ఇతర నవలలు
చార్లెస్ డికెన్స్ రాసిన ”ఆలివర్ ట్విస్ట్ ”నవల నెర చరిత్రకు సంబంధించింది . .లండన్ లోని అండర్ వరల్డ్ అంతటినీ కళ్ళకు కట్టించిన చిత్రం గా కని పిస్తుంది .సాంఘిక అధిక్షేపణ నవల .చైల్డ్ ను హీరో గా పెట్టి రాసినామోదటి నవల .చిన్న వాడి దృష్టి లో నుంచి సాగిన కధా గమనం .ఆలివర్ జీవిత యాత్ర అసహాయ స్థితి నుంచి పరిస్థితి ని గుప్పిట్లో పెట్టు కొనే దాకా సాగుతుంది .ఉనికి లేని స్థితి నుంచి అస్తిత్వాన్ని నిల బెట్టు కొనే ఒంటరి పోరాటం అది ఏమీ చేయలేక అసహాయం గా చాయా సీన్లలో ఆలివర్ ఏడుస్తాడు .మాట్లాడాడు .అన్ని సమయాల్లోనూ తెల్ల మొహమే పెడతాడు .అతని ప్రతి వాడు తనకు కావలసి నట్లు మలుచు కొంటాడు ..ఆ కధే స్టోరి వో .(జీరో )తల్లికి బిడ్డకు వున్న ప్రాధమిక సంబంధం సదల రాదు తెగిపోకూడదు .ఇదే అస్తిత్వ చిహ్నం
ఉత్సుకత ను కలిగించే దుఃఖ భాజనుడి కధ .విపత్కర పరిస్థితి లలో కూడాచెడు పై మంచి సాధించిన విజయం ..చార్లీ చాప్లిన్ కు బాగా ఇష్టమైన నవల ఇది .దీనిపై ఎనిమిది సినిమాలు తీశారు .”చట్టం గాడిద లాంటిది ”అని డికెన్స్ తరచుగా అంటాడు .
‘నికొలాస్ నికల్బి ”నవల చాలా సరదా గా కష్టపడ కుండా రాశాడు .ది డైలీ న్యూస్ అనే పత్రిక కొంత కాలమ్ నడిపాడు .తండ్రికి పనేమీ లేక పోవటం తో ఆజరు పట్టీ లో పేరు రాసి జీతం ఇచ్చే వాడు .చాలా గిల్డ్ లకు ,చారిటీస్ కు సహాయం చేశాడు డికెన్స్ .అడిగిన వాడికి లేడన కుండా ధన సాయం చేసిన మానవీయతా మూర్తి .అమెరికా కు రెండు సార్లు రీడింగ్ టూర్ వెళ్ళాడు .డబ్బు బాగా వచ్చింది ”మన సంస్కృతీ అధ్యయనం డికెన్స్ ద్వారా సాధ్యం ”’అన్నారు ఇంగ్లాండ్ విశ్లేషకులు .
ప్రముఖ నేరస్తుడి ఉరితీత విక్టోరియన్ ఇంగ్లాండ్ లో పెద్ద డ్రామా గా జరిగేది .ఇది చూసిన డికెన్స్ కు జీవితానికి చావుకు మధ్య వున్న వాకిలి ని చూసి చలించి పోయేవాడు .దీన్ని బట్టి చూస్తె మనిషి కి చావు ఎప్పుడో అతనికి తెలిసి పోతుంది అనుకొన్నాడు .ఆ హింసకు విచాలితుదయ్యే వాడు .నాలుగు ఉరితీతలకు స్వయం గా హాజరై రిపోర్ట్ లు రాశాడు .అమెరికా ప్రజల్ని ‘బోరింగ్ పీపుల్ ”అన్నాడు .అక్కడి బానిసత్వాన్ని నిరషించాడు .పొగడ్తలంటే ఇష్టమని ,తమల్ని చూసి తాము నవ్వు కోలేని ప్రజలని అమెరికన్ల పై డికెన్స్ అభిప్రాయం .అయితె ముఖ్య అతిధిని చూసి నవీ సంస్కారం వున్న వారు ఐ చురక అంటించాడు .అతను మాట్లాడిన దంతా బాగానే పేపర్లలో రాసినా ,అమెరికా నాయకులు తలలో పేలు వంటి వారని ,అమెరికా ప్రతి దాన్ని భ్రస్టు పట్టిస్తోందని ,ప్రజా వాణి కి విలువ్క అక్కడ లేదని నిర్భయం గా చెప్పాడు ..
రచయితల రక్షణ కోసం డికెన్స్ ఒక సంస్థ ను స్థాపించాడు .వారి హక్కులను కాపాడ టానికి న్యాయ నిపునిది గా వ్యవహరించాడు .లాంగ్ ఫెలో కవి దీన్ని సమర్ధించాడు .1891 లో చట్టం వచ్చింది .ప్రపంచ వ్యాప్తం గా కల్పనా సాహిత్యాన్ని అత్యుత్తమ వ్రుత్తి గా మార్చిన ఘనా ఘనుడు దికేంసే .అతని సాహిత్యం ,ప్రజా సంబంధాలు ,ఆత్రుత్వం వల్ల సాహితీ వ్రుత్తి గౌరవ స్థానం పొందింది .రచనల వల్లనే సంపన్నుడైన ఘనత డికెన్స్ ఒక్కడికే దక్కింది .
1844 లో మార్టిన్ చుజిల్ విత్ పుస్తకాన్ని ఉల్ల్లస భరితం గా తేలిగ్గా సృజనాత్మకం గా రాశాడు .అందులో నఎడీ పండలేదన్నారు విమర్శకులు .అయితె అందులో డికెన్స్ పరిపక్వత కని పిస్తున్దన్నారు .అతని జీవితాన్నే మార్చేసిన నవల అది .అమెరికా నుంచి వచ్చిన నిరుత్సాహ పరిస్తితి లో రాసింది .కొత్త దారి తొక్కాడు .మిస్టరి తో నింపాడు .తమాషా పేర్లు పెట్టాడు .ప్రతి పాత్రకు రెండు పేర్లుంటాయి .పిక్విక్ పేపర్ నవల అన్నింటా నంబర్ వాన్ అని పిస్తే ఇది అన్నిటా లాస్ట్ అని పించుకోవటం విచిత్రం .అయినా బెస్ట్ సెల్లార్ గా నిలిచింది .ఇందులో మార్టిన్ చుజిల్ విత్ కు అమెరికా దేశం పిచ్చి ఆసుపత్రి గా అనిపిస్తుంది .మనం రోడ్డు మీద వున్నాం అన్నాడు చేస్తార్తాన్ .”డికెన్స్ మేధో మధన సారం ఈ నవల ”అన్నాడు గీజింగ్ అనే విమర్శకుడు ..ఇందులోని మిసెస్ గామ్ప్ డికెన్స్ కు ఉన్న వింత వికారమే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -03 -12
శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి -శుక్ర వారం -ఉగాది శుభా కాంక్షలు