బిరుదు పొందిన ప్రముఖ చిత్ర కారుడు ఆత్కూరి రామ మోహన రావు ను పోషించి కళా సేవ చేశారు .భారతం లోని ముఖ్య ఘట్టాలకు చిత్రాలు వేయించి శ్రీ పాద వారి శ్రీ కృష్ణ భారతాన్ని ముచ్చటగా సచిత్రం గా ముద్రిమ్పించారు రాజా వారు
రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ -వి.ఆర్.జి.కే.ఏం ప్రసాద్ గా సుప్రశిద్ధులు .చివరి జమీందారు .శంకరాచార్యుల వారు రాసిన ”గంగా లహరి ”ని ,వాసుదేవానంద సరస్వతి రాసిన ”కృష్ణా లహరి ”ని ముద్రిమ్పించారు .కుమార రాజా గా ప్రశిద్ధులు .1950 లో నావ్య సాహిత్య పరిషత్ పదకొండవ వార్షి కోత్స వాన్ని గణం గా ముక్త్యాల కోటలో నిర్వ హించారు .ఈ పరిషద్ ఆధ్వర్యం లోనే ‘ప్రతిభ ”త్రి మాస పత్రిక నడిచింది .వేటూరి ప్రభాకర శాస్త్రి ,కాటూరి వెంకటేశ్వర రావు ,విశ్వ నాద ,రాయప్రోలు ,దేవుల పల్లి పిలకా ,గడియారం నోరి వంటి సాహితీ ప్రియంభావుకులు ఎందరో అలరించిన సమా వేశం ఇది .యువక్లను సాహిత్యం వైపు కు మళ్లించిన సభలుగా పేరు వచ్చింది .బుద్ధ జయంతి ని జర పటం సంస్థానం లో ఆనవాయితీ గా వస్తోంది .వీరి ఆధ్వర్యం లోనే చారిత్రిక ప్రాశస్త్యం వున్న ”ధనంబోడు ”(జగ్గయ్య పేట )లో బుద్ధ జయంతి ని అద్భుతం గా నిర్వ హించారు .
నాగార్జున సాగర్ న్ర్మానానికి రాజా వారి సేవలు విలువ కట్ట లేనివి .ప్రాజెక్ట్ కు జీవ దాత అనే పేరు పొందారు .ఆయన నిస్వార్ధ బుద్ధికి మేధా సంపత్తికి ,నిరూప మాన కృషి కి నిదర్శనమే ఈ ప్రాజెక్ట్ .ప్రఖ్యాత ఇంజినీర్ కే;ఎల్.రావు గారి పర్య వేక్షణలో పులి చింతల వద్ద తల పెట్టిన ప్రాజెక్ట్ మారి పోయి నాగార్జున సాగర్ వద్ద నిర్మింప బడి ఆహులార్ధ సాధక ప్రాజెక్ట్ గా ఆధునిక దేవాలయం గా రూపొంది సాగుకు ,తాగు నీటికి సుజలాం సుఫలాం గా నీటిని అందిస్తోంది .
56 ఏళ్ళు నిస్వార్ధం గా ప్రజా సేవ చేసి ,ముక్త్యాల రాజా గా కీర్తి సాధించి ,ప్రజల మనస్సుల్లో నిలిచి పోయారు .వేటూరి వారి ప్రోత్సాహంతో ముక్త్యాల పరిసరాల్లో ప్రాచీన శిధిల శిల్ప ఖండాలను,పురా వస్తువులను సేకరించి మ్యూజియం లో పెట్టాలి అన్న రాజా వారి కల ఫలించక పోవటం మన దురదృష్టం .ఇక్ష్వాకుల నుంచి ,కాకతీయుల వరకు గల శిలా శిల్పాలు శాసనాలు మాత్రం సేకరించ గలిగారు .”ప్రభాకరాస్తామయం ”తో ఆ ప్రయత్నం అంతటి తో ముగిసి పోయింది .కవి పండితులను ఆదరించటం తో పాటు ప్రజా హిత కార్య క్రమాల్లోను రాజా వారిది ఆదర్శ జీవితమే .”భోగాల పాటి దిబ్బ”ను తవ్వించి శిధలాలను సేకరించారు .ఆ తర్వాత అడుగు ముందుకు సాగ లేదు .
,దుర్గా సదాశివ ప్రసాదు బహద్దర్ — వీరు జయంతి పురం రాజా వారు సాహిత్యాభి రుచి వున్న వారు .విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి సభ్యులు .”దమ్మ పదం ”ను తెలుగు లోకి అనువదించారు .పాళీ ,హిందీ ,తెలుగు ,ఇంగ్లీష్ ,సంస్కృతాలలో మంచి పండితులు .”బుద్ధ గీత ”గా దమ్మ పదాన్ని అనువదించారు .ఇది బౌద్ధుల ప్రామాణీక గ్రంధం .”సరస్వతి ”సాహిత్య పత్రిక కు \\సంపాదకులు .సాహిత్య ,ఆయుర్వేదాలపై మంచి రచనలు చేశారు .”ఆనాటి విద్యా వినోదాలు ””ఏది ప్రాచీనం-రామాయణమా ?భారతమా ?”సంస్కృతం మృత భాష అనడం మృష ”మొదలైన వ్యాసాలు రాశారు .ప్రయోగ మాల ,ప్రసాదాన యోగాలు ,అందానికి ,ఆనందానికి వగైరా ఆయుర్వేద రచనలు మంచి పేరు తెచ్చు కొన్నాయి .ముక్త్యాల నుంచి చీలిన జయంతి పురం జమీ కూడా సాహిత్య సంప్రదాయాన్ని కొన సాగించటం ముదా వాహం .”నిత్య జయంతి -జయంతి సంస్థానం ”.
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -03 -12

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com